Showing posts with label రాజ'కీ'యాలు. Show all posts
Showing posts with label రాజ'కీ'యాలు. Show all posts

Saturday, 28 November 2015

కేజ్రివాల్ మీద జాలితో




ఈ లాలు ప్రసాద్ యాదవ్ ఏమి చేసినా భలే తమాషాగా అనిపిస్తుంది . 
అందరు టికట్ రేట్ పెంచుతుంటే రైల్వే మంత్రిగా టికట్ రేట్ తగ్గించడం ,
ఐ . బిఎం లో గెస్ట్ లెక్చర్లు , మొన్నటికి మొన్న ఉప ముఖ్యమంత్రి గా 
ఉంటారా అంటే సిగ్గుపడటం , నిన్నటికి నిన్న కేజ్రివాల్ ని హగ్ చేసుకోవడం .... 
అన్ని బోలెడు కాలక్షేపం చాటింగ్ లో . 
రాజకీయాలు నాకేమి పెద్దగా తెలీవు . కాని ఇలాంటివి వచ్చినపుడు 
పక్కన మేడమ్స్ ని అడుగుతుంటాను . 
''ఎలా తగ్గిస్తారు శైల  టికట్ ?మళ్ళీ బడ్జెట్ నష్టాలలోకి వెళ్లి పోతుంది 
కదా ! మళ్ళా లాభాలు పెరిగాయి అని గెస్ట్ లెక్చర్ ఎలా ఇస్తాడు ? ''
శైల వాళ్ళ శ్రీవారు రైల్ వేస్ లో ఏ . ఎస్ . ఎం . 
''ఏమి లేదులే శశి గూడ్స్ కి ఒక వాగన్ పెంచేశారు . అక్కడ కవర్ 
చేస్తారు '' 
మరి లోడ్ ఎక్కువైతే ఇంజెన్స్ ఇబ్బంది కాదా ! 
గెస్ట్ లెక్చర్స్ ఇచ్చే రాజకీయ నాయకులను ఒక్క కిచ్చారెడ్డి లక్ష్మా రెడ్డి ని 
ఒక్కటే చూసాను . మా లీడ్ ఇండియా ట్రైనింగ్ లో ఇచ్చారు . 
అప్పుడు దాని మీద రెస్పాన్స్ నేనే చెప్పాను . మెచ్చుకున్నారు కూడా !

ఇక ఇప్పుడు కేజ్రివాల్ వంతు . లాలు నే హగ్ చేసుకున్నాడు , 
నాకేమి ప్రేమ లేదో అని మొత్తుకుంటున్నాడు . 
ఆకు ముల్లు  సామెత ఇప్పుడు అర్ధం అయిందా !
తప్పు మాది కాక  పోయినా , మాది తప్పు అనేస్తే నిరూపించుకోవడానికి 
మేము ఎంత తంటాలు పడతామో అర్ధం అయిందా . 
తన దాకా వస్తేనే తెలుస్తుందని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు . 

కేజ్రివాల్ గారు బాధ పడకండి . మీ తప్పేమీ లేదని నమ్ముతున్నాము . 
లాలు సంగతి మాకేమి కొత్త కాదు :-)
                               @@@@@@@ 

Friday, 12 October 2012

ఏమిటి నిజమా?ఇలా కూడా బ్రతకోచ్చా?

హా....చెప్పు ....టి.వి.సీరియల్ మధ్యలో కరంట్ 
పొతే విసుక్కున్నట్లు ....తూగుతుంటే లేపిన 
పెద్ద మనిషిని విసుక్కుంటూ తెల్ల కాగితం ,పెన్ 
తీసుకున్నాడు చేతిలోకి....

''పేరు ఏమిటి?''....చెప్పాడు 
''ఎక్కడ ఉంటారు?''చెప్పాడు అతను.

''ఏమి పోయింది?ఎప్పుడు?''

చెప్పినది విని మన్మోహన్ గారు మాట్లాడితే వినపడి నట్లు 
ఉలిక్కి పడ్డాడు.
''ఏమిటి అది పోయిందా?నిజమా?''

''నిజమండి''బాధగా చెప్పాడు అతను.

''నిండుదా?ఖాళీదా?''అడిగాడు.

''అయ్యో ఖాలీది వాడు ఏమి చేసుకుంటాడు చెప్పండి 
నిండుదే '' దిగులుగా తరుక్కుని పోయిన గుండెతో 
భారంగా చెప్పాడు.

