Friday, 10 June 2011

ముందుంది ముసళ్ళ పండగ

హాయ్ ఏమిటి చదవాలని చాలాహుషారుగా ఉన్నట్లున్నారే?
అవునూ....ఇంతకి ఈ సామెత ఎలా వచ్చిందంటారు?
తెలిస్తే కొంచం చెప్పవచ్చు కదా మీలో ఎవరైనా........

మళ్ళి long long  ago నే................................
మా పెళ్ళైన తరువాత అక్కడ వ్రతాలు ,పూజలు ఇక్కడివి 
నిద్రలు అన్ని అయినాక ఒక మంచి రోజు చూసుకొని 
మా మామగారు వచ్చి నన్ను వాళ్ళింటికి తీసుకు 
వెళ్ళారు .ఎంత బుద్ధిగా వెళ్ళానో తెలుసా?వాళ్ళు 
కూడా మంచి అమ్మాయి అనుకోని ఉంటారు.

(ఏమిటి  అల్లరి పిల్ల అని తెలుసుకొని నాలిక కరుచుకొని 
ఉంటారా.మీరు మనసులో అనుకొన్నది వినిపిస్తుందిలే)

 అలా వాళ్ళ ఊరికి వెళ్లేసరికి అందరు మన కోసం 
ఎదురు చూస్తున్నారు.ఈయనైతే సెలవు పెట్టి మరీ 
(ముందుంది ముసళ్ళ పండగ అని తెలీదుగా మరి)

ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఎంత మంది ఉండేది చెప్పాలండి.
(చెప్పొద్దా?అదంతా జాన్తానై వినాల్సిందే)
మా అత్తగారు,మామగారు వాళ్ళ నలుగురు కొడుకులు ,
ఒక అమ్మాయి (ఇంతేనా అంటారా?)మా అత్తగారు వాళ్ళ 
అమ్మ ,చిన్న అత్తగారు ,మా తోడుకోడలు వాళ్ళ పాపా,
(ఇంతేనా అంటారా?)ఇంకా వాళ్ళ వాళ్ళలో చదువు కోసమని 
ఇంకో మరిది వచ్చే పోయేవాళ్ళు ఇంట్లో ఎంత మందో 
చూసుకోండి.మా వారు రెండో వారు కాబట్టి ఇంకా మిగిలిన 
ఇద్దరు మరుదులుకి,చెల్లిలికి అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు.
 (మా అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న ముగ్గురు ఆడ పిల్లలము ఇంకా ఒక తమ్ముడు అంతే)

నేను వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో సందడే సందడి.
మా వారు హ్యాపీ గా నవ్వుకుంటున్నారు ఆ సందడి చూసి.
మా తోడుకోడలు ,ఆడ బిడ్డ వాళ్ళు అల్లినవి ,paint 
వేసిన చీరలు చూపిస్తున్నారు ఎలా ఉన్నాయని?
(మనం అప్పుడు all in one లెండి.అప్పుడు అమ్మాయికి 
పని ముద్దా ?పాట ముద్దా?అని అడిగేవారు.
ఇప్పుడు system ముద్దా?software ముద్దా ?అని అడుగుతున్నారు)

హ్యాపీ గా ఉంది కదా .మొసళ్ళ పండగేమిటిఅంటారా? 
wait and see .

రాత్రి ఏడు గంటలదాకా అలా హుషారుగా గడిచింది.
అప్పుడు చపాతిలు చేస్తున్నాము.నేను పాముతుంటే 
వాళ్ళు కాలుస్తున్నారు.అప్పటికి నా మొహంలో 
రంగులు మారిపోయి దిగులు మేఘాలు వచ్చేసాయి.
మా అక్క చూసింది.ఏమైంది శశి ?కళ్ళు నిండిపోయాయి 
మీ నాన్న గుర్తుకు వచ్చాడా?అంది ఇంక చూసుకోండి 
వరద గోదారే కళ్ళలో .అన్ని వదిలేసి మిద్ది మీదకు వెళ్ళాను.

