Thursday 1 November 2012

ఆట పాటల చదువు ...అప్పుడే సందడే సందడి

చిన్న పిల్లలను స్కూల్ లో వేసిన ఇల్లు...
అందమైన బుజ్జి మాటల,పాటల పొదరిల్లు.
మరి అంత అందమైన అనుభూతిని ఇంకా కొంచెం
మధురం చేసుకుందాము.
ఈ రోజు ''ఆంద్ర భూమి'' భూమిక పేజె లో నా ఆర్టికల్.

(నా ఆర్టికల్ లింక్ ఇక్కడ )

పాటలతో పాఠాలెంతో హాయ

  • - శశి తన్నీరు
  • 01/11/2012
‘దోసెమ్మ.. దోసె
అమ్మకు ఒకటి
నాన్నకు రెండు
నాకేమో మూడు’’
- పసిపిల్లలను మొదటిసారి స్కూల్‌లో చేర్పిస్తే ఇక ఇల్లంతా ఇలా... ఆటపాటలతో రాత్రిళ్ళు సందడిగా మారుతుంది. అప్పుడే స్కూల్‌లో చేరిన పిల్లలకు అక్షరాలు రాయడం వంటివి ముఖ్యం కాదు. వారు చక్కగా వినటం, పదాలు పలకటం, వస్తువులను గుర్తించడం ముఖ్యం. స్కూల్‌లో ఎంత చెప్పినా, పిల్లలు ఇంటికి వచ్చిన తరువాత తల్లిదండ్రులు చిన్న చిన్న ఆటలు, పాటలు కానీ మొదలుపెట్టి వాళ్ళతో ఆడితే అందరికీ సరదాగా ఉంటుంది. పాటలతోనే పాఠాలు నేర్పితే వాళ్లతో సాన్నిహిత్యం పెరుగుతుంది. పిల్లలు స్కూల్‌లో ఎలాంటి బెరుకు లేకుండా అన్ని విషయాలలో పాల్గొంటారు. చదువు అంటే ఆట అనుకుని, ఆడుకోవడానికి స్కూల్‌కి వెళ్లాలని అర్థం చేసుకుంటారు.
కొన్ని చిన్న ఆటలు వాళ్ళ కోసం...
మీరు ‘అ’ ఎక్కడ?- అంటే వాళ్ళు ఇంట్లో మీరు దాచి పెట్టిన అక్షరాలలో నుండి దాన్ని వెతికి తేవాలి. లేదా దూరంగా అక్షరాలన్నింటినీ కుప్పలాగా వెయ్యొచ్చు. (ఇంగ్లీష్ అక్షరాలు అయనా)
ఇంకా రంగులు కూడా. మీరు చెప్పిన రంగు ఇంట్లో ఎక్కడ ఉందని అంటే వాళ్ళు ఆ కలర్ కలిగిన వస్తువులను- ఉదాహరణకి మీరు రెడ్ అని చెపితే వాళ్ళు టొమాటో, కర్టెన్స్, వాళ్ళ డ్రెస్... ఇంకా ఏమైనా ఆ కలర్‌లో ఉన్న వాటిని తాకాలి.
రకరకాల రంగుల్లో ఉన్న అక్షరాలను ఒకే కలర్‌వి కుప్పగా వెయ్యమని పిల్లలకు చెప్పాలి. ఇందులో ఎవరు ఫస్ట్?- అని పోటీలాగా పెట్టుకుంటే వాళ్ళకు తమాషాగా ఉంటుంది. ఇలాంటి పోటీల్లో పిల్లలను అప్పుడప్పుడూ గెలిపిస్తే వాళ్ళకు అదో ఆనందం.
ఇంకా టీవీలో, పేపర్‌లో మీరు చెప్పిన అక్షరం గుర్తుపట్టమని చెప్పి దానికి చాక్లెట్స్ ఇవ్వవచ్చు అభినందనగా. మనం రోజూ ఇచ్చేవే అయినా ఇలా ఆడినపుడు ఇస్తేనే- వాళ్లలో గెలుచుకున్నామనే సంతోషం ఉంటుంది. ఇలా చేయస్తే, బస్‌లోగానీ బయట ఎక్కడ ఉన్నా అక్షరాలను గుర్తుపట్టి మీకు చూపిస్తూ ఉంటారు హుషారుగా.
చిన్న చిన్న పాటలు అభినయంతో చేయించి, మీరు ప్రేక్షకులుగా కూర్చొని వారిని ప్రోత్సహించడం మంచిదే. ఆటపాటలైనా, ఇంకేదైనా సరదాగా ఉండటమే పిల్లలకు కావాల్సింది. పిల్లలు మనసు విప్పి ఏమీ చెప్పకపోయనా, వారిని అందరిలో నిరుత్సాహ పరచడం వంటివి చెయ్యకూడదు. ఇంకా.. మీరు చెప్పిన నెంబరు మీదకు బాణం వెయ్యటం, లేకుంటే గోలీ వెయ్యటం.. ఇలా అంకెలపై కూడా అవగాహన కలిగించవచ్చు. స్కూల్‌లో ఏం చెప్పారని అని ముద్దుగా అడిగితే వాళ్ళు మిమ్మల్నే చేతులు కట్టుకోమని చక్కగా వాళ్ళ టీచర్‌లాగా అనుకరించి మాట్లాడతారు. ఇలాటపుడు కొంచెం గమనిస్తే వాళ్ళ టీచర్ పిల్లలతో ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలిసిపోతుంది. పిల్లలను చిన్నప్పుడే మార్కులు, ర్యాంకుల గొడవలోకి ఇరికించవద్దు. ఆ ప్రభావం వాళ్ళ మానసిక వికాసంపై పడుతుంది. కొన్ని రోజులకు చదువంటేనే భయపడతారు. నేర్చుకోవడం ప్రధానం.
తల్లిదండ్రులకు ఇంకో ముఖ్య విషయం- మీ పనులు ఎప్పుడూ ఉండేవే. అవి అయిపోయినాక పిల్లలతో గడుపుదామని అనుకుంటే ‘‘మీరు ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు’’- వాళ్ళు పెద్ద అయిపోతారు. వాళ్ళకు మీరు ఇవ్వాల్సినది సంపాదనే కాదు, సాన్నిహిత్యాన్ని, సమయాన్ని. అప్పుడే వాళ్ల బాల్యపు తలపుల్లో మీరు మధురస్మృతిగా నిలిచిపోతారు.

