'' కంచె '' ఎప్పటిది . ఇప్పుడు వ్రాస్తున్నాను . చూడాల్సిన
వాళ్ళు అందరు చూసి రేటింగ్ ఇచ్చెసినాక . ఇచ్చిన కాంప్లిమెంట్స్ తో
క్రిష్ ఊపిరి పీల్చుకొని ఉంటాడు . మరి మా సీ సెంటర్స్ కి ఇప్పుడే
వచ్చింది . ఇక ఇప్పుడే కదా చూస్తాము .
అసలు ఈ ఫోటో పెట్టడానికే కొంత సేపు పట్టింది . ఎందుకంటె క్రిష్ చూపిన రెండు
కోణాలు దీనిలో ఉండాలి అనుకుంటే ఈ ఫోటో ఆప్ట్ అయింది .
నాకు ఫేస్ బుక్ నుండి మా పాప నుండి బాబు నుండి ముందే రివ్యు
వచ్చేసింది . నువ్వు చూడాల్సిన సినిమా మా ,తప్పకుండా వెళ్ళు .
ఎప్పుడు వస్తుందా అని అప్పటి నుండి వాల్ పోస్టర్స్ ని గమనిస్తూ
ఉన్నాను , శ్రీవారిని కొంచెం ముందే మోటివేట్ చేసి . పిల్లలు చెప్పారు
అంటే సినిమా నన్నేమి నిరాశ పరచదు ,ఖచ్చితంగా .
సినిమా కధ కు వస్తే రెండో ప్రపంచ యుద్ధం నేపద్యం లో
కులాలు అంతరాలు ఎదిరించి కలిసి పోవాలి అనుకునే
ఇద్దరు ప్రేమికుల కధ . లవ్ అండ్ వార్ ఎప్పుడూ మానవాళి కి
ఇంటరెస్టింగ్ విషయాలు . రెండిటిలో చిక్కటి స్క్రీన్ ప్లే ,ఘర్షణ
ఉంటాయి . వీటికి సంభందం ఎలా కలిపాడు క్రిష్ అనేది ఇంకా
ఇంటరెస్టింగ్ . వాళ్ళు కలిసారా లేదా అనేది ఆ రోజులకే కాదు
ఈ రోజు పరిస్త్తితుల్లో కూడా సాహసికమైన కధ .
హీరో హరి చిన్న కులం ,హీరోయిన్ సీత జమిందారులు .
కలపడమే మద్రాసు లో కలిపేస్తాడు క్రిష్ . ఎక్కువ టైం
తీసుకోకుండా ఒక్క పాటలోనే వాళ్ళ మధ్య ప్రేమను
వండర్ఫుల్ సెల్యులాయిద్స్ గా మనసుకు తగిలించేస్తాడు ,
ఎప్పటికీ మాసిపోని గుర్తులుగా . ముందే తన ఊహల్లో ఆ ఫోటో
ప్రేమ్స్ తీసుకొని ఉంటాడు . అలాగే దించేసాడు .
హీరో గా వరుణ్ తేజ , హీరోయిన్ గా ప్రజ్ఞ చాలా బాగున్నారు .
''ఏమోయ్ షేక్ స్పియర్ '' అని హీరో చిన్న కవితలకు మురిసిపోయి
సీత అందం బాగుంది . కాక పోతే కవితలు కాబట్టి
''ఏమోయ్ కీట్స్ '' అనాలేమో . పర్లేదు . హృదయాలు ఒకటైనపుడు
పేర్లు వాటికి సంభందించిన పరువు , పలుకుబడి , అంతస్తు
అధికారం ,అవేమి అవసరం లేదు . చివరికి వాళ్ళ సొంత పేరుతో సహా .
హీరోయిన్ కాస్ట్యూమ్స్ గూర్చి ఖచ్చితంగా చెప్పుకోవాలి .
ఎవరు చెప్పారు విప్పుకుంటేనే అందం అని , చక్కగా చీరలో
యెంత బాగుందో ! కుటుంభం లో అందరం హాయిగా
చూడొచ్చు .
పాటలు , సంగీతం చాలా బాగున్నాయి .
ముఖ్యంగా ఆ యుద్ధ వాతావరణం , పల్లె వాతావరణం
అక్కడ దేశాలు మధ్య ఏర్పడ్డ కంచెలు , ఇక్కడ మనసుల మధ్య
కొందరి వలన ఏర్పడిన కంచెలు .... ఒక్కో సీన్ అక్కడ కొంత
ఇక్కడ కొంత పేర్లల్ గా చూపించడం , నిజంగా క్రిష్ కత్తి
మీద సాము ని సక్సెస్స్ గా చేసాడు . అసలు ఈ రోజుల్లో
ఈ కధ తీసుకోవడమే ఈ టీం చేసిన సాహసం .
ముఖ్యంగా ఒక అమ్మాయి జర్మన్ సేనలు ముందు నగ్నంగా నిలబడి
వీళ్ళను కాపాడటం , శ్రీనివాసులు ఏడుస్తూ నీవు నా తల్లివి
అని మనసు మార్చుకోవడం ,నిజమే మనది కాని శరీరం
లోని నగ్నత మన మాత్రుత్వాన్నే గుర్తు చేస్తుంది కానీ
కోరిక రగిలించదు . యుద్ధం మధ్యలో చిన్ని పాపను
చూపడం సినిమాలో భాగం అనుకున్నాను కాని పాపే
ఈ సినిమాకి కేంద్రం అయిపోతుంది అనుకోలేదు .
