Saturday, 30 July 2011

స్నేహ బంధము .....ఎంత మధురము...


స్నేహ బంధము ఎంత మధురము ...కరిగి పోదు చెరిగి పోదు జీవితాంతము .... 


 

ఓఓ....my friend.........తడి కన్నులనే తుడిచిన 
నేస్తమా.........
     అపార్దాలతో వీడి పోనిది
    కోపానికి చెదిరి పోనిది
    నీ మేలుని కోరుకునేది
    బదులుగా ఏమి ఆశించనిదికమ్మని జ్ఞాపకం
వాడని పరిమళం
వీడకు నీ హస్తం
నడిపించు నేస్తం

మిత్రమా .............నువ్వు లేవు ఒంటరిగా .....
నువ్వుంటున్నావు విశ్వం లో మమేకమై 
నువ్వుంటున్నావు సర్వస్వంగా
నువ్వు ఉంటున్నావు సంబవించని సృష్టిగా
నువ్వుంటున్నావు మొక్కగా లోలోపల మారే విత్తనంగా

నీ ఒక్కడి జీవితమే ప్రవహిస్తూ ఉంటుంది
ఎన్నో రూపాలగా
ఓ విశ్వం లో ఎంతగానో ,ఓ అణువు లో అంతగానే 

నువ్వు లేవు ఒంటరిగా ,నువ్వు లేవు ఊరకనే

విశ్వం లో మమేకమై 
విశ్వ ప్రణాళిక లో బాగమై
దర్శిస్తూ ఆనందాన్ని ,దర్శిస్తూ స్నేహాన్ని 
పంచుతూ సంతోషాన్ని ,శాంతి ని

మిత్రమా నేవేన్నడూ లేవు ఒంటరిగా

నీ నీడగా నేను ఉన్నంతవరకు .......
నా ప్రాణం గాలిలో కలిసేవరకుThursday, 28 July 2011

నేను..కెవ్వ్....నా దయ్యం

అమావాశ్య .......అర్ధ రాత్రి......కీ......కీ.......కీచురాళ్ళు .........
ధబ్......................ఏదో పడిన శబ్దం   ..............................
కెవ్వూ..............కేక.........నిసీద  నడిరాత్రి లో నల్లని ఆకారం.......
అదిగో మీ పక్కనే.....................................................................

తూచ్......తూచ్.....తూచ్.......బయపడ్డారా?ఎంత మాత్రం దైర్యం ఉందొ టెస్ట్ చేశా నొచ్ .............
అయినా నా బ్లాగ్ లో ఇటువంటివాటికి నో ప్లేస్. తొందరగా చదివేయండి.
తరువాత డెలీట్ చేసేస్తా.
 ఏమిటి ఇంకా బయంగా ఉందా?శ్రీ ఆంజనేయం ,ప్రసన్నాంజనేయం...........

(ఏమిటి మీకు బయం లేదా?నాకు బయం అని కని పెట్టేసారా కొంప తీసి....)

సరే మీ బయం పోవడానికి.........................................
(ఏమిటి నా బయమా ....ఎవర్రా అది.....బూత ప్రేత పిశాచ ...
నారి బంబం.......అవును సొంత పాటే ......నా దెయ్యం వేరే వాళ్ళ పాటలు పాడితే రాదు)
ఒక రోజు ఏమయ్యిందంటే .............ఏమిటి ఇంకా మా దయ్యం ఊ....అనలేదే.
దానిని చూడాలనే కదా కోరికతో మా వారిని అడిగింది.
అదేనండి అరుందతి.మా వారిని అడిగా ...ఏమండీ.....ఏమండీ........ఏమండీ eeeeeee .....

(మన పనులు కావాలంటే అలా దీర్గం తీస్తూ పిలుస్తామనమాట ......ఏమిటండి.......
అన్నారు అనుకో అడిగి వేయొచ్చు.అలా కాక ఏమిటి?...అని చూసారో ........
ఇంకా అడగటం జానతా  నై)

హమ్మయ్య...మంచి మూడ్ లోనే ఉన్నారు .మెల్లిగా చెప్పా.అరుందతి సినిమా చూడాలని 
ఉంది అని."నేను రాను.నాకు ఓపిక లేదు వదిలేయ్యబ్బా.అన్నారు"

(వాళ్ళ మీద ఆదార పడ్డామని అలుసు)

ఎందుకో బలే రోషం వచ్చింది.

