ఇంకో సారి వయోలేన్సు వాయించాలని పించింది.
నా పెళ్ళైన కొత్తల్లో సంగతి.
నా పెళ్ళైన కొత్తల్లో సంగతి.
పెళ్లి అయిన తరువాత మా ఇంటికి మా వారు వచ్చి నపుడునేను వయోలిన్ నేర్చుకోన్నానని తెలిసింది.
ఒక సారి వాయించవా?అని అడిగారు
(ఖర్మ అలా అడిగించింది)
సరే అని వేరేవాళ్ళ ఇంట్లో వయోలిన్ ఉంటె తెప్పించి
మొదలు పెట్టాను.
(ఎలాగయినా శబాష్ అనిపించుకొని వయోలిన్
కొనిపించు కోవాలని అనుకున్నాను )
ఇద్దరం శ్రద్ధగా కూర్చున్న తరువాత మొదలు పెట్టాను.
మొదట మోహన రాగం అయితే నచ్చుతుంది అందరికి అని
మొదలు పెట్టాను.గ గ పా పా ....దప సా సా....వర వీణ ...మృదు పాణి ...వనరుహలో ..చను రాణి.....
పాట అయిపోయినా అయన మొహం లో ఫీలింగ్స్ లేవు
(ఆయనకు సంగీతం గూర్చి ఏమి తెలీదని అప్పుడు తెలిసింది)
అర్ధం అయితే వాయించటమే గొప్ప ఇక ఏమి రాని వాళ్లకి అర్ధం కావాలంటే ...దేముడా ఏమిటే ఈ అగ్ని పరీక్ష ?
కల్యాణి వాయించాను.పేస్ లో ఏమి మార్పు లేదు.
భైరవి ...ఊహు ........బ్రోచేవారెవరురా ?...........
ఊహు.......ఎవరు వచ్చి బ్రోవలేదు...............
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి ..........ఊహు.......
ఆమె కూడా రాలే.....
(ఇక్కడ వయోలిన్ కొనీడని మనకు టెన్షన్ )
నన్ను బ్రోవ నీకు భారమా?నీదు స్మరణ గాక వేరే ఎరుగను.......ఊహు.......ఏమిటి దారి?
రోషం వచ్చేస్తుంది,రాగాలకి ఇల్లు కదిలి పోతుంది ఈన గారి మనసు మాత్రం కరగలేదు.
ఒక చిన్న ఉపాయం వచ్చింది.ఎస్ అలాగే చేయాలి అనుకొన్నాను.సినిమా పాటలు వాయిస్తే
ఎలా ఉంటది అనుకోని దేవుడికి దండం పెట్టుకొని
(పనిలో పని కొబ్బరికాయ లంచం ఇస్తానని అనుకొన్నాను)
ఉపాయం బాగుంది కాని నాకేమి సినిమా పాటలు రావు.
ఒక అక్క ముద్దుగా నాకు ఒక పాట నేర్పించింది.
అదేమిటి అంటే "చూడు పిన్నమ్మ పాడు పిల్లడు.......పాట"
వాయించబోయి ఒక్క క్షణం ఆలోచించాను.
బుద్ధి ఉండే వాళ్ళు ఎవరైనా ఆ పాట వాయిస్తే
వయోలిన్ కొనివ్వరు అని నా బుద్ధి ఆపేసింది.
ఏమిటి దారి?
సమస్య మళ్ళా మొదలు?సరే మిస్సమ్మ లో పాట
"సా ని స రి మా ...రీ ని సా సా....
మాకు మేమే మీకు మీరే .....పాట మొదలెట్ట పోయాను.
(మళ్ళా బుద్ధి ఒక్క చరుపు చరిచింది.కొత్త పెళ్లి కొడుకు ఆ పాట పాడితే పారి పోతాడని)
అయ్య..........urekhaa ...........ఒక పాట గుర్తు కు వచ్చింది.
అందరికి తెలిసిన పాట.
దొరికిందే చాలని వాయించాను.ఏమిటంటే జనగణమన........
కద అయిపోలేదండి.అక్కడే మొదలు అయింది.
మద్యహ్ననికల్ల రాజీవ్ గాంధి చనిపోయారు.
వారం రోజులు టివి లో,రేడియో లో
నేనేదో రాజీవ్ గాంధి ని చంపినట్టు ఇంత వరకు వయోలిన్ కొనిలేదు .
26 comments:
ఏం చేస్తామండి? ఒకరు రసజ్ఞులైతే ఇంకొకరు కారు ఏ జంటలోనూ...:((
మళ్ళీ వయొలెన్సాఆఆఆఆ... ;)
మీ వయొలెన్స్ కి గురికాబడ్డ ప్రాణికి నా తరుపున శుభాకాంక్షలు తెలియజేయుడీ..హహహ్
:)))
"వయొలేన్సు" (violence) అని చూసి, వయొలిన్ బదులు తప్పుగా రాసారేమోనుకున్నా. అంతా చదివాక తెలిసింది...
haha :)))
bavundi post :)
మీరు పెళ్ళయి ఇరవై ఏళ్ళ 'వయో' వృద్ధులైన కూడా , మీ 'లెన్సు' మరీ షార్ప్ అండీ! అంత ఖచ్చితం గా అన్ని పాటలూ గుర్తుంచుకున్నారు!
వయొలెన్ వయొలెన్స్ అనమాట! బాగుందండీ!
