Wednesday 29 February 2012

''జాబిలి తునకలు'' తుషారం 4

అల్లి బిల్లి అల్లరి పిల్ల ల మధ్య మా మనసు 
ఎన్నటికి ఎదగదు.......వారికీ కవిత్వం అంటే తెలుసు....
అర్దమైతే చదువుతారు.....చిన్న మనస్సులో నాటుకున్న 
భావాలు పెద్దైనా నిలబడతాయి....మనసు కదిలినపుడు 
వ్రాసిన  నా  కవితల సంకలనమే ''జాబిలి తునకలు''
దాని మీద వచ్చిన సమీక్షలలో ఇది నాలుగవది.
మార్చి ఒకటిన నేటి నిజం లొ వచ్చింది.
వ్రాసిన కొండ్రెడ్డి గారికి,నేటి నిజం వారికి కృతజ్ఞతలు.


సమీక్ష లింక్ ఇక్కడ చూడండి



Saturday 25 February 2012

వహ్వా.....చదువుల ''తల్లి''

తానె ఒక పాప.....తన వడిలో ఒక ముక్కు పచ్చలారని 
పసిపాప........ఏమి అందం.....అది తనలో పట్టుదల.


ఆడవాళ్ళకు  ఏమి అందం ......
చల్లని ప్రేమను కురిపించే నల్లని కళ్ళా
హరివిల్లుని దించి సంతోషాన్ని విరజల్లె కను బొమ్మలా 
చిగురాకు ఎరుపును చూచాయగా అద్దిన బుగ్గలా 
సింగారపు వన్నెలు నిండిన చీరలా 
మెరుపులు కురిపించే సొమ్ములా......


కాదు.....కానే కాదు.....


పట్టుదలతో వచ్చిన  జ్ఞానపు వికాసం ......
దానితోటి వెల్లి విరిసే ఆత్మా విశ్వాసం......


చూడండి ఆ పాపని(పాపే ....పెద్ద అమ్మాయి కాదు)
పట్టుదలతో తన వడిలోని చిన్నారితో 
పరీక్ష వ్రాస్తున్న పసిపాపను.......


నీళ్ళు  నిండిన మీ కళ్ళకి ........
తను భారత దేశపు మూడ విశ్వాసాలు,ఆడపిల్ల పై వివక్ష 
అనే పంకం నుండి వికసించిన పంకజం లో 
జ్ఞాన తేజస్సుతో వెలిగే చదువుల ''తల్లి'' లాగా 
కనపడటం లేదా.......


''అవును ఆడ పిల్ల  చదువుకోవాలి
తన కాళ్ళ పై తాను నిలబడటానికే కాదు 
తన తరువాతి తరాలను కూడా మంచి 
మార్గం లో నడపటానికి''
ఈ రోజు పేపర్ లోని ఫోటో నా హృదయాన్ని ఎంతో
కలచివేసింది.యెంత పసి బిడ్డ.....తనకు ఇంకో బిడ్డ....
ఇంతేనా భారత దేశం....మనమేమి చెయ్యలేమా .....



Wednesday 22 February 2012

పరీక్షల టెన్షన్ ......ఎదుర్కోవటం ఎలా?



పరీక్షల పులి.....పిల్లలు బలి...

టెన్షన్....టెన్షన్....ఎక్కడ చూసినా పరీక్షల టెన్షన్.....
మరి దీని మీద నేను వ్రాసిన ఆర్టికల్ ఈ రోజు ఆంద్ర భూమి లో 
చూడండి.
నువ్వు వ్రాయగలవు ....అని ప్రోత్చహించి  సలహాలు ఇచ్చిన 
వలబోజు.జ్యోతి గారికి,భూమి  వారికి కృతఙ్ఞతలు.
  భూమి లొ నా ఆర్టికల్  లింక్ 


