Friday 27 May 2011

సినిమా హాలు సిత్రాలు ....... చితక్కోట్టుడే ....

s.v.p.p
ఆ రోజు మిట్ట మధ్యాహ్నం .యెర్రని ఎండ.కాకులు 
కూడా కదలటంలేదు.అక్కడ ఆ సినిమా హాల్ దగ్గర ఒక ఘర్షణ .
టికెట్స్ ఇచ్చే అతను ఒక ఆమెను తిడుతున్నాడు
"పిల్లోడికి కూడా టికెట్ తీసుకుంటే రా లేక పోతే పో" అని ఒక్క సారి తోసాడు.
రోషంగా లేచింది.కళ్ళు ఎర్రగా మెరుస్తూంటే "రేయ్...నీలాంటి వాళ్ళ 
సంగతి చూడటానికి వస్తాడురా ...మా అన్న ...""అన్న......"
దిక్కులు కదిలి పోయేలా అరిచింది.
(రాత్రే వీర సినిమా చూసాను ఆ మత్తు దిగేదాకా మీరు ఇలా చదవాల్సిందే) 

ఉన్నట్లుండి ఊరంతా ఒకటి వ్యాపించింది 

 ( కలరా కాదు.మీరు ఇలా అడ్డు తగిలేతే కద చెప్పనంతే)
 
అది ఒక సంతోషకరమైన వార్త.వెంకటేసులన్న(మా నాన్న) సినిమా హాల్ ఓపెనింగ్ అని.
ఎవరు ఈ అన్న అంటారా?ఎవరిని చూస్తే అందరూ బ్లాక్ అయి...గ్రీన్ అయి...రెడ్ అయి....
దండాలు పెడతారో ఆయనే ఆ అన్న (ఊరికే అలా వ్రాశాను అరె దానికే తల కొట్టుకోవాల?)
ఊరందరికీ అది పండగ ...జాతర....ఇంకా ఏమేమో...............
మా నాన్న అందరికి ఒకటే మాట చెప్పాడు.
"పది మంది గా రండి.పది పది పెంచుకుంటూ రండి.అందరు ఒకే సారి రండి."
(వాళ్ళు అడిగారు టికెట్స్ కొనా?కొనకుండాన ?)
అలా....అలా.........సంతోషంగా కాలం గడిచిపోతుంది.
                   ఒక రోజు  
మా నాన్న పేద రాయుడులా మధ్యలో ఉంటె అటు ఇటు అందరు ఊళ్ళో 
వాళ్ళు నిలబడ్డారు.ఆడవాళ్ళకి చాల ధైర్యంగా ఉంది.అన్న మన పక్కనే 
మాట్లాడ తాడు అని."అన్న"అడిగారు.మా నాన్న మీసం దువ్వుకుంటూ 
అటు వైపు తిరిగాడు.(అలా అని మనం ఒక సీన్ ఊహించాము అన్న మాట)
"చెప్పమ్మా"అన్నాడు."అన్న ఉదయం ఆటలు మాకు వీలుగా లేవు
పని చేసుకొని రావాలంటే కష్టం గా ఉందివెంటనే మగవాళ్ళు అందుకున్నారు.
"కుదరదు.మా హీరో సినిమా కి తొమ్మిది గంటలాట ఉండాల్సిందే"
"ఆగండి....."పెద్దగా అరిచాడు మా నాన్న .
"ఇదే నే చెప్పా బోయే తీర్పు.ఇక నుండి రోజు పన్నెండు గంటలకే ఆడవాళ్ళూ పని చేసుకొని 
వచ్చాకే సినిమా.అది కూడా ఆ షో కి వాళ్ళు అడిగిన సినిమా వేస్తాను"అంతే ఆడవాళ్ళంతా 
వంగి వంగిదండాలు పెట్టారు.ఒకామె పాట మొదలు పెట్టింది...........
(ఏ పాటైతే మీకేందు కండి?మీ కవసరమా?
వచ్చామా.......చూసామా........నవ్వుకుంటూ వెళ్ళామా......అంతే )

      కోన సీమ కుర్రాడు 

ఒక సినిమా అని కాదు కాని సినిమా ఫీల్ అయి చూడాలంటే పల్లెలలోనే చూడాలా.
వాళ్ళ కామెంట్స్ ముందు జర్నలిస్ట్లు దేనికి పనికి వస్తారు?ఫైటింగ్ సీను వస్తే చూడాలి...
అరె...అరె ...ఏమి ఆవేశం.......చితగొట్టు ...నా.కొ........
అంటూ వీరంగం ఆడేస్తారు దానికి ఆడ ,మగ తేడా ఉండదు .....కొట్టు ..కొట్టు అని 
అరుపులు విజిల్స్....అంతే ..అది సినిమా అంటే ....అంతే గాని డబ్బులు ఇచ్చి 
నవ్వకుండా ,అరవకుండా భయంగా అలానా సినిమా చూసేది.వాళ్ళు కొట్టు ...కొట్టు..
అని అరిస్తే....మన ఇండియా టీం కూడా క్రికెట్ లో గెలిచేస్తుంది.అది ఆ ఉషారు.
(మనలో మాట ఎవరికి చెప్పకండి.నిన్న వీర సినిమా లో విలన్ కారుతో ఒకామె  మీద 
బురద చల్లుతాడు.తరువాత వీర వచ్చినాక ఆమె కాలితో విలన్ ని తంతుంది.నాకైతే కొట్టు...
చితక్కొట్టు.....అనాలనిపించింది.ఇంకేమి లేదు అరిచామనుకో .....మా వారు ఇంక
సినిమా అంటే.........జాన్తానై ..అంటారు.అంటే అర్ధం ఏందా?మీరే అర్ధం చేసుకోండి.)

