Friday 4 May 2012

తోక లేని పిట్ట..... ఇన్ని ఏళ్ళు తరువాత...

   తోక లేని పిట్ట ......తొంబై ఆమడలు పోతుంది....
ఎవరో తెలుసు కదండీ.......

మరి ఈ తోక లేని పిట్ట ఎన్నో ఏళ్ళు ఊర్లన్ని  తిరిగి ఫేస్ బుక్ లో 
వచ్చి పడి అది చేరవలసిన ఊరికి చేరింది......        



సరే ఇది చేరింది....ఓ.కే.

మరి పాపం మా జిల్లా ఇంటర్ ఫిజిక్స్ పేపర్స్ పోస్ట్ లో 
మిస్ అయ్యాయంట....మరి ఆ తోక లేని పిట్టలు ఎప్పటికి 
కనపడుతాయంటారు .............

పాపం వాళ్ళు నిన్న మళ్ళా ఫిజిక్స్ పరీక్ష వ్రాశారు.
చూడండి....రాత్రికల్లా దిద్ది రిజల్ట్స్ ఇస్తారంట.

మరి ఎవురికైనా ఎప్పటికైనా ఆ జవాబు పత్రాలు దొరికితే .......
ఎన్నేళ్ళు అవుతుందో మరి......చక్కగా అప్పుడు ఉండే ఏదో ఒక 
బుక్ లో పెట్టెయ్యండి.....వాళ్ళ మనుమలు చూసి సంతోషిస్తారు.

మా తాత రిజల్ట్స్ ఇప్పటికైనా వచ్చాయి అని ....

పనిలో పని వీళ్ళు వ్రాసిన స్కూల్ గూర్చి కొంచం చెపుతాను చూడండి...
మీకు కొద్దిగా పైన ఫోటోలో కనిపిస్తూ ఉంది కదా.....

అది ,ఇక్కడి కలక్టర్ ఆఫీస్ .......ఇవి బ్రిటిష్ వాళ్ళు కట్టినవి.
ఒక్కో గోడ ఇం......త లావుగా ఉంటుంది.మెట్లు కూడా చేక్కవి .
అయినా భలే గట్టిగా ఉంటాయి.ఇప్పటి భవనాలు చూసారా?
చెప్పుకోవటం ఎందుకు.....

సరే ఫిజిక్స్ పరీక్ష గూర్చి ఇంకొంచం.....ఎందుకంటె తృష్ణ గారు కామెంట్ 
చాలా చక్కగా చేసారు.దానిపై కొంచం వివరణ ఇస్తే అందరికి 
ఇక్కడి పిల్లలపై సానుకూల దృక్పధం ఏర్పడుతుంది.

ముందు జలతారు వెన్నెల  గారి కామెంట్ చూడండి 


Blogger జలతారువెన్నెల said...
శశి గారు,నేను ఈ వార్త పేపర్ లో చదివి తెలుసుకున్నాను ఈ సంవత్సరం physics lO అంధ్రా లో విధ్యార్ధులు తక్కువ మార్కులతో ఉత్తీర్ణులయ్యరని.
అసలు బ్లూ ప్రింట్ /గ్రీన్ ప్రింట్ అని కాకుండా.. syllabus లో ఉన్న టోపిక్స్ అన్ని చదవాలి కదండి. విధ్యార్దులన్నాక పరీక్షలలో పాస్ అవ్వడమే ధ్యేయం అవ్వకూడదు కదా? ఇక్కడి system లో ప్రతి లెస్సన్ లోను quizes and tests untaayi. 90% పైన మార్కులు సంపాదిస్తే "A" వచ్చినట్టు. లేకపోతే గ్రేడ్ పడిపోతుంది. అలా అన్ని లెస్సన్స్ లో quizes and tests lO vachina marks అన్ని కలిపి, mid term + Final కలిపి final grade decide అవుతుంది. అంటే "A" సంపాదించాలంటే ప్రతి లెస్సన్ లోను 90% పైన మార్కులు సంపాదించాల్సిందే! ఇక పరీక్షలలో (physics) theory questions ఉండవు. అన్ని problems . Conceptual gaa గా subject అర్ధం అయితే తప్ప ఆ problems ని crack చెయ్యleru students. ఇవి కాక, వారికి weekly ఒక 15 problem sets ఇస్తారు homework కింద. ఆ homework కి కూదా గ్రgrades ఉంటాయి. Final grade లో HW + quizes + final test + midterm test అన్ని కలిపి 90% పైన ఉంటే "A" vachinattu..లేకపోతే ఇంతే సంగతులు... ఒక వేళ ఆరోగ్యం బాగొలేక కొన్ని tests / quizes మిస్స్ అయినా, సరిగా చెయ్యకపోయినా..final దెబ్బ తింటుంది. ప్రతి రోజు చదువుకోవాలి, ప్రతి test బాగా score చెయ్యలి..అది challenge!