నిలబడ్డాడు రైటర్ ....''అయితే మీరు ఏమి చేస్తున్నారు 
ఇప్పుడు"రైలు ప్రమాదం జరిగితే కాపాడకుండా
ఫోటోలు తీసే మొహం వేసుకొని...

''ఏమి చేస్తాము చెప్పండి.ఉదయాన్నే తోటకూర,గోంగూర 
మన్ను కూర శుబ్రం చేసి తరిగి తగు మోస్తర ఉప్పు వేసి 
....''చెపుతూ ఉన్న అతనికి అడ్డు తగిలాడు రైటర్ ...
ఉండు వ్రాసుకోవాలి.

అతను చెప్పసాగాడు''మశానం కూర ముళ్ళు లేకుండా చక్కగా 
గిల్లుకొని అన్నీ  కలిపి మిక్సీ లో వేసుకొని తగినంత నీరు పోసుకొని 
......కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు....''తరువాత సరిగా 
గుర్తు లేదు'' 

''లేదు..లేదు గుర్తు చేసుకొని చెప్పు''అదిలించాడు రైటర్.
తప్పదా అన్నట్లు చూసి....మూడు సార్లు బుర్ర,
పది సార్లు మోకాలు గోక్కున్నాడు.సరే సహాయం కావాలో 
ఏమో అని తన వంతుగా తానూ కూడా గీరాడు రైటర్.

''హా గుర్తుకు వచ్చింది''...''చెప్పు''ఆసక్తిగా చేతిలోని 
పెన్నుతో ముందుకు వంగాడు రైటర్.
''అవన్నీ మిక్సీ లో వేసి వడ గట్టాలి ...తరువాత కొంచెం 
జిలకర పొడి,మిరియాల పొడి కలుపుకొని 
తాగాలి''తన్మయంగా చెప్పు కొని పోతునాడు.

''ఆపు...ఆపు''అరిచాడు రైటర్ ...వస్తున్న ఎస్.ఐ.ని 
చూసి సాల్యుట్  చేస్తూ.

ఏమిటి సంగతి కళ్ళతో అడిగాడు.....చెప్పాడు.
ఉలిక్కి పడ్డాడు ఎస్.ఐ.
''ఏమిటి నిండుదే''

''అవును''తల పంకించాడు.వ్రాస్తున్న మేటర్ చూసాడు.
ఆనందం తొ ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు.
గుడ్ నాకు ఒక కాపీ వ్రాసి పెట్టు.....
అని పక్కకు  పిలిచాడు.
చిన్నగా గుస గుస....''దొరికితే ఇంటికి పంపెయ్యి
మేం సాబ్ ఆర్డర్''చెప్పి వెళ్లి పోయాడు.
తనకే సొత్తు అని ఆనంద పడిన రైటర్ మొహం వాడి పోయింది.
సరే ఈ వివరాలు అన్నా తెలుసుకుందాము అని 
అతని వైపు తిరిగి ఇంకా ఉన్నాయా?చెప్పు.....

అతను తన్మయంగా చెప్పుకు పోతునాడు.
మధ్యాహ్నం ....కెరట్ ఒక సెంటిమీటర్ ముక్కలుగా 
తరిగి బీర కాయ పీచు తీయకుండా ,పచ్చి మిర్చి తొ 
కలిపి తొక్కి దానిని కెరట్  లో కలపాలి.
దానిలో బీట్ రూట్ తురుము ,తేనే కలిపి....
చెప్పుకుంటూ పోతునాడు.అర బస్తా కాగితాలు వ్రాసి 
నిట్టూ ర్చాడు రైటర్....ఇప్పుడు దీనికి రెండో కాపీ 
రాయాలి ......గుట్టను దిగులుగా చూసాడు.

''సరే దొరికితే చెపుతాము పో''చెప్పి పంపేసాడు.
           @@@@@@@

''సార్ దొరికింది''సంతోషం గా వెళ్లి  చెప్పాడు ఎస్.ఐ.కి.
దెబ్బకి మొహం నూనెలో వేసిన పూరిలాగా పొంగింది.
(ఎన్ని రోజులు అయింది పూరి తిని అనుకుంటూ)

ఉన్నట్లుంది చిల్లు పొడిచిన పూరి లాగ అయిపోయాడు 
వచ్చిన ఫోన్ కాల్ విని....''ఎవరు సార్''

''నా మొగుడు...ఎలా తెలిసిందో ఏమో దొరికిందని''
''ఇప్పుడేమి చేద్దాము సార్ ?''
''ఏమిటి చేసేది నా మొహం ఆడకు పంపించు''
ఆ కాగితాల కట్ట తీసుకొని సరే ఇవే ప్రాప్తం
అనుకుంటూ వెళ్లి పోయాడు.
  @@@@@@@@

చాలా రోజుల తరువాత వచ్చాడు ...అతను .
కాని మొహం లో దీనత్వం లేదు,
ఏదో తేజస్సుతో వెలిగి పోతుంది.
''ఇంకా రోజులు పడతాది దొరకటానికి 
దొరికితే పిలుస్తాము పో ''కసురుకునాడు రైటర్ .

