Monday, 6 May 2013

మేము సైతం ..... ఒక్క గొంతుక

మేము సైతం ..... ఒక్క గొంతుక

''భారత్ మాతకి జై '' నలువైపులా ప్రతిధ్వనిస్తున్న ''మిరియాల నారాయణ''
గారి గొంతు డెబ్బై వసంతాలు  దాటినా తగ్గని వాడి ......
పిల్లల దగ్గర  నుండి పెద్దల వరకు అందరిలో స్వాతంత్రపు కాలం నాటి ఉత్తేజాన్ని
ఒక్క సారిగా ఉరకలు వేయించి ఒక్క గొంతుకతో ''భారత్ మాతకి జై''
అని నాయుడుపేట  వీధుల  నుండి పై నున్న ఆకాశం  వరకు ప్రతిధ్వనించి
భారతమాత పులకించి పోయింది .
స్వాతంత్ర సమరాన్ని చూసిన ''మిరియాల నారాయణ ''గారు రావడం
భావి భారత పౌరులకు ఒక స్ఫూర్తి గా మదిలో నిలిచిపోయింది .
  
(photos kosam link ikkada )

అదిగో నాయుడుపేట సాయి అనేక్సీ సెంటర్ దగ్గర ఏదో కోలాహలం . పిల్లలు ,టీచర్స్
ప్రజలు అందరి మొహాల్లో ఏదో హుషారు ...... ఒక మంచి పని లో పాల్గొంటున్నందుకు .
అది 6/5/2013 న ఉదయం పది గంటలకు భారత దేశం లో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో
నెల్లూరు జిల్లాలో ని నాయుడుపేట  లో ప్రపంచ రికార్డ్ నెలకొల్పడానికి
''భారత సద్భావన దివస్'' సందర్భంగా అందరు ఒక్కటిగా జాతీయగీతాలాపన చేసే
ప్రయత్నం .

నాయుడుపేట ,పెళ్లకూరు ,ఓజిలి మండల ఉపాధ్యాయులు ఒక్కటిగా నిలిచి
స్తానిక స్వచ్చంద సంస్థల సహకారం తో విజన్ స్కూల్,ఎస్,ఆర్,కె వారి విద్యార్దులతో
చేసిన మంచి ప్రయత్నం . మూడు రోజుల నుండి ఆటో లో ప్రచారం,స్తానిక చానెల్ లో
ప్రచారం ,మీడియా లో ప్రచారం ఫలించి వేయి గొంతుకల కు పైగా ఒక్క చోట
కలిపింది .
స్వాతంత్ర సమార యోధులు మిరియాల నారాయణ గారు ,
ఎమ్.ఈ.వొ. అజెయ్ కుమార్ గారు
యె.ఎస్.పి . శేఖర్ గారు దేశ భక్తి ని పెంపొందించుకోవాలి
అని పిల్లలకు సందేశాన్ని ఇచ్చారు.
ఎండకు ,కష్టానికి భయపడకుండా ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు
చేసినందుకు ఉపాధ్యాయులను అభినందించారు .

అందరి సహకారమే ఈ విజయం ఏ ఒక్కరిదో కాదు అని ఉపాధ్యాయులు
అనడం ఆ వృత్తి కి ఇంకా గౌరవం పెంపొందిస్తూ ఉన్నది .
                                   
                                      ఝండా కర్ర ఎప్పుడూ
                                       క్రిందే
                                      దేశ ప్రతిష్ట లోనే
                                       దానికి ఆనందం