12 comments:

Raj said...

మధుర స్మృతులా శశి మిస్?

Srini said...

చాలా చక్కగా రాశారు.
అన్నట్టు ఆర్టికల్ లింక్ మీ personal computer లో folders ki point చేస్తుంది :)

anrd said...

చక్కటి విషయాలను తెలియజేసారండి.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

చాలాబాగా రాశారు. పేపర్ లింక్ పనిచెయ్యట్లేదు. మార్చండి

సుభ/subha said...

ముందుగా అభినందనలండీ.. బాగున్నారా?

శశి కళ said...

అవును రాజేంద్రా ...ఫ్రెండ్ పిల్లలు స్కూల్ కి వచ్చారు
అందుకు నా విషయాలు జ్ఞాపకం వచ్చాయి ...మా
మనుమల కోసం ఇక్కడ ఉంచి పెతాను :))

శశి కళ said...

శ్రేనివాస్ రావ్ గారు ,చైతన్య విషయం చూసి చెప్పినందుకు థాంక్యు.మార్చాను

శశి కళ said...

శుభా థాంక్యు ...బాగున్నాను

శశి కళ said...

ఆనందం గారు థాంక్యు

thanooj said...

thanku sashikala gaaru meeru andariki thank u cheptunnaruga variety ga untundaninene meeku cheppa

శశి కళ said...
This comment has been removed by the author.
శశి కళ said...

తనూజ్ గారు :))