Friday, 27 May 2011

సినిమా హాలు సిత్రాలు ....... చితక్కోట్టుడే ....

s.v.p.p
ఆ రోజు మిట్ట మధ్యాహ్నం .యెర్రని ఎండ.కాకులు 
కూడా కదలటంలేదు.అక్కడ ఆ సినిమా హాల్ దగ్గర ఒక ఘర్షణ .
టికెట్స్ ఇచ్చే అతను ఒక ఆమెను తిడుతున్నాడు
"పిల్లోడికి కూడా టికెట్ తీసుకుంటే రా లేక పోతే పో" అని ఒక్క సారి తోసాడు.
రోషంగా లేచింది.కళ్ళు ఎర్రగా మెరుస్తూంటే "రేయ్...నీలాంటి వాళ్ళ 
సంగతి చూడటానికి వస్తాడురా ...మా అన్న ...""అన్న......"
దిక్కులు కదిలి పోయేలా అరిచింది.
(రాత్రే వీర సినిమా చూసాను ఆ మత్తు దిగేదాకా మీరు ఇలా చదవాల్సిందే) 

ఉన్నట్లుండి ఊరంతా ఒకటి వ్యాపించింది 

 ( కలరా కాదు.మీరు ఇలా అడ్డు తగిలేతే కద చెప్పనంతే)
 
అది ఒక సంతోషకరమైన వార్త.వెంకటేసులన్న(మా నాన్న) సినిమా హాల్ ఓపెనింగ్ అని.
ఎవరు ఈ అన్న అంటారా?ఎవరిని చూస్తే అందరూ బ్లాక్ అయి...గ్రీన్ అయి...రెడ్ అయి....
దండాలు పెడతారో ఆయనే ఆ అన్న (ఊరికే అలా వ్రాశాను అరె దానికే తల కొట్టుకోవాల?)
ఊరందరికీ అది పండగ ...జాతర....ఇంకా ఏమేమో...............
మా నాన్న అందరికి ఒకటే మాట చెప్పాడు.
"పది మంది గా రండి.పది పది పెంచుకుంటూ రండి.అందరు ఒకే సారి రండి."
(వాళ్ళు అడిగారు టికెట్స్ కొనా?కొనకుండాన ?)
అలా....అలా.........సంతోషంగా కాలం గడిచిపోతుంది.
                   ఒక రోజు  
మా నాన్న పేద రాయుడులా మధ్యలో ఉంటె అటు ఇటు అందరు ఊళ్ళో 
వాళ్ళు నిలబడ్డారు.ఆడవాళ్ళకి చాల ధైర్యంగా ఉంది.అన్న మన పక్కనే 
మాట్లాడ తాడు అని."అన్న"అడిగారు.మా నాన్న మీసం దువ్వుకుంటూ 
అటు వైపు తిరిగాడు.(అలా అని మనం ఒక సీన్ ఊహించాము అన్న మాట)
"చెప్పమ్మా"అన్నాడు."అన్న ఉదయం ఆటలు మాకు వీలుగా లేవు
పని చేసుకొని రావాలంటే కష్టం గా ఉందివెంటనే మగవాళ్ళు అందుకున్నారు.
"కుదరదు.మా హీరో సినిమా కి తొమ్మిది గంటలాట ఉండాల్సిందే"
"ఆగండి....."పెద్దగా అరిచాడు మా నాన్న .
"ఇదే నే చెప్పా బోయే తీర్పు.ఇక నుండి రోజు పన్నెండు గంటలకే ఆడవాళ్ళూ పని చేసుకొని 
వచ్చాకే సినిమా.అది కూడా ఆ షో కి వాళ్ళు అడిగిన సినిమా వేస్తాను"అంతే ఆడవాళ్ళంతా 
వంగి వంగిదండాలు పెట్టారు.ఒకామె పాట మొదలు పెట్టింది...........
(ఏ పాటైతే మీకేందు కండి?మీ కవసరమా?
వచ్చామా.......చూసామా........నవ్వుకుంటూ వెళ్ళామా......అంతే )

      కోన సీమ కుర్రాడు 

ఒక సినిమా అని కాదు కాని సినిమా ఫీల్ అయి చూడాలంటే పల్లెలలోనే చూడాలా.
వాళ్ళ కామెంట్స్ ముందు జర్నలిస్ట్లు దేనికి పనికి వస్తారు?ఫైటింగ్ సీను వస్తే చూడాలి...
అరె...అరె ...ఏమి ఆవేశం.......చితగొట్టు ...నా.కొ........
అంటూ వీరంగం ఆడేస్తారు దానికి ఆడ ,మగ తేడా ఉండదు .....కొట్టు ..కొట్టు అని 
అరుపులు విజిల్స్....అంతే ..అది సినిమా అంటే ....అంతే గాని డబ్బులు ఇచ్చి 
నవ్వకుండా ,అరవకుండా భయంగా అలానా సినిమా చూసేది.వాళ్ళు కొట్టు ...కొట్టు..
అని అరిస్తే....మన ఇండియా టీం కూడా క్రికెట్ లో గెలిచేస్తుంది.అది ఆ ఉషారు.
(మనలో మాట ఎవరికి చెప్పకండి.నిన్న వీర సినిమా లో విలన్ కారుతో ఒకామె  మీద 
బురద చల్లుతాడు.తరువాత వీర వచ్చినాక ఆమె కాలితో విలన్ ని తంతుంది.నాకైతే కొట్టు...
చితక్కొట్టు.....అనాలనిపించింది.ఇంకేమి లేదు అరిచామనుకో .....మా వారు ఇంక
సినిమా అంటే.........జాన్తానై ..అంటారు.అంటే అర్ధం ఏందా?మీరే అర్ధం చేసుకోండి.)

వేలల్లో కొన్న బొమ్మ లక్షల్లో కలక్షన్ అంటే జనం ఎలా ఊగుంటారో చూస్కో?
                   
ఇక ఆడవాళ్ళ సినిమా వచ్చిందంటే మా నాన్న కు చేతి నిండా పని.ఆ సినిమా లోని 
దేవత బొమ్మ పెట్టాలా....పూజలు చేయించాలా....వచ్చిన వాళ్లకి కుంకుం పంచాల.....
ఇక ఆడవాళ్ళు పిల్లలను వరండా లో మా నాన్న దగ్గరే పడుకో బెట్టి వెళతారు.
వాళ్లకు కాపలా......ఎవరైనా లేస్తే లోపలి వెళ్లి ఎవరి పాపా చూస్కోండి అని అడగాల......
ఓఓఓఓఓహ్ ........ఇన్ని పనులండి......ఇవి కాక ఇంకో పని ఉందండి.దానికి మేము 
కూడా సాయం చేస్తాము.

