Thursday 29 September 2011

తన్నుకు చావండి...అదే పదివేలు

ఏమిటి?తన్నుకు చావటమా?
అదియును పవిత్ర భారత నారీమణి బ్లాగ్లో....

ఏమిటి పే...ద్ద..ఆడవాళ్ళ బ్లాగుల్లో కదలు ,కవితలు 
కాకరకాయలు,కబుర్లు తప్ప రాజకీయాలు ఉండకూడదని 
గవర్నమెంట్ ఆర్డర్ చేసిందా ఏమిటి?

అందులో ఇంత ముఖ్యమైన విషయం ఉత్తినే డబ్బులు 
సంపాదించే విషయం అందరి చెవుల్లో వేయకపోతే 
నా బుర్ర వేయి వక్కలైపోద్ది....తట్టుకోలేకా....

తన్నుకు వేయి....రోజుకు పదివేలు...

బలే మంచి చవక బేరము 
పట్టుడి కర్రలు మహిళ లారా...సమయము మించినా దొరకదు...
బలే మంచి...బలే మంచి చవక బేరము.....

ఏమిటి ?కొట్టు కొట్టండి...అనేస్తున్నారు...ఎవర్ని కొట్టాలో తెలుసా?

ఎంచక్కా ఉదయాన్నే లేసి మాంగల్యాన్ని కళ్ళకు అద్దుకొని
ఏ పాద పద్మములు సదా పూజింతునేని...అని పద్యాలు 
పాడేస్తారో...సదరు పతిదేవుల్ని....

ఏమిటి?నోరు తెరిచారు....ఏమేమో కనిపిస్తున్నాయి ....

మరి సదరు మంత్రిగారే....సదరు బారతీయ మహిళను 
బర్త తాగి వస్తే ఆయన పోస్ట్ మరిచిపోయి రెండు పీకమని 
మహిళలను కోరినారు.(ఎవరికైన అదే రూల్)

పైగా ఒక్క ఒక్క తన్నుకు వేయి చొప్పున బారతీయ మహిళకు 
పది వేల వరకు ఆఫర్.

కాబట్టి "తాంబూలాలు ఇచ్చెసాము ..తన్నుకు చావండి"
అని మంత్రి గారు సెలవిచ్చినారు.(అమంగళం ప్రతిహతమగుగాక )


ఇప్పుడు నేను కొన్ని సలహాలిస్తాను.
వాటిని పాటిస్తే ఇక "నారేతలు,పైరు కోతలు,బాక్స్ మోతలు,
బస్సు వేటలు"లేకుండా రోజుకు పది వేలు పది తన్నులతో 
సంపాదించవచ్చు.

కాక పొతే సదరు భర్త గారు తాగిన తరువాత ముచ్చటగా 
"తమల పాకుతో నేనొకటి అంటే...తలుపు చెక్కతో నేనొకటి"

అని మనకు ఇలా సహకరించాలి...
లేదా వాళ్ళు సహకరించకపోతే తన్నకుండా తీసు కోటానికి 
మన నిజాయతి ఒప్పుకోదు కాబట్టి దేవుడిని తలుచుకుంటూ 
ఇలా ఓ పది తగిలించాలి(మనసులో దేవుడిని క్షమాపణ 
వేడుకోవచ్చు)


ఇంకా ఇది చూసే భార్యలు,భర్తలు,బ్లాగర్లు,పెద్దలు,పిల్లలు ,పీచులు,
మీకు తోచిన సలహాలిస్తే కొంత సాయం చేసినవారు అవుతారు.

సదరు మంత్రి గారికి కృతఙ్ఞతలు....భారతీయురాలు.

సామాన్యుడు శాంతియుతంగా నిరసిస్తే ఆ బలం ఎలా ఉంటుంది?
అన్నా హజారే బ్లాగ్ చూడండి.http://annahazaresays.wordpress.co   

Monday 26 September 2011

ఏమవుతారని చేయాలి సాయం ?

చూడండి స్పూర్తి కోసం ఎక్కడో పుస్తకాలలో చదవక్కరలేదు.
మన మధ్యే ఎంతో మంది ఉన్నారు .వాళ్ళను చూస్తె అబ్బ 
మనం కూడా పుట్టిన దానికి జన్మ సార్ధకత చేసుకుంటే 
బాగుండు అనిపిస్తుంది.

సిక్కిం లో భూకంపం వచ్చిన తరువాత యెంత ఘోరంగా 
ఉందంటే పరిస్తితి అంత ఘోరంగా ఉంది.యెంత మంది దార్లు 
మూసుకు పోయి "దేవుడు లేడా"అని అనుకుంటూ ఎదురు 
చూస్తున్నారు......

