అమావాశ్య .......అర్ధ రాత్రి......కీ......కీ.......కీచురాళ్ళు .........
ధబ్......................ఏదో పడిన శబ్దం ..............................
కెవ్వూ..............కేక.........నిసీద నడిరాత్రి లో నల్లని ఆకారం.......
అదిగో మీ పక్కనే.....................................................................
తూచ్......తూచ్.....తూచ్.......బయపడ్డారా?ఎంత మాత్రం దైర్యం ఉందొ టెస్ట్ చేశా నొచ్ .............
అయినా నా బ్లాగ్ లో ఇటువంటివాటికి నో ప్లేస్. తొందరగా చదివేయండి.
తరువాత డెలీట్ చేసేస్తా.
ఏమిటి ఇంకా బయంగా ఉందా?శ్రీ ఆంజనేయం ,ప్రసన్నాంజనేయం...........
(ఏమిటి మీకు బయం లేదా?నాకు బయం అని కని పెట్టేసారా కొంప తీసి....)
సరే మీ బయం పోవడానికి.........................................
(ఏమిటి నా బయమా ....ఎవర్రా అది.....బూత ప్రేత పిశాచ ...
నారి బంబం.......అవును సొంత పాటే ......నా దెయ్యం వేరే వాళ్ళ పాటలు పాడితే రాదు)
ఒక రోజు ఏమయ్యిందంటే .............ఏమిటి ఇంకా మా దయ్యం ఊ....అనలేదే.
దానిని చూడాలనే కదా కోరికతో మా వారిని అడిగింది.
అదేనండి అరుందతి.మా వారిని అడిగా ...ఏమండీ.....ఏమండీ........ఏమండీ eeeeeee .....
(మన పనులు కావాలంటే అలా దీర్గం తీస్తూ పిలుస్తామనమాట ......ఏమిటండి.......
అన్నారు అనుకో అడిగి వేయొచ్చు.అలా కాక ఏమిటి?...అని చూసారో ........
ఇంకా అడగటం జానతా నై)
హమ్మయ్య...మంచి మూడ్ లోనే ఉన్నారు .మెల్లిగా చెప్పా.అరుందతి సినిమా చూడాలని
ఉంది అని."నేను రాను.నాకు ఓపిక లేదు వదిలేయ్యబ్బా.అన్నారు"
(వాళ్ళ మీద ఆదార పడ్డామని అలుసు)
ఎందుకో బలే రోషం వచ్చింది.
(ఈయన లేక పోతే పోలేమా పెద్ద......ఇష్....నిజంగానే పోలేము.
అందులో దెయ్యం సినిమా. ఎవరండి ఇండియా డెవలప్ అయింది అంది)
వస్తారా?రారా?సీరియస్ గా అడిగాను.రాను గట్టిగా చెప్పారు.
(ఇంత దైర్యం ఎక్కడి దబ్బా?బహుశా దెయ్యం తో ,కోడి రామ కృష్ణ తో వేగే
బదులు భార్య తో వేగటం బెటర్ అను కొనిఉంటారు)
నాకు తిక్క రేగింది(కొత్తగా రావటమేమిటి ?ఎప్పుడూ ఉంది కదా
అని ఎవరో గొణుగుతున్నారు .సరే సినిమాకి వెళుతున్నా కాబట్టి
క్షమించేసా.)
నేను నివాస్ ని తీసుకొని వెళతాను అన్నాను."పొమ్మా ఎవరొద్దన్నారు"
అనేసారు నన్ను వదిలిందే చాలురా దేముడా అన్నట్లు.
అనేసాము కాబట్టి ఇంకా వెనక అడుగు వేయదలుచుకోలేదు.కాని ఎప్పుడు వెళ్ళలేదు
కాబట్టి కొంచం జంకుగా ఉంది.సరే అని ఇంకో మాడం కి ఫోన్ చేసాను.
ఎందుకంటె...........
we may arrive on different ships ,but we are on the same now.