పిల్లల్లో టెన్షన్‌కు పెద్దలదే బాద్యత

  • -వాయుగుండ్ల శశికళ
  • 20/02/2012


టిఫిన్ తినాలి.. రా నాన్నా’’... స్కూల్ నుండి వచ్చిన కాశ్యప్‌ని పిలిచింది తల్లి.
‘‘నాకేమీ వద్దు’’ విసుగుగా వెళ్లిపోయాడు... లోపల పుస్తకాలు టేబుల్‌పై విసిరేసిన చప్పుడు.. రోజూ ఇదే తంతు.. వీడికి ఏమైంది..? నిట్టూర్చింది తల్లి.
‘‘ఏం.. ఈసారన్నా ర్యాంక్ తెచ్చుకుంటావా? ఊరికినే ఏమీ సీట్ రాలేదు.. వేలకువేలు తగలేస్తే వచ్చింది...’’ తండ్రి అరుపులకు చిన్నబోయిన చిన్నారి మనసు దిండును కన్నీళ్ళతో తడుపుతుంది.. మొహం కనబడకుండా బుక్ అడ్డం పెట్టుకొని..
కాశ్యప్ లాంటి వాళ్లే కాదు.. ఎక్కడ చూసినా.. టెన్షన్.. టెన్షన్.. పరీక్షలుదగ్గర అవుతుంటే.. ‘ర్యాంకుల పులి’ పైనబడి పీకుతుందని చిన్నారులు బెదిరిపోతున్నారు. వారి భయాన్ని తీర్చాల్సిన తల్లిదండ్రులే బెదిరింపులకు దిగుతుంటే... ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో తెలీక బిక్కు బిక్కుమంటూ డిప్రెషన్‌లోకి జారిపోతూ... ఒక్కోసారి ఆత్మహత్యలతో లోకానికి, చదువు కష్టాలకు శాశ్వతంగా సెలవు చెప్పేస్తున్నారు. గతంలో కంటే బాగా పెరిగిన సిలబస్, పోటీతత్త్వం, సమాజమే కాక తల్లిదండ్రులు కూడా పిల్లలను మార్కులతో కొలతలు వేస్తుండటం.. తగిన నిద్ర, పౌష్టికాహారం లేక పోవటం కూడా పిల్లలలో టెన్షన్‌లు పెరగటానికి కారణమవుతున్నాయి.
పిల్లలను అన్ని విధాలా సంరక్షించి, దేశానికి ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దాల్సిన తల్లిదండ్రులు కొంచెం విజ్ఞతతో, ప్రేమతో ప్రవర్తిస్తే మనం భావితరాలను చక్కని దారిలో నడపగలం. పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకుని చదువే కాక, వారిలో సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే టీచర్లు లేరు ఈ కార్పొరేట్ ప్రపంచంలో. ఎప్పటికప్పుడు సబ్జక్టుల్లో చాప్టర్ వారీగా ప్రతిరోజు పరీక్షలు పెట్టటం, వారిని మార్కులతో తూచి, తెలివి పేరిట విడదీయటంతో చిన్నారి మనసులు విశ్రాంతి లేక టెన్షన్‌తో తల్లడిల్లిపోతున్నాయి. బాగా చదివే పిల్లలకు వత్తిడి ఉండదేమో అనుకోవటం పొరపాటు. నిజానికి ఒక్క మార్కు తగ్గినా దిగులుపడిపోయి డిప్రెషన్‌లోకి వెళ్ళేది వాళ్ళే.
చిన్న చిన్న జాగ్రత్తలతో పిల్లలకు చేయూతనందిస్తే వారిని ఈ పరీక్షల సమయంలో ఆత్మవిశ్వాసం అందించగలం. ముందుగా పిల్లలు ఏయే విషయాలలో టెన్షన్‌కు గురవుతారో పరిశీలించాల్సి ఉంది.
ప్రతిరోజూ చదువుతున్నా పరీక్షలు దగ్గరకు వచ్చిన తరువాత ఇంకా చాలా సిలబస్ చదవాల్సి ఉందని అనిపిస్తే.
మోడల్ పేపర్స్ చూసినపుడు వారికి రాని ప్రశ్న కనిపిస్తే, అది ఇంక చదవలేమని అనిపిస్తే ,వచ్చినవి కూడా మర్చిపోయినట్లు వారు తికమకపడిపోతుంటారు.
నిద్ర తక్కువైనా మెదడు అసౌకర్యంగా ఉండి సరిపోయినంత ఏకాగ్రతతో పనిచెయ్యలేదు. జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది.
ఏదైనా సబ్జెక్ట్‌లో వీక్ అయితే దానిగూర్చే ఆలోచించి దిగులు పడి మిగిలినవి కూడా చదవలేకపోతారు.
పరీక్షల భయానికి లోనై సరిగా భోజనం చేయక పౌష్టికాహార లోపం వచ్చి, కొంచెం చదివినా అలిసిపోతుంటారు. విసుగుపడుతుంటారు. విసుగుని బుక్స్ విసిరేస్తూనో, దురుసుగా మాట్లాడుతూ అమ్మానాన్నల్ని కసురుకుంటూ ఉంటారు.
