Showing posts with label cartoons. Show all posts
Showing posts with label cartoons. Show all posts

Saturday, 28 November 2015

కేజ్రివాల్ మీద జాలితో




ఈ లాలు ప్రసాద్ యాదవ్ ఏమి చేసినా భలే తమాషాగా అనిపిస్తుంది . 
అందరు టికట్ రేట్ పెంచుతుంటే రైల్వే మంత్రిగా టికట్ రేట్ తగ్గించడం ,
ఐ . బిఎం లో గెస్ట్ లెక్చర్లు , మొన్నటికి మొన్న ఉప ముఖ్యమంత్రి గా 
ఉంటారా అంటే సిగ్గుపడటం , నిన్నటికి నిన్న కేజ్రివాల్ ని హగ్ చేసుకోవడం .... 
అన్ని బోలెడు కాలక్షేపం చాటింగ్ లో . 
రాజకీయాలు నాకేమి పెద్దగా తెలీవు . కాని ఇలాంటివి వచ్చినపుడు 
పక్కన మేడమ్స్ ని అడుగుతుంటాను . 
''ఎలా తగ్గిస్తారు శైల  టికట్ ?మళ్ళీ బడ్జెట్ నష్టాలలోకి వెళ్లి పోతుంది 
కదా ! మళ్ళా లాభాలు పెరిగాయి అని గెస్ట్ లెక్చర్ ఎలా ఇస్తాడు ? ''
శైల వాళ్ళ శ్రీవారు రైల్ వేస్ లో ఏ . ఎస్ . ఎం . 
''ఏమి లేదులే శశి గూడ్స్ కి ఒక వాగన్ పెంచేశారు . అక్కడ కవర్ 
చేస్తారు '' 
మరి లోడ్ ఎక్కువైతే ఇంజెన్స్ ఇబ్బంది కాదా ! 
గెస్ట్ లెక్చర్స్ ఇచ్చే రాజకీయ నాయకులను ఒక్క కిచ్చారెడ్డి లక్ష్మా రెడ్డి ని 
ఒక్కటే చూసాను . మా లీడ్ ఇండియా ట్రైనింగ్ లో ఇచ్చారు . 
అప్పుడు దాని మీద రెస్పాన్స్ నేనే చెప్పాను . మెచ్చుకున్నారు కూడా !

ఇక ఇప్పుడు కేజ్రివాల్ వంతు . లాలు నే హగ్ చేసుకున్నాడు , 
నాకేమి ప్రేమ లేదో అని మొత్తుకుంటున్నాడు . 
ఆకు ముల్లు  సామెత ఇప్పుడు అర్ధం అయిందా !
తప్పు మాది కాక  పోయినా , మాది తప్పు అనేస్తే నిరూపించుకోవడానికి 
మేము ఎంత తంటాలు పడతామో అర్ధం అయిందా . 
తన దాకా వస్తేనే తెలుస్తుందని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు . 

కేజ్రివాల్ గారు బాధ పడకండి . మీ తప్పేమీ లేదని నమ్ముతున్నాము . 
లాలు సంగతి మాకేమి కొత్త కాదు :-)
                               @@@@@@@ 

Sunday, 22 November 2015

మీరు మీకు తెలిసినవి చెప్పండి

 దేవుడా .... ఎక్కడున్నావు ? 
ఈ వానలు ఏమిటి తండ్రి అని అడగాలి అంటే భయం . 
మళ్ళీ ఎక్కడ లేకుండా పోతాయో అని !!
ఏడాది వానలు ఆరు రోజుల్లో కురిపిస్తే ఎట్టా చెయ్యాలి ?
నువ్వట్టా కురిపించావు , అయ్యి ఇట్టా కట్టలు తెంపుకొని 
సముద్రం లో కలిసిపోయాయి ! ఇక కురిపించి ఏమి లాభం ! 
కాసిని నీళ్ళు అయినా భూమి కింద దాచిపెట్టు , ఎండాకాలం 
కావొద్దా . .... 
లాభం అంటే గుర్తుకు  వచ్చింది ....... 
మొన్న రైల్వే స్టేషన్ లో చూసాను . చాలా మంది కూలీలు , 
ఆడవాళ్ళు మగవాళ్ళు ,పక్కన బిందెలు , కట్టెలు , బట్టలు . 
ఇంత తుఫాన్ లో ఎక్కడికి పోతున్నారు ! 
గుంటూరు నుండి వచ్చిన కూలీలు అంట . నారేతలు వేస్తారు అంట. 
రోజు కూలీ కాదు , ఎకరానికి ఇంత అని కాంట్రాక్ట్ . వాళ్ళ పని నచ్చి ఇక్కడ 
వాళ్ళు ఇంకొంచెం అదనంగా కూడా ఇస్తారంట . వానలు పడుతున్నాయి 
అని చూసుకుంటే కుదరదు , నారు ముదిరి పోతూ ఉంది . 
( ఇది ఇక్కడ వాళ్ళ పొట్ట గొట్టినట్లు కాదా ,ఏమో మరి !) 
వ్యవసాయం వ్యాపారపు హంగులు అద్డుకుంటూ  ఉంది .
తప్పదు లాభం , నష్టం అనేవి మన ప్రాణాలతో చలగాటం ఆడే 
స్థాయి  వచ్చేసినాక రైతు కూడా వ్యాపార మెళుకువలు నేర్చుకోవాల్సిందే !
నేర్చుకోకపోతే వచ్చిన ఇంకో పని చూసుకోవాల్సిందే . 

