Monday 17 December 2012

కొంచెం మా విద్యార్ధినులను దీవించండి

కొంచెం మా విద్యార్ధినులను దీవించండి ....
విషయం ఏమిటి అంటే ''ప్రపంచ తెలుగు మహా సభలు''
సందర్భంగా మా బడిలో చిన్న కవితా శిక్షణ 
కార్యక్రమం పెట్టాను.అందులో పిల్లలు వ్రాసినవే ఈ 
''అక్షరం''కవితా సంకలనం.రాసి లో చిన్నదే ...
మరి వాసి లో అంటారా పిల్లల వయసుని గమనించే 
మీ సహృదయత మీద ఆధారపడి ఉంటుంది.

అయితే ఈ సేకరణ జరిగేటపుడు చాలా మంది పిల్లలు 
వచ్చి మేడం మేము కధలు ఇస్తాము అని అడిగారు.
అప్పుడు నేను ఈ సారి ''కదా సంకలనం'' వేస్తాను అని 
చెప్పి పంపేసాను.
ఈ సారి పిల్లలను వాళ్ళల అమ్మలు,తాతలు,అమ్మమ్మలు 
చెప్పిన కధలు తెమ్మని చెపుదాము అనుకుంటున్నాను.
సంకలనం పేరు''మా పిలకాయల కధలు''
ఇంతకూ ముందు జన విజ్ఞాన వేదిక వారు ఈ ప్రయత్నం 
చేసి ఒక కధాసంకలనం ''మా నెల్లూరు పిల్లోల్ల కధలు''
వెలువర్చి ఉన్నారు.కాని వారు సేకరించింది 
''పుట్టెడు వడ్ల లో పిడికెడు''ఇంకా ఎన్ని ఉన్నాయో.....

అమ్మ వొడిలో వెచ్చగా రగిలి ఊపిరి పోసుకున్న రెక్కల 
గుర్రాలు,తాతయ్య భుజాలపై ఊగుతూ సప్త సముద్రాలు 
దాటించిన కధలు,అమ్మమ్మ వేలు పట్టుకొని ఊహల 
రంగుల రాట్నం తిరిగి సృజనను ఊపిరిగా పీల్చిన కధలు....
బాల్యపు కలలను అందంగా హృదయ పుటలలో 
జ్ఞాపకాలుగా నెమలీక అంత బధ్రంగా దాచుకున్న కధలు ...
ఒక్క సారి ఆ పిల్లల కలం పై మన చెవులు ఉంచితే చాలు 
తమ ఊసులన్ని రంగావల్లులుగా తీర్చి మన ఒడిలో 
రాసులు పోస్తారు.
అయితే సమస్య ఏమిటి అంటే ''స్పాన్సర్స్''కోసం చూస్తున్నాను.
మనం అందరం దీనిలో బాగం పంచుకుంటే ఎలా 
ఉంటుంది?







7 comments:

జ్యోతిర్మయి said...

శశికళ గారు పిల్లల కవితలు చూసి చాలా ముచ్చటేసింది. తెలుగు వ్రాయడానికి ఆసక్తి చూపుతున్న పిల్లలు ఉన్నారనుకుంటేనే ఎంతో సంతోషంగా వుంది. మాతో పంచుకున్నందుకు మీకు బోలెడు ధన్యవాదాలు.

anrd said...

శశికళ గారు, మీరు పిల్లలను చక్కగా ప్రోత్సహిస్తున్నారు.
పిల్లల సున్నితమైన భావాలు ఎంతో బాగున్నాయి.

అశోక్ చౌదరి said...

Sure, Please let me know if i can be of any help. Please send me an seperate email to discuss.

durgeswara said...

శుభాకాంక్షలు

శశి కళ said...

జ్యోతి గారు థాంక్యు


ఆనందం గారు నిజమే అండి పిల్లలు చాలా చక్కగా వ్రాసారు.నాకు భలే సంతోషం వేసింది

శశి కళ said...

అశోక్ చౌదరి గారు ...ఇంకా సమయం ఉంది.మీరు ముందుకు వచ్చినందుకు థాంక్యు.మళ్ళా జూన్ లో విషయం ప్రకటిస్తాను


దుర్గేశ్వర రావ్ గారు కృతఙ్ఞతలు

Unknown said...

ఈ శశి మా శశి అనుకుంటే నే సంతోషంగా గర్వంగా వుంది.పిల్లల కధలు బాగున్నాయి.వాటిని వెలుగు లోకీ తేవడం Great. మంచి పనికీ నా సాయం నీ కె ప్పుడు వుంటుంది.O.k.,