"దైవం మానుష రూపేణా"అంటారు పెద్దలు.
దేవుడు ఎక్కడ నుండో  రాడు
మనకు ఆ క్షణం లో సాయం చేసే వాడే దేవుడు.

అలా వచ్చిన వారే "పూర్ణిమా రనాడే""అరుణిమా విదాతే"
మహిళలు అనుకుంటే ఏ రంగం లో అయినా సేవ చేయగలరని చూపారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్సు తరుపున ఈ ఇద్దరు మహిళా పైలట్లు 
దాదాపు 250 గంటలు పైనే రేస్క్యు ఆపరేషన్ లో పాల్గొని భూకంప 
భాదితులకు సాయం చేస్తూ చక్కర్లు గొట్టారు.

ఇంత సేపు పని చేయటం అనేది శారీరిక నిర్మాణం దృష్ట్యా 
ఆడవాళ్ళకు చాలా కష్టం.మరి మన అనుకున్నారు కాబట్టే 
భాదితులకు సాయం చేయగలిగారు.(నాకైతే ఎక్కువ పని చేసాను 
అనుకోండి ఎంచక్కా చెవుల్లో సిలోన్ radio station "కుయ్"
మని వచ్చేస్తుంది)

వారికి అందరం hatsoff చెప్పాలి.....కదా...

ఇంకో సంగతి చూద్దాము.ఇక్కడ నెల్లూరు జిల్లా లో మా 
సూళ్ళూరు పేట మండలం లో అటకాని తిప్పలో జరిగింది.

ఇక్కడ ఆటకాని తిప్పలో గ్లోబల్ స్కూల్ నిర్మించారు.
దీనికి సాయం చేసింది బెల్జియం దేశం వారు.

అక్కడ "ఎంజిలిన్"అనే మహిళా వంద మీటర్ల పరుగు పందెం 
లో వచ్చిన బహుమతి రూ..1.25 లక్షలు మొత్తం 
ఖర్చు  పెట్టి ఇక్కడ  డైనింగ్ హాల్ కట్టించింది.

మరి వీరందరూ అవతలి వాళ్ళు ఎమవుతారని సాయం చేసారు.

కేవలం వాళ్ళు మనుషులే అనే చిన్న స్వార్ధం తప్ప......
            
            మనిషి 
            దేవుడయ్యాడు 
            విశాల
            హృదయం చూపి..........

Wednesday 21 September 2011

మానవత్వమా...నీవెక్కడ ?

ఈ రోజు మానసిక వికలాంగుల మీద ఒక ఆర్టికల్ 
చదివి నాకు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది.

రియ్యం...రియ్యం....రియ్యం...కొన్ని నెలల ముందు 

మా బాబాయి వాళ్ళ పెళ్లి రోజని వాళ్ళతో మా నాన్న 
వాళ్ళు మేము అలిమేలుమంగాపురం(తిరుపతి దగ్గర)
వెళ్లి అందరం స్వామీ వారి కల్యాణం చేయించాము.

తరువాత తిరుపతికి దగరలో చిత్తూర్ వెళ్ళే రోడ్ మీద 
అక్షయ మానసిక వికలాంగుల కేంద్రం ఉంది.దానిలో 
వాళ్ళ పెళ్లి రోజు సందర్బంగా ఏమైనా సహాయం
చేద్దామని వెళ్ళాము.

అది మధ్యలో షట్భుజి ఆకారం లో ఖాళి స్తలం వదిలి చుట్టూ 
రూమ్స్ కట్టి ఉన్నారు.ఎక్కడ చూసినా మానసికంగా 
ఎదగని పిల్లలే.ఏడ్చే వాళ్ళు,నవ్వు కొనే వాళ్ళు,గమ్ముగా 
కూర్చుని అమాయకంగా చూసేవాళ్ళు...ఒక్కొక్కరి గూర్చి 
చెపుతుంటే వారిని ఎలా పెద్ద వాళ్ళు వదిలేసేంది చెపుతుంటే
..వాళ్ళనలా చూస్తుంటే ఏమి పాపం చేసారని 
ఇంత చిన్న పిల్లలకు ఈ శిక్ష ...అని హృదయం ద్రవించి పోయింది.

నేను మా పిన్నమ్మ అయితే చూడలేక కళ్ళ నీళ్ళు 
పెట్టుకొని ఎడ్చేసాము.

తరువాత ఆ కేంద్రం నడుపుతున్న డాక్టర్ గారికి డబ్బులు 
ఇస్తూంటే వారన్నారు "డబ్బులు ఇచ్చే వారు చాలా మంది 
ఉన్నారు .సేవ చేసే వారే లేరు "అని.

చివరగా ఒక 18 ఏళ్ళ అమ్మాయిని చూసాను.అసలు హీరోయిన్ 
హన్సికా లాగుంది.కాని బుగ్గ మీద గీసుకొని రక్తం వస్తూంది.
అసలు మన లోకం లో లేదు.