(ఈయన లేక పోతే పోలేమా పెద్ద......ఇష్....నిజంగానే పోలేము.
అందులో దెయ్యం సినిమా. ఎవరండి ఇండియా డెవలప్ అయింది అంది)

వస్తారా?రారా?సీరియస్ గా అడిగాను.రాను గట్టిగా చెప్పారు.
(ఇంత దైర్యం ఎక్కడి  దబ్బా?బహుశా దెయ్యం తో ,కోడి రామ కృష్ణ తో వేగే
బదులు భార్య తో వేగటం బెటర్ అను కొనిఉంటారు)

నాకు తిక్క రేగింది(కొత్తగా రావటమేమిటి ?ఎప్పుడూ ఉంది కదా
అని ఎవరో గొణుగుతున్నారు .సరే సినిమాకి వెళుతున్నా కాబట్టి 
క్షమించేసా.)
నేను నివాస్ ని తీసుకొని వెళతాను అన్నాను."పొమ్మా ఎవరొద్దన్నారు"
అనేసారు నన్ను వదిలిందే చాలురా దేముడా అన్నట్లు.
అనేసాము కాబట్టి ఇంకా వెనక అడుగు వేయదలుచుకోలేదు.కాని ఎప్పుడు వెళ్ళలేదు 

కాబట్టి కొంచం జంకుగా ఉంది.సరే అని ఇంకో మాడం కి ఫోన్ చేసాను.
ఎందుకంటె...........

we may arrive on different ships ,but we are on the same now.

 .
వాళ్ళ ఆయన కూడా సినిమాకి వచ్చే టైపు కాదు.ఆమె ఉత్శాహంగా తన కూతుళ్ళు 
ఇద్దరినీ (7,6 తరగతులు) బండి మీద తీసుకుని సినిమాకి వచ్చింది.నేను బాబుని 
తీసుకొని వచ్చాను.ఇంకా మా ఇద్ద్దరికి హుషారే హుషారు.ఇంకా ఏమి సినిమాలు 
వచ్చినా మేమిద్దరమే చూసేద్దము అనుకోని ఆనంద పడిపోయాము.

సినిమా మొదలైంది.......ఊఊ.........ఊ.......కార్ లో ఇద్దరు వస్తున్నారు పెళ్లి పత్రిక 
తీసుకొని .........ప్రమాదం ....డమేల్......చెట్టుకి గుద్దుకొని కార్ ఆగిపోయింది.
పక్కనే పాత ఇల్లు కొత్తగా మారిపోతూ.......ఊఊఉ............
ఒకరు వచ్చి అటు వెళ్ల వద్దు...

ఎవరు లేరు......కి..కి........బాబోయ్......
గుండె నాకు మాత్రం పెద్దగా వినిపిస్తూ .........

బయం వేసి పక్కకు చూస్తును కదా.....మన ఆడ పిల్లలు ఇద్దరు అమ్మకి చెరో వైపు 
కరుచుకొని ఉన్నారు.ఆమె కళ్ళు మూసుకొని మంత్రాలు.........

(అంటే నేనే బెటర్ శేబాష్ శశి అనుకోని )
బాబు తో కలసి సినిమా చూస్తున్నాను.
మళ్ళా కొంచం డమ్మారె ...డమ్మారె .....డం......పాటలు

(దెయ్యం ఎక్కడో బజ్జోని ఉంటుంది,దానికి తోడూ అమ్మ దయ్యం ఒకటి మా ప్రాణాలకి)

అరుందతి ని రప్పించటానికి వాళ్ళ తాత కాలు విరగ కొడుతుంది దెయ్యం నీళ్ళు 
పంపించి.....అది ఒక బయానకమైన సీన్ ......పక్కకు చూద్దును కదా అమ్మ ఇద్దరు 
కూతుళ్ళు ముగ్గురు జాయింట్ గా నెల మీదకి సీట్స్ వెనుక వాలి పోయి ఉన్నారు.
నేనింకా బయటపడలేదు కాని బయం తో వణికి పోతున్నాను 
(ఇంటి కి పొయామో అనుకో అలుసు అయిపోమా) 

దెయ్యం మళ్ళా పని పిల్లలో చేరి.........తిరుగుతుంది.....కెవ్వు......నోటి మీద చేయి 
పెట్టేసు కున్నాను .దయ్యం ఎలాగోలా అరుందతి ని  ఊరికి వెళ్ళకుండా ఆపేసింది

(ఇక్కడ మాకు లబ్...డబ్....లబ్....డబ్......)

ఇంటర్వెల్ కల్లా మాడం లేసేసింది.మాడం నా వల్ల కాదు నేను వెళ్లి పోతున్నా....అని 
వెళ్లిపోయింది.

ఇక ఇప్పుడు నా వంతు."రేయ్ నివాస్ మనం కూడా వెళ్లి పోదాము రా"వాడిని అడిగాను.
వాడేమో టాం అండ్ జెర్రీ చూసినట్లు చూస్తున్నాడు.నాకేమో వాడు బయపడితే నిద్రలో 
ఉలిక్కిపడతాడని నాకు బయం .మద్య లో వాడి కళ్ళు మూస్తే ......మా  తమాషాలా ..
నేనిప్పుడు పదో తరగతి నాకేమి బయం అని విసుక్కున్నాడు

.(దెయ్యానికి ఏమి తెలుసు వీడు పదో తరగతని)

ఇంకా క్లాసు తీసుకున్నాడు.
"ఎప్పటికైనా దెయ్యం చనిపోతుంది కదా .ఎందుకు బయపడతావు"అని.

