Sunday, 4 March 2012

ఏది నీది?.....ఎందుకు కాదు?....చెప్పేది ఎవరు?

''నది లో కుండ ఉంది.దానికి లోపల వెలుపల నీళ్ళు ఉంటాయి.
అటూ ఇటూ ఉన్న నీళ్ళు వేరు కాదు .కుండ ఉన్నంత వరకే బేధం.అదే మాయ.
తాడుని పాము అనుకొనేంత బ్రాంతి. కుండ పగిలితే ఏమి లేదు.
అంతా ఒకటే. ఈ మనిషి,ఈ దేహం,ఈ స్వపర బేధం,నాది నీది అనుకునే 
వెర్రితనం ,అహంకారం ..........అంతా ఆ కుండ లాంటిదే ''

 యెంత చక్కగా చెప్పారు రచయిత.........శంకరాచార్యుల 
తత్వాన్ని అక్షరాల్లో మూసగా పోసి.......చక్కర చిలకల్లాగా 
హృదయాన్ని మెల్లిగా ఆత్మ మూలాలలోకి కలుపుతూ.....
ఈ రోజు సాక్షి ఫండే లో "ఆకెళ్ళ రాఘవేంద్ర" గారి రాలిన మొగ్గలు 
శీర్షికన శంకరాచార్యుల వారిని గూర్చి చూడండి.

మామూలుగా ఎవరు శంకరాచార్యుల గారిని గూర్చి వ్రాసినా 
మొసలి పట్టుకోవటం,వాళ్ళ తల్లి గారి అవసాన దశ లో 
ఆయన రావటం  ఆయన మహిమలు చూపినట్లు వ్రాస్తారు.
కాని వీరు చక్కగా వారి జీవన యానం లో మామూలు 
మనిషిగా చేసినట్లు వ్రాసారు.అది నిజమే వారు వాళ్ళ జీవితం 
లో మామూలుగానే చేస్తారు.మనం అవి తరువాత మహిమలని
గుర్తిస్తాము.అంత చిన్న పిల్లవాడు సన్యాసం తీసుకోవటం....
జ్ఞానపు ప్రచారానికి బయలు దేరటం యెంత గొప్ప విషయం...
   
 రాఘవేంద్ర గారు శంకరాచార్యుల గూర్చి వ్రాయటమే మీ 
కలం చేసుకున్న అపురూప అదృష్టం దాని ముందు ఇంకెంత 
సన్మానం అయినా దిగదుడుపే.
అంతటి అదృష్టాన్ని పొందినందుకు,చక్కని కధనానికి 
మీకు అభినందనలు. 
నాకు నచ్చిన శ్లోకాలు ''భజగోవిందం'' లో 
''సత్సంగత్వే నిస్సంగత్వం 
నిస్సంగత్వే నిర్మోహత్వం 
నిర్మోహత్వే నిశ్చల   తత్త్వం 
నిశ్చల తత్వే జీవంముక్తిహి ''

''మా కురు ధన జన యవ్వన గర్వం 
హరతినిమే షత్ కాల సర్వం 
మాయా మయ మిద మఖిలం హిత్వ
బ్రహ్మ పదం త్వం ప్రవిశ విదిత్వా''

''దినయామిన్యావ్ సాయం ప్రాత 
శిశిర వసంతవ్ పునరాయాతః 
కాలః క్రీడతి గచ్చాత్యాయు  
స్తదపి న ముచ్యత్యాశావాయుహు ''

రాత్రిం పవళ్ళు ,ఉదయ సాయంకాలాలు,
శిశిర వసంతాది ఋతువులు ఒక దాని వెంబడి 
ఒకటి వచ్చుచూ పోవుచూ ఉండును.
ఈ విధముగా కాలం క్రీడించుచున్నది.
ఆయువు క్షీనించుచున్నది.
అయిననూ ఆశా పిశాచము మాత్రము నిన్ను 
విడువకనే ఉన్నది.......
 
 

3 comments:

Kalyan said...