కొందరికి పౌష్టికాహార లోపంతో దృష్టి దోషం వస్తుంది. అది తలనొప్పికి దారిస్తుంది.
హాస్టల్స్‌లో ఉన్న తమ పిల్లలను పేరెంట్స్ చూడటానికి వెళ్లినపుడు.. ఇంటికి వచ్చేస్తామని మొండికేయటం లేదా ముభావంగా ఉండి మాట్లాడకపోవడం జరుగుతుంది. ఏం అలా వున్నావు.. అని గట్టిగా అడిగితే కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు.
పిల్లలను కళ్ళలో పెట్టుకుని ప్రేమగా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. వాళ్ళు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు నవ్వు మొహంతో పరీక్షలు రాసి విజయకేతనం ఎగురవేస్తారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షల సమయంలో వేరే వాళ్ళతో పోల్చటం, ర్యాంకులు గుర్తుచేయటం సరికాదు. చక్కగా చదువుకొని రాయమని వాళ్ళ బాధ్యతను ప్రేమగా గుర్తుచెయ్యాలి.
ఎట్టి పరిస్థితులలో తాము ఇంత డబ్బు కట్టామనే మాట రాకూడదు. విద్యార్థి ఎన్ని మార్కులు తెచ్చుకోగలడో కనుక్కుని, దానికన్నా ఎక్కువే వస్తాయని ప్రోత్సహించాలి.
వాళ్ళు మనసు పెట్టి తినరు కాబట్టి వీలైనంత ఎక్కువగా పళ్ళరసాలు, తేనె కలిపి ఇవ్వాలి (ఐస్ వద్దు). వాళ్ళకు ఇష్టమైతే ఎప్పుడైనా జంక్ ఫుడ్ పెట్టవచ్చు. కానీ అది మితంగా పెట్టాలి. లేకుంటే పరీక్షల సమయంలో వారికి గ్యాస్ ప్రాబ్లెమ్స్ వస్తాయి.
గుడ్లు, ఆకుకూరలు, కారెట్, పాలు, ఏవైనా సలాడ్స్ ముఖ్యంగా అప్పుడప్పడు డ్రై ఫ్రూట్స్ (హాస్టల్‌లో పిల్లలకు ముఖ్యంగా) తినిపిస్తే పౌష్టికాహర లోపం రాకుండా ఉంటుంది.
వాళ్ళు తినమని మొండికేస్తే దానివలన వాళ్ళ ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కోల్పోతారని ఎంతో ప్రేమగా నచ్చచెప్పాలి.
హాస్టల్‌లో పిల్లలకు వాళ్ళు ఫోన్ చేసినపుడు.. నువ్వు బాగానే రాస్తావు, పరీక్షలో అన్నీ గుర్తుకు వస్తాయి, మంచి ఆహారం తీసుకో... అని చెప్పాలి. పరీక్షల విషయాలే కాకుండా వాళ్ళ మనసు ఉల్లాసంగా ఉండేటట్లు ఏమైనా కబుర్లు చెప్పాలి.
వాళ్ళు ఒక సబ్జెక్ట్ వీక్ అని భయపడుతుంటే చాప్టర్‌వారీగా రఫ్ నోట్స్ కీ పాయింట్స్‌తో రాసుకోవాలని, వాటిని చూడగానే ఆ ప్రశ్నలు గుర్తుకు వస్తాయని చెప్పాలి.
పిల్లలు విసుగుపడుతుంటే కచ్చితంగా వారికి నిద్ర తక్కువై ఉంటుంది. వీలైతే కొద్దిసేపు ప్రశాంతంగా నిద్రపోయేటట్లు లేదా పరీక్షల గూర్చి ఆలోచించకుండా పది నిమిషాలు ప్రతిరోజు ధ్యానం చేయమని చెప్పాలి.
ఆడపిల్లలు ముఖ్యంగా ఎనీమిక్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి డాక్టర్ సలహాలతో మందులు వాడాలి.
తలనొప్పి, జలుబు లాంటి చిన్న చిన్న ఇబ్బందులను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. లేకుంటే అవి ఇప్పుడు ఇబ్బంది పెట్టటమే కాక పరీక్షల సమయంలో సమస్యలు తెస్తాయి.
తల్లిదండ్రులు నిత్యం పిల్లల ఇబ్బందులు గమనించుకొని, ప్రేమతో జాగ్రత్త వహించి వారికి అండగా నిలిస్తే వారు చక్కగా పరీక్షలు రాసి చిరునవ్వులు చిందిస్తారు. చదివే వయసులో ప్రణాళిక, పట్టుదలతో నిలవాలి. పరీక్షల సమయంలో భయాన్ని జయంచాలి.

