'24' ఏమనుకుంటున్నారు ?
ఇది మళ్ళా మాట్లాడుదాము .
ముందు ఒక విషయం . దేవుళ్ళ గురించి బోలెడు
గొడవ ఇక్కడ . ఆయనేమో అందరి హృదయాలు నావే అని
చల్లగా కూర్చొని ఉన్నాడు .
అయ్యా గొడవ పడే వాళ్ళు ! మేము ఇక్కడ ఒకరి అభిప్రాయాలు
ఒకరం గౌరవించుకుంటూ ఒకరి పిల్లలకి ఒకరం పాటాలు
చెపుతూ భిన్నత్వం తో ఏకత్వం లో హాయిగా ఉన్నాము .
ఎవరి దేవుళ్ళు వాళ్ళ నమ్మకం .
మీ పర్సనల్ విభేదాల్లోకి మమ్మల్ని బలి చేయవాకండి .
అసలు వీళ్ళ విభేదాల్లో కి దేవుడినో , స్త్రీలనో లాగి
పరువు తీసే వాళ్ళు అంటే సంస్కారమే లేనట్లు లెక్క .
వాళ్ళ తల్లి కి కాని తెలిసి ఉంటె అసలు కని ఉండదు
ఇలాటి వాళ్ళను . ఓయ్యో ! వాళ్ళ మొహాల దగ్గర
మైకులు పెట్టె వాళ్ళు ఆపండయ్యా . దేశ ప్రజల గౌరవం
పోతుంది . వీలయితే దేశ గౌరవం పెంచండి .
ఏమిటో ఈ ''24'' గురించి వ్రాయరాదా అని లోపల నుండి ఎవరో
అడుగుతున్నట్లే ఉంది . మా పిల్లలు నేను చూడక ముందే
ఇది అమ్మకు నచ్చే సినిమా అని నిర్ధారించేశారు .
ముందు వేణు శ్రీకాంత్ బ్లాగ్ లో దీని రివ్యు సూపర్ గా ఉంది
చదివి రండి . నేను కూడా కొన్ని చెపుతాను .
venusrikanth blogspot link ikkada 24 review
మీకు ట్రైలర్ చూడగానే అర్ధం అయింది కదా ఇది
టైం మెషీన్ గురించి అని . కాకపొతే మన ఆదిత్య 369
లాగా చూసి రావడం కాక ఆ పాయింట్ లో మార్పు చేస్తే
ఎలా ఉంటుంది అనేది విక్రం గారు చక్కగా చూపించారు .
తమిళ్ వాళ్ళు ప్రయోగాలు చేయడం భలే ఇష్టం .
తెలుగులో ఒకే మూస . బహుశ మన వాళ్లకు నచ్చవేమో !
విక్రం గారు ఆదిత్య 369 చూడలేదు అన్నారు గాని
కొంచెం అలాంటి ఫిక్షన్స్ పోలికలు ఉన్నాయి .
కాక పొతే చక్కటి స్క్రీన్ ప్లే ప్రతి అంశాన్ని చివరికి
టోకన్ 144 ను కూడా వదలలేదు . దీనిలో మైనస్
అందరు చెప్పేది రెహ్మాన్ పాటలు సో సో గా ఉన్నాయి అని ,
కాని అంటే ట్యూ న్స్ కొంచెం మామూలువే కాని
లాలి పాట ,ప్రేమ దర్శనం పాటా అక్కడక్కడ వినిపిస్తూనే ఉన్నాయి .
మీకు '' ప్రకృతి ఉరిమితే '' కధ తెలుసా ? డైనోసార్ లను
చూడటానికి వెనుక కాలానికి టైం మెషీన్ లో వెళ్ళిన
యాత్రికుని కాలు కింద పడి చనిపోయిన సీతాకోక చిలుక
వలన అతను ప్రెజెంట్ కి వచ్చేసరికి మొత్తం మారిపోయే
సంగతి . ఎక్కడ మనం పొరపాటు చేసామో , అక్కడకు
వెళ్లి దిద్దుకొనే వీలుంటే మొత్తం కధ మారిపోతుంది .
అదే విక్రం గారు చాలా ఆసక్తి గా చూపించారు . కామెడీ కొంచెం
ఉంటె ఇంకా బలే ఉండేది .