.
వాళ్ళ ఆయన కూడా సినిమాకి వచ్చే టైపు కాదు.ఆమె ఉత్శాహంగా తన కూతుళ్ళు
ఇద్దరినీ (7,6 తరగతులు) బండి మీద తీసుకుని సినిమాకి వచ్చింది.నేను బాబుని
తీసుకొని వచ్చాను.ఇంకా మా ఇద్ద్దరికి హుషారే హుషారు.ఇంకా ఏమి సినిమాలు
వచ్చినా మేమిద్దరమే చూసేద్దము అనుకోని ఆనంద పడిపోయాము.
సినిమా మొదలైంది.......ఊఊ.........ఊ.......కార్ లో ఇద్దరు వస్తున్నారు పెళ్లి పత్రిక
తీసుకొని .........ప్రమాదం ....డమేల్......చెట్టుకి గుద్దుకొని కార్ ఆగిపోయింది.
పక్కనే పాత ఇల్లు కొత్తగా మారిపోతూ.......ఊఊఉ............
ఒకరు వచ్చి అటు వెళ్ల వద్దు...
ఎవరు లేరు......కి..కి........బాబోయ్......
గుండె నాకు మాత్రం పెద్దగా వినిపిస్తూ .........
బయం వేసి పక్కకు చూస్తును కదా.....మన ఆడ పిల్లలు ఇద్దరు అమ్మకి చెరో వైపు
కరుచుకొని ఉన్నారు.ఆమె కళ్ళు మూసుకొని మంత్రాలు.........
(అంటే నేనే బెటర్ శేబాష్ శశి అనుకోని )
బాబు తో కలసి సినిమా చూస్తున్నాను.
మళ్ళా కొంచం డమ్మారె ...డమ్మారె .....డం......పాటలు
(దెయ్యం ఎక్కడో బజ్జోని ఉంటుంది,దానికి తోడూ అమ్మ దయ్యం ఒకటి మా ప్రాణాలకి)
అరుందతి ని రప్పించటానికి వాళ్ళ తాత కాలు విరగ కొడుతుంది దెయ్యం నీళ్ళు
పంపించి.....అది ఒక బయానకమైన సీన్ ......పక్కకు చూద్దును కదా అమ్మ ఇద్దరు
కూతుళ్ళు ముగ్గురు జాయింట్ గా నెల మీదకి సీట్స్ వెనుక వాలి పోయి ఉన్నారు.
నేనింకా బయటపడలేదు కాని బయం తో వణికి పోతున్నాను
(ఇంటి కి పొయామో అనుకో అలుసు అయిపోమా)
దెయ్యం మళ్ళా పని పిల్లలో చేరి.........తిరుగుతుంది.....కెవ్వు......నోటి మీద చేయి
పెట్టేసు కున్నాను .దయ్యం ఎలాగోలా అరుందతి ని ఊరికి వెళ్ళకుండా ఆపేసింది
ఇంటర్వెల్ కల్లా మాడం లేసేసింది.మాడం నా వల్ల కాదు నేను వెళ్లి పోతున్నా....అని
వెళ్లిపోయింది.
ఇక ఇప్పుడు నా వంతు."రేయ్ నివాస్ మనం కూడా వెళ్లి పోదాము రా"వాడిని అడిగాను.
వాడేమో టాం అండ్ జెర్రీ చూసినట్లు చూస్తున్నాడు.నాకేమో వాడు బయపడితే నిద్రలో
ఉలిక్కిపడతాడని నాకు బయం .మద్య లో వాడి కళ్ళు మూస్తే ......మా తమాషాలా ..
నేనిప్పుడు పదో తరగతి నాకేమి బయం అని విసుక్కున్నాడు
.(దెయ్యానికి ఏమి తెలుసు వీడు పదో తరగతని)
ఇంకా క్లాసు తీసుకున్నాడు.
"ఎప్పటికైనా దెయ్యం చనిపోతుంది కదా .ఎందుకు బయపడతావు"అని.
