Sunday, 27 November 2011

బాపు...బాపు...అనే హృదయ మందిరం

బాపు..బాపు అనే హృదయ మందిరం
చూసి తీరాలని ఉండే రామ రాజ్యము....



అబ్బ బాపు గారంట....రామ రాజ్యమంట....
చూడాల్సిందేనని మనసు కి ఒకటే ఆరాటం....

అన్ని రోజులు హాస్పిటల్ లో సిలైన్ చుక్కల్లో క్షణాలు 
లెక్క పెట్టుకొన్నాను......ఎప్పుడెప్పుడు హాస్పిటల్ నుండి 
వచ్చేస్తానా అని....మరి బుద్దిగా సిలైన్ పెట్టించుకొని ,
ఇంజేక్షన్స్ వేయించుకుంటే తీసుకొని వెళతాను 
సినిమాకి అన్నారు ఈయన....


(పెద్ద జబ్బేమి లేదండి...ఏదో వాటర్ పొల్యుషన్....
నా బాధ మీకేవరికి రాకుండా వర్షాలు 
వెళ్ళే దాక నీళ్ళు కాచి తాగండి)

ఇంతా జరిగి వెళ్లి చూస్తె.....ప్చ్...అసలు రామ...రామ...
పాట యెంత బాగుంటుందో అని ఎదురు చూసాను....
కనీసం అందమైన పిల్ల వాడిని కూడా పెట్ట లేదు.....

అసలు బాపు గారు ఎలా తీయాలి అనేది బొమ్మ గీసి 
తన వ్యూ చూపిస్తారట.....మరి గ్రాపిక్స్ ఆయన వ్యూని
మింగేసాయో ఏమో.....అసలు ఈ టీవీ భాగవతం నా కళ్ళ
ముందు ఇంకా మెదులుతూనే ఉంది.ఇదైతే ఒక దృశ్య 
కావ్యం అవుతుందనుకున్నాను.



 అసలు సముద్రం దగ్గర వాళ్ళం ...మాకు అభిమానం వస్తే 
తాడెత్తు అల తలమునకలుగా ముంచి నట్లే ఉంటుంది...
యెంత పొగుడుతూ రాద్దామని అనుకొన్నాను.పోనీలే 
రమణ గారు వెళ్ళిపోయినా .....ఆయన బుడుగుగా జన్మించే
వరకు ఈయన లోటు తీరుస్తాడు అనుకొన్నాను.......

బాల కృష్ణను గూర్చి ఏమి చెప్పను...మళ్ళ అన్నగారు 
పై నుండి బాధపడుతారు....కాక పొతే డైలాగులు నాలిక 
పై నుండి కాకుండా వాళ్ళ నాన్నలా చెప్పి ఉంటె బాగుండేది.


నయన తారలో కను బొమ్మలు పెద్దగా గీసి,ఐ లాషేస్ పెట్టి,
కుంకుం పెట్టి బాపు గారు కాబట్టి సీతాదేవిని పట్టుకు రాగలిగారు.
అసలు ఆ కళ్ళలో దయ,బేలతనం ఉండాలి....కాని ఆమె 
కళ్ళలో ఆత్మా విశ్వాసం కనిపిస్తూ ఉంటుంది....అసలు సీతమ్మ
"నను బ్రోవమని" వచ్చేవారిని కరుణతో ఆదరించేలా ఉండాలి.

సత్య భామ కళ్ళు వేరు,సీతమ్మ కళ్ళు వేరు.భామ అంటే 
ధనువు పట్టినా,తనువు ముట్టినా అంతే....ఆ కళ్ళు చూస్తె
నే ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంటుంది.సరేలెండి ...బాగుంది.


స్క్రీన్ ప్లే అసలు పాత సినిమా చూసి చేసినా సరిపోయేది.
అనవసరమైన గ్రాపిక్స్ కి ఇచ్చేసారు టైం అంతా.సీత రాముల 
మమతలకు సరిపోనే లేదు.అసలు పాత దానిలో ఇంత సినిమా 
చూపి హాస్యానికి కూడా ఒక ట్రాక్ చూపారు.ఇక్కడ ఏమి 
లేదు.
లవ కుశులు బాగున్నారు.రాజ మందిరం లో పాడిన పాట 
చాలా బాగుంది.ఇప్పటి మ్యూజిక్ లో ఇంకా బాగా మంచి 
పాటలు చేసి ఉండ వచ్చు.