Thursday 16 February 2012

ఇది నిజంగా నిజమేనా?

ఈ రోజు ఈనాడు లో ఈ న్యూస్ చదివి ఆశ్చర్య పోయాను.
అలాగా గ్రహాంతర వాసులతో మీటింగ్ పెట్టె స్టేజ్ కి మనం 
వచ్చామా?నమ్మొచ్చా?



Wednesday 15 February 2012

ఆణి ముత్యాలు....

''I can't teach anybody anything 
I can only make them think''
                                  ------Socrates 
''A learned man is a tank
Awise man is a spring''
                                 -------W.R.Alger




''Every child comes with a message
that God is not yet discouraged of man''
                                          -------Dr R.N.Tagore




''A good laugh is sunshine of house''
                                                       -------Thakeray



''Surround yourself with good books and u will have 
a fortress that will protect of loneliness''
                                                           -----Marcus Aurelivs


''some are born great 
some achieve greatness
some have greatnessthrust upon them''
                                                ---------Shakesphear 


''I'd rather have roses on my table than 
diamonds on my neck''
                                       ------Emma Goldman 
''A good heart is better than all heads
in the world''
                            -------Lylton
''Genious is one percent inspiration 
ninety nine percent perspiration''
                                         ------Thomas Edison 

Monday 13 February 2012

ప్రేమా.....I LOVE U....

ఏంటి ఇంకా రాలేదు దివ్య.....ఇంత రాత్రి అయినా ....
పని లో నుండి తలెత్తి బయట కారిడార్ లో చూసాడు.
పాపను నిద్ర పుచ్చుతున్నట్లు ఉంది.
మల్లె పూల పరిమళం అక్కడ నుండే మెల్లిగా గాలికి తాకుతూ 
మనసును ఊయలలు ఊగిస్తూ తొందర పెడుతుంది.
సాయంత్రం తానూ వచ్చేసరికి దివ్య ఇల్లు నీట్ గా ఉంచి తానూ 
కూడా నీట్ గా ఉంటుంది.లేకుంటే తనకు చాల విసుగు.
బయట వ్యాపార  పనులతో విసిగిపోయి వస్తాను....
ఇల్లు బాగుండకపోతే కోపం వచ్చేస్తుంది.


ఏమిటి ఇంకా రాలేదు ....
విరహం విసుగుగా మారిపోతుంది.
వచ్చేసింది.
పాపని పడుకోబెట్టింది.
హమ్మయ్య....ఇక వెసులుబాటే....
మనసు ఆకాశం లో తిరిగి రమ్మంటుంది జంటను చేరి.....


ఇంతలో మెల్లిగా పాప ఏడుపు.....గబాల్న పరిగెత్తి పాపను ఎత్తుకుంది దివ్య.....
తన  పని డిస్టర్బ్అవుతుందనే బయం కళ్ళలో....ఉండి ..ఉండి కేవ్వుమంటూ ఉంది పాప...
ఏడుపు ఏదో తేడాగా ఉంది.


మెల్లిగా బయం ....పాప గుక్క పెట్టేస్తుంది.''ఏమైంది?'' మెల్లిగా 
అడిగాడు.
ఏమో తెలీదు...కొంచం జలుబు ఉంది రెండు రోజులనుండి...
''అయితే డాక్టర్ దగరకు తీసుకు వెళ్ళ లేదా?''పాప గూర్చి  
తండ్రిగా పట్టించుకోనందుకు కొంచం గిల్టీ ఫీల్ అవుతూ 
అడిగాడు..
''వెళ్లాను .మందులు వ్రాసిచ్చింది.దానికి శ్వాస సరిగా 
ఆడుతున్నట్లు లేదు''బయంగా చెప్పింది.


''ఇప్పుడేమి చేద్దాం''తనలోని భర్త తండ్రిగా ఎప్పుడు మారిపోయాడో....ఆదుర్దాగా ఉంది.పాపకు తగ్గితే చాలు.


పట్టుకోండి పాపని వడిలో ఉంచి పరిగెత్తింది.తన కళ్ళలో 
నీళ్ళు పాపను ఏడుస్తుంటే చూడలేక.....విక్స్ తీసుకొని వచ్చింది.....చేతిలో పెద్ద కాండిల్ .....''పాపకు డ్రెస్ విప్పండి''చెప్పింది.విప్పాడు.వడిలో పడుకోపెట్టుకొని పాపకు చిరుపక్కల మెల్లిగా విక్స్ పూసింది....