అప్పుడు అక్కడ చూసుకొనే ఆయా చెప్పింది...
వాళ్ళ నాన్న పెద్ద డాక్టర్ అంట.కాని ఆ అమ్మాయిని 
ఎక్కడ కాపాడగలడు.అప్పుడు అప్పుడు వచ్చి చూసి వెళుతుంటాడు 
కన్నీళ్లు నిండిన హృదయం తో..........

మరి వీళ్ళ మీద కూడా అత్యాచారం చేసే వారిని దేవుడైనా 
క్షమిస్తాడా?అసలు ఆ న్యూస్ చదవగానే బాదతో ఒక కవిత రాసి 
పంపాను.మానసా సంస్థ ,విజయవాడ వాళ్ళు మొన్న ఆదివారం పిలిచి 
ఒక మేమోంటో ఇచ్చి పంపారు....ఏమిటి ?
కవిత వింటారా?
హెంత మంచోల్లో.....అంతా వద్దులే కొంచం....

ఇలా పుట్టటమే పాపం అని తెలీక 
విరబూయాల్సిన వసంతాలు 
విరియాలని వచ్చిన హరివిల్లులు 

పరుల కోరికల బలిపీటం పై 
చేయని తప్పుకు శిలువలు ఎక్కి 
విష సర్పాల కోరల..కోరికలు తీరుస్తూ..

చిన్నారి పావురాలు రక్తాశ్రువులు చిందిస్తూ 
మరణపు అంచులు తాకుతూ 
మానవత్వపు చిరునామా ఏదని 
ఆరిపోతూ ప్రశ్నిస్తున్నాయి.....

ఇంకేమి రాయలేను..ఇప్పటికే కళ్ళు నీళ్ళతో నిండి పోతున్నాయి....

Friday 16 September 2011

జై సంజీవిని మాత..మస్తుగుంటై కదలు 3

నా ఉద్యోగ నిమిత్తం నేను, మా వారు హనుమ కొండలో 
కాపురం పెట్టాము.అయితే అప్పుడు దసరా సెలవల ముందు 
పాలు పొంగించకూడదని వంట మొదలు పెట్ట లేదు.
మేము మాలాగే చిత్తూర్ నుండి వచ్చిన జంట ఉండేవారు.
అందరం కలిసి హోటల్ లో భోజనం చేసి దగ్గరలో 
వేయిస్తంబాల గుడి ఉంటె రాత్రి దాకా అక్కడ ఉండి
వచ్చే వాళ్ళం.(మరి ఇంకెక్కడకు పోయినా జేబులో 
డబ్బులు హుష్ ..కాకి..)

మా పాప ని మా అత్తగారింట్లో వదిలి వచ్చాము.
మా వారి అన్నగారు S.B.I.లో మేనేజర్ .వాళ్ళు మా 
పెళ్లి అయిన కొత్తల్లోనే ట్రాన్స్ ఫర్  అయి వేరే ఊరికి 
వెళ్లి పోయారు.అందుకని మా పాప వాళ్ళ ఇంట్లో అపురూపం.
యెంత అంటే ఈమెకి ఎక్కడ వేడి తగులుతుందో అని 
అప్పటి కప్పుడు కూలర్ కొని మా మరుదులు రోజు ఆమెకోసం 
వేసేవాళ్ళు.ఇంక మా ఆడ బిడ్డ చెప్పనే అక్కర్లేదు......
రోజుకొక డ్రెస్,బొట్లు...రక రకాలు..మా మామ గారు అయితే 
పాపకు కొత్త డ్రెస్ వేస్తె చాలు వెంటనే ఎదురుగా పోటో స్టూడియో 
లో పోటో తీయించేవారు.ఇక మా వారి అమ్మ ,పిన్నమ్మ,అమ్మమ్మ...
అబ్బో...చెప్పలేము ఈమె యువ రాణి.............

(అసలు అన్న పిల్లలు అంటే తమ్ముళ్ళకు చాలా 
ఇష్టం ఉంటుందేమో కదా)

పాపం పాప అమ్మా నాన్న దగ్గర లేరు అని
ఇంకా గారాబంగా చూసేవారు.
వాళ్లకు కిరాణా షాప్,టెంట్ హౌస్,ఎరువుల షాప్ ఉండేవి.

ఒక రోజు మా పెద్ద మరిది ఒక పురుగుల మందు బాటిల్ 
కొంచం లీక్ అవుతుంటే హాల్లో ఒక బీరువా కింద పెట్టాడు 
టౌన్ కి పోయేటప్పుడు తీసుకెళ్ళి రిటర్న్ ఇద్దామని.
మర్చి పోయి వెళ్లి పోయాడు.ఇంకేముంది పాప చక్కగా 
దోగాడుతూ వెళ్లి బాట్టిల్ పట్టుకొని నోట్లో పెట్టుకుంది.