మందాకిని గారూ మీరలా అనకండి నా future తలుచుకుంటే భయమేస్తోంది! నేను రసజ్ఞని కదా మరి :):):)
:))
@మందాకిని గారు థాంక్యు....
మీ కామెంట్ చదవగానె రసజ్ఞ్ యెమి అంటుందా అనుకున్నా ....చదివింది...రసజ్ఞ all the best
to ur future.
raj...this is end less violence
for ever.thanks for ur wishes
sravya,andy....))))thanks for ur encouragement
అజ్ఞాత గారు మీ పెరు వ్రాసిఉంటె బాగుండేది.
థాంక్యు.
@శ్రీకాంత్ గారు థాంక్యు.
జిలెబి గారు,అలు మగలు ప్రెమ లొ కొత్త చిగుళ్ళు
వెసుకుంటుంటె యెన్ని యెళ్ళు అయినా జ్ఞాపకాలు
మాసిపొవు.థాంక్యు.
రసజ్ఞ గారు, మీకు మంచి రసజ్ఞుడు రావాలని ప్రత్యేకంగా దేవునికి మొక్కుకుందాం లెండి అందరం కలిసి. :-))
శశిగారూ ఈ మీ వయోలెన్స్ బావుందండీ..అన్నట్టు ఈ రోజు మీ వారి పుట్టినరోజా..వారికి జన్మదిన శుభాకాంక్షలు...
(ఓం కార్ స్టైల్ లో ) చాల బాగుంది ....బాగా రాసావ్..అబ్బ అస్సలు చదువుతుంటే ఎంతా బాగుందో తెల్సా....మరి ఇంత బాగా రాసావ్ కాదా మార్క్స్ తీసుకుంటావా....
శశికళ : తీసుకుంటా అన్నయా
చిరంజీవి గారు చెప్పండి శశికళ గారు ఎలా రాసారు...
నిజం చెప్పాలంటే....బానే ఉంది ...సామాజికం గా బానే రాసారు ఒకవేళ ఎవరినా ఈవిడ గారి రాతల్ని పడగొట్టాలని చూస్తీ మీము మద్దత్తు ఇచ్చి ఆదుకుంటాం నిలబెడతాం.
ఓంకార్ : థాంక్స్ చిరంజీవి గారు , ససి కల గారు మరి చిరంజీవి గారు మద్దత్తు ఇస్తామంటున్నారు ......అంటే చాలా బాగా రాసారనే అర్ధం..
చంద్రబాబు..: మేం ముందే చెప్పం ఇలాంటి భయంకర స్వ"గతం" ఉండే ఉంటుందని కాని ఎవరు నమ్మలేదు అందరు కామెంటారు...ఉన్నది ఉన్నట్టు గా ప్రకటించుకుని దేశం మొత్తానికే ఆదర్స్యం అయ్యాను నేను...ఏది ఏమైనా మించిపోయింది ఏమి లేదు మల్లి వస్తాం అప్పుడు చెబ్తాం....
ఓంకార్ : శశికళ గారు మరి చంద్రబాబు గారు అంతగా ఇంప్రెస్స్ అవ్వలేదు అనుకుంటాను మీ రాతల తో ........ఇంకా VOILENCE చేయవచు అని ఆయన ఉద్దేశం ఏమో మరి....ఆయన ఒక పపెరే చదువుతారు లెండి...సరే మరి మనం కెసిఆర్ గారి కామెంట్స్ చూద్దామా...
శశికళ గారు " ఓ చూద్దాం
కెసిఆర్ : భాస మంచ్న్హిగానే ఉంది కాని యాసే మంచిగలేదు ...అన్ని బాగున్నై నాకైతే ఒక విషయం అర్ధం అయితలేదు....గీమే ఇప్పుడు రాసింది పాత కత నేనైతే రోజు ఒక కొత్త కత చెబుతా..... ఇప్పుడొస్తుంది, అప్పుడోస్తుంది అని మరి నాకెన్ని కామెంట్లు రావాలె?
ఓంకార్: శశికళ గారు ....శశికళ గారు...అరె ఏమైంది ...ఎందుకల పిచి చూపులు చూస్తూన్నారు ?
jyothi gaaru,mandaakinigaaru..thank u.
rafsun garu...yemi samaadaanam raayaalo ardham kaavatamledu...any way thank u.
హ హ హ:)..మీ వయోలిన్ వయోలెన్స్ బాగుందండీ.
subha gaaru thanku...welcome to my blog
:)))
:)))
:))
సోనియా ఇంకా బ్రతికే ఉంది. శశి మిస్ మళ్ళీ ఇంకోసారి మాకోసం వయోలిన్ వాయించి చూడరా ప్లీజ్.
శంకరాఆఆఆఆఆఆఆఆఆఅ....యెన్దుకు ఇంత కక్ష ...సొనియాఆఆఆఆఆఅ మీద.....చాలా...ఇంకా వాయించెదాఆఆఆఆఆఆఆఆఆఅ....
శశి గారో...
మీ వయోలిన్ ఫ్లాష్ బ్యాక్ సూపర్...
మీరు దయ ఉంచి, ఇంకోసారి వాయించండి ప్లీచ్...
కావాలంటే మేము చందలేసుకొని మరీ మీకు అధునాతనమైన వయోలిన్ కొనిస్తాము...:)))
potaan gaaroooooooooo...henta manchivaaro....koniste vaayista....
ఫోటాన్ గారూ నేను అడిగినట్టు జరగాలేగానీ శశిమిస్ కి వెండి వయోలిన్ గిఫ్టివ్వనూ!
Post a Comment