(ఇప్పటికైనా చపాతి చూస్తే నాన్నే జ్ఞాపకం.ఆయన అంతే 
నేను వస్తున్నానంటే చపాతి,vegitable కర్రీ కి అన్ని తెచ్చి పెట్టేస్తారు.
ఏమిటి మీకు కొంచం పెట్టాలా?అవతల నేను ఏడుస్తుంటే )

ఇంక ఇంట్లో అందరు నా వెనుకే.నేను ఎక్కిళ్ళు తప్ప 
ఏమి చెప్పక పోతిని .అప్పట్లో ఫోన్ ఉంటె గొప్ప.పైగా 
trunkbooking  చేయాలి.మగవాళ్ళంతా ఫోన్ దగ్గరే.
line కలిసి మా నాన్న మాట్లాడగానే బావగారు,మామయ్య 
మరుదులు అందరు పరిగెత్తారు
"మీ నాన్న మాట్లాడుదువురా "అని.
ఒక్క సారి ఫోన్ ఎత్తుకొని ఓఓఓ ......అని ఏడ్చేసాను.

ఇక్కడ వాళ్లకి గుండెల్లో జన శతాబ్ది పరిగేత్తినట్లు 
గుండె కొట్టుకొంటుంది(ముఖ్యంగా ఈయనికి )
మా నాన్న కాసేపు ఓదార్చి "రేపు వస్తాను"
అని మాటిచ్చి పెట్టేసారు.

వీళ్ళంతా హమ్మయ్య అనుకున్నారు.మా అత్తగారు 
పెరుగన్నం కలుపుకొని వచ్చి తినమ్మా అనింది.
కొంచం తిని ఏడుస్తూనే వెళ్లి పడుకొన్నాను.
పాపం ఈయన తిన్నారో లేదో (నేను ఏడుస్తుంటే 
ఎలా సహిస్తుంది పాపం)నేను నిద్ర పోయిన చాల 
సేపటికి హమ్మయ్య అనుకోని నిద్రపోయారనుకొంటా.
(అప్పుడు ఇగో లు అవి లేవండి.ఒకరు ఏడిస్తే ఇంకొకరు 
బాద పడటమే)

ఉదయం దొడ్లో తులసి కోట దగ్గర పూజ చేసుకుంటూ 
ఉన్నాను.వీధి వాకిలి దగ్గర ఇంకెవరు ?మా నాన్నే .
అసలైతే పెద్ద ఇల్లు రైలు పెట్టెల లాగ.వీధి వాకిలి 
దగ్గర ఎవరైనా ఉంటె పరిశీలనగా చూస్తే కాని కనపడరు.

అసలు నన్ను ఒక వైపు ,మా నాన్న ని ఒక వైపు 
ఉంచి పరుగు పందెం పెడితే గోల్డ్ మెడల్ ఖాయం.
(ఇప్పుడు olympics కి వెళ్ళమంటారా ?మా బంగారాలే)

ఇంక మా నాన్న తో మా పిన్ని కూతుర్ని(నాలుగేళ్ళు)
మామ కూతుర్ని తీసుకొచ్చారు.అంటే ఊరు మొత్తం 
నా కోసం తేలేరు కదా.వాళ్ళతో ఆడుకోనేదాన్ని పెళ్లి 
కాకముందు.
ఇక చూడండి మా నాన్న దగ్గర కూర్చుని కబుర్లే కబుర్లు.
మిగతా వాళ్ళంతా ఆయనకు మర్యాదలు చేస్తున్నా నేను 
మాత్రం లేవలేదు లేస్తే ఎక్కడ వెళ్ళిపోతాడో అని.
"నిన్న మధ్యాహ్నం అన్నం తిన్నావా ?"అడిగాడు నాన్న.
"తిన్నాను.అత్తమ్మ గోంగూర పచ్చడి కలిపి పెట్టింది"
(కలిపి పెట్టటం ఏమిటా?అసలు మీరు ఎపుడూ అలా
తినలేదా?నాన్న ,పిల్లలం అమ్మ కలిపి పెడితేనే తినేది 
అలవాటు.చివర గుజ్జు కోసం అందరం కొట్టుకుంటాము.
అసలు తోడ బుట్టిన వాళ్ళతో కలిసి తింటే రుచి పెరుగుతుంది.
కావాలంటే తిని చూడండి)

ఇక మా వారికి అయితే మా నాన్న తో మాట్లాడుతున్నారు 
కాని గుండె గుండెలో లేదు.నేనెక్కడ ఊరికి వెళ్లి పోతానో 
అని.(మనం కొంచం మొండి రాక్షసి)

ఇక మా నాన్నకి పరిస్థితి అర్ధం అయింది.నేను ఉండను 
అంటానని.ఆ మాట అనక ముందే "సురేషు నువ్వు 
ప్రతి ఆదివారం ఊరికి  అమ్మాయిని తీసుకురా కొన్ని 
రోజులు"అన్నారు.మా వారు నేను ఉంటానంటే 
ఎలాంటి షరతులకైనా సిద్దంగా ఉన్నారు.అల్లాగే 
మామయ్యా అని గట్టిగా మాటిచ్చారు.

