ఈ లాలు ప్రసాద్ యాదవ్ ఏమి చేసినా భలే తమాషాగా అనిపిస్తుంది .
అందరు టికట్ రేట్ పెంచుతుంటే రైల్వే మంత్రిగా టికట్ రేట్ తగ్గించడం ,
ఐ . బిఎం లో గెస్ట్ లెక్చర్లు , మొన్నటికి మొన్న ఉప ముఖ్యమంత్రి గా
ఉంటారా అంటే సిగ్గుపడటం , నిన్నటికి నిన్న కేజ్రివాల్ ని హగ్ చేసుకోవడం ....
అన్ని బోలెడు కాలక్షేపం చాటింగ్ లో .
రాజకీయాలు నాకేమి పెద్దగా తెలీవు . కాని ఇలాంటివి వచ్చినపుడు
పక్కన మేడమ్స్ ని అడుగుతుంటాను .
''ఎలా తగ్గిస్తారు శైల టికట్ ?మళ్ళీ బడ్జెట్ నష్టాలలోకి వెళ్లి పోతుంది
కదా ! మళ్ళా లాభాలు పెరిగాయి అని గెస్ట్ లెక్చర్ ఎలా ఇస్తాడు ? ''
శైల వాళ్ళ శ్రీవారు రైల్ వేస్ లో ఏ . ఎస్ . ఎం .
''ఏమి లేదులే శశి గూడ్స్ కి ఒక వాగన్ పెంచేశారు . అక్కడ కవర్
చేస్తారు ''
మరి లోడ్ ఎక్కువైతే ఇంజెన్స్ ఇబ్బంది కాదా !
గెస్ట్ లెక్చర్స్ ఇచ్చే రాజకీయ నాయకులను ఒక్క కిచ్చారెడ్డి లక్ష్మా రెడ్డి ని
ఒక్కటే చూసాను . మా లీడ్ ఇండియా ట్రైనింగ్ లో ఇచ్చారు .
అప్పుడు దాని మీద రెస్పాన్స్ నేనే చెప్పాను . మెచ్చుకున్నారు కూడా !
ఇక ఇప్పుడు కేజ్రివాల్ వంతు . లాలు నే హగ్ చేసుకున్నాడు ,
నాకేమి ప్రేమ లేదో అని మొత్తుకుంటున్నాడు .
ఆకు ముల్లు సామెత ఇప్పుడు అర్ధం అయిందా !
తప్పు మాది కాక పోయినా , మాది తప్పు అనేస్తే నిరూపించుకోవడానికి
మేము ఎంత తంటాలు పడతామో అర్ధం అయిందా .
తన దాకా వస్తేనే తెలుస్తుందని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు .
కేజ్రివాల్ గారు బాధ పడకండి . మీ తప్పేమీ లేదని నమ్ముతున్నాము .
లాలు సంగతి మాకేమి కొత్త కాదు :-)
@@@@@@@
No comments:
Post a Comment