విశ్వాసమే సాధనకు పరిపక్వత నిస్తుంది.
దత్త చరిత్రలో దంపతులు స్వామి చెప్పినట్లు ఎండిన కొమ్మకు
నమ్మకం తో నీళ్ళు పోస్తే అది చిగుర్చటం
చూస్తాము.
గురువు యందు గురి ఉంటేనే లక్ష్యాన్ని తొందరగా చేరుకోగలము.
మరి బారతీయులు గురువును ఆశ్రయించుటలో
ప్రధాన లక్ష్యం ఏమిటి?విశ్వవ్యాపితమై నిర్గుణ రూపంగా
విలసిల్లుచున్న పరబ్రహ్మ ను చూడటమే.
"అసతోమ సద్గమయా"సత్యం వైపు నడిపించు.
గురువు దారి చూపేవాడు.ఆ దారిలో సాధన చేయటమే
సత్యాన్ని తెలుసుకోవటమే వారికి ఇవ్వగల గౌరవం .
సత్యాన్ని మరచి,సాధన మరచి తనను కొలవమని
ఏ గురువు కోరాడు.గురువు కూడా సహా సాధకుడే.
నేర్చుకోవాలే కాని ప్రక్రుతి లోని ప్రతీది చెట్టు,నది,
పురుగు,జంతువూ,గాలి ,మన పక్కన వారు ఏదో
ఒక విషయం నేర్పిస్తారు.ప్రతి వారి లోని పరమాత్మ
ను గౌరవించమని చెప్పటమే దత్తాత్రేయ,సాయిబాబా
వివిధ అవతారాలలో కనపడిన ఉద్దేశ్యం.
గురువులు,మతాలూ అన్నీ లోపల బియ్యపుగింజ
ఏర్పడటానికి సహకరించే పైన ఉన్న పొట్టు లాంటివి.
మనలో సత్యావిష్కరణ జరిగిన తరువాత మనము
ఉండము ,అవీ ఉండవు.
"అఖండ మండలాకారం వ్యాప్తంచేన చరాచరం"
ఏ సత్యం కోసం ఇన్ని దారులు నిర్మింప బడినాయో
ఆ సత్యాన్ని విస్మరించి ఈ దారులు గొప్పదనాన్ని
గూర్చి వాదులాడుకోవటం మన సాధనకు ఉపయోగ పడదు.
శిష్యుడు సాధనతో పరిపక్వత చెందినపుడు తదుపరి
మార్గం వైపు మార్గదర్శనం చేయటానికి గురువు వచ్చే తీరాలి.
కాని గురువు ఏదో ఆకాశ మార్గం లో వస్తాడు అనుకోవటం
భ్రమ.మన లాంటి మనుషులు లాగానే కనిపిస్తాడు.
ఇవ్వాల్సిన సందేశం పంపిస్తాడు.
ఇహ లోక సుఖాల బావి నుండి మనను బయట పడవేసి
అనంత విశ్వాన్ని ,సత్యాన్ని చూపే తాడు లాంటి వాడు
గురువు.ఆ తాడుకి దూరంగా జరిగి ఆ సత్యాన్ని
తెలుసుకోవటమే మనం ఆయనకీ ఇవ్వగల గౌరవం.
"అజ్ఞాన తిమిరాన్ధస్యజ్ఞానంజన శలాకయా
చక్షురున్మేని తంఎన తస్మైశ్రీ గురువేన్నమః "
జ్ఞాన మనే కాటుక కనులకు పూసి అజ్ఞానమనే
చీకటిని తొలగించు వాడే గురువు.అలాంటి గురుపరంపరను
తనలో కలిగి ఎందరినో జ్ఞానవంతులు చేస్తున్న
భారతమాత వడిలో జన్మించినందుకు మనం ఎంతో
అదృష్టవంతులం.
5 comments:
అఖండమండలాకారం వ్యాప్తం చేన చరాచరం
తత్పదం దర్షితం ఏన తస్మై శ్రీ గురవేనమ:
ఈ శ్లోకానికి ఒకసారి చాగంటి వారు అద్భుతమైన అర్థాలు చెప్పారు..
1. చరాచర సృష్టిలో ప్రతీ అంగుళం లో ప్రతీ కణం లో ఉన్న భగవంతుడిని దర్శించడానికి మనకు గురువు మార్గ నిర్దేశం అవసరం..this is on a spiritual side
2. On a material space, ఈ ప్రపంచం లో ప్రతీ వస్తువు/ప్రాణి నుంచీ నేర్చుకోవాల్సినది ఉంది.. అలా నేర్చుకునే విధంగా మనల్ని తయారు చేసే గురువుకు నమస్సులు..
నాకు చాగంటి వారి discourses లో ఇది చాలా నచ్చుతుంది.. మీ టపా వల్ల మరోసారి గుర్తు చేసుకోగలిగాను.. నెనర్లు..
-కార్తీక్
బాగుంది. మంచి విష్యాలు చెప్పారండీ.
thank u raj ,kaarteek gaaru
పొద్దున్నే,,,,,,ఈ టపా...చదవంగానే భలే అనిపించిది శశి గారు..:)
ఓ సారి గురు చరిత్ర సాయి చరిత్ర కళ్ళ ముందు కనపడ్డాయి :)
karthik - good points..thanks fr sharing :)
గురు దత్తాత్రేయ నమః
Post a Comment