జలతారు వెన్నెల  గారు ఇప్పుడు మీరు చెప్పింది చాలా చక్కగా ఉంది .

నిజానికి విద్యా వ్యవస్థ అలాగే ఉండాలి.
కాని మీరు అలాంటి చదువు కోసం యెంత ఖర్చు పెడుతున్నారో చెప్పగలరా?
ఇక్కడ పేద విద్యార్ధులు అంత ఖర్చు పెట్టగలరు అనే అనుకుంటున్నారా?
అప్పటికి నేను మా వారు మా వంతుగా మంచి పిల్లలకు పెన్స్,బుక్స్ అవీ ఇస్తూ ఉంటాము .
(చాలా తక్కువ లెండి)అసలు బర్రెలు దగ్గరకు పోకుండా బడికి రప్పించటానికి ,
పెళ్లి చేసుకోకుండా పాటశాల కు రప్పించటానికి ఇక్కడ టీచర్స్ కి యెంత కష్టమో తెలుసా?
కనీసం వాళ్ళు ఇచ్చే మధ్యాహ్నం భోజనం కోసం వచ్చే వాళ్ళు ఎందరు తెలుసా?
ఇక్కడ పదునాలుగు ఏళ్ళు నిర్బంధ విద్య ఉంది కాబట్టి ప్రభుత్వం బరిస్తుంది.
లేకుంటే ఎన్ని స్కూల్స్ ఎత్తి వేసిందో తెలుసా?కొందరు టీచర్స్ ది తప్పు అంటారు 
కాని లోపాలు ఎక్కడా ఉంటాయి...ముందు మనం పిల్లవాడిని చదువుకు రప్పించటమే 
మన ధ్యేయం.అల్లాగే అందరు 90% తెచ్చుకొనే క్లేవేర్స్ ఉండరు...ఒక్కోరికి ఒక్కో 
విద్యలో ప్రావీణ్యత ఉంటుంది.అందుకే 35% వస్తే చాలు పై క్లాస్స్ కు పంపేది.
అందరు ఆఫీసర్స్ కాలేరు కదా........

అదీ కాక ఇంటర్ బోర్డ్ వాళ్ళు పేపర్ మార్చినప్పటి నుండి పేపర్ ఇలాగే ఇచ్చి ఉంటె 
వాళ్ళు చెప్పింది నిజమే  అనవచ్చు.ఎలాగో వస్తుందని ఊహించరు.
పాపం మొద్దులు  ఉంటారు కదండీ...వాళ్ళు వాళ్లకు  తగ్గ చదువులు ఏదో 
ప్యాస్స్ మార్కులు తెచ్చుకొని చదువుతారు.
మీరు చెపినట్లు అన్నీ  రాక  పొతే అదే తరగతిలో ఉండమంటే ప్రబుత్వం వాళ్ళ 
ఖర్చు బరించదు.మా మీద భారం  పెడుతుంది ఎలాగైనా పై క్లాస్స్ కు పంపమని...
ఇప్పటికి మనం పేదరికం కారణంగా  సంపూర్ణ అక్షరాస్యతే సాదించలేదు.
మీరు చెపిన చదువు రావటానికి ఇంకా కొంచం కాలం పడుతుంది.
అయితే దానికి తల్లి తండ్రులు సహాయం చాలా అవసరం.ఇక్కడ తల్లి తండ్రులు 
బడికి పంపమంటేనే కష్టపడుతున్నారు.
మంచి కామెంట్ పెట్టారు థాంక్యు.
అలాటి చదువులు ఇక్కడ కూడా రావాలని నేను కూడా కోరుతున్నాను.

