Saturday 30 July 2011

స్నేహ బంధము .....ఎంత మధురము...


స్నేహ బంధము ఎంత మధురము ...కరిగి పోదు చెరిగి పోదు జీవితాంతము .... 


 

ఓఓ....my friend.........తడి కన్నులనే తుడిచిన 
నేస్తమా.........
     అపార్దాలతో వీడి పోనిది
    కోపానికి చెదిరి పోనిది
    నీ మేలుని కోరుకునేది
    బదులుగా ఏమి ఆశించనిది



కమ్మని జ్ఞాపకం
వాడని పరిమళం
వీడకు నీ హస్తం
నడిపించు నేస్తం

మిత్రమా .............నువ్వు లేవు ఒంటరిగా .....
నువ్వుంటున్నావు విశ్వం లో మమేకమై 
నువ్వుంటున్నావు సర్వస్వంగా
నువ్వు ఉంటున్నావు సంబవించని సృష్టిగా
నువ్వుంటున్నావు మొక్కగా లోలోపల మారే విత్తనంగా

నీ ఒక్కడి జీవితమే ప్రవహిస్తూ ఉంటుంది
ఎన్నో రూపాలగా
ఓ విశ్వం లో ఎంతగానో ,ఓ అణువు లో అంతగానే 

నువ్వు లేవు ఒంటరిగా ,నువ్వు లేవు ఊరకనే

విశ్వం లో మమేకమై 
విశ్వ ప్రణాళిక లో బాగమై
దర్శిస్తూ ఆనందాన్ని ,దర్శిస్తూ స్నేహాన్ని 
పంచుతూ సంతోషాన్ని ,శాంతి ని

మిత్రమా నేవేన్నడూ లేవు ఒంటరిగా

నీ నీడగా నేను ఉన్నంతవరకు .......
నా ప్రాణం గాలిలో కలిసేవరకు



9 comments:

మాలా కుమార్ said...

ఈ రోజు ఫ్రెండ్ షిప్ డేనా ?
happy friend ship day .

శశి కళ said...

welcome to new friend mala garu.
తరువాతి ఆదివారం అండి.కాక పొతె మళ్ళా నాకు
తీరదని,అందరి కంటె మొదట చెప్పాలని.సేమ్ టుయు.

వనజ గారు మీకు కూడ మీ లాంటి ఫ్రెండు దొరికినందుకు
థాంక్యు.

మహేశ్వర రెడ్డి said...

"స్నేహ బంధము ఎంత మధురము ...కరిగి పోదు చెరిగి పోదు జీవితాంతము"
chala bagundandi..
advance, sorry.. sorry.. friendship day ki advance vundadu lendi..
happy friendship day!!!

రాజ్ కుమార్ said...

nice post...
happy friendship day Sasi gaaroo..;)

శశి కళ said...

same to u mahesh garu and raj.

రాజ్యలక్ష్మి.N said...

happy friend ship day .

శశి కళ said...

thanku raji....

kiran said...

అమ్మో కవితలు రాసేస్తున్నారు...:)
చాల బాగుంది
కాస్త ఆలస్యంగా హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే:)

Kalyan said...

అవునండి స్నేహం అంత గొప్పది చాల బాగా చెప్పారు . మీది చదివాక నాలో కలిగిన స్నేహ భావము అక్షరాలలో...

అమ్మనై నిన్ను పసిపాగానే చూస్తున్నా
నీ కోపం తీర్చడానికి తండ్రిలా మారుతున్నా
నీతో ఆడుకోడానికి తమ్ముడైపోతున్నా
నీ ముచ్చట్లు తీర్చే ప్రియుడనౌతున్నా
నాకంటూ ఓ కాల పరిమితి లేదు
నీ మనసెరిగిన నేస్తాన్ని నేను
ఏ బంధంలాగైనా మారగలను....