శశికళ గారు ప్రస్తుత సమాజాన్ని చూస్తే పైగా నన్ను నేను పరిసీలించుకున్నా నాకు తోచేది ఏమిటంటే "కలికాగితముపై ధర్మాక్షరాలు వ్యంగ్యాక్షరాలుగా తోచుచున్నవి ఎండుటాకులా రాలిపోచున్నవి" నిజం అండి శంకరాచార్యుల వారు చెప్పే ఆ సిధాంతాలు ఇప్పుడు వ్యంగ్యంగా మారిపోతోంది.. దానిని కాపాడే భాద్యత యువతపై ఎంతగానో వుంది..ఈ ప్రచారము ద్వారా మాలో నమకాన్ని జ్ఞానాన్ని నింపినందుకు మీకు నా కృతజ్ఞతలు

జైభారత్ said...

కొన్ని విషయాలు.... చాల ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ..శశి గారు..గత రెండు సంవత్సరాలు క్రితం అనుకుంటా..ఒక పెద్దాయన తన సెల్ ఫోన్ కి ఎమ్.ఎస్ సుబ్బలక్ష్మి గానం చేసిన భజగోవింద శ్లోకాన్ని కాలర్ టోన్ గా పెట్టుకున్నారు..ఇది విన్నవాళ్ళం అంతా సరదాగా నవ్వుకున్నాం....కొందరైతే..ఆయన పేరు భజగోవింద అనే ఫిక్స్ చేసేశారు.. నేనైతే..దేవుని విగ్రహాన్ని ఆరాదిస్తూ పాడే ఒక మాములు భక్తి గీతం కావోచ్చులే అని లైట్ గా తీస్కున్నా..ఎప్పటి వరకంటే..పోయిన నెల 25 వరకే ఆరోజున రమణ మూర్తి గారు (విజయవిహారం పత్రిక సంపాదకులు)..నా సెల్ కి
''సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చల తత్త్వం
నిశ్చల తత్వే జీవంముక్తిహి ''
అని మెసేజ్ ఇచ్చారు..ఇలా చదివితే నాకేం అర్ధం అవుతుందిలే గాని ఆఫీస్ కి వెళ్ళాక తనని అడిగితె విషయం బాగా చెప్పేస్తాడు లెమ్మని ఆఫీస్ కి వెళ్ళాను కదా తన కుర్చికి వెనుకవైపు షెల్ఫ్ డోర్ కి పెన్సిల్ తో ఈ వాక్యాన్ని వ్రాసేస్కుని .. లాప్ టాప్ లో ఎమ్.ఎస్ సుబ్బలక్ష్మి గారి భజగోవిందం!! భజగోవిందం!! గోవిందం భజ!!మూఢమతే..!!అని ఆ శ్లోకం వింటూ పరవసులై పోతున్నారు..కళ్ళు తన్మయత్వంతో వెలిగిపోతున్నాయ్..ఇక నన్ను చూసి..రా..రా కుర్చోరా అని ..దాని అర్ధాన్ని వివరించి చెప్పారు..ఇప్పటిదాకా మనీష పంచకం అది వెలువరించిన సందర్భం గురించే తెల్సిన నాకు ఇప్పటిదాకా ఏదో మామూలు భక్తి గీతం అనుకున్నాను..కాని ఇంత గొప్ప అర్ధం ఉన్న శ్లోకం అనుకోలేదు.. ప్చ్ ఎంత మిస్ అవుతున్నామో కదా..అని చాల బాధేసింది .. మరల ఇప్పుడు ఆకెళ్ళ గారి ఆర్టికల్ ..చూడటం..నా కోసమే వ్రాసినట్టు అనిపించింది...మరల మీ బ్లాగ్ లో..ఇక ఆది శంకరా చార్యులు గురించి పూర్తిగా చదవాలి..అద్వైతమే సరైన మార్గం అనుకునే నాకు ఇదే సరైన మార్గం. శంకరా చార్యులు గురించి ఇంకా మీనుండి..చాల తెల్సుకుంటాను..సందేహాలను తీర్చుకుంటాను శశి గారు..చాల థాంక్స్ అండీ..నమస్తే.

శశి కళ said...

lokanadh gaaru ....alage...thnx




kalyan nuvvu cheppinadi nijam