Saturday 7 May 2011

స్నేహం అంత మధురమా?

స్నేహం అంత మధురమా? అవతలవారు మనకేమి చెయకపొఇనా వాళ్లకు సహాయం 
చేయాలనిపించెంత ఇది ఏముంది దానిలో? నేను వృత్తి రీత్యా సాంఘిక సంక్షేమ గురుకులాలలో 
టీచర్ గా పనిచేస్తుంటాను.ఇరవై ఏళ్ళుగా చూస్తున్నాను ఐదవ తరగతిలో చిన్నగా బెదురుతూ 
స్కూల్ లోకి అడుగుపెట్టిన చిన్న పిల్లలు ,మేమింటికి వెళ్లిపోతామని ఏడ్చిన పిల్లలు మా ఆప్యాయత లో దిగులు తీరగానే పక్కన పిల్లలతో స్నేహపు దారల్లలుకొని స్వర్గాన్ని అక్కడే సృజించుకోవటం.పక్కవాడు తప్పు చేసినా టీచర్ వాడిని ఎక్కడ కొడుతుందో అని తనపై వేసుకోవటం.
 ఎక్కడిది ఈ బంధం? రక్త స్పర్శ లేకుండా హృదయంలో జనిస్తు కాలాన్నే ఎదిరిస్తూ.............
                        "కాలం తన
                         ఉనికిని కోల్పోయింది
                         స్నేహపు
                         వెలుగులో "
       నా మిత్రులు ఒకరు అన్నట్లు "స్నేహాలు రమ్మంటే రావు 
                                                 పొమ్మంటే పోవు 
                                                 అవి కొనసాగుతున్డాలి అంతే "
స్నేహాన్ని నిలుపుకోవాలంటే ఒకటి గుర్తుంచుకోవాలి.మన అవసరాలకు స్నేహాన్ని వాడుకొన్నా................
మనం సీతాకోక చిలుక లా ఉండాలి.అంటే అది ఆహరం కోసం పువ్వుపై వాలినా పువ్వుని ఇబ్బంది పెట్టదు
పైగా పుప్పుడి ని కీలాగ్రం పైకి చేర్చి చెట్టుకి సహాయపడుతుంది.మనం కూడా ఎవరి సహాయం పొందినా 
అలాగే వారికి సహాయం చేస్తే జీవితం స్నేహపు రంగులుని అద్దుకొని హరివిల్లు లా మారుతుంది.







 

3 comments:

రాజ్ కుమార్ said...

"స్నేహాలు రమ్మంటే రావు
పొమ్మంటే పోవు
అవి కొనసాగుతున్డాలి అంతే".... yess.. అంతే..;)

Raj said...

"మనం సీతాకోక చిలుక లా ఉండాలి.అంటే అది ఆహరం కోసం పువ్వుపై వాలినా పువ్వుని ఇబ్బంది పెట్టదు. పైగా పుప్పుడి ని కీలాగ్రం పైకి చేర్చి చెట్టుకి సహాయపడుతుంది. మనం కూడా ఎవరి సహాయం పొందినా అలాగే వారికి సహాయం చేస్తే జీవితం స్నేహపు రంగులుని అద్దుకొని హరివిల్లులా మారుతుంది.." చాలా బాగా సత్యమైన స్నేహబంధం గురించి చెప్పారు. ఈ మధ్య అలంటి స్నేహాలు చాలా అరుదయ్యాయి కూడా..

వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్యండి. దానివలన ఉపయోగం అంతగా ఉండదు.

శశి కళ said...

manaku yenni kanapadinaa mana swabaavanni batti vaatilo yempika chesukontamu.meeru yempika chesukonna vaakyaale sneham pi mee manasuni teluputhunnai thanku friends.sasi