పాపను రక్షించడం ....
చివరికి పాప కోసం అందరు ప్రాణాలు ఒడ్డి పోరాడటం గ్రేట్ .
మధ్యలో హీరో చేత చెప్పిస్తారు ...... మనది ఎంత ఊరు ,
ఇంత ప్రపంచం లో , ఇంత గ్రహ కూటమి లో ,ఇంత విశ్వం లో
మనం ఎంత . దీనిలో మనం దేని కోసం పోరాడటం .
ఎక్కడా పోరాటమే , చివరికి ఆ చిన్ని పాప కూడా
పాలు కోసం కాదు ప్రాణాలు కోసం పోరాడుతుంది .
దానికి పాపం పుట్టాను అనే సంగతే తెలీదు . ఇక చావు గురించి
తెలిసే అవకాశమే లేదు . ఎవరి కోసం చేస్తున్నాము ఇన్ని
యుద్దాలు ముందు తరాలలో పుట్టబోయే వారిని కూడా
ఫణం గా పెట్టి ...... వరుణ్ తేజ చేసిన రెండు సినిమాలలో
స్పిరుచ్యువల్ బేస్ ఉండటం యాదృచ్చికం కావొచ్చు . లేదా అతని
పాషన్ కావొచ్చు . కాని ఎందుకో ఈ వాక్యాలు మాత్రం క్రిష్
మైండ్ లోవి కాదు హృదయం లోవి అనిపించింది .
సాయి మాధవ్ బుర్రా గురించి చెప్పుకోక పోతే ఈ రివ్యు కే పెద్ద లోపం
సీత చెపుతుంది హర్ష తో .. నన్ను మొదట ప్రేమించిన మగాడు అర్జున్
మా అన్నయ్య '' అని దేనిని నేను వదులుకోను అనే ప్రేమ , స్త్రీ
సహజత్వాన్ని చిత్రిస్తూ , ఇక అర్జున్ చెప్పే మాట '' ఆఫ్ట్రాల్ స్త్రీవి ''
మొత్తం వాస్తవ దుస్థితి రిఫ్లెక్షన్ ,
ఇంకా బామ్మ చెప్పే డైలాగ్ మనం మన గర్భాలలొ వారసులను కనివ్వడానికే ,
అదే గొప్ప అనుకోని సర్దుకుని పోవాల్సిందే .
ఇంకా సైన్యం లో ఊరికినే చేరి కష్టాలు ను విసుక్కున్న శ్రీనివాసులు
మారిపోయి పాపను రక్షిద్దాము అన్నప్పుడు హీరో చెప్పే మాట
''ఇప్పటిదాకా సైన్యం లో ఉన్నావు . ఇప్పుడు సైనికుడివి అయినావు ''
నిజమే మనం కూడా ఇప్పటిదాకా మనుషుల్లో ఉన్నాము కాని
మనిషి అయినామో లేదో తెలీడం లేదు .
ఇక చివరగా ఒక్కటి ......
నేనంటే ఇష్టమా షేక్స్ పియర్ అన్న సీతతో
''కాదు ప్రేమ ''
''రెండింటికి తేడా ఏమిటి అంటే ''
''ఇష్టం ఉంటె రోజా పోవును కోసేస్తాము ,
ప్రేమ ఉంటె దానికి నీరు పోస్తాము ''
ఎక్సలెంట్ . రెండికీ తేడా తెలీకనే ఈ కత్తి పోట్లు ,
ఆత్మ హత్యలు , ఆసిడ్ దాడులు .
ఎటో పరిగెత్తుతున్న జనాలను విశ్వ మానవులుగా
ఆలోచింప చేయడం లో ఈ సినిమా సూపర్ సక్సెస్ .
ఎప్పుడూ జేబు కోసం కాదన్నయ్యా ..... జనాల మంచి కోసం
కూడా సినిమాలు తియ్యాల ..... అంతేనంటారా :-)

8 comments:
Good review !
good review
సినిమా చాలా బాగుందండి. మాటలు కూడ బాగున్నాయి.
ఒక చిన్న మాట.
"ఇంత ప్రపంచం లో , ఇంత గ్రహ కూటమి లో ,ఇంత విశ్వం లో
మనం ఎంత . దీనిలో మనం దేని కోసం పోరాడటం."
అచ్చం ఇలాంటి మాటలే ఆరేళ్ళ క్రితం నా బ్లాగు ప్రారంభించినపుడు మొదటి టపాలో వ్రాసుకున్నాను. వీలైతే చదవండి.
Super
నైస్ అండీ.. మీ మాటల్లో కంచె.
హీరో పేరు హరిబాబు. హర్ష కాదు. వాళ్ళు కలిసేది చెన్నై లో అండీ లండన్ లో కాదు.
neeharika garu ,ramana garu ,bachu karuturi garu ,thankyou .
bonagiri garu alage tappaka mee blog visit chesthanu .
raj ....naaku annee raavaalante inko moodu saarlu cinima choododhdhaa! :-)
thanks for ur support . vaallu chennai lo kalisedi confirm ,nijama ?
చిత్రం లో నాయిక (సీత), నాయకుడు (దూపాటి హరిబాబు) కలిసింది చెన్నై లో కాదు మదరాస పట్టణంలో. సినిమా లో ఎంతో వైవిధ్యం ఉంది. చదవతగ్గ సమీక్ష ఇది.
thank you cb rao garu . corrected .
Post a Comment