Saturday, 25 June 2011

కొత్త భార్య ....vs.....చెత్త సినిమా

అత్తగారింటికి వచ్చి బుద్దిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకొని ....
(అంత సీన్ లేదా ......గొణిగారంటే అమ్మ తోడు అడ్డంగా --------) 

సరే....సరే కూల్...కూల్....అంటారా...ok  కద లోకి వచ్చేస్తాను.
అప్పటికి మా అత్తగారింటికి వచ్చి వారం అయి ఉంటుంది. 
"ఏమండీ ఏమి తోచటం లేదు.సినిమా కి వెళదాము"అని అడిగాను.
మంచి కళ లోనే  ఉన్నారు వద్దులే అనలేదు.ఇప్పుడు టౌన్కి వెళ్ళలేము.
సరే ఈ ఊరిలో "పొట్టేలు పున్నమ్మ" సినిమా ఉంది పోదామా?
అన్నారు.సరే ఏమి చేద్దాము అప్పటికే మనం సినిమా ఆకలితో 
ఉంటిమి.ఆకలైతే సింహం గడ్డి కూడా తింటుంది అనుకోని 
(లాజిక్ అర్ధం కాలేదా.నాకు అర్ధం కాలేదు.కొంచం గొప్పగా ఉంటుందని 
వాడాను)
సరే పొట్టేలు నైనా చూడచ్చు అనుకోని వెళ్దామని 
ఒప్పుకొన్నాను.

సరే మాతో ఎవరైనా వస్తార మా తోటి?అని అందరిని అడిగితే 

ఎవ్వరు రామని చెప్పారు
(ఏదోలే మొహమాటపడుతున్నారు అనుకొన్నాను ముందుండే
విషయం  తెలీక )
కొంచం దూరమే కాబట్టి నడిచే వెళ్ళాము.
"నమో వెంకటేశా"పాటవేస్తున్నారు.
(పాటేమిటి?అంటారా ,ఆ పాట వింటే ఎక్కడి పనులు అక్కడ వదిలేసి పరిగెత్తాలి.లేకుంటే సినిమా నో ,ట్రైలర్స్ నో మిస్ అయిపోతాము)

 పర్లేదు not bad అనుకోని కుర్చీలో కూర్చొని చూస్తుంటే news reel 
మొదలైంది.ఇంకా మన పైనుండి ఎవరైనా పోతే కాళ్ళు తొక్కినా 
సరే పట్టించుకోకూడదు.సినిమా లోనే లీనమవ్వాలి లేకపోతే సినిమా 
అర్ధం కాదు.
(ఎందుకంటె ఆపరేటర్ లు వాళ్ళ ఇష్టం వచ్చిన 
దగ్గర కట్ చేస్తుంటారు పెద్ద సెన్సార్ బోర్డు లాగా)

సరే టైటిల్స్ వస్తున్నాయి చూస్తూ ఉన్నాను.టాక్.....మని 
సినిమా ఆగిపోయింది.
వెంటనే మా అయన వైపు ఒక లుక్ ఇచ్చాను.
పక్కకు తిరిగి కనుక్కొని "రీల్ తెగిందంట"నా వైపు 
తిరిగి చెప్పారు.సరే పొట్టేలు వచ్చేస్తే తమాషాగా ఉంటుందని
ఓర్చుకొని సినిమా లో లీనమయ్యాను.అందరు కనిపిస్తున్నారు గాని పొట్టేలు 
మాత్రం కనపడటంలేదు
(కొంపతీసి కాదు...కాదు....దానికి కొంప ఉంటుందా
...గడ్డి మేయటానికి వెళ్లి ఉంటుందా?)

మళ్ళ ఉన్నట్లుంది కళ్ళ ముందు చీకటి.ఇంకా మా వారి వైపు 
చూడాలన్నా చూడలేను.
(మా వారు మన కంటి చూపు మంట నుండి బతికి పోయారు)
పవర్ పోయిందంట.generator లేదు.

కొంచం సేపు చీకటి కి అలవాటు పడేసరికి పవర్ వచ్చేసింది.
మా వారు చాల సంతోష పడిపోయారు.ఎందుకంటె పవర్ రాకపోతే 
పాస్ లు ఇచ్చి పంపుతారు.మళ్ళా రేపు వచ్చి చూడాలి.
(రేపు రావటమా బాబోయ్?)

సరే ఆడవాళ్ళకు ఓర్పు ఉండాలి శశి  
అని నన్ను నేనే సముదాయించు కొని భర్త కోసం ,పొట్టేలు 
కోసం ఓర్పుగా సినిమా చూస్తున్నాను.