అది ఏందంటే అమ్మవార్ల సినిమాలలో ఫైనల్ పాట వస్తే ఆ శబ్దాలకి ఆడవాళ్ళకి 
పూనకాలు  వస్తాయి.అప్పుడు మనం రెడి గా బకెట్లు...బకెట్లు.......పసుపు నీళ్ళు 
కలుకొని ఉండాలా.పూనకం వస్తే బయటకు తీసుకు రావటం నీళ్ళు పోయటం.
ఏందీ......అంత ఉత్తిదా.......కళ్ళు పోతాయి ,చెంపలేసుకోండి.మేము కూడా 
డిస్త్రిబ్యుటార్ ని అదే అడిగాము "మీరేమైనా డబ్బులు ఇచ్చి పూనకాలు తెప్పిస్తారా ?"
అని.ఆయన దానికి మీకే తెలుస్తుంది చూడండి .రంగు పడుద్ది అన్నాడు.
(పడిందా.....అని అడుగుతున్నారా?పడింది బాబూ పసుపు రంగు...............)
దెబ్బకి సినిమా ఆడవాళ్ళు సంవత్చరం ఆడించారు అంటే చూస్కోండి
(మాకు వదిలింది పసుపు)

చిన్న కాలేజి సంగతి చెపుతాను.డిగ్రీ లో mpc లో క్లాసు అంతటికి ఇద్దరమే ఆడపిల్లలము.
కెమిస్ట్రీ సార్ చాల స్ట్రిక్ట్.పర్మిషన్ లేకుండా ఎగగోడితే practicals కి రానివ్వడు.నా ఫ్రెండ్
పుట్టినరోజు కాబట్టి సినిమా కి వెళ్ళాలని పర్మిషన్ అడిగాము.
గట్టి కారణం లేనిదే శెలవు ఇవ్వను అన్నాడు.
 సరే అనుకోని లీవ్ లెటర్ వ్రాసి ఆయనకు ఇచ్చి బయటకు వచ్చాము.అంతే ధబ్ .......అని
 పెద్ద శబ్దం......దాన్ని అనుసరిస్తూ కెవ్వు మని కేక..............
 కారణం ఏమిటి అంటారా?
 మేము జ్వరంతో లేవలేని స్థితిలో ఉన్నాము కాబట్టి.......సినిమా కి వెళ్ళుటకు పర్మిషన్
 ఇవ్వగలరు అని వ్రాసాము.(అలా ఎందుకు వ్రాసారంటార?అబద్దం  వ్రాయకూడదని)
 అక్కడ మొదలు పెట్టిన పరుగు సినిమా హాల్ దాక ఆపలేదు.
 తర్వాత.......తర్వాత.......ఏమిటి అంటారా..........ఏమి లేదు.........
 నాకు పెళ్లి అయిపాయింది.ఇక్కడ చిన్న సంగతి.

 
 ఇంటికి అల్లుడు రాగానే మా నాన్న అల్లుడుగారు సినిమా వేసారు.
 fullcollections.అయితే ఆ గొప్పదనం మోహన్ బాబు ది కాదంటా.
మా వారి దంట అందరు చెప్పేశారు (హలో ఎవరు మోహన్ బాబు కి ఈ సంగతి చెప్పకండి)
ఇంకే మి సిత్రాలు అంటారా?
ఇంకేమి లేవండి .పెళ్లి అయిపొయింది కద.అప్పుడు ...అప్పుడు....వచ్చి 
హాలులో కూర్చొని చిన్న నాటి స్మృతులు గుండెలనిండా పీల్చుకొని 
వెళ్లి పోతాను.(హలో ఇంకా ఇక్కడే ఉన్నారా?ఏదో ఒక సినిమా కి వెళ్లి 
చితక కొట్టేయండి.)



Monday, 23 May 2011

మేము ఏమి ఇవ్వగలము?

మేము మీకు ఏమి ఇవ్వగలము ?
తాళి కట్టినందుకే మీ ఊపిరి పై హక్కు ఇచ్చినందుకు.....
హృదయ సీమ కు రాణి గా చేసి మమ్మల్నే పాలించమన్నందుకు.....
మీ వంశ వృక్షానికి మూలంగా నిలువుమని మనసులో నిలుపుకొన్నందుకు...

మీ స్వేచ్చని తగ్గించుకొని సగ భాగంగా సాగినందుకు  ..........
తలంబ్రాల తోటి మమతలు కురిపించి ఆనందపు డోలిక లలో ఊపినందుకు.....
ఆశ లలోనే కాదు ఆశయాలలో పాలు పంచుకున్నందుకు............
జీవిత దారులలో,బాధ లలో ,బాధ్యతలలో బాసటగా నిలిచినందుకు....
కుటుంభ చిత్రంలో నువ్వు మరుగుగా నిలిచి త్యాగ శీలిగా
నన్ను చూపినందుకు..................
అనురాగ బంధానికి వెనుక నిలబడి వెన్నెముక  గా మారినందుకు....
పూజలు ,వ్రతాలు మీకోసం చేస్తే ,దీర్ఘ సుమంగ ళీభవ  ......అని దీవిస్తూ....
ఆశీర్వాదం కూడా మాకోసమేనా?మీకేమి లేవా?అని తలపై 
అక్షితలతో పాటు అశ్రువులు రాల్చినందుకు............

మేము ఏమి ఇవ్వగలము?
ఇంటి పేరు లేదు,వంటి పేరు లేదు,mrs లోనే ఉనికి 
ఆర్ధికం లేదు,స్వార్జితం లేదు,అస్తిత్వం లేదు,
మీలోనే మమేకమైన జీవన నది 
అంతర్లీనమైన చైతన్య  స్రవంతి 
మేముగానే లేని మేముఏమివ్వగలం ?

పాట గుర్తుందా..............
హరి పాదానా పుట్టావంటే  గంగమ్మ......
శ్రీ హరి పాదానా పుట్టావంటే గంగమ్మా......
ఆ హిమ గిరి పై అడుగెట్టావంటే గంగమ్మా.......
కడలి..కౌగిలి.......ఒదిగావంటే గంగమ్మా.........
నీ రూపేదమ్మా.....నీ రంగేదమ్మ .................
నడి సంద్రంలో నడకేనమ్మ గంగమ్మ ...ఆ....
ఏమి లేని మేము ప్రతిగాఏమిస్తాము?
హరిపాదానా
మా దగ్గర ఉండే ప్రేమ అభిమానము తప్ప.........
 (మా వారి పాదాలకే అంకితం)




Saturday, 21 May 2011

scooty -నేను -జీవిత sathyaalu

నేను ఈ రోజు నా ఉద్యోగం లో జిల్లా స్థాయి ,రాష్ట్ర స్థాయిలో అవార్డ్లు ,రివార్డ్లు తీసుకోవటం వెనుక ఒకరి సహాయం ఉందండీ.మా వారే అనుకొంటే మీరంతా పప్పులో కాలేసినట్లే ముందు కాళ్ళు ,మనసు కడుక్కొని రండి చెపుతాను.
అది ఎవరంటే నా scooty సరే సౌలభ్యం కోసం బండి అందాము.ఎంటమ్మ పెద్ద మీ వారేమి చేయలేదా అంటే 
దాని తరువాత వారికే కదా నేను థాంక్స్ చెప్పేది.మరి బండి అయితే నేను సహాయం చేసాను అని పది సార్లు అనదుకదా.
  ఇదే నండి మొదటి సత్యం 
1 .మనం మన వాళ్ళకు సహాయం చేస్తే మనకే కదా చేసాము అనుకోని మర్చిపోవాలి.అంతే కాని పది సార్లు చెప్పుకోకూడదు.