మరి మనకు తిండి గింజలో .... అనవాకండి . 
అన్నపూర్ణ ఏమవుతుంది . అన్నం పెట్టె దేవుడు రైతు , 
రక్తం తో తడిసి పుడుతుంది వడ్ల గింజ , కాకుంటి రైతు 
తెల్లని చెమట రక్తం తో .... ఇలాంటి ఎమోషన్స్ ఇప్పుడు 
వద్దు . 
ఇలాంటి సెంటిమెంట్స్ తరువాత ,ముందు సమస్య ఎక్కడ ? ఎలా 
ఉంది ? కొత్త వి ఇంప్లిమెంట్ చేస్తూ , పాత లోపాలు పూడ్చుకోవడం ఎలా 
అని కార్పోరేట్ కంపెనీ లాగా ఆలోచించండి . 
ఈ రోజు శంకర్ కార్టూన్ చూస్తె ఇవే మనసుకు వచ్చాయి . 
సానుభూతి మాటలు కావాల్సిందే ,కాని అవి మాత్రమె 
పని జరిపిస్తాయా ? చూడండి . యూనివర్సల్ టాపిక్కి  
పనికొచ్చే సైలెంట్ కార్టూన్ . 



పనిలో పని ... నా కార్టూన్ కూడా . రైతు మొక్కలు నాటే టప్పుడు 
ఎంత ఆశగా ఉంటాడో , అవి ఆక్ట్ ఆఫ్  గాడ్ లేదా మనుషుల్లోని 
రాజకీయ గ్రద్దలు తన్నుకుని పోయేటపుడు ఎలా ఉంటాడో చూడండి . 


ముందు వ్యవసాయాన్ని వ్యాపారం అనుకుంటే కొంత పరిష్కారం 
ఆలోచించవచ్చు . 
వ్యాపారానికి ఏమి కావాలి ? 
పెట్టుబడి ,ప్లానింగ్ ,కార్మికులు , పబ్లిసిటీ , మార్కెటింగ్ . 
ఇలాగా వాళ్ళు ఎడ్యుకేట్ అయితే బాగుంటుందేమో !  
పెట్టుబడి లో యెంత తాము పెట్టగలరు , బాంక్ నుండి యెంత 
తేగలరు ,యెంత బయట వడ్డీ కి తేవాలి ? 

మొదలు పెట్టె పంట కు డిమాండ్ ఉందా ? వ్యవసాయ అధికారుల 
సలహా పొందగలమా ? అసలు పంట సరియన సమయం లోనే 
మొదలు పెట్టామా ?
కొత్త పద్దతులు ,నైపుణ్యాల పెంపుదల 
అంతర పంటలు వేయడం , గట్లు వెంబడి వేయగల 
పంటలు వేసి కుటుంభ ఖర్చు కు ఉపయోగించుకోవడం . 
పశువులు ,కోళ్ళు పెంచుకోవడం . వాటికి కావలిసిన 
ఆహారాన్ని తానె ఉత్పత్తి చేసుకోవడం . 

పంటలు మార్చి వేయడం , ఎరువుల ఖర్చు , 
పురుగు మందుల ఖర్చు తగ్గించే ప్రక్రియల వైపు 
ఎడ్యుకేట్ అవ్వడం .

వర్షాలు వరదలు ,కరువు లాంటి వాటికి మనం ఏమి 
చెయ్యలేము ,కాని  చిన్నపాటి ఆదాయం వచ్చే 
కుటీర పరిశ్రమలు ఉంటె బాగుంటుంది . 

ఇక వర్షపు నీరు నిలువ చేయడం , చెరువుల్లో 
పూడిక , గట్లు బాగు చేసుకోవడం , పెద్ద కమతాలు గా 
వ్యవసాయం , నీళ్ళలో ఎక్కువ రోజులున్నా , తక్కువ 
నీరున్నా పాడవని విత్తనాలు వాడటం . 

ఇవన్నీ అందరికీ తెలిసినవే . ఇంకా మీకు ఏమైనా తెలిస్తే 
చెప్పండి . భవిష్యత్తు లో ఇది చూసిన  వారికి ఇలాగా 
అప్పట్లో ఉండేది అని తెలుస్తుంది :-) 
సానుభూతి వలన ప్రయోజనం లేదు , చాలా మంది 
దగ్గర స్మార్ట్ ఫోన్స్ లో  ఇలాటి విషయాలు వాళ్లకు ఎక్కువగా 
ప్రచారం చేస్తే బాగుంటుంది . మాకెందుకు అవన్నీ ప్రభుత్వం 
పనులు అనుకుంటున్నారా ? ధరలు చూసారా ?
మీ జీతం మారలేదు అనుకుంటున్నారు ఏమో ? మీకొచ్చే 
సామాన్లు విలువతో పోలిస్తే మీకు ఇప్పుడు జీతం సగం అయినట్లు లెక్క . 

