Wednesday 10 April 2013

జన్మలు ఉన్నాయా?

''న్యూటన్ ఇలా రా "
మెడిసెన్ కోచింగ్ కోసం చేరిన అక్క ,ఫ్రెండ్స్ అందరు ఉలిక్కి పడి  చూసారు.
ఒక వేళ  ఈయన ఫిజిక్స్ లెక్చరర్ అయితే మాత్రం ఇలాంటి పేరు
పెట్టుకుంటారా?
తరువాత ఈ విషయాన్ని అక్క నాకు ఆశ్చర్యంగా చెప్పింది.
ఆయన విద్యానగర్ కాలేజ్ లోనే పని చేసేవారు కాని ,నేను ఆ కాలేజ్ లో
ఇంటర్ చదివేసరికే వాళ్ళు నెల్లూర్ వెళ్లి పోయారు ''కోరా కోచింగ్ ''సెంటర్
పెట్టుకొని.అప్పట్లో అది చాలా ఫేమస్.తరువాత దానిని రత్నం లో కలిపేసారు.



మళ్ళా ఆ న్యూటన్ అనే పేరు మెడిటేషన్ లోకి వచ్చిన తరువాత విన్నాను.
ఏదో పిరమిడ్ ఓపనింగ్ కి వచ్చారు అని.ఎప్పుడూ చూడ లేదు.
కాని జీవితం లో ఆ పేరు వింటూనే ఉన్నాను.వాళ్ళ కౌన్సలింగ్ గూర్చి
చెపుతూనే ఉంటారు కొంత మంది.
ఇదిగో ....ఈ రోజు వాళ్ళ మధ్య అనుభంధం గూర్చి ''సాక్షి ఫ్యామిలీ''లో
చదివి ,వాళ్ళను చూసి నిజంగా థ్రిల్ అయ్యాను.
ఎంత చక్కగా చెపుతునారో భార్యా భర్తల భంధం గూర్చి .....
నిజమే మన పార్టనర్ ని చూస్తె వీళ్ళను వదిలి ఉండాలేము ఏమో  అనిపిస్తూ ఉంటుంది,
అది కాని జన్మ జన్మ ల బంధం అయితే .....

(న్యూటన్ శ్రీ లక్ష్మి గార్ల ఇంటర్వ్యు లింక్ ఇక్కడ )


4 comments:

K V V S MURTHY said...

అవును...జన్మలు వున్నాయి...నా అనుభవంలో చెప్పగలను..వారు చెప్పింది ఒకటి మాత్రం నిజం..ఈ జన్మలో భార్యా భర్తలు అయ్యేది గత జన్మలోని శత్రువులే 80 శాతం మటుకు..

జలతారు వెన్నెల said...

Interesting article! Thanks for sharing Sasi gaaru.

పల్లా కొండల రావు said...

ఉగాది శుభాకాంక్షలు.

శశి కళ said...

మూర్తి గారు మీకు ఎలా తెలుసు?


వెన్నెల గారు ,పల్లా అన్నయ్య థాంక్యు