 ఈ ఊరికి వచ్చిన మొదటి రోజే బండి లేక పోతే స్కూల్ కి పోలేమని అర్ధం అయింది.వెంటనే పైన చూసారుగా దానిని మా వారు తెచ్చారు.ఇక దానిని నేను డ్రైవ్ చేయటం నేర్చుకోవాలి.సరే స్కూల్ కి పోయేటపుడు నేర్పిస్తానని 
చెప్పారు.ఇక్కడ నేను long ...long...ago...pride  నేర్చుకో బోయి దానిని ఏమి చేసానో ఒక భయంకర మైన   flashback  చెప్పాలి(అంత భయంకరం కాదులెండి.కొంచెమే)
అప్పట్లో మావారికి నా తెలివి మీద గొప్ప నమ్మకం ఉండేది.pride కొత్తగా తెచ్చారు.
వారు వెనుక కూర్చొని రెండు రౌండ్స్ తిప్పి "ఇంతే శశి నువ్వు డ్రైవ్ చేయి"అని ఇచ్చేసారు.నేను అంత కంటే గొప్పగా నాకు break ,accelator తెలవగానే అబ్బో చాల వచ్చు అనుకోని (విధి ఆడే వింత లీల)రయ్యిన వెళ్ళిపోయాను.ఎక్కడికి అనుకొన్నారు?నేరుగా ముళ్ళ చెట్లలోకి .అందరు చుట్టూ దూరంగా మూగి అరుస్తున్నారు ఏదో హెల్ప్ చేయాలని నాకు మాత్రం ఏమి చేయాలో తెలీక భూమి మొత్తం తిరిగి వచ్చాను(నిజం అండి break ఎక్కడుందో చూడటానికి)
మొత్తానికి బుర్ర పనిచేయక బండి వదిలేసి in gin ఆపేసాను.మా వారి అదృష్టం బాగుండి నేను ,బండి క్షేమం.
ఇక ఎవరైనా బండి నా చేతికి ఇస్తారంటార?(కాని ఒక ఉపాయం వచ్చింది.ఇంకా ఎప్పుడైనా నేర్చుకోవాలంటే 
break మీద break అని పెద్ద అక్షరాలతో వ్రాసుకోవాలని)
 ఇదే రెండో జీవిత సత్యం 
మనం ఎంత మేధావులమైన మన బుర్ర పనిచేయని క్షనాలుంటాయి
 ఇప్పటి time కి  వచ్చేయండి.ఎలాగోలా నేర్చుకోవాలి తప్పదు కాబట్టి మా వారు నేర్పించటం మొదలు పెట్టారు.
రోజు వెనక కూర్చుని నేర్పిస్తారు కదా కొంచం సేపు హేండిల్ పట్టుకొని వదిలేస్తారు.నేను నడుపుతూ ఉంటాన జాగ్రత్త అంటారు.అంతే హేండిల్ పెండులంలాఊగుతుంది.నేనేమోరోడ్డుమీదగుంటలుచూస్తుంటాను.ఆయనేమో రోడ్డు మీద మనుషులు చూస్తుంటారు.(వాళ్ళని నేను చూడను.ఎందుకంటె మనుషులు కదా వాళ్ళే తప్పుకోవాలని నాకు గట్టి అభిప్రాయం).ఇలా అయితే ఎన్ని రోజులైనా (అప్పటికే మూడు నెలలు అయిపొయింది )ఇంతే అని మా వారు నువ్వే సొంతంగా నడుపు అలాగైతేనే వస్తుంది అని ఇచ్చి నన్ను ముందు పొమ్మని అయన దిగి వెనుక రాసాగారు.జై భోలో హనుమానకి అనుకొంటూ రివ్వున (10 కి మీ స్పీడ్ తో )వెళ్ళాను .బండి తూలుతుంది అటు ...ఇటు ..కొంపతీసి పెట్రోల్ బదులు ఇంకేమైనా ....(నా తప్పేమీ లేదని అనుకొన్నాను) 

అప్పుడు అర్ధం అయింది అప్పటి దాక బండి వాలితే ఈయన కాలు కింద పెట్టి బాలన్సు చేసేవారని 
ఇదే నండి ఇంకో సత్యం............
 పెద్దవాళ్ళు మన వెనుక ఉన్నపుడు వారి సహాయం అర్ధం కాదు వాళ్ళు లేనపుడే వారి విలువ తెలుస్తుంది 
మళ్ళా  బండి పడిపోయింది .ఇక్కడ ఎవరైనా నేర్చుకోనేవాళ్ళు ఉంటె ఒకటి చెపుతాను ,బండి పడిపోతుంది
అనుకుంటే వదిలేసి మనం నిల్చుకోవటం బెటర్.బండి మన కాళ్ళ మధ్య వాలి పోతుంది మన కేమి కాదు (బండి కేమైనా అయితేనా వెనక పరిగెత్తే వాళ్ళు చూసుకొంటారు)
బండి పడిపోతే మనం లేపకూడదు (ఎలాగు మనం లేపలేము)చుట్టూ పక్కల వాళ్ళకి ఆ ఆవకాశం ఇవ్వాలి.(ఎందుకంటె మా వారు పరిగెత్తుకొని వచ్చేసరికి కొంత టైం పడుతుంది)ఇదే ఇంకో సత్యం....
ఎవరికైనా  మనం సహాయం చేస్తేనే మనకు అవసరమైనపుడు వేరేవాళ్ళు సహాయం చేస్తారు.  
 ఇలాగ నేర్చుకొంటూనేఒక సంవత్సరం గడిచిపోయింది.(ఇంత కాలం బండి నేర్చుకొంటే gunnice బుక్ లో వేస్తారంటారా?)ఎలాగో ఒక మోస్తర నేర్చుకొన్నాను కాని బండి నా చేతికి ఇవ్వను ఆయనికి ధైర్యం చాలలేదు.
అడగను నాకు ధైర్యం లేదు.
ఇలా ....ఇలా...రోజులు గడిచి పోతుంటే మా స్కూల్లో సర్ ఒకరు "ఏమి madam ఇంకా బండి మీద రావటం 
లేదు"అని అడిగారు."దైర్యం చాలటం లేదు సార్"అన్నాను.వెంటనే ఆయన "ఊరుకోండి మీరు పోయే 20 కి మీ 
స్పీడు కి ఒక పిల్లవాడు మీ పక్కన పరిగెత్త గలడు.దానికే భయం ఎందుకు"అన్నారు.అంతే ఎందుకో దైర్యం
వచ్చింది. వెంటనే మధ్యాహ్నం ఇంటికి వచ్చి నేనే బండి తీసుకొని స్కూల్ కి వెళ్ళిపోయాను.తరువాత 
తెలిసిందండి. నాకు దైర్యం చెప్పిన సార్ కి దైర్యం లేక ఇంతవరకు సైకిల్ కూడా నేర్చు కోలేదని.ఇక్కడ నాకు ఇంకోసత్యం తెలిసింది.
అనుభవం లేకుండా చెప్పినా కొందరి సలహాలు స్పూర్తి ని ఇస్తాయని.
 ఇక ఇప్పుడు హ్యాపీ గా స్కూల్ కి సమయానికి వెళుతున్నాను.అన్నిటి కన్నా సంతోషం వేసిన విషయము 
ఏమిటంటే మా నాన్నని ఎక్కించుకొని బస్సు దగ్గర వదిలితే మా నాన్న సంతోషపడి "హేమ కి కూడా నేర్పించారాదా ?
అన్నారు.(మా నాన్నకి ఆడపిల్లలు బండి నేర్చుకొంటే ప్రమాదంలో పడతారని బయం)
ఇక్కడ ఇంకో సత్యం.(బోర్ కొడుతుందా చివరికి వచ్చేశాములే)
మనం చక్కగా ఏ పనిని చేసినా పెద్దవాళ్ళు ప్రోత్స్చాహం ఇస్తారు.
 (తప్పు చేస్తే తంతారని గుర్తు ఉంచు కావలెను.మళ్ళ నన్ను అనుకొంటే లాభం లేదు)
ఇప్పటి పరిస్థితి ఏమిటి అంటే?.............ఊర్లో రోడ్ మీద ఎవరు వాటర్ కనెక్షన్ తీసుకొంటే వారు ఒక speed
 breakerకడతారు కాబట్టి (రోడ్ వాళ్ళ నాన్న సోమ్మనుకొని)ఊరిలో చిన్నగా డ్రైవ్ చేసినా highway మీద ఎంత స్పీడ్ తో పోతానో తెలిస్తే మా వారు నిద్ర పోలేరు.
(ఎందుకంటె నేను స్కూటీ తో సహా అయన గుండెల్లో నిద్రపోతాను కాబట్టి)