అప్పుడే వాళ్ళ ముత్తవ్వ చూసి అందరిని పిలిచింది.ఇక చూడండి 
హడావిడి.అందరు వచ్చి గబా గబా పాప నోరు కడిగారు.
మా చిన్న మరిది ,ఆడ బిడ్డ ఎక్కిళ్ళు పెట్టి ఎడ్చారట.

అందరు ఏడుపే ఎమవుద్దో  అని.మా వారి అమ్మమ్మ అయితే 
"అయ్యో వాళ్ళ బిడ్డ మనం ఏమి సమాదానం చెప్పాలి?"
అని ఏడుపు.ఈ లోపల మా పెద్ద మరిది వస్తే డాక్టర్ దగ్గరకు 
తీసుకెళ్ళారు.దేవుడి దయ వల్ల పాప బాగానే ఉంది.ఇక అప్పటి నుండి 
మా మరుదులు పాపని సంజీవని మాత అని పిలిచేవారు.

మేము సెలవలకు వచ్చిన తరువాత ఈ విషయం చెప్పారు.
అప్పుడు ఏముందిలే ఏమి జరగలేదు కదా అని నేను పెద్ద 
పట్టించుకోలేదు.

మొన్న ఒక రోజు టి.వి.లో న్యూస్ లో చూసాను.ఒక ఆతను
అప్పుల బాద పడలేక పురుగుల మందు తాగి చనిపోతూ ,
చనిపోయే ముందు తన రెండేళ్ళ పాపను ముద్దు పెట్టుకొన్నాడు.
ఆ నురుగు తగిలి ఆ పాప కూడా చని పోయింది.తను సరే 
చనిపోయాడు,కాని పాప ను చంపే హక్కు అతనికి ఏముంది.
పాపం పాప....
(దోగాడే పిల్లలు ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి.)ఇంకో కధ 
ఈ సారి... ఎదురు చూస్తూ ఉండండి.మరింకేమిటి కామెంటండి.



Saturday 10 September 2011

అందరి తల్లి...మహా లక్ష్మి

మొన్న శుక్రవారం రాత్రి మా వారి ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతూ "రేపు టీచర్స్ 
అందరమూ శ్రీపురం పోతున్నాము ఇంకా రెండు టికెట్స్ ఉన్నాయి మీరు 
 వస్తారా?రాత్రికే ప్రయాణం "అన్నారు.మా వారు పిల్లలు ఎలా అంటుంటే 
"ఏమండీ ,లక్ష్మిదేవి అవకాశం ఇచ్చింది.ఇబ్బందులు లేవు.పిల్లలు ఏముందిలే
వాళ్ళ లైఫ్ పార్ట్ నర్స్ తో వెళతారు"అనేసి,వెంటనే రెడీ అయి వెళ్లి పోయాము.
శనివారం చూసుకొని రాత్రికి ఇంటికి వచ్చేసాము.

 శ్రీపురం లో మహాలక్ష్మి బంగారు గుడి ఉంది.ఇది "శ్రీ శక్తీ అమ్మ"అనే అతనికి 
 అమ్మవారు పూని కట్టించారని చెపుతున్నారు.ఇది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లా
లో వేలూరికి పది కి.మీ.దూరంలో ఉంది.ఉదయం 8 a.m.--8p.m.వరకు దర్శనం 
 గుడిఅనుమతిస్తారు.

(మేము రాత్రి గుడిఅందం చూడాలని ఎంతవరకు  గుడి ఉంటుందో తెలీక 
బలే టెన్షన్ పడ్డాము.అందుకే వ్రాస్తున్నాను)

చూడండి లక్ష్మి దేవి చాలా అందంగా ఉంది కదా?అసలు చుట్టూ నీటిలో బంగారు మండపం 
ప్రతిబింబిస్తూ,మండపం లో అమ్మవారిని చూస్తె స్వర్గంలో చూసినట్లు ఉంది.

(అబ్బ నేను స్వర్గానికి పోలేదులే ,ఉదయం ఉస్మాన్ ఖాన్ గారి స్వర్గ వివరణ చదివాను..
అలా అనిపించింది.చంపేస్తారా ఏమిటి నన్ను?
ఏదో పోనీలే అని మంచిగుడి గూర్చి చెపుతుంటే పే...ద్ద)
 

 








ఈ గుడి విహంగా వీక్షణం లోచూస్తె చుట్టూ నక్షత్ర రూపంలో క్యూ ఉండి,మధ్యలో
బంగారు గుడి ఉంటుంది.రాత్రి పూట ఆ క్యూలో నడుస్తూ కొన్ని సార్లు గుడికి దగ్గరగా,
కొన్ని సార్లు దూరంగా వస్తూ,పక్కన చెట్లు ,మధ్యలో అన్ని బాషలలో వ్రాసిన సూక్తులు 
చదువుతూ వెళ్ళటం ఒక అపురూపమైన జ్ఞాపకం గా నిలిచిపోతుంది.