''అయ్యో వద్దు సార్...దొరికినా ఇవ్వొద్దు అని చెప్పటానికి 
వచ్చాను''నవ్వుతూ అన్నాడు.

'అదేమిటి''వింతగా అడిగాడు రైటర్.

''మరే ఆ గ్యాస్ బండ పోయినప్పటి  నుండి దరిద్రం వదిలి పోయింది.
చక్కగా కూర గాయాలు తిని కొలెస్టరాల్ లేదు,
గ్యాస్ ప్రాబ్లెం లేదు.మ ఆవిడా సన్న పడింది.
ఇంటి బడ్జెట్ మిగులు లోకి వచ్చింది.పిల్లలకు ఫీ కట్ట గాలుగుతునాము'
ఇప్పటికే ఫ్లాట్ కొన్నాము ...ఇల్లు కట్టాలి అని ప్లాన్ చేస్తున్నాము''

ఓర్నీ గ్యాస్ ఇంట్లో లేక పొతే ఇంత సంతోషమా?
వెంటనే ఆ బండ ను వదిలిన్చుకోవాల్సిందే.

ప్రభుత్వాన్ని అందరు తిడతారు కాని ఇంత మంచి 
చేస్తుందని తెలుసుకోరు.
భక్తిగా కళ్ళు మూసుకొని ప్రభుత్వానికి దణ్ణం పెట్టాడు.
కల  కాలం ఉండమని ......



Wednesday, 3 October 2012

అబ్బో...పాత కూడా వింతే

పాత  సామాన్లు కొంటాము ......
పాత  సామాన్లు కొంటాము....

వీధి అంతా మార్మోగి దడుచుకునే టట్లు అరుస్తున్నాడు 
వాడు.వాడి బాధ వాడిది ...ఇప్పటి టి.వి .సీరియల్స్ 
గొడవలో వాడి గొంతు వినిపిస్తుందో లేదో అని .

మెల్లిగా బయటకు వస్తున్నారు అందరు.
న్యూస్ పేపర్లు,బుక్స్ కట్టలుగా చేరుతున్నాయి.
బండి నిండి పోతూ ఉంది.

బాబు పాత సామాను  తీసుకుంటావా?
అవి కూడా చేరుతున్నాయి.మరి ఎలాగు తీసుకొని 
వెళ తాడో....

మంచి గంగాళాలు.....
కుర్చీలు...
ఫర్నిచర్....
వీధి అంతా శబ్దాలే ...
బాబోయ్ ఇంత మంచివి వేసేస్తున్నారు ఎందుకని?

''బోర్ కొట్టింది లేవయ్యా''

సరే మనోడు అరుపు మార్చాడు 
''బోర్ కొట్టేవి కొంటాము...బోర్ కొట్టేవి కొంటాము''

ఒక ఇంటి  ముందు ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు.
''బాబు ఏది బోర్ కొట్టినా తీసుకొని వెళతావా?''
''వెళతాను బాబయ్యా''

''బోర్ కొట్టేస్తుంది.ఇన్నేళ్ళ బట్టి చూసి..చూసి...
అప్పటి కంటే మారి పోయింది...ఇచ్చేస్తాను 
పట్టుకెళ్ళు ''

''సరే బాబయ్యా''

''రెడీ గా గోతం పట్టుకో దానిలోకి విసిరేస్తాను''
రివ్వున వెళ్లాడు ఇంట్లోకి....
సర్రుమని గోతం లోకి పడిన శాల్తీని ఎవరో చూడకుండా 
కట్టేశాడు.
''ఒరేయ్ విప్పారా...నేనేరా...''లబ లబ లాడాడు.
విప్పుకొని బయటకు రాగానే దబీమని తలుపు మూసినా చప్పుడు.

''ముసిలోడా నీకు నేను బోర్ కొట్టేశాన?
నువ్వు మాత్రం బాగున్నావా ఏమిటి?
అక్కడే పడి చావు నాకు బోర్ కొట్టేసావు...''