 (all is just for fun.take it easy)
















Friday, 20 May 2011

హృదయమా ......నీవెక్కడా?

ప్రపంచం నాకు ఏదో ఒక ఆవకాశం ఇస్తూనే ఉంది.ఆ రోజుకు ఏదో ఒక పేరు 
పెట్టి.మానవుల హృదయాలన్ని నా ప్రేమ శక్తితో స్పృశించి దైవత్వంతో మేలుకొలిపేలా.
"మానవులలో ఒక ఛానల్ ఉంటుంది.అది అభివ్రుద్దిచెందినపుడువిశ్వ మేధస్సు కి,విశ్వ ప్రేమకి,విశ్వ లక్ష్యానికి అనుసందానిమ్పబడతారు.ఆ రోజు మీ జీవితంలో కూడా తప్పక ఉంటుంది.విత్తనం ఈ రోజు విత్తనం రూపంలో 
ఉన్న దానిలోపల మొక్కగా మారటానికి కావలసినవి రూపుదిద్దుకొంటూ 
ఉండవచ్చు.ఒక నిమషం లో మార్పు జరిగి పోతుంది.విత్తనం బద్దలు 
కొట్టుకొని మొక్కగా రూపొందుతుంది.అది ఎన్నటికి తన పాత రూపాన్ని పొందడు. ఇంకా కొన్ని విత్తనాలు ఇస్తూ ప్రపంచానికి మేలు చేయటం తప్ప.
మీలో మీ హృదయం లో ప్రేమను ,శాంతిని కాంక్షిస్తూ ఆ మార్పు జరుగుతూఉంది.తప్పక స్వార్ధాన్ని బద్దలు కొట్టుకొని హృదయం లో మొలకెత్తిన నిస్వార్ధ ప్రేమతో విశ్వ ప్రణాళికలో బాగం అవుతారు .ప్రేమ శాంతులు పంచుతారు."
బుద్దుడు ,బుద్దుడు కాకా ముందు మన లానే ఉండేవాడు,మదర్ తెరిస్సా 
హృదయ వాణి వినక ముందు మనలానే ఉంది.క్రీస్తు, ఫ్లారెన్సు నైట్ ఏంగిల్ 
అందరు వాళ్ళ హృదయం విశ్వ ప్రణాళికకు అనుసందానిన్చనపుడు మన లాగానే ఉన్నారు.ఒక క్షణం లో అంతా మారిపోయింది.అదే మన జీవితంలో కూడా జరుగుతుంది.
"మీరు చేయాల్సిందల్లా ప్రపంచం శాంతి తో ప్రేమతో నిండిపోవాలని కోరుకోవటమే.మీ హృదయంతో మీ వాళ్ళ కోసం చేసే ప్రార్ధనలో ఈ కోరికను 
కలుపుకోండి చాలు.అంతే జరిగి పోతుంది."
గొప్ప విషయాలు ఇంతే సులభం .చిన్న స్వార్ద విషయానికి కూడా చాల ప్రణాళిక అవసరం.
"చూడటానికి ఇది వింతగా అనిపిస్తుంది.ప్రపంచ వ్యాప్తంగా హింస మరియు 
ప్రతి చోట వినాశనం జరుగుతుంది.అదే సమయంలో ప్రపంచమంతా శాంతి ప్రేమలను కోరుతూ ధ్యానం చేయాలనే ఉత్స్హాహం ప్రజలలో ఏర్పడుతుంది.
కొత్త తరాన్ని ఆహ్వానిస్తుంది."------vera stanley alder(5th dimension)
 (కావాలంటే చూడండి ఇప్పటి తరం వారికి ఉద్యోగం వచ్చినాక వారి కోరికలు 
తీర్చుకొంటూనే ప్రజలకు ఏదో మేలు చేయాలని సమాజ సేవకు అన్కితమవుతున్నారు.పాత తరం లో ఇది కనపడదు.మన వరకు ఇంకొకరి 
జోలికి పోకుండా చూసుకొందాము అనుకొంటారు.
"మన వరకే అనుకొంటే మానవత్వం.ఇతరులకు కూడా అనుకొంటే దైవత్వం.
మానవత్వాన్నున్డి దైవత్వానికి ప్రయాణం.
నేనేమి చేయగలను నాకు సమయం లేదు అనుకొంటే హృదయాన్ని తెరచి మీ జీవితంలో ప్రవర్తించండి చాలు .అదే అందరిని ప్రభావితం చేస్తుంది.
అప్పుడే పుట్టి చనిపోయిన బిడ్డ కూడా అందరి హృదయాలను తెరువగలదు.
ఎలా అంటారా?చిన్న బిడ్డ ముళ్ళ పొదలలో పుట్టగానే విసిరివేయబడి ముళ్ళు 
గుచ్చుకొని ఏడ్చి ఏడ్చి చనిపోయింది అని చదివామనుకోండి.చదివిన వారి హృదయాలు ఆ బిడ్డ తెరువడా?వారిలోని దైవత్వాన్ని స్ప్రుశించాదా?
శాంతిని కాం క్షించండి.హృదయంతో ఉండండి.
        మృత్యు ఘంటారావం 
 నగరంలో నరమేధం 
నిర్నిమేషంలో విసిరిన యమపాశం 
నడివీధిలో మృత్యువు వికట్టట్టహాసం
 ఏమిటిది పిడుగా?
రక రకాల మనుషులు ,రక రకాల మనసులు 
జన జీవన స్రవంతిలో అనుక్షణం ఉరకలు 
మరు క్షణం అన్ని మాయం 
మసలుతున్న నిశ్శబ్దం 
విసిరివేయబడిన శవాల గుట్టలు 
మదమెక్కిన పిశాచాల మూర్కపు పన్నాగం 
మది మది ని కదిలిస్తే 
మహాత్ములై కదిలోస్తే 
ఉన్మాదాన్ని కరిగించాలి 
మరో ప్రపంచాన్ని సృజించాలి 
మిన్న అయిన దైవమా ఆలకించు 
ప్రేమా అమృతంతో మరో లోకాన్ని సృజించు..........