సరే లెండి ఈ కాలంలో రాముడేందుకు?
అనుకొనే వాళ్ళు ఉన్న సమయం లో సాయిబాబా గారి 
ప్రయత్నం అభినందనీయం.


అప్పటికి ఇప్పటికి ఏమి మారింది...కాలం....ఎప్పటికి 
ఆడవారు నిందలకు గురి కావలసిందే....తామే 
నిరూపించుకోవాల్సిందే.......నయం ఆమె తిరిగి 
అయోధ్యకి రాకుండా భూమి లోకి వెళ్లి మంచి పని 
చేసింది....మొదటి సారి నింద పడినా బిడ్డల కోసం 
బతికింది....ఇంకో సారి నింద పడుంటే ఇంకెలా బతికున్ను 
పా....పం.

రాముడు ఉన్నాడో లేడో....కాని మనిషి బ్రతకటానికి 
ఒక పద్దతి కావాలి......మీటర్ని కొలవటానికి ఒక కొలతను 
మ్యూజియం లో ఉంచినట్లు.......

అసలు మనిషి ఇలా ఉండాలి అనుకోటానికి ,ఆలు మగలు 
పక్కన ఉన్నప్పుడే కాదు దూరంగా ఉన్నప్పుడు కూడా 
మనసులు ఒకటిగా ఉండాలి అనుకోటానికి ఆదర్శంగా 
రాముడి తరువాత ఎవరు ఆంటే చెప్పలేక పోతున్నారు.


మన వాళ్ళు ఇచ్చిన రాముడిని కూడా "రాజు గా తన 
ధర్మాన్ని నిర్వర్తించటానికి సీతని అడవులకు పంపాడు 
కాని భార్యగా తన మనసు నుండి దూరం చేయ లేదు"
అని గట్టిగా చెప్పలేక పొతే .....మీ పిల్లలకు ఇలా బతకాలి 
మనిషి... అందరి కోసం ...స్వ సుఖాలు చూసుకోకుండా 
అని ఎవరిని చూపుతారు?


హూ......సరే మొత్తానికి పాత లవ కుశ ఎప్పటికి గొప్పదే 
అని నిరూపించారు.............

14 comments:

శేఖర్ (Sekhar) said...

:)

సిరిసిరిమువ్వ said...

:)

సుభ/subha said...

ఎన్నో రివ్యూలు చదివా కానీ నాకెందుకో మీది నచ్చింది. నిజం కొంచం నిష్ఠూరంగానే ఉంటుంది కదండీ ఎంతైనా.

PALERU said...

శశికళ గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారు? ప్రశాంతంగా హాస్పిటల్ నుండి వచ్చి రెస్ట్ తీసుకోకుండా ఈ ప్రయోగాలు ఎందుకు?

రాముడు ఉన్నాడో లేడో....కాని మనిషి బ్రతకటానికి
ఒక పద్దతి కావాలి......మీటర్ని కొలవటానికి ఒక కొలతను
మ్యూజియం లో ఉంచినట్లు.......

ఇది నిజం ......చాలా బాగా చెప్పారు .... నీను కూడా మీలాగే మంచి మంచి రచనలు చేయాలనీ ఆశీర్వదించండి శశికళ గారు..

మీ శ్రేయోభిలాషి,
RAAFSUN

వనజ తాతినేని/VanajaTatineni said...

Different view.. I like it..Shasi gaaru. inkaa nenu chooda ledu..choosi vasthaanu.tharvaata cheputhaanu.

ఆ.సౌమ్య said...

సీతలోని ఆత్మాభిమానం చిత్రించడమే బాపు గారు చేసిన కొత్త పనండీ...అది నాకు నచ్చింది. ఎందుకు ఎప్పూడూ బేలతనమే ఉండాలి?

బులుసు సుబ్రహ్మణ్యం said...