(డైరెక్టర్ వీడికి చెప్పాడు కాబోలు)

అబ్బ అందరు ఊరికి వెళ్ళినాక దయ్యం బల్లి లాగా పై కప్పు నుండి క్రిందకు  దూకుతుంది .....
డమేల్ ...............ఊ......ఉ.........

డాం......అంటే కిందకి వాలి పోయాను.......గుండె అయితే ఎప్పుడో పొట్టలోకి 
వచ్చేసింది.గుండె ఎందుకులే.....దబ.......దబ........అంటే పొట్టలోకి వస్తే గుండె 
అలాగే కొట్టుకుంటుంది.

ఇంకా ఏమి చేసానా....భర్త మాట వినాలి అని గట్టిగా ఒట్టు పెట్టేసుకున్నాను.

.(బయటకు వచ్చినాక గట్టున పెట్టేసాన్ లెండి) 

అరుందతి నాట్యం చేస్తూ ఉంది.....బాబోయ్....ఎవరు రక్షిస్తారు.......
హమ్మయ్య......సాయబు వచ్చి మేం సాబ్......అని అరిచి ఆ మంత్ర దండం విసిరేశాడు.

చచ్చాడు పో........అనుకోని ఊపిరి పీల్చుకున్నా.....కాని చావడు......ఇంకేమి చేసేది 
దేవుడా........అనుకుంటున్నా......అరుందతి దానితో పొడుచుకుంది............

(బాబోయ్.....ఇప్పుడు దెయ్యాన్ని ఎవరు చంపాలి ....నేనా?...కేవ్వ్వ్......)

హమ్మయ్యా ....దానితో అరుందతి దెయ్యాన్ని చంపేసింది.


హమ్మయ్యా.....................దెయ్యం ఖతం..............మనం ఇంటికి......

హలో .....ఈ కద ఎవరికైనా పది మందికి చదవమని చెప్పకపోయారో .............

ఉహ.......హ......హ..........మిమ్మల్ని మంత్రా వచ్చి కాంచనాకి ఇచ్చేస్తుంది.....
మర్యాదలు చేయటానికి కాదు....................
ఏమి  కాదు......పీక్కు తినటానికి..............డౌట్ గా ఉందా.......

ముందు వాళ్ళ కొడుకు మీ పొట్టలో నూడుల్స్ తినటానికి ఫోర్క్ తెచ్చుకున్నాడు చూడండి........Saturday, 23 July 2011

క్షమ......తెలుసా దాని మహిమ?

క్షమించటమా  తెలుగు పదాలలో నాకు నచ్చని పదం అదొక్కటే .........................

 క్షమించటం అంటే ఇంకో తప్పుకు అవకాశం ఇవ్వటమే .....

 ఇలాంటి హీరోల భావాలు తమరికి ఎవరికైనా ఉంటె అర్జెంటు 
గా ఈ పోస్టింగ్ చదవాల్సిందే.................

మామూలుగా తమరి మిత్రులెవరో చెప్పండి 
తమరి గూర్చి చెపుతా అంటారు కదా అది పాత డైలాగ్ ....
(మరి కొత్త దేమిటి చెప్పు అంటున్నారా?లేటుగా చెప్పినా 
లేటెస్ట్ గా చెపుతా)

"మీ శత్రువులు ఎవరో చెప్పండి.మీ గూర్చి చెపుతా"

ఇది మరీ బెదిరిందా?

మరి మీకు ఎంత మంది శత్రువులు ఉంటె అంత మంది 
తో మీకు సరిపడ లేదన్నమాటే. అంత ఎక్కువగా మీకు 
నిద్ర పట్టదన్నమాటే. అంత ఎక్కువుగా మీ అ ఆరోగ్యం 
 పాడవుతుంది అన్న మాటా.


ఏమిటి ఇన్ని మాటలు చెపుతుంది అనుకుంటున్నారా? 

ఆ మాటలు సరిగా ఉపయోగించకపోతే అంత మంది 
శత్రువులు అన్న మాట.

ఎవరైనా తప్పు చేస్తే మీరు ఏమి చేస్తారు?కోపం తో తిడతారు
అంతె కదా?తిట్టక ముద్దు పెట్టుకోవాలా అంటారా?

(బాబోయ్ నా వైపు దేనికి అంత కోపంగా చూస్తున్నారు?)

మరి క్షమించక పొతే నష్టపోయేది మీరే.

