Monday, 5 December 2011

నెమలీక....నవ్వు "లీక్"

అందరికి మా బాబు పుట్టిన రోజుకి ఆశీస్సులు 
ఇచ్చినందుకు థాంకులు...............



దానికి ప్రతిగా ఈ నవ్వు "లీక్స్"
అంటే ఏమి లేదులే.....తూచ్.......


మరి నేమ్లీక ఏమిటి అంటారా....కొంచం మంచు లచ్మి 
స్టైల్ లో కాకర కాయ లాగా కమ్మగా మాట్లాడుదామని......


మా పెళ్లి  ఎలా అయింది అప్పుడప్పుడు నేను 
మా వారు చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటాము
అవన్నమాట.....


(ఏమిటి మీ వారు నవ్వుతారా?ఏడుస్తారా?అని 
.....ఎక్కడో ......)


ఇప్పటికే మిమ్మల్ని రెండు నెమలీకలు ఇచ్చాను .....
గుర్తున్నాయా?మళ్ళీ ...ఒ...సారి వాయొలెన్స్


ముందుంది ముసళ్ళ పండగ



అప్పుడు నేను అప్పుడే బి.ఇడి పరీక్షలు వ్రాసాను అన్న మాట.
మా నాన్న వాళ్ళు నలుగురు అన్నదమ్ములు .మా నాన్న 
రెండో వారు.వాళ్ళు అందరు కలిసి నాకు సంభందం చూడాలని 
గూడూరు లో మా మామ ఒకాయన ఉంటె ఆయన దగ్గరికి వెళ్ళారు.


ఆయన మీ అమ్మాయి బాగా చదువుకుంది(అప్పట్లో అదే గొప్ప)
మీకు చెన్నూరు లో ఒక అబ్బాయిని చూపిస్తాను.ఆ అబ్బాయి 
కూడా ఇప్పుడే బి.ఇడి వ్రాసిఉన్నాడు
(మరి ఈయనగారు ఇంజనీరింగ్ కోసం కొన్నేళ్ళు 
వేస్ట్ చేసి నా క్లాస్ మేట్ అయిపోయారు,వేరే 
కాలేజ్ లెండి)అని చేన్నూరికి తీసుకుని వెళ్ళారు.


అక్కడ వీళ్ళ ఇంటికి కాకుండా మా భందువుల ఇంటికి వెళ్లి , 
మొదటవీళ్ళకి  చెప్పి పంపారు.అప్పుడు ఈయన టెన్త్ మాథ్స్
 ట్యూషన్ చెప్పేవారు.డిగ్రీ చదివేటప్పుడు నుండి చెప్పేవారు.
ఈయన ఉంటె మాథ్స్ ఎవరు ఫెయిల్ అవరని నమ్మకం.


మా భందువుల అమ్మాయి ఈయన దగ్గరే ట్యూషన్.
ఈ అమ్మాయి ట్యూషన్ కి వెళ్లి "ఈ రోజు సురేష్ సార్ పూర్తిగా 
చెప్పకుండానే వెళ్ళిపోతారు చూడండి "అని చెప్పిందంట.
(ఇవన్ని నాకు పెళ్లి అయినాక తెలిసాయి)


మా వారు ఏమోలే అనుకోని ప్రాబ్లం చెపుతూ ఉన్నారు.
ఇంతలో వాళ్ళ తమ్ముడు వచ్చి "అమ్మా వాళ్ళు పిలుస్తున్నారు"
అని తీసుకెళ్ళి పోయాడు.


అక్కడ మా వాళ్ళు కూర్చుని ఉన్నారు.పాపం ఈయన 
బలికి సిద్దమైన మేకలా బుద్దిగా కూర్చుని అడిగిన సమాధానాలు 
అన్నీ చెప్పారు.


అక్కడ మా వాళ్ళు ఈయన సమాధానాలకి ఫ్లాట్ అయిపోయారు.
మా చిన్న బాబాయికి అయితే బోల్డంత నచ్చేసారు ఈయన.
మా బాబాయి ,పిన్ని నన్ను సొంత బిడ్డలాగా చూసుకొనే వారు.


(మా నాయనమ్మకి నలుగురు అబ్బాయిలు,నలుగురు 
అమ్మాయిలు ...మా పెదనాన్న పెళ్ళికి మా చిన్న బాబాయి 
వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతున్నాడు.అంత గ్యాప్.
అందుకని మా బాబాయి,పిన్నమ్మ లకు మాకు అంత తేడా 
ఉండేది కాదు.ఫ్రెండ్స్ లాగే ఉండే వాళ్ళు)


మా బాబాయి"శశికి సురేషే సరిపోతాడు"అని గట్టిగా 
చెప్పేశారు.(పాపం మా వారి మీద హెంత నమ్మకమో 
మొండి రాక్షసి తో వేగ గలడని)


అలా మా వాళ్ళు మా పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయారు.