Tuesday, 17 May 2011

కొన్ని నిమిషాలు మన కోసం

                    బుద్ధం శరణం గచ్చామి   
              ధర్మం శరణం గచ్చామి 
              సంఘం శరణం గచ్చామి 
 వీనుల విందు గా మది ని తాకుతూ మెల్లగా తనలో మనని కలుపుతూ మన జీవనాన్ని 
శాంతి వైపు ,జ్ఞానం వైపు మెల్లిగా మనని మన శృతి లో మమేకం చేస్తూ మన భారత భూమిపై  
నడిపిన మన జీవన నాదం.తనని తాను జ్ఞానం పొందటమే కాక తన వారిని అందులో పయనింప 
చేసిన మహనీయుని శాంతి మార్గం.మనకు మనమే దూరం చేసుకోన్న అమృత భాండం.   
  "పలు మతాల భాషల పరిమళాల కదంబం 
    పలు రీతుల సంగమం మన భారత కుటుంబం 
    .................................................................
   వేద ఘోషలు ,బౌద్ద వాక్కులు.......................
   గుభాళించి పరిచినవి విశ్వ శాంతి బాటలు......."
  


   "ఏ మంచి పూలతో పూజించి నాడవో
    జనియించినావు ఈ తల్లి కనక గర్భమున "

 బుద్ధుని మాట 
"అప్పో దీపో భవ" 
ఎవరికి వారే వారిని ఉద్దరించుకోవాలి .నీ శ్వాసే నీ గురువు.ఎప్పుడు దానిని గమనిస్తూ ఉంటె నీపై నీవు 
ఎరుకలో ఉంటె మానవ జన్మ సార్ధకత నీకు తెలుస్తుంది.ఎంత చిన్న ఉపాయం.మనకు దీని మహత్తు 
తెలీక పక్క వారికిచ్చినా వారు దీనితో జీవనాన్ని సాపల్యం చేసుకొంటున్నారు.లేవండి,మేలుకోండి,
హృదయంతో జీవిస్తూ జీవనాన్ని సమర్ధంగా గడపండి.
                               బుద్ధం శరణం                        
  దిశఎరుగక మసలే మానవునికి దారి చూపే తటిల్లత 
సుఖాలకు పరుగును ఆపి మనసును స్వస్థత పరచే శాంతి మార్గం 
శక్తి ని స్వార్దానికే కాక సంఘానికి పంపే దిక్సూచి 
మానవ శక్తిని దైవ శక్తి గా మార్చే పరసువేది 
నిద్ర పోతున్న జ్ఞానాన్ని నిర్వాణం వైపు నడిపే చైతన్యం 
హృదయాలను వెలిగించే శాంతి జ్యోతి 
మానవ జాతికి మోక్ష పధం 
అదే బుద్ధుని దమ్మ పదం..........

 మీరు జీవనాన్ని ఇంకా సంతోషం గా గడపాలంటే సులువైన మార్గం
"శ్వాస మీద ద్యాస"నేను ఎన్నో ద్యాన మార్గాలు చదివాను,చూసాను.
కాని ఇంత సులువైన గురువు లేని మార్గం నాకు కనిపించలేదు.
ఈ క్షణం ఎలా గడుపుతున్నమో దానిలోనే ఉంటె అదే ద్యానం.వేరే దానిని గూర్చి 
ఆలోచిస్తే పరధ్యానం.మీకు ఇది చేయాలంటే చాల సులభం.ఎన్నో చెడు మార్గాలు 
మన జీవితం లోనికి ఆహ్వానించి ఉంటాము,మన జీవితాన్ని సంతోష పరిచే 
ఈ అద్భుతమైన మార్గాన్ని ఆహ్వానిద్దాము.
ఎక్కడైనా ఎప్పుడైనా చేయవచ్చు.మీకు ఎలా సుఖంగా ఉంటె అలా కూర్చోండి.
కళ్ళు మూసుకొని మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు శ్వాసను గమనిస్తూ 
కూర్చోండి.అది ఎలా అయిన మారని మనకు అనవసరం.దానితో ఉంది మనలో 
ఏమి జరుగుతుందో సాక్షిగా చూస్తూ ఉండండి.అంతే జరగాల్సినది శ్వాసే చూస్తుంది 
ఇది ఇంతే ఇలాగె సులభంగా ఉంటుంది.నేను చేయగలను అనుకోండి.చేసేస్తారు.
మీకు ఎన్నో విషయాలు చెప్పి పనికి వచ్చే ఈ జ్ఞానాన్ని పంచుకోక పోవటం 
నాకిష్టం లేదు.అందుకే చెపుతున్నాను.కొన్ని నిమిషాలు మనకై ఊరకే 
కూర్చోవటం వలన ఏమి వస్తుందో మీరే అనుభవించండి.