శివకుమార్ . తమ్ముడు విలన్ ఆత్రేయ . శివకుమార్ కొడుకు
మణి మూడు పాత్రల్లో సూర్య చక్కగా ఒదిగి పోయాడు .
శివ కుమార్ ,నిత్య (కీర్తి ) ల నెలల బిడ్డ మణి .
అప్పుడే 24 గంటలు ముందు వెనుకగా ప్రయాణం చేయగల
టైం మెషీన్ ను శివ కనుక్కుంటాడు . తమ్ముడు ఆదిత్య
దానిని సాదించుకొనే క్రమం లో వారిని చంపేసినా బాబు
వాచ్ మెకానిక్ గా శరణ్య దగ్గర పెరుగుతాడు . ఈ ప్రయత్నం
లో ఆదిత్య కోమా లోకి వెళ్లి పోతాడు . తిరిగి మేల్కున్నాక
వాచ్ ఎలా సాధిస్తాడు ? దానితో 26 ఏళ్ళు వెనక్కి వెళ్ళ గలిగాడా ?
లేక మణి దాని సహాయం తో అమ్మా నాన్న లను కాపాడుకున్నాడా ?
భలే సస్పెన్స్ . కాని కదా ఊరికే ముందుకు వెనక్కు ,ఎలా
తీసాడబ్బ ! చూడటానికే మనకు అర్ధం కావడం లేదు . అందరు
బ్రతకడాన్ని నేను అసలు జీర్ణించు కోలేక పోయాను . నిత్య , సమంతా
పెద్ద పాత్రలు లేకున్నా సో క్యూట్ . శరణ్య అయితే అమ్మ పాత్రలో
జీవించింది . ఇక టైం ప్రీజ్ చేసినపుడు వాన చినుకులు
ప్రీజ్ అవ్వడం సూపర్ . హాల్ అంతా చప్పట్లే .
నిజంగా మనం కాలం లో వెనక్కి వెళ్లగలమా ?వెళితే !!
అవును వెళ్ళ వచ్చు . కాక పోతే మన ధ్యానం లో సూక్ష్మ
శరీరం తో , నమ్మరా ? అంతే ఇప్పుడు సైన్స్ అన్న తరువాత
అన్ని బౌతికంగా చూస్తె కాని నమ్మము . అప్పుడే గ్రహణాలు ,
గ్రహాల చలనం , తోక చుక్కలు కనిపెట్టారు టెలిస్కోప్
లేకుండా , అయినా నమ్మము .
ఒక పని చేయండి హైదరాబాద్ లో పిరమిడ్ మెడిటేషన్
'' న్యూటన్ , లక్ష్మి '' వాళ్ళ దగ్గరకు వెళ్ళండి . మీకు ఇప్పుడు
ఇబ్బంది పెట్టే పాత్ర తో గతం లో మీ అనుభందం ఎక్కడ
ఉందొ అక్కడకు తీసుకుని వెళతారు . అప్పుడు మీ తప్పును అక్కడ
ఒప్పుకొని రండి . ఇప్పటి పరిస్థితి అంతా ఎలా సవ్యంగా
మారుతుందో చూడండి .
ప్రతి ఒక్కరి పాత్ర ప్రతి ఘటన లో ఎంతో ప్రభావాన్ని
చూపుతుంది ,అది మంచికో చెడుకో అది వేరే సంగతి .
గుడ్ల గూబ ఈక ఈ సినిమాలో టైం మిషీన్ ని సృష్టించింది ,
కోమాలో ఉన్న విలన్ ని మేలుకొలిపింది . మంచి జరిగిందా
చెడు జరిగిందా ..... ఏమో ! వదిలెయ్యండి . మరి మీరు
పాల్గొనే జీవిత సంఘటన లను మీరు ఎటు వైపు
మరలించాలి అనుకుంటున్నారు ?
''Presence makes miracles whether it may be yours or mine ''
@@@@@@@@@@

4 comments:
రివ్యూ చక్కగా రాశారు.
చిన్న సవరణ, విలన్ పేరు ఆత్రేయ (ఆదిత్య అని రాసారు :) )
thank you srini garu . sari chesanu
లింక్ ఇచ్చినందుకు థాంక్స్ శశి గారు.. రివ్యూ బాగా రాశారు..
thank you venu
Post a Comment