మరి మా వారి సంగతేమీటి అంటారా?


పాపం ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి చేసుకోవాలని ఆయనకు లేదు.
మరి వాళ్ళు ఈయనను ఎలా ఫిక్స్ చేసారో ఇంకో సారి చెపుతాను.


పెళ్లి శుభ లేఖ చూసి  అందరు అమ్మాయి కూడా నీ చదువే 
లవ్ మ్యారేజ్ నా?.....అంటే పెళ్లి పీటల మీద చూడండి 
కాదని తెలుసుకుంటారు అనేసారంట.........


marriages are made in heaven ....నమ్ముతారా మరి....
ఎవరు నమ్మినా నమ్మక పోయినా ఒకరు ఖచ్చితంగా 
నమ్మారు.


ఆ వ్యక్తీ ఎవరంటే ఇంకెవరు......మా వారు......

12 comments:

ఆ.సౌమ్య said...

"అంటే పెళ్లి పీటల మీద చూడండి
కాదని తెలుసుకుంటారు అనేసారంట.."

"ఆ వ్యక్తీ ఎవరంటే ఇంకెవరు......మా వారు......"


హహహ్హహ....మీరిలాగే ఎప్పుడూ హాయిగా ఉండాలి!

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

హాహా.... బాగుందండి నెమలీక నవ్వు లీక్...

marriages are made in heaven ....నమ్ముతారా మరి.... ఎవరు నమ్మినా నమ్మక పోయినా ఒకరు ఖచ్చితంగా నమ్మారు.

పెళ్ళి చేసుకున్నాక ఇలా నమ్మితేనే సర్దుకుపోగలమని నమ్ముతున్నారో ఏమో ;-)

Anonymous said...

ఈ నెమలీక చాలా చిన్నదిగా ఉంది.మా కొసం మరిన్ని పంపరు.

Anonymous said...

ఈ నెమలీక చాలా చిన్నదిగా ఉంది.
మా కోసం మరిన్ని పంపరు.
మీ దగ్గర ఉన్న నెమలి ఎప్పటికి ఇలానే
మరిన్ని అందమైన నెమలీకలు ఇవ్వాలని కోరుకుంటూ...........

శశి కళ said...

@సౌమ్య గారు....థాంకులు

@అవినెని గారు....meeru same to maa vaaraa
yemiti?ala confirmgaa cheppestunnaaru.....)))))))))))

అదంతా యెమి లెదు.బి.ఇ.డి కాలెజ్
పక్క కాలెజ్ పిల్ల ....
అప్పుడైతె నచ్చనే లెదు
ఇపుడైతె మర్చిపోలెను....అంటారు

శశి కళ said...

అనానమస్ గారు....అలాగె ఇస్తాను....ప్రెమ కధ కాక
పొతెనె ఇంత బాగా చదువుతుంటె...యెన్దుకు ఇవ్వను..
మీ పెరు వ్రాసుంటె బాగుండెది...థాంక్యు

జయ said...

చాలా బాగుంది. మరి మీవారు సరిగ్గా వేగుతున్నారా!!! అదేనండి మీ తోటి:)

జ్యోతిర్మయి said...

"మా బాబాయి"శశికి సురేషే సరిపోతాడు"అని గట్టిగా
చెప్పేశారు.(పాపం మా వారి మీద హెంత నమ్మకమో
మొండి రాక్షసి తో వేగ గలడని)"

హహహ..

రాజ్ కుమార్ said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్...మీరు మొండి రాక్షసా? హహహహ

నెమలీక-నవ్వులీకా? హిహిహిహి

రసజ్ఞ said...

marriages are made in heaven ....నమ్ముతారా మరి.... ఇంకా తెలియదు కాని matches are made in sivakaasi అని మాత్రం నమ్ముతాను. బాగున్నాయి మీ నెమలీకలు.

Unknown said...

పాపం ఈయన
బలికి సిద్దమైన మేకలా బుద్దిగా కూర్చుని అడిగిన సమాధానాలు
అన్నీ చెప్పారు.
(పాపం మా వారి మీద హెంత నమ్మకమో
మొండి రాక్షసి తో వేగ గలడని)
అక్క అన్ని ఇలా నిజాలు చెప్పేస్తే ఎలా ?
మీ పోస్ట్ మాత్రం సూపర్ ...చాలా బావుంది
మీ పెళ్లి చూపుల్లో మేము ప్రక్కనుంచి బావగారు బలికి సిద్ధం అవడం చూస్తున్నట్టు ఉంది.
మిగతాది త్వరగా పూర్తీ చేయండి.

శశి కళ said...

jaya gaaru,jyothirmayee gaaru thanku



raaj,rasajna...)))))))))))))


sailoooooooo......nee anta baagaa
feel avutooo raayalenu...thank u