 
                 



 

Sunday, 15 May 2011

నేను--violin-----violence

నా పెళ్ళైన కొత్తల్లో సంగతి.పెళ్లి అయిన తరువాత మా ఇంటికి మా వారు వచ్చి నపుడు నేను వయోలిన్ నేర్చుకోన్నానని తెలిసింది.ఒక సారి వాయించవా?
అని అడిగారు(ఖర్మ అలా అడిగించింది) సరే అని వేరే
వాళ్ళ ఇంట్లో వయోలిన్ ఉంటె తెప్పించి మొదలు పెట్టాను.
(ఎలాగయినా శబాష్ అనిపించుకొని వయోలిన్ 
కొనిపించు కోవాలని అనుకున్నాను )
 ఇద్దరం శ్రద్ధగా కూర్చున్న తరువాత మొదలు పెట్టాను.
మొదట మోహన రాగం అయితే నచ్చుతుంది అందరికి అని 
మొదలు పెట్టాను.గ గ పా పా ....దప సా సా....వర వీణ ...మృదు పాణి  ...వనరుహలో ..చను రాణి.....
పాట అయిపోయినా అయన మొహం లో ఫీలింగ్స్ లేవు
(ఆయనకు సంగీతం గూర్చి ఏమి తెలీదని అప్పుడు తెలిసింది)అర్ధం అయితే వాయిన్చటమే గొప్ప ఇక ఏమి రాని వాళ్లకి అర్ధం కావాలంటే ...దేముడా ఏమిటే ఈ అగ్ని పరీక్ష ?
కల్యాణి వాయించాను.పేస్ లో ఏమి మార్పు లేదు.భైరవి ...ఊహు ........
బ్రోచేవారెవరురా ?...........ఊహు.......ఎవరు వచ్చి బ్రోవలేదు...............
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి ..........ఊహు.......ఆమె కూడా రాలే.....
(ఇక్కడ వయోలిన్ కోనీడని మనకు టెన్షన్ )
నన్ను బ్రోవ నీకు భారమా?నీదు స్మరణ గాక వేరే ఎరుగను.......ఊహు.......ఏమిటి దారి?
రోషం వచ్చేస్తుంది,రాగాలకి ఇల్లు కదిలి పోతుంది ఈన గారి మనసు మాత్రం కరగలేదు.
ఒక చిన్న ఉపాయం వచ్చింది.ఎస్ అలాగే చేయాలి అనుకొన్నాను.సినిమా పాటలు వాయిస్తే
ఎలా ఉంటది అనుకోని దేవుడికి దండం పెట్టుకొని
(పనిలో పని కొబ్బరికాయ లంచం ఇస్తానని అనుకొన్నాను)
ఉపాయం బాగుంది కాని నాకేమి సినిమా పాటలు రావు.ఒక అక్క ముద్దుగా నాకు 
ఒక పాట నేర్పించింది.అదేమిటి అంటే "చూడు పిన్నమ్మ పాడు పిల్లడు.......పాట"
వాయించబోయి ఒక్క క్షణం ఆలోచించాను.బుద్ధి ఉండే వాళ్ళు ఎవరైనా ఆ పాట వాయిస్తే
వయోలిన్ కొనివ్వరు అని నా బుద్ధి ఆపేసింది.ఏమిటి దారి?
సమస్య మళ్ళా మొదలు?సరే మిస్సమ్మ లో పాట "సా ని స రి మా ...రీ ని సా సా....
మాకు మేమే మీకు మీరే .....పాట మొదలెట్టా పోయాను.
(మళ్ళా బుద్ధి ఒక్క చరుపు చరిచింది.కొత్త పెళ్లి కొడుకు ఆ పాట పాడితే పారి పోతాడని)
       అయ్య..........urekhaa ...........ఒక పాట గుర్తు కు వచ్చింది.అందరికి తెలిసిన పాట.
దొరికిందే చాలని వాయించాను.ఏమిటంటే జనగణమన........
 కద అయిపోలేదండి.అక్కడే మొదలు అయింది.

            మద్యహ్ననికల్ల రాజీవ్ గాంధి చనిపోయారు.వారం రోజులు టివి లో,రేడియో లో
 వయోలిన్ అంటే వయోలిన్...........ఇంకేక్కడ కొనిస్తారూ........ఇరవయ్ ఏళ్ళు అయినా

నేనేదో రాజీవ్ గాంధి ని చంపినట్టు ఇంత వరకు వయోలిన్ కొనిలేదు .

మనసు తోడు...ఎలా ఉంటుంది?

 మనసుకి తోడైన మనసు ఎలా ఉంటుంది?ఆ బంధం ఇహమేనా ?పరానికి వస్తుందా?ఎందుకు తన మనసుని 
చేరాలని మనసుకి అంత తపన?తాళితో పడిన బంధమే ఇంకా మనసుల ముడి తో జతపడితే......................
తనవారు తనువు విడిచిన వార్త చెవులో పడి మనసు చేరక ముందే తను తనువు విడిచి తన మనసు ముడిలోకి
ఎగసి పోవాలి మన ప్రమేయం లేకుండానే జరిగిపోవాలి అదే సతి సహగమనం.అష్ట పదులు వ్రాసిన జయదేవుని 
భార్య పద్మావతికి తమాషాకి కొంత మంది భర్త చనిపోయాడని అబద్దం చెపుతారు.వెంటనే తను నిజంగా చనిపోతుంది.తరువాత జయదేవుడు వచ్చి బాధ పడి తన భక్తితో పద్మావతిని బ్రతికిన్చుకొంటారు.అది మనసు కై 
మనసు పడే తపన. తన మనసుని చేరగల శక్తి.
                                   మనసుల ముడి   
అలల కెందుకో అలజడి......అలుపు లేకుండా పరుగు
అవనిని స్ప్రుశించాలని...........................................
మనసు కెందుకో తపన.....మమతలతో ఉరుకు
తన మనిషిని చేరాలని..........................................
వియోగ లోయల అంచున......క్షణాల తోడుతో పయనం
తన మనసును స్పృశించి 
సంపూర్ణ జీవిత ఆవిష్కరణం...............................
మనసుల ముడి ఎంత చిత్రం? 
 ఒక దానికి భాద మబ్బు.....................
రెండోది కన్నీటి వరద..........................
ఒక దానికి సంతోషాల హరివిల్లు..........
రెండోది నవ్వుల పడవ......................
అవును మరి....అవి మనం పుట్టాక ముందే ముడి పడ్డాయిగా
   విధాత సృజన అనంత విశ్వాల 
   అంతర్లీన కుంచెల మహా సృష్టి 
  మనుషల జీవితాలను శాసిస్తూ ........






 

Monday, 9 May 2011

టీ కప్పులో తుపానా?..........రా దంతే..