సినిమా బాగానే జరుగుతుంది గాని పొట్టేలు వచ్చే టైం కి 
ఏదో ఒకటి.సినిమా లో శ్రీ ప్రియ అంటూ ఉంది నా పొట్టేలు వచ్చిందో 
చూస్కో నీ సంగతి అని..
.(అమ్మయ్యా ..నా పొట్టేలు వస్తూన్దోచ్ )

అంతే మళ్ళ సినిమా డమాల్.....రీల్ మార్చాలంట.
single ప్రొజెక్టర్ కదా.రీల్ మార్చినపుడల్లా కొంత సినిమా కట్ 
చేస్తారు టైం కలిసి రావటానికి.

మళ్ళ పొట్టేలు కద నుండి గడ్డి కోసం పరారే.....
నేనేమో దాని కోసం  waiting ఇక్కడ.

మా వారు వెంటనే కూల్ చేయటానికి డ్రింక్ తెచ్చి తంటాలు 
పడుతున్నారు.పతివ్రతని కాబట్టి మరీ ఆయనను అంత యేడిపించ
కూడదని చాల ఓర్పుగా పొట్టేలు వచ్చే దాక సినిమా చూస్తానని 
చిరు నవ్వు అతికించుకొని మరి చెప్పేసాను.

అలా....అలా...మూడు ఇంటర్వెల్స్...ఆరు పోప్కార్న్స్....
అయిన తరువాత........అబ్బ అదిగోండి పొట్టేలు ............
హయ్యా.........అనుకోని గంతు వేసేలోపల దాని పక్కనే 
కనిపించిన్దోకటి..............................
ఏమిటా?..............శుభం 

  కొత్త భార్యని అలాంటి సినిమా కి తీసుకెళ్ళి నందుకు ఇప్పుడైతేనా 
A.K నే (A.K.అంటే అప్పడాల కర్రా ......మీకెవరు చెప్పారు?
ఓహో ....అనుభవమా?)

క్జ్దెఅ ౪౫౭౮౫ వస్ర్వ్దుఇ  ౯౬౮౪౩౨౫౭ జేశ్ర్ఫర్డు  ౫౪౨౮౭ ధేఅనే  ....
(ఏమిటి అర్ధం కాలేదా?మా వారిని  తిట్టాను మీకెందుకు 
అర్ధం కావాలి పెద్ద?)

మరి ఈ అలక ఎలా తీరిపోయిందా?    

అద్దం మీద ఆవగింజ ఎంతసేపు ఉంటుంది?
వలపు గాలి విసురుగా వీచేవరకే......... 

సూపర్ మంత్రం ఇది.

మగవాళ్ళు A .k  నుండి తప్పించు కోవాలంటే నూరు సార్లు 
జపించండి.

ఆడవాళ్ళు వలపుల బంధం నిలుపుకోవాలంటే నూట ఒక్క 
సార్లు జపించండి.

ఏది ఒక సారి అనండి......జై పొట్టేలు.....జై జై పొట్టేలు......


11 comments:

Anonymous said...

very nice naku me bada talusu,yandukanta nanu me posting chusatapudu 3 times current poindi Madhu.........

it is sasi world let us share said...

బాద పడీన వారికె నా బాద తెలుస్థుంది థాంక్స్ మదు గారు...వా.......

Anonymous said...

humorous post :)

శరత్ 'కాలమ్' said...

:))

ఆ.సౌమ్య said...

హహహ మీరు రాసిన విధానం చాలా బావుంది...బలే నవ్వించారు. :)

it is sasi world let us share said...

శరత్ గారు,సౌమ్య గారు చాలా థాంక్స్......

ఇందు said...

:)))))))) Bhal undi sasi garu :)

it is sasi world let us share said...

హాయ్ ఇందు...ఇంకా మా ఇందు చూదలెదు యెందుకు
అనుకుంటున్నాను.థాంక్యు....

నందు said...

మీ పెళ్ళైన తొలి నాళ్ళలో సినిమా ముచ్చట్లు పంచుకొని మమ్మల్ని ధన్యులని జేసారు. ముఖ్యంగా నాబోటి పెళ్ళి కావాల్సిన బధుద్దాయి ని. నాకంటూ ఇలా సినిమాకి తీసుకెళ్ళే చాన్సే వస్తే ముందుగానే చూసి. ఆ పేరులో ఏ పొటేలో ఉంటే అదే పొటేలు బూరె లో పూర్ణం లా సినిమాలొనే ఉందో లేక మైసూరు పాక్ లో మైసూరు లా లేకుండా పోయిందో తెలుసుకు జాగ్రత్త పడతాను..అదే చేత్తో .. అధునాతన ఏ.కే లకి ధీటుగా ఓ హెల్మెట్ కొనుక్కొంటాను. Thanks for all the enlightment :)

-Nandu

శశి కళ said...

నందు గారు థాంక్యు.మీరు కూడా బాగా వ్రాస్తారు.

Palla Kondala Rao said...

:))

జై పొట్టేలు.... బాగా ఆలస్యంగా !