Monday, 13 February 2012

ప్రేమా.....I LOVE U....

ఏంటి ఇంకా రాలేదు దివ్య.....ఇంత రాత్రి అయినా ....
పని లో నుండి తలెత్తి బయట కారిడార్ లో చూసాడు.
పాపను నిద్ర పుచ్చుతున్నట్లు ఉంది.
మల్లె పూల పరిమళం అక్కడ నుండే మెల్లిగా గాలికి తాకుతూ 
మనసును ఊయలలు ఊగిస్తూ తొందర పెడుతుంది.
సాయంత్రం తానూ వచ్చేసరికి దివ్య ఇల్లు నీట్ గా ఉంచి తానూ 
కూడా నీట్ గా ఉంటుంది.లేకుంటే తనకు చాల విసుగు.
బయట వ్యాపార  పనులతో విసిగిపోయి వస్తాను....
ఇల్లు బాగుండకపోతే కోపం వచ్చేస్తుంది.


ఏమిటి ఇంకా రాలేదు ....
విరహం విసుగుగా మారిపోతుంది.
వచ్చేసింది.
పాపని పడుకోబెట్టింది.
హమ్మయ్య....ఇక వెసులుబాటే....
మనసు ఆకాశం లో తిరిగి రమ్మంటుంది జంటను చేరి.....


ఇంతలో మెల్లిగా పాప ఏడుపు.....గబాల్న పరిగెత్తి పాపను ఎత్తుకుంది దివ్య.....
తన  పని డిస్టర్బ్అవుతుందనే బయం కళ్ళలో....ఉండి ..ఉండి కేవ్వుమంటూ ఉంది పాప...
ఏడుపు ఏదో తేడాగా ఉంది.


మెల్లిగా బయం ....పాప గుక్క పెట్టేస్తుంది.''ఏమైంది?'' మెల్లిగా 
అడిగాడు.
ఏమో తెలీదు...కొంచం జలుబు ఉంది రెండు రోజులనుండి...
''అయితే డాక్టర్ దగరకు తీసుకు వెళ్ళ లేదా?''పాప గూర్చి  
తండ్రిగా పట్టించుకోనందుకు కొంచం గిల్టీ ఫీల్ అవుతూ 
అడిగాడు..
''వెళ్లాను .మందులు వ్రాసిచ్చింది.దానికి శ్వాస సరిగా 
ఆడుతున్నట్లు లేదు''బయంగా చెప్పింది.


''ఇప్పుడేమి చేద్దాం''తనలోని భర్త తండ్రిగా ఎప్పుడు మారిపోయాడో....ఆదుర్దాగా ఉంది.పాపకు తగ్గితే చాలు.


పట్టుకోండి పాపని వడిలో ఉంచి పరిగెత్తింది.తన కళ్ళలో 
నీళ్ళు పాపను ఏడుస్తుంటే చూడలేక.....విక్స్ తీసుకొని వచ్చింది.....చేతిలో పెద్ద కాండిల్ .....''పాపకు డ్రెస్ విప్పండి''చెప్పింది.విప్పాడు.వడిలో పడుకోపెట్టుకొని పాపకు చిరుపక్కల మెల్లిగా విక్స్ పూసింది....


''కాండిల్ వెలిగించండి''వెలిగించాడు.''దినేష్ ...చేతులు 
క్యాండిల్  పక్కన ఉంచి వెచ్చ బడినపుడు పాప 
లంగ్స్  పై ఉంచు అంది....
పాపకు వెచ్చగా ఉండేటట్లు కవర్ చేస్తూ....
మెల్లిగా వెచ్చని చేతులు పాప చిరు పక్కలపై ఉంచాడు....
అరిచేతులకు మెత్తని స్పర్శ హృదయాన్ని మెల్లిగా తాకుతూ .......
అమ్మ వెచ్చని వడి,నాన్న వేడి స్పర్శ పాపకు శ్వాసను ఇచ్చాయి కాబోలు ఏడుపు ఆపింది.....చిన్నగా వాళ్ళని చూసి మెల్లగా విచ్చుకున్నాయి ఎర్రటి పెదవులు....నేను బాగున్నాను అని.....