''కాండిల్ వెలిగించండి''వెలిగించాడు.''దినేష్ ...చేతులు 
క్యాండిల్  పక్కన ఉంచి వెచ్చ బడినపుడు పాప 
లంగ్స్  పై ఉంచు అంది....
పాపకు వెచ్చగా ఉండేటట్లు కవర్ చేస్తూ....
మెల్లిగా వెచ్చని చేతులు పాప చిరు పక్కలపై ఉంచాడు....
అరిచేతులకు మెత్తని స్పర్శ హృదయాన్ని మెల్లిగా తాకుతూ .......
అమ్మ వెచ్చని వడి,నాన్న వేడి స్పర్శ పాపకు శ్వాసను ఇచ్చాయి కాబోలు ఏడుపు ఆపింది.....చిన్నగా వాళ్ళని చూసి మెల్లగా విచ్చుకున్నాయి ఎర్రటి పెదవులు....నేను బాగున్నాను అని.....


హమ్మయ్య....ఆనందం పట్టలేక బుగ్గలపై ముద్ర వేసింది అమ్మతనం.
తానేమిటో మర్చిపోయి ఆ ఆనందాన్ని చూస్తున్నాడు...దినేష్ 
చాలు ఇంకేమి కావాలి ఇంత కన్నా అని సంతోషంగా....


మెల్లిగా పాపను పడుకోబెట్టి అలిసిపోయినట్లు పక్కనే 
పడుకొని కళ్ళు మూసుకుంది దివ్య.....మెల్లిగా పరిశీలనగా 
చూసాడు దివ్యని దినేష్.....తనని ,పాపని పక్క పక్కన 
చూస్తూంటే ....చూసే కొద్ది వీళ్ళు నా వాళ్ళు అనుకునే  
కొద్ది ప్రేమ పెరిగిపోతుంది.....


పాపం నిద్ర తక్కువై కాబోలు తన మోహంలో 
అలసట,కళ్ళ చుట్టూ నల్ల వలయాలు.....
ఉన్నట్లుంది తటాలున జ్ఞాపకం తటాకం లో రాయి విసిరేసినట్లు......అవును ఈ రోజు తేది ఫిబ్రవరి పద్లాలుగు...
వాలెంటైన్స్ డే ......తమది ప్రేమ వివాహం కాకపోయినా 
తమ ఇద్దరినీ కలిపినా రోజు....తనను చూసి నచ్చి ప్రేమను తనతో చెప్పలేక.....అమ్మా వాళ్ళతో రాయబారం నడిపి అది 
కుదురుతుందా లేదా...అని టెన్షన్ తో తీయటి బాధను 
అనుబవించిన రోజు.....


సారి డియర్ ఇంత మంచి మనకు సంబందించిన రోజును ఎలా మర్చిపోయాను.......వంగి ముందుగా పాప తల నిమిరి బుగ్గపై 
ముద్దు పెట్టుకున్నాడు ....తరువాత మెల్లిగా దివ్య పై వంగి 
పెదాల ముద్ర ఎంతో ఇష్టంగా.....నిద్రపోతుందేమో అనుకోని మెల్లిగా....కాని మేలుకొనే ఉంది .


చిన్నగా నవ్వుతూ చేయి పట్టుకుంది.....మెల్లిగా తీసుకువెళ్ళి 
పొట్టపై ఉంచి అల్లరిగా నవ్వింది.....''ఏమిటి?'' అనుమానం.
లిపి లేని కంటి బాష .....హృదయాలకు భావాల్ని ప్రసారం చేస్తుంటే  మాటలు ఎందుకు......''అవునా''అడిగాడు.


కంటిచూపులోనిసిగ్గుఅవుననిబలపరచింది.
''మళ్ళీనా....ఖర్చు''....అడిగాడు....తప్పు నాదా? 
ఎదుటి కళ్ళలో చిన్న కన్నీటి పొర అతని ప్రేమపై 
మలినాలు తొలగిస్తూ...


నిజమే తనని ఎందుకు అనటం....తొందర మగాళ్ళదే  పాపం 
తిట్లు, బాధలు వాళ్ళవి....
ప్రేమ లోపల నుండి తన్నుకు వచ్చింది....
వాడు తమ ప్రేమకు ప్రతిరూపం అలా ఏర్పడుతూ...
పొట్టపై ఇష్టంగా నిమిరాడు....