''ఒసే ఒసే...చంపవాకే...నా మాటలు ఎవరో నీకు 
తప్పుగా విశ్లేషించారే......నా మాట విని తలుపు 
తియ్యవే'' ....రామాయణం కొనసాగుతూనే ఉంది.

''నిజమే పాత కూడా వింతగానే ఉంది''
అనుకొని వెళ్లాడు వాడు .



Friday, 10 August 2012

వార్నీ ...ఇదేమి బాట బాబయ్య

హ్మ్...గట్టిగా గాలి పీల్చాడు ముఖ్య మంత్రి.
అయితే ఏదో బాధ పడే విషయమే అయి ఉంటుందని 
ఊహించి వాళ్ళు కూడా హ్మ్...అని గాలి వదిలారు.
దెబ్బకి ఆ గాలికి లేచి గోడకి కొట్టుకొని కొంచెం కష్టపడి 
లేచి...ఏమిటిది ?కోపంగా అడిగాడు.
అంటే మీరు చేసారు అని మేము కూడా ...
ఇప్పుడు అది కాదు కావాల్సింది ప్రజలు 
మనలను మర్చిపోతున్నారు.
వాళ్ళు గుర్తుంచుకోవాలంటే 
ఏమి చెయ్యాలో అది ఆలోచించండి.

''అందుకే కదండీ కరంట్ కోతలు ...ఇషో..ఇషో..అని విసురుకుంటూ 
మనలను గుర్తు చేసుకుంటున్నారు.కాదు అమ్మ నా బూతులు 
తిట్టుకుంటున్నారు.
''ఏమి లాభం లేదు ఏదో ఒక బాట పట్టాల్సిందే....పోదాము పదండి''
అన్నాడు ముఖ్య మంత్రి.
''వద్దు,వద్దు వాళ్ళు మిమ్మల్ని నిలేస్తారు.అసలే ఖజానా ఖాళీగా 
ఉంది''చెప్పారు ముందు జాగ్రత్తకి.
''కుదరదు వెళ్ళాల్సిందే...ఏదో ఒకటి చెపుతాను వాళ్లకి,గొర్రె 
కసాయివాడిని నమ్మక పోయిన చరిత్రే లేదు''
      @@@@@@@@
ప్రజా బాట మొదలు...ముందు గా రైతులు ఎదురు అయ్యారు.
''ఎరువులు లేవు,విత్తనాలు లేవు,కరెంట్ లేదు ..ఎట్ట చెయ్యాలా?
నిలేసారు.
చిరు నవ్వు నవ్వాడు ప్రశాంతంగా 'మీరింకో విషయం మర్చిపొయ్యారు 
వానలు కూడా లేవు.ఇప్పుడు మేము చూడండి .....మేము కూడా 
అన్ని రకాల కరువుతో బాధపడుతున్నాము.అయినా మీలాగా 
అడుగుతున్నామా?మీరే మీ కష్టాలు తీర్చుకోవాలా?''దణ్ణం పెట్టి 
వెళ్లి పొయ్యాడు.
'వ్యాపారస్తులు నిలేసారు.''ఏమి చెయ్యాలా ?వ్యాట్ పెంచారు.
పన్నులు పెంచారు.దాడులు పెంచారు.కరెంట్ లేదు.''
''మీరు మరీని...మాకు ఇక్కడ పవర్ లేదు...ఢిల్లీ నుండి 
ఎప్పుడు ఆగిపోద్దో అని నేను కూడా బయపడుతున్నాను.బయపడితే ఎలాగా 
జరుగుద్ది.ఎవురి సమస్యలు వాళ్ళే తీర్చుకోవాల?''చిరునవ్వుతో 
వెళ్లి పొయ్యాడు.