ఇంకా ఇక్కడ గుడిముందుపద్మం లాగా ఒక శిల చెక్కి ఉన్నారు.
దానిపై చెవి పెట్టి దానిని తడితే లోహం పై తట్టినట్లు  వినిపిస్తుంది.

అలా గుడికి దగ్గరగా వచ్చి గుడి చుట్టూ ప్రదిక్షణం చేస్తాము.
అప్పుడు దాని అందం చూస్తూ నేను నోరు తెరిచేసాను 
నాకు తెలీకుండానే.

ఏమిటి  ఈగలు పోయాయా అని అడుగుతున్నారా?

(మీ ప్రపంచం లో మీకు బిల్ గేట్స్ గొప్ప కావొచ్చు.
కాని పసి పాప ప్రపంచం లో తూనిగే గొప్పది.)

ఇంతకీ చుట్టూ తిరిగి  అమ్మవారిని చూస్తుంటే  గుండె గతుక్కు మన్నది.

"అరె పిల్లలని తెచ్చి చూపించి వివరించి ఉంటె బాగుండునే "అని.

(ఏమిటో తల్లి పాత్ర లోకి వెళ్ళటమే కాని తిరిగి మన ప్రపంచం లోకి ఎప్పటికి రాలేమా?)

Website:WWW.sripuram.org

 కొన్ని సూక్తులు మీ కోసం  
1.మొదటి ధర్మం నీ బాధ్యత నువ్వు సరిగా నిర్వర్తించటమే.

2.మనిషి ఆధ్యాత్మిక జీవితం లేకుండా గడపగలడు కాని 
   లోఆధ్యాత్మికత లో గడపటం లో సంతోషం ,శాంతి లబిస్తాయి.

3.ఎందరో నన్ను గుడి కాకుండా హాస్పిటల్ కట్టొచ్చు కదా అన్నారు.కాని దీనిలో లబించే మంచి ఎనేర్జి వారిని హాస్పిటల్ కంటే కూడా బాగు చేసి మంచి మార్గంలో వ్యవస్థ వైపు మళ్ళిస్తుంది.

 (ఓషో అంటారు...ఒక సాదారణ వ్యక్తి బాద్యతలతో  అలిసిపోతే ఎక్కడకు వెళ్లి సేద తీరాలి?
 అతనిని ఓదార్చి సమాజంలోని బాద్యతల వైపు మళ్ళించడానికి ఇలాటివి అవసరం అని
 చెప్పారు.కాని ఏది అతిగా ఉండొద్దు.ఈ గుడి ఉండటం మంచిదే అనిపించింది నాకు)

 4.ఈ రోజు నువ్వు అనుభవించేది నీ గత జన్మల కర్మ పలితం 
అయితే,ఈ రోజుమంచి పనులు చేస్తేనే కదా రేపు మంచి జీవితాన్ని అనుభవించగలవు.
ఇక్కడ కర్మ అంటే నాకు ఒకటి గుర్తుకు వచ్చింది.కొందరికి మనం అనుకున్న వెంటనే
మెయిల్ చేస్తాము.కొందరికి ఎందుకనో చెయ్యాలన్న చేయలేము.

సాక్షి ఫండే లోG.R.Maharshi గారు మార్నింగ్ షో అని వ్రాస్తారు.
 అసలు ఒక సినిమా హాల్ యజమాని కూతురుగా అవన్నీ నేనెంతోఆనందంగా  అనుబవించాను.
 అసలు ఆయనికి నేను ఎప్పుడో మెయిల్ చేసి ఉండాల్సింది  నా సంతోషాన్ని తెలియ చేస్తూ.

ఒక  సారి సినిమా హాల్స్ పడిపోవటం గూర్చి వ్రాసారు.అప్పుడే మా నాన్న హాల్ పడగొట్టి 
ఉన్నారు.మా నాన్న మళ్ళా హాలె కట్టొచ్చు.ఏదైనా కట్టొచ్చు.కాని ఆ ఆర్టికల్ చదివి 
నాకు చాలా బాధ వేసింది.ఎందుకంటె సినిమా హాల్ అనేది ఒక వ్యాపారం కాదు.
ఎందరి జీవితాలలోని సంతోషాన్ని పంచుకొనే ఒక ఆత్మీయ స్థలం.

కాని ఎందుకో ఎప్పుడూ రాయలేకపోయాను.
ఇప్పుడు ఆయనఈ రోజే ఆ కాలమ్ ఆపేశారు .