(డైరెక్టర్ వీడికి చెప్పాడు కాబోలు)
అబ్బ అందరు ఊరికి వెళ్ళినాక దయ్యం బల్లి లాగా పై కప్పు నుండి క్రిందకు దూకుతుంది .....
డమేల్ ...............ఊ......ఉ.........
డాం......అంటే కిందకి వాలి పోయాను.......గుండె అయితే ఎప్పుడో పొట్టలోకి
వచ్చేసింది.గుండె ఎందుకులే.....దబ.......దబ........అంటే పొట్టలోకి వస్తే గుండె
అలాగే కొట్టుకుంటుంది.
ఇంకా ఏమి చేసానా....భర్త మాట వినాలి అని గట్టిగా ఒట్టు పెట్టేసుకున్నాను.
.(బయటకు వచ్చినాక గట్టున పెట్టేసాన్ లెండి)
అరుందతి నాట్యం చేస్తూ ఉంది.....బాబోయ్....ఎవరు రక్షిస్తారు.......
హమ్మయ్య......సాయబు వచ్చి మేం సాబ్......అని అరిచి ఆ మంత్ర దండం విసిరేశాడు.
చచ్చాడు పో........అనుకోని ఊపిరి పీల్చుకున్నా.....కాని చావడు......ఇంకేమి చేసేది
దేవుడా........అనుకుంటున్నా......అరుందతి దానితో పొడుచుకుంది............
(బాబోయ్.....ఇప్పుడు దెయ్యాన్ని ఎవరు చంపాలి ....నేనా?...కేవ్వ్వ్......)
హమ్మయ్యా ....దానితో అరుందతి దెయ్యాన్ని చంపేసింది.
హమ్మయ్యా.....................దెయ్యం ఖతం..............మనం ఇంటికి......
హలో .....ఈ కద ఎవరికైనా పది మందికి చదవమని చెప్పకపోయారో .............
ఉహ.......హ......హ..........మిమ్మల్ని మంత్రా వచ్చి కాంచనాకి ఇచ్చేస్తుంది.....
మర్యాదలు చేయటానికి కాదు....................
ఏమి కాదు......పీక్కు తినటానికి..............డౌట్ గా ఉందా.......
ముందు వాళ్ళ కొడుకు మీ పొట్టలో నూడుల్స్ తినటానికి ఫోర్క్ తెచ్చుకున్నాడు చూడండి........
13 comments:
మీ భావ ప్రకటన బాగుంది. దెయ్యాల చిత్రాలకి..ఆదరణ ప్రపంచ వ్యాప్తంగా ఉంది.అంతకన్నా భయంకర మనస్తత్వాలని భయం లేకుండా ఎదుర్కోమని.. చెప్పడం అన్నమాట. కోట్లు ఖర్చు పెట్టి.. ప్రేక్షకులపైకి విసిరేసే టెక్నిక్ ఉన్నప్పుడు..చూస్తే..,అనుకరిస్తే..తప్పు ఏమిటి..అన్నట్టు.. సెన్సార్ వాళ్ళు..సర్టిఫికేట్ చేస్తే.. మీలాంటి గుండె దైర్యం ఉన్నవారు..చూస్తారు. అలాటి చిత్రాలు శత దినోత్సవాలు జరుపుకుంటాయి. అయినా కోడి రామ కృష్ణ గార్కి..అసిస్టెంట్ గా చేసారా..ఏమిటి శశి గారు.అంత బాగా రాసారు.. ..బాగుంది.
చాల చక్కగా మెచ్చుకున్నారు......ఇంకా కూసిన్త
మెచ్చుకొండి......ఇంకొంచెమ్ హుషారు వస్తుందెమొ.
అసలె దెయ్యంతొ తిరిగి అలిసిపోయాను.థాంక్యు.
మీకు దెయ్యాలంటే ఇంత ఇష్టమాండీ?