''మళ్ళా ఆడపిల్ల అయితే''సందేహం....ఏమి వద్దా....
కళ్ళతోనే దీనంగా అడిగింది.''చ'' ఏమిటి తను ఇంత మూర్కంగా ఆలోచిస్తున్నాడు....


''లేదు ఎవరైనా మన ప్రేమకు ప్రతిరూపమే....కాక పొతే పాపకు రెండేళ్ళేకదా అందుకని అన్నాను''అన్నాడు.చిన్నగా నవ్వింది ...
ప్రేమని హాయిగా అనుబవిస్తూ......(ఏముందిలే కొత్త బిజినెస్స్ 
డీల్ ఒప్పుకుంటే ఆదాయం పెరుగుతుంది....
కాక పొతే కొంచం కష్టం ఎక్కువఅనుకున్నాడు).......
చిత్రం వాళ్ళతో సామీప్యంగా ఉంటె ఏదో సంతోషం 
పొంగి పొరలుతున్నట్లు......అసలు ఏమి కోపం రావటం లేదు....


అతనిలోని ప్రేమ ఆమెని చేర్చుకొని,పాపను తాకి ,బాబుకి కూడా చోటిస్తూ ఉంది.....ప్రేమకు వ్యాకోచించే గుణం ఉందా?


మెల్లిగా చేతిలో ఒక పేపర్ పెట్టింది....''ఏమిటి ?ప్రేమ లేఖ నా''
చిన్నగా అల్లరిగా నవ్వింది....తన కు ఎంతో ఇష్టమైన నవ్వు...
చూస్తె బ్యాంక్ చెక్ ....ఎవరికి?అడిగాడు.....


''మరి దానం కొద్ది బిడ్డలు అంటారు కదా అందుకే మన బిడ్డ 
రాబోయే శుభా సందర్భం లో .....JEEVANI  శరణాలయానికి 
పది వేలు మా నాన్న మొన్న ఇచ్చినవి చీర కొనకుండా 
విరాళంగా ఇచ్చేశాను మన బిడ్డకు మంచి ఆశీస్సులు రావాలని''చెప్పింది.


''పిచ్చి''ఇష్టంగా దగ్గరకు  తీసుకొని హత్తుకున్నాడు....
నీకు పిల్లల కోసం నేను ఏదైనా చేస్తాను......
ప్రేమ నింగిని నేలను కలుపుతూ 
విశ్వాన్ని తనలో కలుపుకుంటుంది.....
భార్యా .పిల్లలు,సమాజం పర్యావరణం......
అవును ప్రేమకు కలుపుకోవటమే తెలుసు....
మనసులో నింపుకోవటమే  తెలుసు....అవతల వారి సుఖాన్ని 
తనదిగా భావించటమే తెలుసు.....


ప్రేమ 
చచ్చిపోతుంది 
మనుషులు 
హృదయాన్ని మూసివేస్తే ....


ప్రేమ 
తన వాళ్ళుగా మారుస్తుంది 
హృదయాన్ని 
పంచితే.......


''ప్ర్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా 
పండేననుకో ఈ బ్రతుకే మనసు తీరా......''


అందుకే ప్రేమ....I LOVE U......



Wednesday 8 February 2012

ఎందుకు?....ఏమిటి?....ఎలా?విజయానికి మంత్రాలు....

విజయం ఎవరికి కావాలో.....అంటే మీకే కాదు .....మీ 
పిల్లలకు కూడా......చదివెయ్యండి......లేదా మీ పక్కన 
ఎవరైనా పిల్లలు ఉంటె వాళ్లకు అయినా చెప్పండి......
గురునాం పరిప్రశ్నయా సేవతే.......అంటే గురువులను 
ప్రశ్నలతో సేవిస్తూ జ్ఞానాన్ని పొందాలి.....అవీ ఎలాంటి 
ప్రశ్నలు.....మన జ్ఞానాన్ని  పెంచేటటువంటి ప్రశ్నలు.....
అంతే కాని మన జ్ఞానాన్ని చూపాలని గర్వంగానో.....
అవతల వారి అజ్ఞానాన్ని అవహేళన చేయాలనో వేసే 
ప్రశ్నలు కాదు.....

పగిలిపోయిన బకెట్తో నీళ్ళు తేలేము....పనికి రాని ప్రశ్నతో 
జ్ఞానాన్ని పొందలేము....
మీ కోసం నది మాస పత్రికలో .....సృజనాత్మకత పై ఒక 
ఆర్టికల్ చదవండి......