విద్యార్దులు నిలేసారు''రీ ఇమ్బర్సేమెంట్ ఇవ్వనంటున్నారు.స్కాలర్షిప్ లు 
పెంచలేదు.ఇంట్లో ఆర్దిక ఇబ్బందులు మేము ఎలా చదవాలి?''
''భలే వాళ్ళే....ఇప్పుడు ఖజానా మొత్తం ఖాళి.మాకు ఆర్దిక భారం ఉంది.
నేను కొత్త ఇల్లు కూడా కట్టుకోలేదు.ఎవరికి వాళ్ళు కష్టపడి పైకి 
రావాలి అంతే కాని ప్రభుత్వం ని నమ్ముకుంటే ఎలా?మమ్మల్ని 
ఆదర్శంగా తీసుకోండి''వెళ్లి పొయ్యాడు.
ప్రజా బాట అయిపోయంది.
           @@@@@@@
ఇంటికి వెళ్ళాడు.కృష్ణునికి పూజ జరుగుతుంది.
''రారా కృష్ణయ్య ....రారా కృష్ణయ్య ''ఎలుగెత్తి పాడుతూ పూజ చేసాడు.
భక్తికి మెచ్చి కృష్ణుడు ప్రత్యక్షం అయ్యాడు.
''స్వామీ అన్ని కష్టాలే...ఆర్దిక ఇబ్బందులు,సీట్ ఇబ్బందులు,
స్వపక్షం,ప్రతిపక్షం,అన్ని వైపులా చుట్టూ ముట్టేస్తున్నాయి.
మీరే కాపాడాల..''అడిగాడు 
చిన్నగా నవ్వాడు కృష్ణుడు...''నన్ను చూడు నాకు ఎన్ని ఇబ్బందులు,
మంచి వెన్నకు కరువే,భక్తికి కరువే,ఇంకా గోపికలతో బాధలు,
వీళ్ళు కాక ఎనిమిది మంది భార్యల కోరికలు ...ఎవ్వరు ఎవరికి సహాయం 
చెయ్యలేరు.సలహాలు మాత్రమె ఇస్తారు.నీ స్వశక్తి తో మాత్రమె నువ్వు 
పైకి రావాల''జ్ఞానోదయం చేసి ఎక్కువ సేపు ఉంటె ఇంకా ఏమి 
అడుగుతాడో అని బుడింగున మాయం అయ్యాడు కన్నయ్య.

(నిన్న ఖమ్మం బాట తో నాకు బోల్డెంత జ్ఞానోదయం అయింది...
మరి మీకు?)

Wednesday, 11 July 2012

రాజ ''కీ''యాలు.....చిదంబర రహస్యం


  రాజ ''కీ''యాలు.....చిదంబర రహస్యం 
రూం అంతా వేడిగా పొగలు సెగలుగా నిండి పోయి ఉంది.
పెద్ద మేడం హాట్ హాట్ గా ఉండేసరికి పార్టి పెద్ద తలకాయలు 
నోట్లో సెంటర్ ఫ్రెష్ ఉంచుకొని గప్చిప్.....

చెప్పండి ....ఎందుకిలా అన్ని వైపులా ఓటమి ...
పార్టీయే మునిగేలా ఉంది.ఏదో ఒకటి చెప్పక పోయారో 
మీ బతుకు బస్సు స్టాండే....పొండి :పొయ్యి ఎలుకను తవ్వి 
కొండను పట్టుకు రాపొండి".

ఏమిటి సామెత కూడా పార్టీ లాగా తిరగ బడిందే  అనుకోని 
మనకు ఎందుకు ....మళ్ళా జాలిం లోషన్ తో పని 
అనుకోని తలలు అన్ని కోణాల్లో ఊగిస్తూ వెళ్లి పొయ్యారు.

మూడు రోజులు  తలకిందులుగా ఆలోచిస్తే మోకాల్లో మెదడు కొంచం 
యధాస్తానానికి వచ్చి ఆలోచించింది.అన్ని లుక లుక తమ వైపే ...
ఇది కాకుండా చిన్న సార్ కూడా ఇందులో వేలు పెట్టాడు.
దెబ్బకి "నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా '' అని ప్రజలు 
పార్టీని కుట్టేసి ముక్కలు  చేసేసారు.ఈ విషయం పెద్ద మాడం కి చెపితే 
ఇంక ఏమైనా  ఉందా?

పాయింట్లు  అన్నీ తిరగేసి మరగేసి చూసారు వేరే వాళ్ళ మీదకు నెపం 
తోయ్యటానికి.....అందులో ఒక పాయింట్ కనిపించింది ఓటమికి. 
పెరిగిన ధరలు.

అయితే పెరిగితే మాత్రం దానికి తగ్గట్లు జీవించాలి కాని ఎందుకు అరవటం 
ఈ జనాలు....అసహనం గా  అరిచాడు ఒక చిదంబర తలకాయ.
అవును ఈ జనాలింతే.....యెంత రెట్లు పెరిగినా ఏ రోజైనా వోట్లేసే రోజు 
పంచుతూ ఉండే  సారా తగ్గించామా?
హూ...సకిలించాడు  ఇంకో పెద్ద తలకాయ.