 టీ....ముక్త సరిగా ముందు పెట్టింది సంభోదన లేకుండానే.
చేతికిస్తే ఏమి సొమ్ము పోయింది.....విసుగ్గా నిట్టూర్చాడు.
 ఆ....సొమ్ము పోతుందనే కదా సినిమాకి తిసుకుపొంది....పెడేల్మని సమాదానం.
పల్లెటూరి వాళ్ళను చేసుకుంటే ఇంతే..........ఎదురు దాడికి సిద్దం అవుతూ.....
ఎవరిది పల్లెటూరు ?అసలు మా వాళ్ళను అనాలి మీలాంటి రాయి కిచ్చి చేసినందుకు............నేను దాడికి సిద్దం అని సూచిస్తూ....
మీది పల్లె కాదన్నది ఎవరు?అసలు మా ఊరిలో ఉన్నంత  మంచి ఇళ్ళు మీ ఊరిలో ఉన్నాయా?..........బల్లెం లా విసిరాడు మాట.
మా ఊరిలో ఉన్నన్ని సినిమా హాల్స్ మీ ఊరిలో ఉన్నాయా ?.......అడిగింది రెచ్చ గొడుతూ.
 మబ్బులు కాపురంలో పూర్తిగా కమ్మేసాయి రాబోయే తుపాన్ని సూచిస్తూ......
 తెలీదా ఏమిటి ,ఒకటున్దిగా...........మెరుపులు రప్పిస్తూ అన్నాడు.
ఆ ఉందిలే పెద్ద .....మూడు ఇంటర్వెల్స్ ......రీలు మార్చినపుడల్లా......సన్నగా నవ్వుతూ అంది.
అరె కారు మబ్బులు వీగిపోతున్నాయి ఏమిటి...........
అప్పుడే కదా తమరికి ఇష్టమైన పాప్కార్న్ మూడు సార్లు తినచ్చు.....మురిపెంగా మీసాల కింద నవ్వు.
మబ్బులు చేదిరిపోతున్నై...........చల్లటి గాలి వీస్తూ ప్రేమగా......
సరే కానీండి మీ ముచ్చట నేను ఎందుకు కాదనాలి............ప్రేమ ప్రసారం చేస్తూ కళ్ళతో.
సాయంత్రం రెడి గా ఉండు సినిమా కి వెళదాం ప్రేమగా దగ్గరకు తీసుకొంటూ అయన......
అరె తుపాను కాదు కదా.....మబ్బు తునకైనా లేదే ..........ప్రేమ దెబ్బకు రాదంతే............











 

Sunday, 8 May 2011

అమ్మ.....మధురిమ.....తన కంటి చెమ్మ...


 అమ్మ అంటే జీవిత మధురిమ.ఎంత మంది ఎన్ని వ్రాసిన అమ్మ తో అనుభూతులు వారికి గొప్పవే.(నిన్న తనతో గడపటానికి వెళ్ళాను.అందుకే ఇది ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను.మరి అమ్మ కేమి ఇచ్చాను?మధురంగా నా ప్రేమతో నిండిన నా పెదాల స్పర్శ తన బుగ్గపై )
                     ఆడపిల్లలంటే తల కొట్టుకొనే రోజుల్లో ముగ్గురు ఆడ పిల్లలు ఒక బాబుని కన్నా ఎప్పుడు మాపై వివక్ష నీడ పడకుండా చదువు లోనే  కాక అన్ని రంగాలలో
ప్రోత్చహించింది.ఏమి సాదించినా వెరీగుడ్ ఇంకా సాదించాలి అని మెచ్చుకునేది.ఏదైనా సాదించాలనే తపన 
సాదించ గలము అనే స్ఫూర్తి ఆ అమృత మూర్తి నుండే అందుకొన్నాము.
                         చివరికి నేను పురిటి నెప్పులు పడుతూ "అమ్మ "అని అరిస్తే 

నలుగురు బిడ్డలను కన్న తాను నా కష్టానికి కంటి చెమ్మతో చూస్తూ 

"అమ్మ అంటావేమిటి ?అమ్మ కేమి శక్తి ఉంది ?అమ్మ ఏమి చేయలేదు నాయనా......నారాయణా అని అరువు ఆయనే చూసుకొంటాడు" అని విలవిల 
లాడింది.
తన కేమి తెలుసు అమ్మ అనే పిలుపు బాధ లను తగ్గించే మంత్రం అని
ప్రతి బిడ్డ ఉహ తెలీక ముందే కనుగొంటాడని ,తలపులలో ఉంచుకుంటాడని.
   మరి ఈ అమృత స్పర్శ ఒక తరానికే పరిమితమా? 
కాదు.అమ్మ......అమ్మకు అమ్మ........అమ్మమ్మ ..........
ఈ జీవ స్పర్శ నిర్జీవ జీవితాన్ని పునరిజ్జీవింప చేస్తూ అమృతవాహిని అయి 
తరాలను పులకింప చేస్తూ సరస్వతి నదిలా అంతర్వాహినిగా మన జీవితాలలో సాగిపోతూ ఉంటుంది."అమ్మ కు జిందాబాద్"
"ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నివసిస్తారు"
పెద్దల మాట పెరుగన్నం మూట.వారు అనుబవంతో చెప్పిన సంస్కృతి కి 
వారసులైన మనం "ఎందుకు చేయాలి?"అని మూర్కంగా ప్రశ్నించుకుంటూ కూర్చోకుండా అనుభవం తో చెప్పిన 
దానిని ఆచరిస్తూ మన జీవాన్ని కాపాడుకుందాము.

Saturday, 7 May 2011

స్నేహం అంత మధురమా?

స్నేహం అంత మధురమా? అవతలవారు మనకేమి చెయకపొఇనా వాళ్లకు సహాయం 
చేయాలనిపించెంత ఇది ఏముంది దానిలో? నేను వృత్తి రీత్యా సాంఘిక సంక్షేమ గురుకులాలలో 
టీచర్ గా పనిచేస్తుంటాను.ఇరవై ఏళ్ళుగా చూస్తున్నాను ఐదవ తరగతిలో చిన్నగా బెదురుతూ 
స్కూల్ లోకి అడుగుపెట్టిన చిన్న పిల్లలు ,మేమింటికి వెళ్లిపోతామని ఏడ్చిన పిల్లలు మా ఆప్యాయత లో దిగులు తీరగానే పక్కన పిల్లలతో స్నేహపు దారల్లలుకొని స్వర్గాన్ని అక్కడే సృజించుకోవటం.పక్కవాడు తప్పు చేసినా టీచర్ వాడిని ఎక్కడ కొడుతుందో అని తనపై వేసుకోవటం.
 ఎక్కడిది ఈ బంధం? రక్త స్పర్శ లేకుండా హృదయంలో జనిస్తు కాలాన్నే ఎదిరిస్తూ.............
                        "కాలం తన
                         ఉనికిని కోల్పోయింది
                         స్నేహపు
                         వెలుగులో "
       నా మిత్రులు ఒకరు అన్నట్లు "స్నేహాలు రమ్మంటే రావు 
                                                 పొమ్మంటే పోవు 
                                                 అవి కొనసాగుతున్డాలి అంతే "
స్నేహాన్ని నిలుపుకోవాలంటే ఒకటి గుర్తుంచుకోవాలి.మన అవసరాలకు స్నేహాన్ని వాడుకొన్నా................
మనం సీతాకోక చిలుక లా ఉండాలి.అంటే అది ఆహరం కోసం పువ్వుపై వాలినా పువ్వుని ఇబ్బంది పెట్టదు
పైగా పుప్పుడి ని కీలాగ్రం పైకి చేర్చి చెట్టుకి సహాయపడుతుంది.మనం కూడా ఎవరి సహాయం పొందినా 
అలాగే వారికి సహాయం చేస్తే జీవితం స్నేహపు రంగులుని అద్దుకొని హరివిల్లు లా మారుతుంది.







 

Friday, 6 May 2011

ఇంటి గరిమనాభి స్త్రీ యా ....................shit.........