హహహహ... కాంచన చూశారా లేదా??
>>మిమ్మల్ని మంత్రా వచ్చి కాంచనాకి ఇచ్చేస్తుంది>>>
నేను చంద్రముఖినీ, నాగవల్లినీ, ముని నీ తీసుకొస్తా...;) ;)
>>దెయ్యం ఎక్కడో బజ్జోని ఉంటుంది,దానికి తోడూ అమ్మ దయ్యం ఒకటి మా ప్రాణాలకి
hahaha
>>దెయ్యానికి ఏమి తెలుసు వీడు పదో తరగతని
pointee!!!
>>బాబోయ్.....ఇప్పుడు దెయ్యాన్ని ఎవరు చంపాలి ....నేనా?...కేవ్వ్వ్......
నాకువచ్చిన డౌట్లే మీకువస్తే ఎలా? :)))))
Super dayyam Tapa Sasi :)
హ హ సరదాగా ఉందండీ బాగా రాసారు..
రాజ్...ఇంకా యెక్కడి కాంచన....ఇంక దెయ్యం
సినిమా లకు పొవటం కూడానా.....అలా కాదు
కాని కాంచన పై నువ్వె పోస్టింగ్ రాసెయ్యి......
నూడుల్స్ నంజుకుంటూ తినెస్తా....దెయ్యాన్ని...
ఇందూఊఊఊఊఊఊఊఊ....అంటే జాబ్ లొ పడి వినిపించదని అలా అరిచా...అంత పనిలొ కూడ
మా దెయ్యాన్ని విసిట్ చెసినందుకు అది థాంక్స్
చెప్పమంది.
వెణు శ్రికాంత్ గారు....కొంచం కామెంట్ పెంచండి.
దెయ్యానికి సరి పొలెదు.
నేను ఇంట్లో చూద్దామని సి.డి తెచ్చుకున్నాను . అందరూ భయపెడుతున్నారు చూడొద్దని . ఐనా ధైర్యం చేసి చూద్దామా అనుకుంటున్నాను :) కానీ . . . ఇప్పుడు మీ పోస్ట్ చదివాక ధైర్యంబ్ గయాబ్ :)
మాల గారు ఒక సారి చూసెదాకె బయం.నా మాట
విని రెండో సారి చూడండి...పరారె...పరారె..
bagundandeeeeeeeee.......
Arundhathi movie rendo saari chuyinchesaru ticket lekunda free gaa, naa chetha!!
very good narration!!!
lengthy gaa vundile ippudem chaduvutham le ani skip cheddamanu kunnanu mee post ni first lo..
but modati phrase lone flat ayi saantham chadivesanu..
such a good narration you have used ma'am!!
హహహహహః....kevvvvvvvvvvvvvvvvvvvv
నాకు భలే నచ్చేసింది గా ఈ టపా :)
బొమ్మలు కూడా కేక :ద
మీ పేరు బ్రవేరి అవార్డు కి nominate చేస్తునా :D
kevv.....kiran inni comments..baboy naa chinni gunde nindi potundi....
(బాబోయ్.....ఇప్పుడు దెయ్యాన్ని ఎవరు చంపాలి ....నేనా?...కేవ్వ్వ్......)
కెవ్వు కెవ్వు కెవ్వు
భర్త మాట వినాలి అని గట్టిగా ఒట్టు పెట్టేసుకున్నాను.
(బయటకు వచ్చినాక గట్టున పెట్టేసాన్ లెండి)
మరి ఇలా బ్లాగ్ లో చెప్తారా ఏంటి?
నిజమే...ఇలా మేము అనుకున్న సందర్భం కూడా ఉంది కుదిరినప్పుడు బ్లాగ్ లో రాస్తాను.
మొత్తానికి సూపర్ పోస్ట్
హాస్యం పండించడం లో లేరు మీకు పోటి
మీకు మీరే సాటి.
కొంచం మెచ్చుకోండి మరి నన్ను.
Post a Comment