దంగల్ ,ఓ నాలుగు బాణాలు
మరి దంగల్ అంటే యుద్ధం అన్నారు అందుకని
నాలుగు బాణాలు కాని బాణాలు ,వాక్బాణాలు .
నా బ్లాగ్ రీడర్స్ కోసం .
''పిన్ని సాయంత్రం సినిమాకి రాను . సాయిబాబా
గుడికి పోవాలి '' అక్క కొడుకు హర్ష ఫోన్ .
'' నీతో రానురా ! మా అక్కతో అయితేనే చూస్తాను ''
ఖచ్చితంగా చెప్పేసాను .
బావగారు పోయాక పిల్లలే ప్రపంచంగా ఉన్న రాణి అక్క ,
''ఏమిటే నీ పిచ్చి , నాతొ చూడాలి అని ఆ సినిమా ''
నవ్వుతూ ప్రేమతో కసిరింది .
ఏమైనా సరే దంగల్ సినిమా అక్క తోనే చూడాలి .
ఈ రోజు మా విజయాల వెనుక మేము పడిన కష్ట సుఖాలు
ఆప్యాయంగా గుర్తుకు తెచ్చుకోవాలి .
ఎక్కడో రిలీజ్ అయిన సినిమా కోసం ఇంట్లో ఈయనను
నొప్పించి(ఒక చిన్న యుద్ధమే జరిగింది . ఫర్లేదు భార్యా భర్తలకు
చిన్ని తుంపర వర్షాలు అలవాటేగా సంసారంలో !)
మరీ 30 కిలోమీటర్లు ప్రయాణం వెళ్లాను .
థియేటర్ లోకి వెళ్ళేటపుడు చిన్న పశ్చాత్త్తాపం , తప్పు చేసానా !
రిజర్వ్ క్లాస్ లో ఒక్కరు కూడా లేరు మరి .
టైటిల్స్ చూడగానే తెలుగు .లో .
భలే హ్యాపీ . నేను హిందీ కి ప్రిపేర్ అయి వచ్చాను .
కుచ్ కుచ్ మాలూం హిందీ కదా , నేను .
కథ మహా వీర ఫో గెట్ గురించి . మల్ల యుద్ధం లో
నేషనల్ మెడల్ గెలుచుకున్న తాను ,తనకు కుమారుడు పుట్టి
వాడిని వరల్డ్ గోల్డ్ మెడల్ దేశానికి తెచ్చి పెట్టేలా
తీర్చి దిద్దాలి అనుకుంటాడు .
కానీ పాపం ! ప్రతి సారి కూతురే . అదీ నలుగురు .
ఆశ వదిలేసుకుంటాడు . కానీ పిల్లలు ఆకతాయిలను
కొట్టడం చూసి , పిల్లలకు మల్ల యుద్ధం నేర్పిద్దాము
అనుకుంటాడు . ఆడ అయితే / ఏమిటి మగ అయితే
ఏమిటి ? దేశానికి గోల్డ్ మెడల్ తేవాలి అనుకుంటాడు .
ఆడ పిల్లలు , మల్ల యుద్ధం , అదీ చిన్న నిక్కర్లు
వేసుకొని , అదీ ఆడ పిల్లలు వేస్ట్ అనుకునే రోజుల్లో ,
చిన్న పిల్లలకే చీపురు చేట ఇచ్చి నేర్పించి పెళ్లి
చేసి పంపిస్తే ఒక పీడా పోయింది అనుకొనే జనాల
మధ్య ,
మల్ల యుద్ధం చేస్తుంటే వాళ్ళ పట్టు పట్టే నైపుణ్యం కాక
షర్ట్ చినిగితే ఏమవుతుంది ,అని ఆసక్తిగా ఆడ పిల్లలను
చూసే వాళ్ళ మధ్య .
అసలు సాధన చెయ్యగలరా ఆడపిల్లలు ?
తల ఎత్తుకొని తిరగగలరా ?
నిలబడి బంగారు పతకం తెగలరా ?
తేగలరు , మహా వీర ఫోగెట్ లాంటి తండ్రి ఉంటే !
అబ్బో ఆడవాళ్ళతో గెలవడం ఏమి గొప్ప అనకుండా ,
చిన్నప్పటి నుండి మగ పిల్లలను కూడా గెలిచి
చూపిస్తారు . నేషనల్ పతకం సాధిస్తారు .
కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది .
ఇప్పుడు గీత కి టీనేజ్ . నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ లో
చేరుతుంది . అంటే తండ్రి ని వదిలి దూరంగా వెళ్లడం ,
ఇంకో కోచ్ దగ్గర ట్రైనింగ్ .