వ్రాసిన మెయిల్స్ కంటే రాయనవే విలువ అయినవేమో.
మన జ్ఞాపకాలలో నిలిచి పోతాయి కాబట్టి....మహర్షి గారికి అభినందనలు.

అభినందన 
మొగలి  రేకులుమాయం...
తీయని జ్ఞాపికలుగా 
మారుతూ.....


Tuesday 6 September 2011

సోదరా..నేనంటే ఎంత ప్రేమరా?

ఎంత...ఎంత....దూరం....బావి...బావి....దూరం....
వానా ..వానా....వల్లప్పా....వాకిలి తెరువు...చెల్లప్పా...

ఏమిటి?అలా చూస్తున్నారు?మీరు చిన్నప్పుడు మీ తమ్ముడి తో 
ఆడుకోలేదా?

(ఆడుకున్నారా?లేక మాలాగా కొట్టుకున్నారా?)

వాడు పుట్టేసరికి నాకు మూడేళ్ళన్నమాట .అప్పటికి మా అక్క 
పుట్టి ఉంది కాబట్టి ఆ ఇంట్లో నేను ఎక్స్ ట్రా నే.అప్పుడు నేను
కొంచం అల్లరి రాక్షసి.
(ఇప్పటి సంగతి ఏమిటి అని అడుగుతున్నారా
ఇప్పుడు బాపు బొమ్మే  కాకా పొతే కూసింత బొద్దు)


(ఇది మా పోటో  కాదు.మేము ఇంకా అందంగా ఉంటామని ఉత్తమ 
చదువర్లు గ్రహించగలరు)

మా అమ్మ ఒక రోజు "శశీ.."అని పిలిచింది.ఏమిటా అని గోడ పై 
నుండి తొంగి చూసాను.

(నేను ఇంట్లో కంటే గోడలపైనే ఎక్కువ సేపు ఉండేదాన్ని).

"శశీ తమ్ముడిని పోటో తీయించుకు రామ్మా"అని నా చేతిలో బుజ్జి 
బాబుని పెట్టింది.వాడేన్చాక్కా మంచి బట్టలేసుకొని నెలవంక 
బొట్టు పెట్టుకొని ఉన్నాడు.షాప్ లో పని చేసే అబ్బాయిని నాతో
పంపింది.నేను చక్కగా పోటో తీయించి తీసుకు వచ్చాను.
వాడు అంటే ఇంట్లో అందరికి బలే ఇష్టం.చిన్నారి యువ రాజే 

(అబ్బ నేను కూడా యువ రాణే)

ఎంత ఇష్టం అంటే వాడు కోవా కావాలంటే మా ఊరిలో దొరకదని 
మా నాన్న మా వాన్ గూడురుకి (27 కి మీ)పంపి తెప్పించేవారు. 

ఇలా....ఇలా......రయ్యిం....రయ్యిం.....రోజులు పోతూ ఉన్నాయి.

ఒకవినాయక చవితి రోజు మా అమ్మ తమ్ముడికి,పసుపు బట్టలు 
తీసుకురా పోయి అని పంపింది.మేము వినాయకుని పూజ చేసేటపుడు 
చిన్న కొత్త తెలుపు క్లాత్ ని పసుపులో ముంచి ఆయనకు ,
 మా  తమ్ముడికి కండువాలాగా వేస్తాము.

(అది నాకు తెలీదు.మాకు అన్ని షాప్స్ ఉన్నాయి)

ఎంచక్కా వెళ్లి మా తమ్ముడికిపసుపు డ్రెస్ గంటలో కుట్టించుకు వచ్చేసాను.
ఇంక ఆ డ్రెస్ చూసి అందరు నవ్వే నవ్వు వేమాల సామి లాగ 
ఉన్నాడని.

(పొరపాటు చేశాను.వాడి పెళ్లి చూపులకు కుట్టించి ఉంటె 
ఎంచక్కా రవి తేజ లాగ ఉండేవాడు.మీరెవరైనా ట్రై చేయండి నా మాట విని)

ఇంక ఒక దీపావళి రోజు మా అమ్మ పిల్లలు అందరు వెళ్లి చిచ్చు బుడ్డి 
కాలుస్తూ పోటో తీయించుకొని రమ్మని నాకు చెప్పి పంపింది.

(మా అక్క పప్పు.అందుకని అన్నినాకే చెపుతుంది మా అమ్మ)

పోయి పోటో తీయమని అడిగితె వాడు "చిచ్చుబుడ్డి కాలిస్తే 
స్టూడియో కాలుతుందని ఒప్పుకోలేదు.సరే మనం కూడా మొండి.
చివరికి ఒక్క కాకర పూవొత్తి కాల్పించి పోటో తీసాడు.