 
వేరే దేశం వాళ్ళు కనిపెట్టే దాక సూర్య కేంద్రక సిద్దాంతాన్ని ఒప్పుకోక పోతిమి 
(ofcourse వాళ్ళ దేశం వాళ్ళు కూడా వాళ్ళను తన్నారు)మన దేశంలో 
ఎప్పుడో ఉంచిన నవగ్రహాలను చూసి కూడా ఒప్పుకోక పోతిమి.
మరి మన అహంకారం ఇల్లాలు కుటుంబానికి గరిమ నాభి అంటే 
ఒప్పుకుంటుందా ?ఆమెను కొంచం మనసు కష్టపెట్టిన 
మన కుటుంబ అక్షం ఒక్క డిగ్రి పక్కకు ఒరిగినా రుతువులు మారిపోతాయని వసంతం 
వేడి గాడ్పులు వీచే వేసవిలా,రాత్రి కి నీ హృదయాన్ని తడిపే వర్షం లా మారుతుందని 
ఎంతమందికి తెలుసు?ఆశ్చర్యం ఏమిటంటే ఆ సంగతి ఇల్లాళ్ళకు తెలుసా?(బహుశా 
తెలిసినా మన మీద ప్రేమతో క్షమిస్తారు)ఆలాంటి ఒక ఇల్లాలి జ్ఞానోదయమే క్రింద 
వ్రాసాను.(ఇది పూర్తిగా నా సొంతమే ఎవరిని గూర్చి కాదు) 
              తృప్తి తో విరిసిన నెలవంక 
ఏమిటి వీళ్ళందరు నన్ను ఇలా విసిగిస్తున్నారు ?
       బాబు కేదో కావాలన్నట్లు నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు.
       నాకు ఆఫీసుకి టైం అవుతందన్న వదలడే......................
     
       అరె పాప కూడా ఏమి కావాలని నాకు సహాయం చేస్తూ చుట్టూ తిరుగుతుంది.
       టైం టైం ఏది? ఇప్పుడే వీళ్ళు నా చుట్టూ ..............................
.........

       అయ్యా బాబోయ్ ! ఈయన కూడా సహయంచేస్తానంటు. ఏమి కావాలి వీళ్ళందరికీ................

        రాత్రి చల్లగా వచ్చినాక ఆయన హృదయం గుసగుసగా చెప్పింది నాతో.........
        ఇల్లాలి చిరునవ్వే ఇంటిల్లిపాదికి టానిక్ అని,విరజాజుల వాన కురిసినట్లు
        అందరు సంతోషపడుతారని.............................

        బుగ్గలు ఎర్రనై,సిగ్గుమబ్బు కప్పుకుంటు తృప్తిగా విరిసింది నెలవంక నా పెదాలపై...................    

మధురోహ

ప్రేమ అలౌకికం గా మారితే అది ఏమి ఆశించదు పైగా  అది తన పరిధులు దాటి ఒక వ్యక్తిని దాటి,సమాజానికి ,ప్రకృతికి,విశ్వానికి నిస్వార్దంగా విస్తరిస్తుంది కామం దానికి చివరి బిందువు కాలేదు.ఇదే క్రిష్ట్నుని  సమ్మోహన ప్రేమ 
శక్తి.దానికి ప్రియులు పక్కన బౌతికం కాక పోయినా పర్వాలేదు.దాని స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది.
        ఆశ మాస పత్రిక మే 2011 సంచికలో నా కవిత ప్రచురింపపడింది.
      
                                
        మధురోహ
నీ పదమంజీరాల పలుకులు
                     నా వీనుల వీవెనలు వీచినట్లు ................
నీ తనూలత తలపుల తన్మయంతో
                       పచ్చికై పోదివినట్లు.............................
నీ కనుపాపల మెరుపుకాంతి
                        మదిలోపల మెరిసినట్లు.......................
నీ ప్రణయపు పరిమళాలు
                        నా నాసిక లో నర్తిన్చినట్లు.....................
నీ పలువరసల రోచస్సుల రాజిల్లె మధు పాత్ర
                         నా పెదవి వొంపులో వోలికినట్లు...............
      ఏమిటిది ప్రియ ? ఎందుకీ పులకరింత?ఎందుకీ కలవరింత?..............

చిన్నారి సాహి

హాయ్
హాయ్ ,ఈ చిన్నారి పేరు సాహి .ఎంతో ముద్దుగా ఉంది కదా.మన కధ లో ఈమె హీరొయిన్ .అమ్మ నాన్నలకు కాకుండా అందరికి ఈ బుజ్జి పాప అంటే ఇష్టం,తన అల్లరి అంటే కష్టం.అక్క ఉంది తను పాప అల్లరి చేస్తే దెబ్బలు తినకుండా కాపాడుతూ ఉంటుంది.(అసలు ఈ చిన్నారిని ఎవరైనా కొట్టలేరు ఎందుకంటె కొట్టటానికి వస్తే గోడల మీదకు ఎక్కేసి వెక్కిరిస్తుంది )
                                         ఎవరైనా ఏమి కూర మీ ఇంట్లో అంటే "చేపల కూర"అని 
నవ్వేస్తుంది (అది ఎవరో చెప్పటం నేర్పించారు)ఎవరిల్లు అయిన అది తనదే అనుకుంటుంది.ఆకలి వేస్తే అక్కడే తింటుంది నిద్ర వస్తే అక్కడే పడుకుంటుంది.
ఒక రోజు ఏమైందంటే పక్కింట్లో అవ్వ ఒక్కటే ఉంటుంది బలే గయ్యాళి అవ్వ.
సాహి వాళ్ళింట్లో అరుగు మీద పడుకొని ఉంది.ఉన్నట్లుండి అవ్వ బయటకు వచ్చి కాకులను తిడుతూ ఉంది.
ఎదవా కాకులు ,ఈ కాకులు చావా అని తిడుతూ ఉంది.లోలో అడిగింది "ఏమైంది అవ్వ?"అని."ఏమి చెప్పను తల్లి 
ఈ ఎదవా కాకులు నా పూరిలన్ని తినేసాయి నాకు కాని దొరకాలి అవి వాటిని చంపేస్తాను"కోపంతో అరిచింది.
"అరవవాకు అవ్వ.కాకులు చాల మంచివి.నాకు ఆకలి వేస్తే నేనే తిన్నాను"దైర్యంగా చెప్పింది.అవ్వ కోపంతో సాహి ని 
కొట్టడానికి చేయి ఎత్తింది.దైర్యంగా నిజం చెప్పి అలాగే అవ్వ కన్నుల్లో కి చూసింది పాప.ఏమైందో తెలీదు అవ్వ పాపను గట్టిగా పట్టుకొని ముద్దులు పెట్టేసింది.తప్పు చేసిన సరే నిజం చెపితే బలే బహుమానం.

Wednesday, 4 May 2011

please come and share

I don,t have any guidence here to improve my blog.
can any one help me by sharing ur knowledge.thank u.