హమ్మయ్య....ఆనందం పట్టలేక బుగ్గలపై ముద్ర వేసింది అమ్మతనం.
తానేమిటో మర్చిపోయి ఆ ఆనందాన్ని చూస్తున్నాడు...దినేష్ 
చాలు ఇంకేమి కావాలి ఇంత కన్నా అని సంతోషంగా....


మెల్లిగా పాపను పడుకోబెట్టి అలిసిపోయినట్లు పక్కనే 
పడుకొని కళ్ళు మూసుకుంది దివ్య.....మెల్లిగా పరిశీలనగా 
చూసాడు దివ్యని దినేష్.....తనని ,పాపని పక్క పక్కన 
చూస్తూంటే ....చూసే కొద్ది వీళ్ళు నా వాళ్ళు అనుకునే  
కొద్ది ప్రేమ పెరిగిపోతుంది.....


పాపం నిద్ర తక్కువై కాబోలు తన మోహంలో 
అలసట,కళ్ళ చుట్టూ నల్ల వలయాలు.....
ఉన్నట్లుంది తటాలున జ్ఞాపకం తటాకం లో రాయి విసిరేసినట్లు......అవును ఈ రోజు తేది ఫిబ్రవరి పద్లాలుగు...
వాలెంటైన్స్ డే ......తమది ప్రేమ వివాహం కాకపోయినా 
తమ ఇద్దరినీ కలిపినా రోజు....తనను చూసి నచ్చి ప్రేమను తనతో చెప్పలేక.....అమ్మా వాళ్ళతో రాయబారం నడిపి అది 
కుదురుతుందా లేదా...అని టెన్షన్ తో తీయటి బాధను 
అనుబవించిన రోజు.....


సారి డియర్ ఇంత మంచి మనకు సంబందించిన రోజును ఎలా మర్చిపోయాను.......వంగి ముందుగా పాప తల నిమిరి బుగ్గపై 
ముద్దు పెట్టుకున్నాడు ....తరువాత మెల్లిగా దివ్య పై వంగి 
పెదాల ముద్ర ఎంతో ఇష్టంగా.....నిద్రపోతుందేమో అనుకోని మెల్లిగా....కాని మేలుకొనే ఉంది .


చిన్నగా నవ్వుతూ చేయి పట్టుకుంది.....మెల్లిగా తీసుకువెళ్ళి 
పొట్టపై ఉంచి అల్లరిగా నవ్వింది.....''ఏమిటి?'' అనుమానం.
లిపి లేని కంటి బాష .....హృదయాలకు భావాల్ని ప్రసారం చేస్తుంటే  మాటలు ఎందుకు......''అవునా''అడిగాడు.


కంటిచూపులోనిసిగ్గుఅవుననిబలపరచింది.
''మళ్ళీనా....ఖర్చు''....అడిగాడు....తప్పు నాదా? 
ఎదుటి కళ్ళలో చిన్న కన్నీటి పొర అతని ప్రేమపై 
మలినాలు తొలగిస్తూ...


నిజమే తనని ఎందుకు అనటం....తొందర మగాళ్ళదే  పాపం 
తిట్లు, బాధలు వాళ్ళవి....
ప్రేమ లోపల నుండి తన్నుకు వచ్చింది....
వాడు తమ ప్రేమకు ప్రతిరూపం అలా ఏర్పడుతూ...
పొట్టపై ఇష్టంగా నిమిరాడు....


''మళ్ళా ఆడపిల్ల అయితే''సందేహం....ఏమి వద్దా....
కళ్ళతోనే దీనంగా అడిగింది.''చ'' ఏమిటి తను ఇంత మూర్కంగా ఆలోచిస్తున్నాడు....