యెంత తమ్ముడంటే ఇష్టమైనా అన్నిటికి కొట్టుకోవటమే (కర్రలతో 
కూడా).మా అమ్మను విసిగించేసే వాళ్ళం.

(మిమ్మల్ని విసిగించను లెండి.అలాఆఆఆఅ పెద్ద అయిపోయాము)

నాకు పెళ్లి కుదిరేసరికి వాడు ఇంటర్ .
(అయినా బలే కొట్టుకునేవాళ్ళం)

ఒక రోజు ఫ్యాన్ కింద పడుకోటానికి నేను అంటే నేనని గొడవ 
పడుతున్నాము.ఇంతలో మా అమ్మ వచ్చి "దాన్ని పడుకోనీరా
అది ఇంక ఎన్ని రోజులు ఉంటుంది పాపం"అంది.
అంతే వాడు ఇచ్చేసి వెళ్లి పోయాడు.
నిజంగా కొట్టుకున్నప్పటి కంటే నాకు,వాడికి అప్పుడు చాలా బాద వేసింది.

పెళ్లి పిలుపులకు వాడిని మా అత్త గారి ఊరికి ఒక్కడినే పంపారు 
వంద జాగ్రతలు చెప్పి.తీరా చూస్తె రాత్రి అయినా తిరిగి రాలేదు.
మాకేమో భయం వేసి పోతుంది.ఎమయ్యాడా అని.
చాలా సేపటి తరువాత సినిమా హాల్ వాళ్ళు వచ్చారు ఫోన్ వచ్చిందని .

విషయం ఏమిటంటే మా మరుదులు ,మా వారు 
వీడిని సినిమా చూపించటానికి ఆపేశారు

(మరి బామ్మర్దా మజాకా...హలో ఎవరైనా కొత్త వాళ్ళుంటే ఈ దారి దగ్గర 
 పెళ్లి కూతుర్ని కాకా పట్టటానికి ...ప్రొసీడ్)

పాపం వాడు బావ గారికి మర్యాదలు చేసి,కాళ్ళు కడిగి 
ఇంక అంతే "నీ కాలి మీద పుట్టు మచ్చనై అక్కయ్యో..."






మా  పిల్లలు,బారశాలాలు,పుట్టు వెంట్రుకలు తీసే మంగలి,
అలా....అలా......

ఇప్పటికి నేనంటే యెంత ప్రేమంటే నేను వెళితే చాలు 
సెకండ్ షో ప్రోగ్రాం .నాకు నిద్ర వస్తుందిరా అన్నా వినడు.
చూసినంత చూద్దువులే అంటాడు.అలాగైనా నాతొ ఎక్కువగా 
గడపొచ్చని.

 ఇంకా యెంత ప్రేమంటే వాడి కూతురు కొంచం బొద్దుగా 
 ఉందంటే "మా శశి అక్క లాగా"అని మురిసి పోతుంటాడు.

మరి అంత ప్రేమకు నేనేమి ఇవ్వాలి.అందుకే ఈ పోస్ట్ మా
తమ్ముడు వాసు కి.ఇంకా అక్కచెల్లెళ్ళను బాగా చూసుకునే
అందరికి అంకితం.

హలో అక్కయ్యలు కళ్ళు తుడుచుకొని మీ తమ్ముళ్ళకు అర్జెంటు 
ఫోన్ చెయ్యండి..........టాటా.




Saturday 3 September 2011

గల గల పారె సెలయేరు ...గొదారిలా మారితే..

మారితె ఏమవుతుంది?చక్కగా జీవనదిలా మారి 
ఎందరికో జీవన నాదం గా నిలిచిపోతుంది.
 అలాంటి సెలయేరు లా ప్రవహించే నన్ను జీవన 
 శ్రుతికి తెచ్చి నా జన్మకు సార్ధకత తెచ్చి ఎందరో విద్యార్దుల 
తలపుల్లో నన్ను నిలబెట్టిన మా గురువులను తలుచుకుందామని
చిన్న ప్రయత్నం.

(ఏమిటి ఇంత గంబీరమైన బాష అనుకుంటున్నారా?
కొంచం గ్రాందికం బీబత్శంగా ప్రాక్టిసు చేస్తున్నాను. )

ముందు నాకు చిన్నతరగతుల్లో చెప్పిన కుమారి మేడం ని 
తలుచుకోవాలి.అదేమీ పెద్ద కాన్వెంట్ కాదు.నాకు,మా
పెదనాన్న పిల్లలు ఇద్దరికీ ఇంకో ఇద్దరు వేరే పిల్లలకి 
పెట్టిన స్కూల్ అది.