అందుకే ఆయనెవరో అన్నాడు ''ఆసియా ప్రజలు తిండితోనే ఆహార 
కొరత అని....వీళ్ళు అంత అంత తినటం ఎందుకు ?ధరలు పెంచటం 
ఎందుకు?మనం పెంచాము అనే నింద మనకు ఎందుకు?''

చిదంబర తలకాయ కి ఇంకో మంచి ఆలోచన వచ్చింది.''యురేకా''
అరిచాడు గట్టిగా....దెబ్బకి అందరు అదిరిపడి తమ పంచెలు 
గట్టిగా పట్టుకొని ఆయన పంచె వైపు చూసారు....ఎక్కడ ఆనందంతో  
వీధి లోకి పరిగేడుతాడో అని ....హమ్మయ్య క్షేమం అని అనుకోని 
కారణం సెలవు  ఇయ్యమని వినయంగా అడిగారు 

చిద్విలాసంగా నవ్వి ''అసలు ఈ పేదలతో మనకు కష్టం లేదు.
వాళ్ళు తాగేది గంజి.గోప్పోళ్ళ తో కష్టం లేదు.వాళ్ళు బెంజి లో 
తిరిగినా సమయం లేక తినేది బ్రేడ్డే....వీళ్ళిద్దరికీ మన గూర్చి 
ఆలోచించే తీరిక అరిచే ఓపికా ఉండవు.

రేపు నేను మీడియా కి ఇచ్చే స్టేట్మెంట్  చూడండి....దెబ్బకి 
ధరల పెరుగుదల నింద మనపై లేకుండా పోతుంది.
మేడం కూడా చిన్న బాబు పై నింద వెయ్యనందుకు మెచ్చుకుంటారు అన్నాడు.

పక్క రోజు వార్త....''అసలు ఈ మధ్య తరగతి వాళ్ళ వల్లే ధరలు 
పెరుగుతున్నాయి(అంటే పెరిగినట్లు అందరికి తెలుస్తున్నాయి)
ఏమి బియ్యం ఒక్క రూపాయ పెంచితే మీ సొమ్ము ఏమి పోతుంది 
గలబా...గలభా...ఏమి ఐస్ క్రీంలు తినటం లేదా ?మినెరల్ వాటర్ 
తాగటం లేదా?ప్రభుత్వం కోసం ఈ మాత్రం అన్నింటి పైనా ఒక్క 
రూపాయి ....ఒకే ఒక్క రూపాయి పెంచాలేరా?

నిద్రపోతున్న చిదంబర తలకాయ ఆత్మని లేపి అడిగాడు 
అపరిచితుడు.....ఒక్క రూపాయ మీకిస్తే మా సొమ్ము పోతుందా?
పోదు చెప్పాడు...ఛి.త.......వంద రకాలపై ఒక్క రూపాయ మీకిస్తే 
మా సొమ్ము పోతుందా? పోదు...ఛి.త 
వంద కోట్లు మంది ఒక్కో రూపాయి,ఒక్కో వస్తువు మీద ఇస్తే 
సొమ్ము పోతుందా?

చిదంబర తలకాయ నవ్వింది....పోదు...ఎక్కడికి ...
స్విస్ బ్యాంక్ కి తప్ప......హ...హ...హ...
అంతే మధ్యతరగతి అపరిచితుడు....డమాల్ అని స్పృహ తప్పి పడి పొయ్యాడు.

చిదంబరం గారికి.....ఏదో మీ పుణ్యమా అని సాదారణ గృహిణిగా 
ముచ్చట్లు వ్రాసుకునే నేను ఇలా ''రాజ'కీ' యాలు'' వ్రాసుకొనే 
స్టేజ్ కి వచ్చాను.ఇలాగే నన్ను అభివృద్ధి చేసి ఏదో ఒక ఊరికి 
ఎం.ఎల్.ఏ.చెయ్యగలరని ప్రార్ధన.

Tuesday, 18 October 2011

అకటా...ఏమంటిరి......ఏమంటిరి......

ఎమంటిరి?ఎమంటిరి?
రేణుకా చౌదరి గారు ఎమంటిరి?

"ఇదేమన్నా ప్రెషర్ కుక్కర్లో  వంటనా?అనియా?"

హెంత మాటా.....యెంత మాటా.......

ఇది ప్రాదేశిక వివాదము  కాని మా శక్తి వివాదము  కాదె ....
కాదు అదే నందురా....మా ప్రెషర్ లేకుండా ఈ రాష్ట్రం లో ఏ 
పనైనా జరుగునా....వాని గురువు ఢిల్లీ మాటేమిటి.....అక్కడ 
కూడా వెనక నుండి ప్రెషర్ పెడుతుంటేనే మాటలు బయటకు 
వస్తున్నవి కదా...............