కోపం అనేది బురద లాంటిది .అది ఎదుటి వారిపై పోస్తే 
మిమ్మల్ని కూడా మురికి చేస్తుంది.
ఎంత వరకు క్షమించాలి?మరి పెద్ద వాళ్ళు చెప్పింది 
అదే కదా.సామ ,బేద ,దాన,దండోపాయాలు.

ఎలాగంటే మీరు అధికారి అనుకోండి ,మీకేన్నో టెన్షన్స్ 
ఉంటాయి.అప్పుడు మీ క్రింది వ్యక్తి తప్పు చేసాడు.
అప్పుడు మీ కోపానికి అతన్ని బలి చేస్తారు.అప్పుడు ఏమి 
అవుతుంది.........there starts the problems..........

అతనితో మీకు చాలా అవసరాలు ఉంటాయి కాని అతడు 
ఇక మీకు సహకరించడు  పైగా మీ గుట్టు మట్లు అన్ని ఇతరులకు 
చెప్పి తన కోపం తీర్చుకుంటాడు.క్షమించారు అనుకోండి 
అతనికి మీమీద ఇంకా గౌరవం పెరుగుతుంది.
మీరు హాయిగా నిద్రపోవచ్చు.

ఎంత పెద్ద తప్పు అయినా ఎలా క్షమిస్తాము?అంటారా.....
నిజమే ఆ సంగతి అతనికి అర్ధం అయ్యేటట్లు కోపాన్ని 
చూపించాలి.అంటే మీరు మీ కోపం చూపటానికి తిట్టలేదు 
అని అతనకి అర్ధం కావాలి.

కోపం లో మాటలు తూలి ఇతరులుని దూరం చేసుకునే 
దానికన్నా క్షమించి దగ్గర చేసుకుంటే మీ శత్రువులు 
తగ్గుతారు మీరు హాయిగా ఉంటారు.పొరుగువాళ్ళ 
విషయం లో కూడా ఇది గుర్తించుకుంటే మీకు మంచి 
ఇరుగు పొరుగు దొరుకుతారు.క్షమించటం చేతకాని 
తనం అంటారు కాని కోపమే చేతకానితనం కాదంటారా....

మీరేమి చేయలేని పరిస్థితులలో మీకుఇంకా ఎక్కువ 
కోపం వస్తుంది కావాలంటే ఆలోచించి చూడండి.

కాబట్టి వీలైనంత వరకు క్షమించేద్దాము......
మన కోసం మన ఆరోగ్యం కోసం...........
మన చుట్టూ సంతోషం విరియటం కోసం............
మరి చెప్పండి మీ శత్రువులు ఎంత మందో.....నేను చెపుతాను
మీ గురించి ........కాదంటారా?

Wednesday, 20 July 2011

విపత్తు .....నీ తెలివితొ అది చిత్తు....

When it rains, all the birds fly for shelter. But the eagle alone avoids the rain by flying above the clouds. Problem is common to all, but attitude makes the difference


మా పాప presentation కోసం ఈవ్యాఖ్య చూసినపుడు నాకు చాలా....చాలా.....నచ్చింది.

ఇది అందరు గుర్తు ఉంచుకోవాల్సిన వాక్యం.

చాలా కష్టాలు అందరికి ఒకటెగా వస్తాయి.కాని కొందరు అందరిలా ఆలొచించక 

విభిన్నంగా ఆలొచించి ఆ సమస్య ను పరిష్కరించుకుని అందరికి ఆదర్శం అవుతారు.

ఇంకొక విషయంగుర్తు ఉంచుకోండి.

సమస్య వచ్చినపుడు అది మీదని కాకుండా గ్రద్ద లాగా ఆ సమస్య మబ్బు లాగా ,
మీరు పై నుండి ఆ సమస్య ని చూస్తున్నట్లు ఊహించుకోండి.
తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది.మిగతా వాళ్ళు ఏమనుకుంటారొ అని 
ఆలోచిస్తె సమస్య ఇంకా పెద్దది అనిపిస్తుంది.

పరిష్కారం లేని సమస్యే లేదు.మనం కొత్తగా ఆలోచించగలిగితె..................

విభిన్నంగా మానవత్వం తొ ఆలోచించండి.......జీవితం లో  ఆశల హరివిల్లులు
విరబూస్తాయి....................................................

                                 సంతోషాల హరివిల్లు
                     మీ పై కురిసేను 
                      నవ్వుల జల్లు 
                                 

Sunday, 17 July 2011

తిరుపతి.....ఏమిటి మా గతి.......

...అలొ.....అలొ......అలొ......ఏమి చేస్తున్నాలు?పొస్ట్ చదవాలని
వచ్చాలా?