ఎంత చక్కగా చూపిస్తారో , కోచ్ అహం వర్సెస్
తండ్రిగా ఆశయం కల తండ్రిగా అమీర్ ఖాన్ తపన .
తన కూతురు తప్పు దారి పడకుండా , తప్పు ఆట
ఆడకుండా , అదీ ప్రపంచ స్థాయి యోథులతో పోటీ
పడేటప్పుడు ఎలా తండ్రిగా అండగా నిలబడతాడో
చూసి తీరాల్సిందే .
ఎలాగో మనకు గీత బంగారు పతకం తెస్తుంది అని
ముందే తెలుసు , అయినా టెన్షన్ గా చూసేట్లు
ఉంది స్క్రీన్ ప్లే . డైరెక్షన్ . (ఆదిత్య )
ముఖ్యంగా కూతురి ఫైనల్ మ్యాచ్ తండ్రిని చూడ నివ్వకుండా
బంధించి నప్పుడు , ఆ తండ్రి స్థానం లోకి మనం వెళ్లి
టెన్షన్ పడిపోతాము .
మన జాతీయ గీతం రాగానే పక్కన అక్క చెప్పేసింది ,
ఇది విని తెలుసుకుంటాడు తండ్రి తన కూతురు
గెలిచింది అని .
స్క్రీన్ ప్లే సూపర్ . కథ సాగ దీయకుండా గీత అన్న
చేత కథ చెప్పించడం , ఎందుకు మాకీ సాధన అని
బాధ పడే పిల్లలకి , చిన్న వయసులో పెళ్లి చేసుకుంటున్న
వాళ్ళ స్నేహితురాలు వాళ్ళ తండ్రి గొప్ప దనాన్ని
వివరించడం ,
అసలెందుకు ఒక్కో డైలాగ్ కి కళ్ళనీళ్లు తిరిగాయి .
డబ్బింగ్ లో ఇంట చక్కని డైలాగ్స్ కుదరడం ,వాహ్ !
పాటలు బాగున్నాయి కానీ , కథ లో మునిగి సరిగా
వినలేదు . ఇంకో సారి చూస్తేనే చెప్పగలను .
ప్రతి ఒక్కరు ఒక జీవితాన్ని మన ముందుకు అలాగే
తీసుకొచ్చారు . టీమ్ కి హాట్స్ ఆఫ్ !
తప్పక చూడాల్సిన సినిమా .
మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన మా అక్కకి బోలెడు తెలివి .
ప్రతీ సీన్ ముందే చెప్పేసింది . అక్క నా సోల్మెట్ కదా ,
నన్ను భలే అర్ధం చేసుకుంటుంది .
అక్కతో నవ్వు , ఏడుపు పంచుకుంటూ సినిమా చూడటం
చాలా బాగుంటుంది . ముఖ్యం గా ఈ సినిమా .....
అక్కడ తండ్రి ని గెలిపించి నట్లే , నేను, అక్క చదువుకొని
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ మా నాన్న ఆశయాన్ని
గెలిపించాము . అక్కడ తెర మీద నాకు అమీర్ ఖాన్
కళ్ళలో అందరికి సమాధానం చెప్పి గట్టిగా నిలబడి
మమ్మల్ని చదివించిన మా నాన్నే గుర్తుకు వచ్చాడు .
దగ్గర వాళ్ళు , దూరం వాళ్ళు ఎన్ని సంభందాలు
వచ్చినా ,ఆడ పిల్లలకు చదువు ఎందుకు అని
కామెంట్ చేసినా మా ప్రపంచం నుండి ఒక్క
అడుగు మేము ఉద్యోగాల వైపు వేసాము అంటే
అది మా అమ్మా , నాన్న సంకల్ప బలం .
తాంక్యూ అమ్మ , తాంక్యూ నాన్న .
మీకు పిల్లలుగా అదీ ఆడ పిల్లలుగా పుట్టినందుకు
వెనుక ఉండే అందరు ఆడపిల్లలకు చదువు
దారి ఏర్పరిచినందుకు గర్వం గా ఉంది .
@@@@@@@

గేట్ కీపర్ పెద్దాయన . మమ్మల్ని చూసి
''వెళ్లండమ్మా , ఇలాటి సినిమా ఇంక గూడూరికి రాదు .
చాలా బాగుంటుంది '' ఎన్నో సమస్యలు చూసి ఉంటాడు
జీవితం లో .
హమ్మయ్య మంచి సినిమాకి వచ్చాము . టైటిల్స్ చూడగానే తెలుగు .లో .

No comments:
Post a Comment