అన్నియునూ కనపడని ప్రెషర్ తోనే జరుగుతుండ..........
నేడీ కుక్కర్ .....కుక్కర్ అని తేలిక మాటలేల.............

మరి మదీయ గొప్పదనము మీ కెరుక  అయిన అటుల వచింపబోదురు కదా?

సఖి....నా ప్రాణ నెచ్చలి .....శశి కళ.......మదీయ గొప్పదనము శతదా....సహస్రదా
....సహస్రదా......లక్షదా........లక్షదా....కోట్లదా...... వీరికి వివరింపుము........

అటులనే సఖా........వినుడి ..వినుడి ....కుక్కర్ గాధా......వినుడీ మనసారా.........

                           ఎవరిని ఎలా ఉడికించాలో 
                            బాగా తెలుసు ...........
                            కుక్కర్ తో 
                             సావాసం.............

మరి కుక్కర్ లేక పొతే యెంత మంది లేత వంటగాళ్ళు(ఆడ వాళ్ళ ను ఏమనాలో)
కు చేనక్కాయలు ఎలా ఉడక పెట్టాలో నేర్పేది ఎవరు?
మొక్కజొన్నలు ఎలా ఉడక పెట్టాలో నేర్పేది ఎవరు?
పప్పు ఎలా వండాలో......అన్నం ఎలా చిమడ పెట్టాలో 
నేర్పేది ఎవరు?ఎవరు?ఎవరు?................................

                          గ్యాస్  బడ్జెట్ 
                           కిందకు దిగింది 
                           ప్రెషర్ ఉంటె 
                           అంతే.............


గ్యాస్ సబ్సిడీ లో కోత పెడుతూ......ఆరు సిలిండర్లె అని 
అరిచి గీ పెడుతూ.......ఉడకని అన్నం .......నానని పప్పు 
జాలిగా చూస్తూ.....కట్టెలు కొట్టుకొని బతకాల్సిన పరిస్తితిలో .......
ఆడవాళ్ళను ఆదుకున్నది ఎవరు?ఎవరు?ఎవరు?

                       వంట 
                       తగలడింది.......
                       కుక్కర్ 
                       లేక...........
 ఒక పక్క వంట.....ఒక పక్క పిల్లల తంటా.....
శ్రీవారి ఆకలి మంట.....తకదిమి తొమ్.....తకదిమి తొమ్....
కదాకళి  ,   కూచి పూడి చేస్తుంటే......వంట మాడకుండా ఆడవాళ్ళను 
కాపాడింది ఎవరు?ఎవరు?ఎవరు?

                        అన్ని తనలో 
                       ఇముడ్చుకుంటుంది....
                       ఇల్లాలి 
                       ప్రేమ కోసం............

శ్రీవారికి అన్నం సరే....బాబుకి పప్పు సరే.....తాతకి తాలింపు సరే......
పాపకి కంకి సరే.......ఎన్నున్నా.....ఏమి తెచ్చినా......నీ సుఖమే 
నే కోరుకున్నా .......నీ కోసమే నే ఉడుకుతున్నా.....అంటూ 
అనుక్షణం తన నెచ్చెలి సుఖం కోరుకునేది ఎవరు?ఎవరు?

                     మొగుడి ముందే 
                     విజిల్ వేస్తుందే......
                     ఆడవాళ్ళ సప్పోర్ట్ 
                     ఉందిగా.............

అమ్మ రేణుక ఎంతంటే.....యేమని చెప్పను....కుక్కర్ గొప్పదనాన్ని....
శ్రీమద్రమా రమణ గోవిందో.....గోవింద.........

ఇంకా మాకేంత  ఇష్టమంటే.........

"లామి లామినా.....జాన్ కారేగా......జింగా.....జింగా.......
లామి లామినా......హే...హే.....వక్క......వక్కా ......హే...హే....
it is the time for aaaaafricaaaaaaaaaa................."

(ఏమి అర్ధం కాలేదా?అది మా బాబుకు ఇష్టమైన పాట అన్న మాట.
వాడికి నిద్ర వచ్చేదాకా మేము కూడా చచ్చినట్లు వినాల్సిందే........
పాపం బాబుకి ఎన్నేళ్ళు అంటారా?చిన్న పిల్లాడే ......సీనియర్ ఇంటర్....)

మా బాబుకి ఆ పాట యెంత ఇష్టమో.....నాకు కుక్కర్ అంత ఇష్టమన్న మాట.