ఏమి లేదండీ....మా బాబు
చిన్నప్పటి అల్లరి బాల్యపు తీపి గుర్తులు 
రాద్దామని.....మొదలెట్టాను అన మాట.ఊ.......ఊ........యెక్కడ నుండి
మొదలు పెట్టాలి?ముందు మా బాబు పోటో చూపిస్తాను.

 
అరెరె......బుజ్జి కన్నయ్యా......దా...దా......దామ్మా........నీ గూర్చె చెపుతున్నాను.
(మీరెమి చిచ్చి......బుజ్జి.....అనక్కర్లేదు.....పదండీ....పదండీ......)

మా అమ్మ మూడొ ఏడు వరకు పెంచి స్కూల్ లొ వేయమని నా దగ్గరకు పంపింది.
అప్పుడు మేము ఉండె ఊరిలొ దసరాకు పిల్లల కు చాల పొటీలు పెట్టెవారు.పిల్లలను
ఆ పోటీలకు పంపేది నాకు సరదా.ఆ రొజు fancy dress పోటీ .వాడికి వామనుడి లాగ
వేద్దామని గడ్డి తొ చిన్న గొడుగు చెసాను.అన్ని బాగా కుదిరాయి.కాని మూడు అడుగులు
నేల ఇమ్మని వాడు డైలాగ్ చెప్పాలి.

వాలికెమొ...ఇన్కా సలీగా లాదు
(ఒహ్.....నాకు బాగానెవచ్చు కద....నెను ఏందుకు అలా మాట్లడటం)

ఇక మన హీరొ స్టేజి మీదకి యెక్కాడు.అందరికి బలే ముద్దుగా ఉంది ఏమి చెపుతాడా అని.
అసలు మాట్లాడీతె గదా.నోట్లొ  centre fresh పెట్టు కున్నట్లు గమ్మున నిలుచున్నాడు.

(ఏమిటి?నెను పొయి చెప్పమంటారా?మీ కిచ్చెస్తా centrefresh)

నెను క్రింద నుండి చెప్పగా.....చెప్పగా....నొరు విప్పి అడిగాడు.....ఏమని అంటె 
రెండు అడుగుల నేల కావాలని......ఇక అందరు నవ్వటమె.......వాడి పొట్టి కి తగ్గట్టు 
అడిగాడని.

వాడికి పదేళ్ళ వయసులొ మెము మా వారి అన్నగారి కుటుంబము కలిసి తిరుపతి వెళ్ళాలని
అనుకొని బయలుదెరాము.వాళ్ళకు ముగ్గురు ఆడ పిల్లలు,మా పాప,బాబు కలిసి ఐదుగురు 
పిల్లలు.అందరు తిరుమల కు నడిచి వెళ్ళాలని అడిగారు.అక్క,నెను పిల్లలకు సపోర్ట్.
ఇంక మొగవాళ్ళు కూడా ఒప్పుకొని నడవసాగారు.

అప్పుడు చూడాలి మగవాళ్ళ తిప్పలు..................
(పెళ్ళి కాని వాళ్ళు చదవక పొతె మంచిది.లేక పొతె 
పెళ్ళంటె బయపడె ప్రమాదం ఉంది.యెమి బయంలేదా సరె .....సాహసమ్ చెయరా డింబకా...
నీకు తగ్గ విజయ లక్ష్మి వరించేనులే......)

అసలె వీళ్ళు తూనీగలు.పరుగొ.....పరుగొ......ఒకరు మామిడి కాయ కావాలంటే......
ఇంకొకరు కూల్ డ్రింక్ అంటె........ఇంకొకరు మెట్లపై పరుగు.......నెను ఫస్ట్ అంటె,నేను ఫస్ట్ అని...
మగవాళ్ళకు పిల్లలను వదిలేసి నెను అక్క హాపిగా కబుర్లు చెప్పుకుంటూ నిదానంగా ఏక్కుతున్నాము.
వాళ్ళకు మండిపోతుంది.
"ఇంకో సారి మీతొ వస్తె చూడండి" అని బెదిరించారు.

వెంటనె పై కోర్ట్  ఆర్డ్ ర్ వేసినట్లు పిల్లలకు వార్నింగ్ ఇచ్చెసాము .
మీ నాన్న వాళ్ళకు కోపంవచ్చింది .
వెంటనె అల్లరి మానేసి బుద్దిగా ఉండండి.లేకపొతె ఇక్కడే వదిలేసి పొతాము "అన్నాము.

యెంచక్కా బుద్దిమంతులై పోయారు.

అసలు తిరుమలకు నడిచి వెళుతుంటె ఆహా........చూడాల్సిందె......వర్ణించలేము.

పచ్చని కొండలు,చల్లని పవనాలు,మబ్బుల్లొకి నడిచి వెళుతున్నట్లు ఖచ్చితంగా పాట పాడాల్సిందే.
"గాల్లొతేలినట్లుందె.......గుండే జారినట్లుందే..........తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్లుందె......."