8 comments:

తృష్ణ said...

శశిగారూ, ఇప్పుడే మీ పోస్ట్ చూస్తున్నాను. "తృష్ణ గారి కామెంట్" అని మీరు రాసినది చూసి ఆశ్చర్యం వేసింది. గత రెండు రోజులుగా నేను ఇంట్లోనే లేను. నా బ్లాగ్లో టపా, వాటికి కామెంట్లు మాత్రం బయట నుంచే పబ్లిష్ చేసాను తప్ప అసలు అగ్రిగేటర్ల వైపు, బ్లాగుల వైపు రానేలేదు. అదీకాక ఈ పరీక్షల గురించి, హంగామా గురించి నాకు బొత్తిగా ఏమీ తెలియదు. నేనెక్కడా వాటి గురించి రాయలేదు కూడా.బ్లాగుల్లో నేను కాక మరో "తృష్ణ" ఉన్నారా? మీకు కామెంట్ ఎవరు రాసారు? మీరు టపాలో రిఫర్ చేసినది ఎవరి గురించి...? కాస్త క్లారిఫై చేసి నా కంగారు తీర్చండి.
--------------------

శశి కళ said...
This comment has been removed by the author.
శశి కళ said...

తృష్ణ గారు నాకిపుడు ఏమి వ్రాయాలో అర్ధం కావటంలేదు...జలతారు వెన్నెల అని వ్రాసి కూడా ఎందుకు మీ పేరు వ్రాసానో అర్ధం కావటం లేదు.
మీ పేరు నా మైండ్ లో సైడ్ ట్రాక్ ఎలా వచ్చింది.
ఇప్పుడే ఎడిట్ చేస్తాను...ఏమి అనుకోకండి.

తృష్ణ said...

హ్మ్మ్మ్...!! అలా కాకపోతే పర్వాలేదులెండి.. :)
ఎవరన్నా నా పేరుతో కామెంట్ పెట్టారేమో అని కంగారు పడ్డాను.

జలతారు వెన్నెల said...

శశి గారు, కామెంట్ పోస్ట్ చేసాను అనుకున్నాను ఉదయం. మరి చెయ్యలేదేమో!
కాని నేను ఈ physics ఉదంతాన్ని మొత్తం తప్పుగా అర్దం చేసుకున్నాను. క్షమించండి.
ఇక్కడ కూడా పాస్ అవ్వడానికి కాలసినది "D" grade మాత్రమే! మంచి మార్కులు, "A' రావడం కష్టం అంతే! k-12 వరకు ఫీస్ లేదండి. కాని తర్వాత చదివే చదువుకి మాత్రం మొత్తం పైసా వసూల్ చెసేస్తారు.

Anonymous said...

శశి గారు మీరు అన్నది నిఝంగా నిజమే.. పునాది గట్టిగా ఉంటేనే ...కట్టడాలు మన్నికతో ఉంటాయ్..
అయితే మార్పును ఈ సమాజం ఒక్కసారే ఒప్పుకోదు.. అందుకే ఈ పిల్లల-- వారి తల్లిదండ్రుల గోలలు,,,
నేను టి.వి చూస్తున్నప్పుడు.. ఇదే అనుకునేవాడిని.... "ఏం చదువుల్రా బాబూ'...

Anonymous said...

lets see

N.M.V.Prasad said...

జలతారువెన్నెల Garu, could you please send me your articles/give me the access for American school education written on your blog. As currently I could not access those.
my email id : nmvprasad@gmail.com

I have kids who are studying 3rd grade and 7th grade

Sorry Sasi kala garu posting this comment on your blog.