అన్నీ చదవండి.....మానవత్వం తో ఆలోచించండి....
విజ్ఞతతో మంచిని గ్రహించి చెడుని హంసలా విడువండి....
అదే బ్రతుకులో ఎదగటానికి పనికి వచ్చే విచక్షణ ......

చదువుతున్నారా.....నది మాస పత్రికలో దాశరధి రంగాచార్య 
గారి అక్షర ప్రవాహం.....శతాబ్ది.....మన మట్టి వాసన.....
మన భారతీయతా స్పర్శ....మన మూలాల పరిమళం......
మనసుకు హత్తుకోండి.....మానవత్వం కానివి విడిచేయ్యండి....
పరిమళ బరితమైనవి దాచుకోండి.....మీ కొరకే కాదు.....
మీ తరువాతి తరాల కోసం........


Sunday 5 February 2012

మనసున...మనసై....ఒక జీవన ప్రవాహం....

ఏముందండి మామూలే....అరె మామూలే అనగానే వెళ్లి పోతారెంటి?
చదవండి......

పేపర్ లో మనసున మనసై చూసి నాకు కూడా
వ్రాయాలని పించింది....
సర్లే .....మన జీవితం లో ఏమి గొప్ప ఉంది పే...ద్ద  ....
మా అమ్మ కాపురం చెయ్యలేదా....వాళ్ళ అమ్మ....ఇలాగా...
అందరు షష్టి పూర్తీ,సహస్ర చంద్ర దర్శనం చేసిన వాళ్ళే...
లోకం లో యెంత మంది లేరు చక్కగా కాపురాలు 
చేస్తూ భారతీయతకు.....దాంపత్య జీవనానికి వన్నె 
తెచ్చిన వాళ్ళు అనుకున్నాను.

సరేలే ...మేము మొదట ఇద్దరం ఉద్యోగులుగా బయటకు 
వచ్చిన వాళ్ళం కదా.....బయట వాళ్ళ కామెంట్స్ 
ట్టించుకోకుండా ప్రేమగా ఇద్దరం  వాటిని ఎదురుకొని
నిలబడితే కాపురం గౌరవంగా ఉంటుంది అని వ్రాశాను.
(మరి ఎవరికైనా పేపర్ లో ఫోటో అంటే ఇష్టమే కదా?)


ఇంకా ఎవరు కోపంగా ఉన్నా అవతలి వారు మౌనంగా 
ఉంటె తగువులు పెరగవు.....ఇవి చాల మంది పాటిస్తూనే 
ఉంటారు...అదేమీ పెద్ద లోపం కాదు....ఎందుకంటె 
మనం మనలాగా పూర్తిగా వ్యవరించాగాలిగేది మన 
ఇంట్లోనే కదా......సరే ఏదో ఒకటి నాకు మంచిది 
అనిపించింది వ్రాసాను.....చక్కగా కాపురం చేసుకుంటూ 
దాంపత్య జీవితానికి వన్నె తెచ్చే అందరికి అంకితం....


THANK YOU SAAKSHI FAMILY 

saakshi ikkada...



హోం > వివరాలు
నా మౌనమే గెలిచింది...
మనసున మనసై
భర్త చిటికెన వేలు పట్టుకుని అమాయకంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన 
నాకు అత్తవారింట్లో అడుగిడేనాటికి లోకం పోకడ తెలియదు. 
బిఈడి చదివితే టీచర్‌గా ఉద్యోగం చేసుకుంటూ హాయిగా గడిపేయవచ్చని 
అమ్మానాన్నలు చదివించారు, ఇద్దరిదీ ఒకే ప్రొఫెషన్ అయితే బావుంటుందని బిఈడి 
చదివిన అబ్బాయిని తెచ్చారు. అలాగేనని పెళ్లి చేసుకున్నాను. 
మాది నెల్లూరు జిల్లా కోట, మా వారిది గూడురు దగ్గర చెన్నూరు.
ఆయన మిత్రమండలి స్కూల్లో హెడ్‌మాస్టర్‌గా పని చేస్తూ మరో కోచింగ్‌సెంటర్‌లో లెక్కలు చెప్పేవారు. ఆయన దగ్గర లెక్కలు నేర్చుకున్న పిల్లలంతా పాస్ అవుతారనే పేరు ఉండేది. 
నాకు నా కాళ్ల మీద నిలబడాలి అనే పట్టుదల ఎక్కువ. పెళ్లయిన ఏడాదికి పాప పుట్టడం, 
వరంగల్ జిల్లా హన్మకొండలో నాకు ఉద్యోగం రావడం ఒకేసారి జరిగాయి. 
ఆయనకు ఒకవైపు కెరీర్, మరోవైపు నేను. 
నా కోసం ఆయన ఉద్యోగాన్ని వదిలి హన్మకొండకు వచ్చారు. 
అక్కడే ఒక ప్రైవేట్ స్కూల్లో జాబ్‌లో చేరారు. తర్వాత బాబు పుట్టినప్పుడు ఆయన 
ఆ ఉద్యోగం కూడా మాని బిడ్డను చూసుకున్నారు.
ఇదంతా నాణేనికి ఒక వైపు... రెండో వైపు చాలా చిత్రమైన అనుభవాలను మిగిల్చింది.