అక్క ని కలిసి చాలా రోజులయ్యెసరికి ఇద్దరం మాటలె......మాటలు............గల.....గలగల......
గల గల గల............

మా బావ గారు ఉన్నట్లుండి "శశి నీకు ఒక విషయం తెలుసా?" అని అడిగారు.
మెము మాటలు ఆపి కుతూహలంగా "యెమిటి బావా?"అని అడిగాను.

"కపిల తీర్దం జలపాతం శబ్దం వినిపించటం లేదంట.."చెప్పారు.అది తిరుపతి లొ చిన్న జలపాతం.

"ఎందుకు బావా?"అడిగాను."ఏమి లేదు మీ మాటల శబ్దం వలన ....."

అంతె నెను, అక్క బావ ని కంటి చూపు తొ .............చూసాము.
"అసలు మెము తక్కువకొందరు మాట్లాడితె నయాగర జలపాతం 
కూడా వినపడదు తెలుసా?"

(సామెత తెలుసా?అడివి అంతా సింహానికి బయపడీతె ,సింహం సింగానికి బయపడుతుందంట...)

వెంటనె నవ్వెసి మాట మార్చెసారు.

ఈ లొపల మా వాడికి బుద్దిగా ఉండటం బొర్ కొట్టింది.
"అమ్మ నెను 500 మెట్టు దగ్గర ఉంటా"అని అడిగాడు.
సరె పొ అన్నాను .వాడు అలాగె తూనీగ లాగా వెళ్ళి అక్కడ కూర్చుని ఉన్నాడు 

మెము వచ్చెవరకు.అలాగె 1000,1500 మెట్ల దగ్గర మా కొసం కూర్చుని యెదురు చూసాడు.

మెల్లిగా మధ్యలొ ఆంజనెయ స్వామి విగ్రహం ,జింకల పార్క్ దగ్గరకు వచ్చాము .హమ్మయ్యా......
ఇక్కడ వరకు నడిచాము కదా కూర్చుంటాము. 
హలొ.........మీరు వెళ్ళి స్వామి కి దణ్ణం పెట్టుకొని ,జింకలు చూసి ఎంజాయ్ చెయండి.

మళ్ళా ప్రయాణం ....పదండీ.......పదండి.............ఆడ పిల్లలు ముందు నడుస్థున్నారు.వెనుక మగవాళ్ళు 
వెనుక నెను అక్కా.మళ్ళా మా వాడు "అమ్మా....నెను అక్కా వాళ్ళతొ వెళతాను"అని అడిగాడు.సరే నని 
పంపాను.

సరె యెవరి గోలవాళ్ళ దే.......బి జీ గా ఉన్నాము.కాసెపు తరువాత ఆడ పిల్లలను అడిగాను 
"తమ్ముడు ఏడి?" అని.

వాళ్ళు బయపడి పోయారు.మీ దగ్గర కద ఉండేది అన్నారు.జరిగింది యెమిటంటె వాళ్లు 
పేలాలు మిక్సర్ కొనుక్కొవాలని వెళితె వీడు చూసుకొకుండా వెళిపోయాడు.

నాకు నోట్లొ  నుండి మాట రావటం లేదు."దేవుడా యెలా వీడు దొరికెది......."నాకు కళ్ళు 
తిరిగి పొతున్నట్లుంది.బావ గారు దైర్యం చెప్పారు వాడు 2000 మెట్టు మీద ఉంటాడులె.....అని.

గబ....గబ....అక్కడికి వెళ్ళాం......అక్కడ.....లెడు.నాకైతె మనసు మనసులొ లెదు.

దైర్యం యెటు పోయిందొ........ఏడుపు ఆపుకుంటూ ...అందరిని అడుగుతూ వెళుతున్నాము.
అప్పటికె వీడు కనపడక చాలా సెపు అయింది."తిరుపతి వెంకన్నా యెమిటి మా గతి?
సాయి బాబా యెన్ని మొక్కులు మొక్కానొ ....."

అప్పుడు యెదురుగా ఒక అతను కాషాయ వస్త్రాలు వెసుకొని ఒక పుస్తకమ్ గుండెలపై
పెట్టుకొని వస్తూ ఉన్నాడు.ఆ పుస్తకం అట్ట పై బాబా నవ్వుతూ ఆశీర్వదిస్తూ కనిపించాడు.
యెందుకొ బాబు క్షెమంగా ఉన్నాడు అని పించింది.

"బాబా వాడికి వాళ్ళ నాన్న ఫొన్ నెంబరు ఒకటె తెలుసు అది వాడికి గుర్తు రావాలి "
అని ప్రార్దించ సాగాను.