చాలా బాగుంది మీ రివ్యూ. నేను ఇంకా చూడలేదు.నేను హాల్ కెళ్ళి చూసి 30 యియర్స్ అయింది. వ్రత భంగం చేద్దామా అనుకున్నాను. కానీ ఇంకో నెల రోజులు ఆడితే అప్పుడు ఆలోచించ వచ్చు అనిపిస్తోంది మీ రివ్యూ చూసిన తరువాత.

>>> బాల కృష్ణను గూర్చి ఏమి చెప్పను...మళ్ళ అన్నగారు
పై నుండి బాధపడుతారు....కాక పొతే డైలాగులు నాలిక
పై నుండి కాకుండా వాళ్ళ నాన్నలా చెప్పి ఉంటె బాగుండేది.

ఈ కామెంటు నన్ను మళ్ళీ ఆలోచింప చేసింది అన్నమాట. దహా.

మీ ఆరోగ్యం ఇప్పుడు బాగుందని అనుకుంటాను.

Anonymous said...

meekevvari kaina gurram praveen sharma kanipinchaaraa, vaaru ee madhya comments raayaltedu.

Unknown said...

Akka! Review బావుంది.
రాముడు ఉన్నాడో లేడో....కాని మనిషి బ్రతకటానికి
ఒక పద్దతి కావాలి.
నిజ్జం చెప్పారు.

శశి కళ said...

శెఖర్ గారు,సిరి సిరి మువ్వ గారు,సుభ గారు
థాంక్యు.

@రాఫ్సన్ గారు మీకు ఇద్దరు మంచి గురువుల పెర్లు
చెపుతాను వాళ్ళ ను కలవండి.రాజ్ కుమార్,హరె క్రిష్ణ
అనబడు ఆండీ.....ఇక మీకు తిరుగె ఉండదు.

శశి కళ said...

వనజ గారు,థాంక్యు.

సౌమ్య...మీరు చెప్పింది నిజమె...అసలు బాపుగారికి
నెను వీర అభిమానిని.ఆయన ప్రయొగాలన్ని స్వాగతిస్తూ ఉంటాను.
సొగసు చూడ తరమా అంటూ..రాజెంద్ర ప్రసాద్ గారితొ
యెదురు చూపులు చూపించినా...ప్రెమలొ అలా జరిగిపొతుందని...ఆమని అలిసిపొయినా యెమి అనరని
అర్ధం చెసుకున్నా....కాని సీతమ్మ...సీతమ్మ తల్లి
కదా...యెందుకొ జీర్ణించుకొలెదు.

శశి కళ said...

బులుసు గారు,మీ లాంటీ పెద్దల ఆశీశ్శుల వలన
బాగానె ఉన్నాను.
సినిమా కి వెళ్ళండి...మనం మంచి సినిమాలు కొరుకుంటూన్నామని వాళ్ళకి తెలియాలి కదా...

శైలూ....థాంక్యు.పాపం మా పాప రాముడి తరువాత
నాన్న ఉన్నాడు కదమ్మా అనింది.
నెను చెప్పాను...రాముని లాగ రాజధర్మం కొసం నాన్న
నన్ను వదులుకొలెడు...దానికి ప్రజల మీద చాలా ప్రెమ ఉండాలి అని చెప్పాను.
ఈ రొజుల్లొ యెవరు ఉన్నారు నాయకులు అలాగా..

Prakash Pasupuleti said...

Mee 2 points ki nenu oppukonandi.
1. nayanatara seethammavari ga chala chakkaga undi.
2.ilayaraja music. songs vini tarvatha movie chusaa. visual ga songs chedagottaru ganee lekapote songs adhbhutam. anduke i believe ilayaraja is god.
lyrics ni visual ga chupiinchi graphics lekunda, child artists and balakrishna lu kakunda vere artists tho movie tesunte khachitamga movie master piece ayedi. idasalu BAPU movie lane ledu.
aina aa potta tho ramulavarila cheyadaniki bala krishana gariki manasu yela oppindo. tandrila god characters veyalanukunte saripodu, anduku taggatlu thananu thanu teerchukovali.

my dream combination is
nayanatara- seethamma
sr. ntr- ramulavaru
old lava kusa child artists -as lava kusa.
ilayaraja music
bapu direction with out graphics.
wowww.... talchukuntene adhbhutamga undi.

శశి కళ said...

thankyou prakash garu . happy to see another bapu fan .