వేలల్లో కొన్న బొమ్మ లక్షల్లో కలక్షన్ అంటే జనం ఎలా ఊగుంటారో చూస్కో?
                   
ఇక ఆడవాళ్ళ సినిమా వచ్చిందంటే మా నాన్న కు చేతి నిండా పని.ఆ సినిమా లోని 
దేవత బొమ్మ పెట్టాలా....పూజలు చేయించాలా....వచ్చిన వాళ్లకి కుంకుం పంచాల.....
ఇక ఆడవాళ్ళు పిల్లలను వరండా లో మా నాన్న దగ్గరే పడుకో బెట్టి వెళతారు.
వాళ్లకు కాపలా......ఎవరైనా లేస్తే లోపలి వెళ్లి ఎవరి పాపా చూస్కోండి అని అడగాల......
ఓఓఓఓఓహ్ ........ఇన్ని పనులండి......ఇవి కాక ఇంకో పని ఉందండి.దానికి మేము 
కూడా సాయం చేస్తాము.

అది ఏందంటే అమ్మవార్ల సినిమాలలో ఫైనల్ పాట వస్తే ఆ శబ్దాలకి ఆడవాళ్ళకి 
పూనకాలు  వస్తాయి.అప్పుడు మనం రెడి గా బకెట్లు...బకెట్లు.......పసుపు నీళ్ళు 
కలుకొని ఉండాలా.పూనకం వస్తే బయటకు తీసుకు రావటం నీళ్ళు పోయటం.
ఏందీ......అంత ఉత్తిదా.......కళ్ళు పోతాయి ,చెంపలేసుకోండి.మేము కూడా 
డిస్త్రిబ్యుటార్ ని అదే అడిగాము "మీరేమైనా డబ్బులు ఇచ్చి పూనకాలు తెప్పిస్తారా ?"
అని.ఆయన దానికి మీకే తెలుస్తుంది చూడండి .రంగు పడుద్ది అన్నాడు.
(పడిందా.....అని అడుగుతున్నారా?పడింది బాబూ పసుపు రంగు...............)
దెబ్బకి సినిమా ఆడవాళ్ళు సంవత్చరం ఆడించారు అంటే చూస్కోండి
(మాకు వదిలింది పసుపు)

చిన్న కాలేజి సంగతి చెపుతాను.డిగ్రీ లో mpc లో క్లాసు అంతటికి ఇద్దరమే ఆడపిల్లలము.
కెమిస్ట్రీ సార్ చాల స్ట్రిక్ట్.పర్మిషన్ లేకుండా ఎగగోడితే practicals కి రానివ్వడు.నా ఫ్రెండ్
పుట్టినరోజు కాబట్టి సినిమా కి వెళ్ళాలని పర్మిషన్ అడిగాము.
గట్టి కారణం లేనిదే శెలవు ఇవ్వను అన్నాడు.
 సరే అనుకోని లీవ్ లెటర్ వ్రాసి ఆయనకు ఇచ్చి బయటకు వచ్చాము.అంతే ధబ్ .......అని
 పెద్ద శబ్దం......దాన్ని అనుసరిస్తూ కెవ్వు మని కేక..............
 కారణం ఏమిటి అంటారా?
 మేము జ్వరంతో లేవలేని స్థితిలో ఉన్నాము కాబట్టి.......సినిమా కి వెళ్ళుటకు పర్మిషన్
 ఇవ్వగలరు అని వ్రాసాము.(అలా ఎందుకు వ్రాసారంటార?అబద్దం  వ్రాయకూడదని)
 అక్కడ మొదలు పెట్టిన పరుగు సినిమా హాల్ దాక ఆపలేదు.
 తర్వాత.......తర్వాత.......ఏమిటి అంటారా..........ఏమి లేదు.........
 నాకు పెళ్లి అయిపాయింది.ఇక్కడ చిన్న సంగతి.

 
 ఇంటికి అల్లుడు రాగానే మా నాన్న అల్లుడుగారు సినిమా వేసారు.
 fullcollections.అయితే ఆ గొప్పదనం మోహన్ బాబు ది కాదంటా.
మా వారి దంట అందరు చెప్పేశారు (హలో ఎవరు మోహన్ బాబు కి ఈ సంగతి చెప్పకండి)
ఇంకే మి సిత్రాలు అంటారా?
ఇంకేమి లేవండి .పెళ్లి అయిపొయింది కద.అప్పుడు ...అప్పుడు....వచ్చి 
హాలులో కూర్చొని చిన్న నాటి స్మృతులు గుండెలనిండా పీల్చుకొని 
వెళ్లి పోతాను.(హలో ఇంకా ఇక్కడే ఉన్నారా?ఏదో ఒక సినిమా కి వెళ్లి 
చితక కొట్టేయండి.)



2 comments:

రాజ్యలక్ష్మి.N said...

"బకెట్లు...బకెట్లు.......పసుపు నీళ్ళు
కలుకొని ఉండాలా."

మీ సినిమాహాల్ సినిమా కష్టాలు..
చిన్ననాటి సినిమా స్మృతులు అన్నీ బాగున్నాయండీ...

శశి కళ said...

mari meekokkarike naa kastaalu ardam ayyayi.thanks raaji gaaru.