సమాజం చాలా చిత్రమైంది. ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడేవాళ్లు. ‘నువ్వు ఆడవాళ్లలాగా ఇంట్లో పిల్లలను చూసుకోవడం, పెళ్లాన్ని కూలికి పంపించడం ఏమిటి?’’ అంటూ సన్నిహితులు సైతం ఆయన వద్ద చెప్పే మాటలు తెలిసి భూమి కంపించిపోయినట్లయింది నాకు. ఆయన నోటి నుంచి వచ్చే ఒక్కో మాట ఒక్కో శూలంలాగ గుచ్చుకునేది. కానీ ‘ఎవరో ఏదో అంటే ఏమవుతుంది? మనం, మన కుటుంబం బాగుండడానికి ఏం అవసరమో అది చేయాలి. ఎవరో అన్న మాటల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయేది ఎవరు?’ అని ఆయనకు నచ్చచెప్పాల్సి వచ్చేది. ఆయనకు రెండుసార్లు టీచర్ ఉద్యోగం ఇంటర్వ్యూలో మిస్ అయింది. ఇలా కాదని నేను బలవంత పెట్టి కోచింగ్‌కి పంపించాను, మూడవ ప్రయత్నంలో ఉద్యోగం వచ్చింది. 
నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఆయన పోస్టింగ్ చాలా దూరంగా. 
ఆయనకు ఉద్యోగం వచ్చిందని ఆనందించాలో, దూరంగా ఎక్కడో పోస్టింగ్ 
వచ్చినందుకు విచారించాలో తెలియని పరిస్థితి నాది. ఇక ముందుగా నేను ధైర్యం చిక్కబట్టికున్నాను.‘‘పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు ఉద్యోగంలో జాయిన్ అవండి’’
 అని ఆయనకూ ధైర్యం చెప్పి పంపించాను.

ఇన్నేళ్ల మా వైవాహిక జీవితంలో నేను ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఆయన కోపం.
నాకు కోపం వస్తే మౌనంగా ఉంటాను. మాట జారితే వెనక్కి తీసుకోలేమని నా నమ్మకం.
ఆయన అలా కాదు కోపం వస్తే తిట్టిపోస్తారు. నేను ఓర్చుకోగలిగినంత సేపు ఓర్చుకుంటాను, 
ఆ తర్వాత ‘‘మీరు తిట్టి ఏం సాధించారో చెప్పండి, నా మనసు కష్టపెట్టడం తప్ప’’ అంటాను.
ఆ మాటతో ఆపేస్తారు. ఆయన బలహీనతను భూతద్దంలో చూస్తే జీవితంలో మిగిలేది శూన్యమే. 
నేను బెస్ట్ టీచర్ అవార్డు, బహుమతులు అందుకున్నానంటే ఆయన సహకారమే.
ఆయన సహకారంతో నేను కెరియర్‌లో చాలా సాధించాను, అలాంటి వ్యక్తిలో ఒక చిన్న లోపం.
 కోపం వస్తే దాన్ని ఆపుకోలేరు. అది చిన్న సమస్యే కాబట్టి సరిదిద్దుకోలేనా,
 సర్దుకుపోలేనా అనిపిస్తుంది. నేను కూడా ఇగోకు పోతే ఇరవై ఏళ్ల మా దాంపత్యం పరిపూర్ణంగా
 సాగేది కాదు. అందుకే నేను అంటాను 
‘అహంతో అణువునైనా జయించలేం, ప్రేమతో ప్రపంచాన్ని జయించవచ్చు’ అని.

- శశికళ, వాయుగుండ్ల, నెల్లూరు జిల్లా