క్షమించటమా తెలుగు పదాలలో నాకు నచ్చని పదం అదొక్కటే .........................
క్షమించటం అంటే ఇంకో తప్పుకు అవకాశం ఇవ్వటమే .....
ఇలాంటి హీరోల భావాలు తమరికి ఎవరికైనా ఉంటె అర్జెంటు
గా ఈ పోస్టింగ్ చదవాల్సిందే.................
మామూలుగా తమరి మిత్రులెవరో చెప్పండి
తమరి గూర్చి చెపుతా అంటారు కదా అది పాత డైలాగ్ ....
(మరి కొత్త దేమిటి చెప్పు అంటున్నారా?లేటుగా చెప్పినా
లేటెస్ట్ గా చెపుతా)
"మీ శత్రువులు ఎవరో చెప్పండి.మీ గూర్చి చెపుతా"
ఇది మరీ బెదిరిందా?
మరి మీకు ఎంత మంది శత్రువులు ఉంటె అంత మంది
తో మీకు సరిపడ లేదన్నమాటే. అంత ఎక్కువగా మీకు
నిద్ర పట్టదన్నమాటే. అంత ఎక్కువుగా మీ అ ఆరోగ్యం
పాడవుతుంది అన్న మాటా.
ఏమిటి ఇన్ని మాటలు చెపుతుంది అనుకుంటున్నారా?
ఆ మాటలు సరిగా ఉపయోగించకపోతే అంత మంది
శత్రువులు అన్న మాట.
ఎవరైనా తప్పు చేస్తే మీరు ఏమి చేస్తారు?కోపం తో తిడతారు
అంతె కదా?తిట్టక ముద్దు పెట్టుకోవాలా అంటారా?
(బాబోయ్ నా వైపు దేనికి అంత కోపంగా చూస్తున్నారు?)
మరి క్షమించక పొతే నష్టపోయేది మీరే.
కోపం అనేది బురద లాంటిది .అది ఎదుటి వారిపై పోస్తే
మిమ్మల్ని కూడా మురికి చేస్తుంది.
ఎంత వరకు క్షమించాలి?మరి పెద్ద వాళ్ళు చెప్పింది
అదే కదా.సామ ,బేద ,దాన,దండోపాయాలు.
ఎలాగంటే మీరు అధికారి అనుకోండి ,మీకేన్నో టెన్షన్స్
ఉంటాయి.అప్పుడు మీ క్రింది వ్యక్తి తప్పు చేసాడు.
అప్పుడు మీ కోపానికి అతన్ని బలి చేస్తారు.అప్పుడు ఏమి
అవుతుంది.........there starts the problems..........
అతనితో మీకు చాలా అవసరాలు ఉంటాయి కాని అతడు
ఇక మీకు సహకరించడు పైగా మీ గుట్టు మట్లు అన్ని ఇతరులకు
చెప్పి తన కోపం తీర్చుకుంటాడు.క్షమించారు అనుకోండి
అతనికి మీమీద ఇంకా గౌరవం పెరుగుతుంది.
మీరు హాయిగా నిద్రపోవచ్చు.
ఎంత పెద్ద తప్పు అయినా ఎలా క్షమిస్తాము?అంటారా.....
నిజమే ఆ సంగతి అతనికి అర్ధం అయ్యేటట్లు కోపాన్ని
చూపించాలి.అంటే మీరు మీ కోపం చూపటానికి తిట్టలేదు
అని అతనకి అర్ధం కావాలి.
కోపం లో మాటలు తూలి ఇతరులుని దూరం చేసుకునే
దానికన్నా క్షమించి దగ్గర చేసుకుంటే మీ శత్రువులు
తగ్గుతారు మీరు హాయిగా ఉంటారు.పొరుగువాళ్ళ
విషయం లో కూడా ఇది గుర్తించుకుంటే మీకు మంచి
ఇరుగు పొరుగు దొరుకుతారు.క్షమించటం చేతకాని
తనం అంటారు కాని కోపమే చేతకానితనం కాదంటారా....
మీరేమి చేయలేని పరిస్థితులలో మీకుఇంకా ఎక్కువ
కోపం వస్తుంది కావాలంటే ఆలోచించి చూడండి.
కాబట్టి వీలైనంత వరకు క్షమించేద్దాము......
మన కోసం మన ఆరోగ్యం కోసం...........
మన చుట్టూ సంతోషం విరియటం కోసం............
మరి చెప్పండి మీ శత్రువులు ఎంత మందో.....నేను చెపుతాను
మీ గురించి ........కాదంటారా?
6 comments:
chaalaa baagaa raasaru baavundi
నా కొత్త ఫ్రెండు కు స్వాగతం.థాంక్యు.....
Baagundi Sasi...naaku aa baby pic super nachindi :) Like it. Post as usual super :)
చాలా బాగా చెప్పారండీ. క్షమా గుణానికి మించిన దైవత్వం లేదు. క్షమ, ఓర్పు మనిషికి ఉండి తీరవలసినవే!! మరే నాకు ఒక్క శత్రువు కూడా లేరు కానీ నేను ఎవ్వరినీ క్షమించలేదు, తిట్టలేదోచ్చ్. అయినా ఎలా శత్రువులు లేరు అంటారా? అదేగా మరి కిటుకు!!! నాకు కోపం వస్తే ఎవ్వరితోనూ మాట్లాడను. మౌనమే నా ఆయుధం. ఇప్పుడు చెప్పండి మరి నా గురించి
baaboy meeru saamanyulu kaadu...
sahana mother therissaa....
ఏమిటేమిటి...నేను ఓ నెల రోజులు కనపడక పోతే మీ టాలెంట్ అంత బైట పెట్టేతార...
కేక ..బాగా చెప్పారు...:)
Post a Comment