ఇక లాస్ట్ 100 మెట్లు ఉన్నాయి.ఒక ఆమె అక్కడ అమ్ముకుంటూ ఉంది.ఆమె చెప్పింది.
ఇందాక ఒక బాబు రెండు సార్లు మెట్లు దిగి యెక్కాడు అని.పై మెట్టు మీద ఉంటాడు అని 

మా వారు స్పీడ్ గా వెళ్లారు.మేము ఉన్నాడా?అని కెక వెశాము.లేడని చెప్పారు.అంతె నా 
కయితె కళ్ళు తిరిగాయి.ఇంతలొ అక్క అరిచింది.ఉన్నాడంటా.....ఫొన్ చెసాడంటా...అని.
            
  మా వారు చివరి మెట్టు యెక్కెసరికి అక్కడికి కొంచం దూరం నుండి వీడీ ఫొన్.
అక్కడ ఏడుస్తూ ఉంటె యెవరొ అడిగితె "మా అమ్మ,నాన్న తప్పిపోయారు"అని ఏడ్చాడంట
(తప్పి పోయింది వీడా? మేమా?)

వాళ్ళు ఫొన్ చెస్తుంటే వాడికి మా వారు కనిపించారు."అదిగొ మా నాన్న.....అని పరిగెత్తుకొని
వచ్చాడు.(నయం ఆప్పుడు చిరుత పులులు లెవు.లేక పొతె అమ్మో..........)

ఇంక నేను అయితె వాడినింక వదల లెదు.
కధ సుఖాంతం ఇంకా యేమి చూస్తారు నవ్వండీ.....హ......హ....హ...........

ఇదంతా ఇప్పుడు ఏందుకు రాసాను అంటారా?
ఏమి లేదండి......వేణూ శ్రీకాంత్ వాళ్ళ అమ్మ మీద వ్రాసిన అర్టికల్ చూసిన తరువాత
మా బాబు కి యెప్పుడైనా నా ప్రేమతొ స్పూర్తి పొందాలంటే వాడికి చదువుకోను ఇది 
ఇది ఉండాలని వ్రాశాను.

మీరెందుకు బాద పడుతున్నారు?నెను ఏక్కడికి పోతాను?
సరె మీకు ఒక మంచి జోక్............

డాక్టర్ ; x-ray  తీస్తె మీ యెముక ఒకటి విరిగి కనిపించింది.

పెషంట్; అయ్య బాబొయ్.........యెలా ఇప్పుడు?

డాక్టర్; పరవాలేదు......photo shop లొ అతికించేశాము.

పెషంట్; ఆ.....ఆ.......ఆ...........Thursday, 7 July 2011

మా ఊరు ..ఒక కమ్మని కల

ఎవరికైనా పుట్టి పెరిగిన ఊరు తమ బాల్యాన్ని 
మోసే కమ్మని కల......

పెదాలపై నవ్వు తెప్పించగల 
తియ్యని జ్ఞాపకం............

కల్మషాలు లేని 
అందమైన హృదయం.........

ఇది నా ఊరు.......
నా ఆట.......నా పాట.......అల్లుకున్న అందమైన తోట.......
మా కోట..........   

Tuesday, 5 July 2011

LEAD INDIA 2020


               LEAD INDIA 2020 
"యువత చేతిలోనే దేశ ప్రగతి ఉందిరా,
యువత తలుచుకొంటే చేయలేనిదేమి లేదురా."

"
All the powers are with in you"
                        -Swami Vivekananda.


ఏమిటి ఈ లీడ్ ఇండియా ?
యువత చేతిలో దేశ ప్రగతి ఎలా ఉంది ?
 

దీనికి సమాధానమే ఒక నిస్వార్ధ వ్యక్తి కల.
మన ప్రేమ మన ఇంటి వరకే పరిమిత మైతే మన పిల్లలు మాత్రమే అభివృద్ధి చెందుతారు.
 

అదే ఆ ప్రేమ విశ్వ జనీనమైతే దేశ అభివృద్దికి దారి తీస్తుంది.

అభివృద్ధి చెందినా దేశం లో నివశించాలని "అడిగిన ఒక చిన్నారి హృదయపు అభిలాష
ఒక నిస్వార్ద వ్యక్తి ఉద్యమానికి పిలుపునివ్వటంతో సాకారం పొందనారంబించింది.

 
అతనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు.   
                           

స్వాతంత్ర్యము కొరకు "క్విట్ ఇండియా " "వందే మాతరం"అని ఒకే లక్ష్యం తో
జాతి మొత్తం పయనించి అది సాదించాము.
నేడు అందరిని ఒకే వైపు నడపటానికి ఒక ఉద్యమం అవసరం అని
కలాం గారు గ్రహించి లీడ్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇచ్చారు.
 