''లేదు ఎవరైనా మన ప్రేమకు ప్రతిరూపమే....కాక పొతే పాపకు రెండేళ్ళేకదా అందుకని అన్నాను''అన్నాడు.చిన్నగా నవ్వింది ...
ప్రేమని హాయిగా అనుబవిస్తూ......(ఏముందిలే కొత్త బిజినెస్స్ 
డీల్ ఒప్పుకుంటే ఆదాయం పెరుగుతుంది....
కాక పొతే కొంచం కష్టం ఎక్కువఅనుకున్నాడు).......
చిత్రం వాళ్ళతో సామీప్యంగా ఉంటె ఏదో సంతోషం 
పొంగి పొరలుతున్నట్లు......అసలు ఏమి కోపం రావటం లేదు....


అతనిలోని ప్రేమ ఆమెని చేర్చుకొని,పాపను తాకి ,బాబుకి కూడా చోటిస్తూ ఉంది.....ప్రేమకు వ్యాకోచించే గుణం ఉందా?


మెల్లిగా చేతిలో ఒక పేపర్ పెట్టింది....''ఏమిటి ?ప్రేమ లేఖ నా''
చిన్నగా అల్లరిగా నవ్వింది....తన కు ఎంతో ఇష్టమైన నవ్వు...
చూస్తె బ్యాంక్ చెక్ ....ఎవరికి?అడిగాడు.....


''మరి దానం కొద్ది బిడ్డలు అంటారు కదా అందుకే మన బిడ్డ 
రాబోయే శుభా సందర్భం లో .....JEEVANI  శరణాలయానికి 
పది వేలు మా నాన్న మొన్న ఇచ్చినవి చీర కొనకుండా 
విరాళంగా ఇచ్చేశాను మన బిడ్డకు మంచి ఆశీస్సులు రావాలని''చెప్పింది.


''పిచ్చి''ఇష్టంగా దగ్గరకు  తీసుకొని హత్తుకున్నాడు....
నీకు పిల్లల కోసం నేను ఏదైనా చేస్తాను......
ప్రేమ నింగిని నేలను కలుపుతూ 
విశ్వాన్ని తనలో కలుపుకుంటుంది.....
భార్యా .పిల్లలు,సమాజం పర్యావరణం......
అవును ప్రేమకు కలుపుకోవటమే తెలుసు....
మనసులో నింపుకోవటమే  తెలుసు....అవతల వారి సుఖాన్ని 
తనదిగా భావించటమే తెలుసు.....


ప్రేమ 
చచ్చిపోతుంది 
మనుషులు 
హృదయాన్ని మూసివేస్తే ....


ప్రేమ 
తన వాళ్ళుగా మారుస్తుంది 
హృదయాన్ని 
పంచితే.......


''ప్ర్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా 
పండేననుకో ఈ బ్రతుకే మనసు తీరా......''


అందుకే ప్రేమ....I LOVE U......



10 comments:

వేణూశ్రీకాంత్ said...

చాలాబాగుంది శశిగారు..

శేఖర్ (Sekhar) said...

చాల ఫీల్ ఉంది శశి గారు ,బాగుంది :)

ఇందు said...

Manchi katha! :) chala baagundi.....

Kalyan said...

తల్లి మనసు బిడ్డకే కాదు సమాజానికి కూడా అనేది ఎంతగానో ఆకట్టుకుందండి ... చాలా బాగుంది ఈ ప్రేమ :)

శశి కళ said...

వెణూ,శేఖర్,కళ్యాణ్.....థాంక్యు.



ఇందు...చాలా రొజుల తరువత...పీలింగ్ వెరి హ్యాపి...థాంక్యు

ఫోటాన్ said...

చాలా చాలా బాగుంది శశి గారు... !

Unknown said...

prema gurimchi antha andham ga cheoaru nijam ga yugalanu kshanalu chesedhi preme ga,chala bagundhi

ఎందుకో ? ఏమో ! said...

Wow, Really awesome

?!

నిరంతరమూ వసంతములే.... said...

బాగా రాశారు శశి గారు. చివరన వేటూరి గారి పదాలు మీ పోస్టుకి మరింత అందాన్నిచ్చాయి.

Krishna said...

OMG sister. ipppdu nannu nenu tittukuntunnanu inta manchi post chadavananduku. Its awesome. etaina nuvvu keke, idigo bavagaru vintunnara