మనం చదివేది లేదు.రాసేది లేదు.
చెప్పేటపుడు విని గుర్తు పెట్టుకోవటమే.
మేడం దగ్గరుండి ఇది రాయి అంటే రాయటమే.
లేకుంటే నా ఇష్టం ఉంటె  వ్త్రాస్తా...లేకుంటే లేదు.
ఒక వేళ రాశాననుకోండి.తప్పు లేక పొతే మార్క్స్ తీసేస్తే 
ఒప్పుకోను.ఏమి చేస్తానా?మా నాన్నని లాక్కొచ్చి అడిగిస్తా?
ఎక్కడ తప్పుందో చెప్పమని.

నాతో వేగలేక మూడో క్లాసు లోపే ఐదు తరగతుల బుక్స్ 
చదివించేసి హై స్కూల్ కి పంపేసింది.

 ఇక హైస్కూల్ లో సుమిత్రమ్మమేడం. నాకు అప్పుడు పరీక్షలు 
 ఎలా వ్రాయాలో తెలీదు.అందరికంటే ఫస్ట్ ఇచ్చేసేదాన్ని.అదే ఫస్ట్
రావటమంటే అనుకునే దాన్ని(35  మార్క్స్ కంటే ఎక్కువ రాయను)

ఎప్పుడు బూమి మీదే ఉండము.ఎక్కడ ఉంటానా?గోడల మీద,చెట్ల మీదే...పాపం నన్నుభూమి మీదకి తేవటానికే 
చాలా కష్టపడింది.ఇంకా పరీక్ష పూర్తిగా రాయించటం...
భగీరదుడు  గంగను తెచ్చినట్లే...ఆమె అన్ని ప్రశ్నలు 
రాయాలమ్మా అంటుంది...వెంటనే మనం ఏమంటాము...

మా నాన్న కొండ మీద కోతి కావాలన్న తెచ్చిస్తాడు 
నేను ఎందుకు రాయాలి అని .

(మన మీద బోల్డెంత అభిమానం,బయం కూడా మా నాన్నని లాక్కోస్తానని...అయన వాళ్ళని ఏమి అనకపోయినా)

 అలా....అలా....ఓర్పుగా కధలు  నా కోసం కల్పించి చెప్పి 
మనం స్కూల్ ఫస్ట్లు,సెకండ్ లు వచ్చేటట్లు చేసింది.
మేడం కి పోలియో ఒక కాలుకి.పెళ్లి కూడా చేసుకో లేదు.
ఇప్పటికి వాళ్ళ ఇంట్లో అందరు,మేడం నన్నుకన్నబిడ్డలా
చూస్తారు.నా అల్లరి "విన్నావా యశోదమ్మా?"లాగా 
కదలు చెప్పుకుంటారు.

(మా పిల్లలకి చెప్పేస్తారు...చెప్పోద్దో అంటే కూడా వినరు)
   

"రైలు బడి" పుస్తకం లో కొబయాషి , టొటో చాన్ ను 
దారిలో పెట్టినట్లు నన్ను ఈ రోజు ఎందరో విద్యార్దుల కు 
 స్పూర్తి గా నిలిపింది ఆమె.

పిల్లలు తమకు నచ్చిన విదంగా ప్రకృతిలో మమేకమై
విద్య నార్జించే పరిస్తితులు కల్పించేవాడు కొబయాషి.
అతని ఓర్పు,పిల్లల పట్ల ప్రేమ ఎందరో టొటొ చాన్ లను సృష్టించి 
దేశం కోసం పంపింది.

వారి గూర్చి మిత్రుని రివ్యూ చూడండి.


"పిల్లలంతా తరగతి గదిలో  క్రమశిక్షణ తో నిశ్సబ్దంగా ఉంటె
నేర్చుకునేదెవ్వరు?"అంటూ ఉంటారు గిజు బాయి.


 "వాళ్ళని వాళ్ళ లాగే పెరగనిస్తే ప్రకృతే వాళ్లకి గురువు అవుతుంది"
 అంటారు రవీంద్ర నాథ్ టాగూర్ గారు.

"మీరు ఏమైనా వారికి నేర్పించాలంటే ముందు వాళ్ళ ప్రపంచం తో
మమేకమవ్వండి.అప్పుడు అక్కడ ఇద్దరు లేరుఉన్నది ఒక్కటే.
అది జ్ఞానం మాత్రమే"

ఇదెవరు చెప్పరంటారా?
బలే వాళ్ళే నేనే చెప్పానండి.
ఏమి చెప్పకూడదా?
ట్వెంటీ ఇయర్స్ టీచింగ్ ఇండస్ట్రీ ఇక్కడ.


"A bad teacher teaches 
 A  good teacher explains
 A  better teacher demonstrates
 A  best teacher inspires"


"The future of the nation depends upon the 
class room".........Sarvepalli.Radhakrishnan.