మా నాన్న వెళ్లిపోతుంటే దిగులుగా చూస్తూ 
ఉండిపోయాను.మా వారికి నా దిగులు తీర్చేసరికి 
బహుశా అందరు దేవతలు కనపడి ఉంటారు.

ఏమిటి ఆడ పిల్లలు ఇంత దిగులు పడతారా అంటారా?
మీకు మూడు సమాధానాలు చెపుతాను మీరు ఎలాంటి వాళ్ళు 
అయితే ఆ సమాధానం చదువుకోనండి.

1 .మీకు అమ్మాయి ఉంటె

మీకెలాగో తెలుసు "పుట్టగానే పూవు పరిమళిస్తుంది.
పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది"మీకేమి చెప్పను 
అవసరం లేదు.

2 .మీకు అమ్మాయి లేకపోతే
మీరో ఒక పని చేయండి.ఒక మొక్కని నాటండి.
ఇరవయ్యి ఏళ్ళు బాగా పెంచండి.తరువాత పీకి 
ఇంకో దగ్గర వేయండి.అది ఎలాగా ఉంటుందో 
ఆడపిల్లలు అంతే.

3 .మీకు పెళ్లి కాకపోతే
అయితే మీరు మీ గుండెల్లో కొంచెంచోటు,
బోలెడన్ని kerchiefs తీసి పెట్టుకోండి.
ఎందుకు అంటారా?


ముందుంది మొసళ్ళపండగ      

8 comments:

వేణూరాం said...

సూపరండీ. .మురారి సినిమా మళ్లీ చూసినట్టూ అనిపించిందీ..హహహ ;)

రాజ్ కుమార్

ఇందు said...

మమ్మీఈఈఈఈఈఈఈ...............నాకు మళ్ళీ గుర్తుచేశారు.....వాఆఆఅ..........వాఆఅ....

ఈ పెళ్ళిళ్ళు ఎవరు కనిపెట్తారోకానీ...అమ్మాయిలే అత్తారింటికి వెళ్ళే రూల్ ఏంటో! ఏదేశం చూసినా ఇదే ఆనవాయితి!! అబ్బాయిలు ఆల్ హాపీస్! అన్ని కష్టాలు అమ్మయిలకె!

:(((((((((((((((

చాలా బాగుంది పోస్ట్ కొంచెం ఫన్నీగా...కొంచెం బాధగా! :( :)

వేణూ శ్రీకాంత్ said...

ఏంటోనండీ మీరు ముందుంది ముసళ్ళపండగ అని భయపెడుతున్నాకానీ.. మీ టపా చాలా నచ్చేసింది.. చాలా బాగా రాశారు చక్కగాకళ్ళకు కట్టినట్లు ఆరోజుల్లోకి తీసుకు వెళ్ళి మమ్మల్ని కూడా మీ వెంట తిప్పేశారు. అత్తింట్లో అంతటి ఆప్యాయతను పొందిన మీరు అదృష్టవంతులు..

మధురవాణి said...

హహహహా.. భలే రాసారండీ.. చాలా బాగున్నాయి మీ కబుర్లు.. మీరు చెప్పింది నిజమే! అమ్మాయిలూ లేని వాళ్ళకి అర్థం అయ్యేలా బాగా చెప్పారు. I really liked it! :)

it is sasi world let us share said...

వెణు గారు మీకు కూడా ఆ పండగ జరుపుకొవాలని ఉందా...యెమిటి?
హా...హా....))))))))

మధురవాణి గారు యెంత మధురంగా సెలవిచ్చారు.thank u.

it is sasi world let us share said...

రాజ్ ఇక్కడ చాల మందికి ఆ పందుగ కావాలంట.మీ కొద్దా?....

ఇందూ యేడవ వద్దు....బన్గారు తల్లి కద....ఆమ్ కొనిపెడతాలె...
అంటారు చందు.......))))))))))

వేణూరాం said...

హహహ... మీ అందరూ సీనియర్లు కాబట్టీ మీకు తెలుసు ఆ పండగ ఎలా ఉంటాదో..తినబోతూ రుచి అడగటం ఎందుకూ అని ఊరుకున్నానండీ...

రాజ్ కుమార్

వేణూరాం said...

మళ్ళీ చదివించేసారండీ మీ పోస్ట్ ని. ;)