 L-LEADERSHIP,

E-EXCELLENCE,

A-AWARENESS,

D-DEVELOPMENT
 

ఈ నాలుగు విషయాలలో యువతను సుశిక్షితులుగా తీర్చిదిద్ది తుంది.
దీనికి 2020 సంవత్శారాన్ని ఎందుకు ఎన్నుకొన్నారు?
        

మిగతా దేశాలతో పోలిస్తే 2020 నాటికి మన జనాబా లో 55 శాతం 
యువత మన దేశంలో ఉంటుంది.
వారిని కాని మనం నైపుణ్యము,దేశ బక్తి కలవారిగా చేసుకొంటే 
అంత యువ శక్తి ని ఎవరు ఆపగలరు?
          

ఈ శిక్షణ లో ఒక వ్యక్తి ప్రగతి దేశ ప్రగతికి ఎలా దారి తీస్తుందో చెపుతారు.
ఇంకా లక్ష్యం ఉండుట ఎంత అవసరమో దానిని ఎలా సాదించాలో చెపుతారు.
విస్వనాయకత్వ లక్షణాలు పెంపొందించుట,విలువలు,
శారిరికాభి వృద్ది ,ఆలోచనలు వైఖరులుగా ఎలా మారుతాయోచెపుతారు.
 

W-WORDS,

A-ACTION,

T-THOUGHTS,

C-
CHARACTER,

H-HEART,

 

డైరీ ద్వారా ఎలా గమనించుకోవాలో విలువలతో ఎలా పెరగాలో చెపుతారు.

 ప్రస్తుతం సుదర్శన ఆచార్య,Oasis school of excelency,raidurga,hyderabad గారు దీనిని
ట్రైనింగ్ ఇస్తున్నారు.

 
"sound mind in a sound body"
చాల మందికి తమ పిల్లలు నైపుణ్యం తోనే కాక విలువలతో కూడా
పెరగాలని ఉంటుంది.ఈ ట్రైనింగ్ యువత కందరికీ ఇవ్వటం వలన 2020  నాటికి తప్పక ఇండియా విశ్వ విజేత గా నిలుస్తుంది.రేపటి భవిత కోసం ఈనాడు యువత ఫై శ్రద్ద వహించటం మనందరి బాద్యత.
   

LEAD YOUTH TO LEAD THE INDIA TO LEAD THE WORLD BY 2020"


Friday, 1 July 2011

కాపాడే దైవమె కాసులకు ఆశ పడితే....

తల్లి తండ్రులు జన్మ నిస్తే 
దైవం ప్రాణం పోస్తే 
ఆ ప్రాణాన్ని కలకలం కాపాడే 
దైవం ఒకరున్నారు.......
వారే వైద్యులు.............
కాని వారిలో కొందరు డబ్బుకు ఆశపడి
సిజేరియన్ అవసరం లేకున్నా చేస్తున్నారనే 
విషయం పేపర్ లో చదివినపుడు చాల భాద 
వేసింది.ఈ కవిత నవ శంఖారావం పత్రిక లో 
పోయిన సంవత్షరం వచ్చింది.
మంచి వాళ్ళు ఉన్నారు.......
చెడ్డ వాళ్ళు ఉన్నారు..........
మంచి వారికి నమస్సులు.......
చెడ్డ వారి హృదయం తెరుచుకోవాలని 
నూతనంగా ఈ భూమి పై కి వచ్చే పసి బిడ్డని 
పైకపు ఆశలతో కాక పరిమళించే చిరునవ్వుతో 
ఆహ్వానించాలని ఆశిస్తూ.............................


                         ప్రకృతికి కత్తెర

 పరితప్త జంట హృదయాల ప్రార్ధన తో 
ప్రకృతి పరిష్వంగం నుండి 
పరమాణువు గా వీడి 
పసిపాప గా మారి 
ప్రపంచం పరికించాలని
చిన్నగా విప్పిన కళ్ళు 
చూస్తున్నాయి పైకపు ఆశల కుళ్ళు 

ప్రాణాలు పోయాల్సిన చేతులు 
పాపపు మూటలు మోస్తూ 
అమ్మతనాన్ని కత్తిరిస్తూ 
జననాన్నేకృత్రిమము  చేస్తూ 
పసిడి కత్తెర వేస్తుంటే 

రక్తపు మరకల పుణ్య ధారలు
లో మునగాల్సిన కరములు 
కాసులకు ఆశ పడి 
ఆశల సౌధాలు కూలుస్తూ 
నిర్వీర్యపు జీవితాలకు 
నైరాశ్యపు స్వాగతాలు చెపుతున్నాయి 
స్వార్ధపు సంగతులనే 
కొత్త ప్రాణికి పరిచయం చేస్తున్నాయి......


పశ్చాతాపంతో పరమాత్మునిగా 
మారి మానవులు పసిపాపలకు 
పరిమళాల స్వాగతం ఇచ్చేదేన్నడో ?