కాబట్టి కుక్కర్ ని గాలితో పని చేస్తుందని గాలి తీసిపారెయ్య కండి.

కుక్కర్ లేనిదే సగటు ఇల్లాలికి నిమిషం గడవదని గుర్తించండి........

ఇక మేమిద్దరం కలిసాము అనుకోండి............

రావే చేద్దాం ........భాండియా.......జరా 
లొట్టలు వెయ్యదా ఇండియా ............

మీ మాటలు వెనక్కు తీసుకొని కోట్ల మంది ఇల్లాళ్ల 
అభిమాన దనాన్ని కాపాడుతారని ఆశిస్తున్నాము.........


Thursday, 29 September 2011

తన్నుకు చావండి...అదే పదివేలు

ఏమిటి?తన్నుకు చావటమా?
అదియును పవిత్ర భారత నారీమణి బ్లాగ్లో....

ఏమిటి పే...ద్ద..ఆడవాళ్ళ బ్లాగుల్లో కదలు ,కవితలు 
కాకరకాయలు,కబుర్లు తప్ప రాజకీయాలు ఉండకూడదని 
గవర్నమెంట్ ఆర్డర్ చేసిందా ఏమిటి?

అందులో ఇంత ముఖ్యమైన విషయం ఉత్తినే డబ్బులు 
సంపాదించే విషయం అందరి చెవుల్లో వేయకపోతే 
నా బుర్ర వేయి వక్కలైపోద్ది....తట్టుకోలేకా....

తన్నుకు వేయి....రోజుకు పదివేలు...

బలే మంచి చవక బేరము 
పట్టుడి కర్రలు మహిళ లారా...సమయము మించినా దొరకదు...
బలే మంచి...బలే మంచి చవక బేరము.....

ఏమిటి ?కొట్టు కొట్టండి...అనేస్తున్నారు...ఎవర్ని కొట్టాలో తెలుసా?

ఎంచక్కా ఉదయాన్నే లేసి మాంగల్యాన్ని కళ్ళకు అద్దుకొని
ఏ పాద పద్మములు సదా పూజింతునేని...అని పద్యాలు 
పాడేస్తారో...సదరు పతిదేవుల్ని....

ఏమిటి?నోరు తెరిచారు....ఏమేమో కనిపిస్తున్నాయి ....

మరి సదరు మంత్రిగారే....సదరు బారతీయ మహిళను 
బర్త తాగి వస్తే ఆయన పోస్ట్ మరిచిపోయి రెండు పీకమని 
మహిళలను కోరినారు.(ఎవరికైన అదే రూల్)

పైగా ఒక్క ఒక్క తన్నుకు వేయి చొప్పున బారతీయ మహిళకు 
పది వేల వరకు ఆఫర్.

కాబట్టి "తాంబూలాలు ఇచ్చెసాము ..తన్నుకు చావండి"
అని మంత్రి గారు సెలవిచ్చినారు.(అమంగళం ప్రతిహతమగుగాక )


ఇప్పుడు నేను కొన్ని సలహాలిస్తాను.
వాటిని పాటిస్తే ఇక "నారేతలు,పైరు కోతలు,బాక్స్ మోతలు,
బస్సు వేటలు"లేకుండా రోజుకు పది వేలు పది తన్నులతో 
సంపాదించవచ్చు.

కాక పొతే సదరు భర్త గారు తాగిన తరువాత ముచ్చటగా 
"తమల పాకుతో నేనొకటి అంటే...తలుపు చెక్కతో నేనొకటి"

అని మనకు ఇలా సహకరించాలి...
లేదా వాళ్ళు సహకరించకపోతే తన్నకుండా తీసు కోటానికి 
మన నిజాయతి ఒప్పుకోదు కాబట్టి దేవుడిని తలుచుకుంటూ 
ఇలా ఓ పది తగిలించాలి(మనసులో దేవుడిని క్షమాపణ 
వేడుకోవచ్చు)


ఇంకా ఇది చూసే భార్యలు,భర్తలు,బ్లాగర్లు,పెద్దలు,పిల్లలు ,పీచులు,
మీకు తోచిన సలహాలిస్తే కొంత సాయం చేసినవారు అవుతారు.

సదరు మంత్రి గారికి కృతఙ్ఞతలు....భారతీయురాలు.

సామాన్యుడు శాంతియుతంగా నిరసిస్తే ఆ బలం ఎలా ఉంటుంది?
అన్నా హజారే బ్లాగ్ చూడండి.http://annahazaresays.wordpress.co