మా బాబు రెండు నెలల క్రితం '' ఆకృతి 3డి సొల్యుషన్స్ '' లో 
''స్మార్ట్ విలేజ్ / సిటీ '' లో పాల్గొంటూ ఉంటె నేను ఒకటే మాట 
చెప్పాను . 
''రేయ్ , ప్రైజ్ రావడం ముఖ్యం కాదు . రైతు కు పనికి వచ్చేది 
కనిపెట్టారా , రైతు దెబ్బ తినేది ముఖ్యంగా నిలువ ఉంచుకోలేక 
పోవడం వలన , తన సరుకు అవసరం ఎక్కడ ఉందొ తెలుసుకోనలేక 
పోవడం వలన , వీటికి పరిష్కారాలు ఆలోచించరా '' అన్నాను . 

ఎలాగు ఏదో ఒక విషయం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాము . 
అదేదో ఇలాగా అందరి మేలుకు ఉపయోగపడే ఆలోచన 
చేస్తే యెంత బాగుంటుంది ! మరి ఇప్పుడే ఆలోచించండి . 
                         @@@@@@@@  





Saturday, 27 June 2015

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

చదివే ముందు ఫాదర్స్ డే సందర్భంగా మాలిక వెబ్ మాగజైన్ 
లో నా కార్టూన్స్ చూడండి 
(cartoons link ikkada )

 ''మేడం ఆటో తెచ్చాను '' కింద నుండి డ్రైవర్ ఫోన్ . 
కిందకు వచ్చి ఆటో లో కూర్చోపోతూ చూసాను . ఈ మధ్య 
కొంచెం స్కూటీ లో పోలేక ఆటో లో వెళుతున్నాను స్కూల్  కి .
వేరే వాళ్ళు పెద్దగా ఎక్కరు ఆ రూట్ లో . సీట్ మీద బాటరీ ,మైక్ . 
పక్కన వాల్ పోస్టర్స్ . ముందు ఒక పెద్దాయన డ్రైవర్ పక్కన . 
అవన్నీ చూసేసరికి మా సినిమా హాల్ గుర్తుకు వచ్చింది . ఇంకా 
ఇలాగ ప్రచారం చేస్తున్నారా ! నేనింకా వాల్ పోస్టర్స్ వేసి వదిలేస్తున్నారు అనుకున్నాను . 
పిల్లలు అందరం మైక్ లో మాట్లాడాలి అని పోట్లాడే వాళ్ళం . 
''నేడే చూడండి .... మీ అభిమాన హీరో నటించిన .... క్రియేషన్స్ ... ''ఇలాగ 
హుషారుగా చెప్పాలి. పనులు చేసుకొనే వాళ్ళు కూడా ఒక 
నిముషం పని ఆపేసి బయటకు వచ్చి ఏ సినిమా అని బయటకు 
వచ్చి రిక్షా కి కట్టిన పోస్టర్ ఆసక్తిగా చూసేవాళ్ళు . ఒక్క సారి అవన్నీ 
గుర్తుకు వచ్చి హుషారు వచ్చింది . '' ఏ సినిమా ?'' అడిగాను . 
''కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ '' ఇద్దరు చెప్పారు . 
అరె ఇది రేపు రిలీజ్ అని  ముందు రోజు చూసానే !  
సుదీర్ బాబు ,నందిని బాగానే నటిస్తారు . అది కాదు ఖదీర్ బాబు 
మాటలు అని చూసి చూడాలి అనుకున్నాను . ఎలా ఉంటుందో 
చూద్దాము అని ,ఓనమాలు కూడా చూసాను . ఇది చూద్దాము . 
మెల్లిగా శ్రీవారి చెవిలో వేసాను . ఇక ఆయనకు తీరి ,నాకు వీలు 
కుదిరి ఎప్పుడైతే అప్పుడు . ప్రస్తుతానికి సరే అన్నారు . 

సినిమా తీసిన వాళ్ళు శిరీష శ్రీధర్ అంట . మంచి టేస్ట్ ఉంది . 
సినిమాకి మ్యూజిక్ పెద్ద హైలెట్ . పక్కన ఈయన మాత్రం అన్నీ 
కలలేనా అని వొంక పెడుతూనే ఉన్నారు . మరి జంట మధ్య ప్రేమ 
గౌరవంగా చూపిస్తూ ఉంటిరి . కల కాక ఇలలో ఎలా జరుగుద్ది !
కధకు వస్తే కృష్ణాపురం హై స్కూల్ లో చదివిన ఫ్రెండ్స్ 
''పూర్వ విద్యార్ధుల సమ్మేళనం '' నిర్వహించి ఎక్కడ ఎక్కడ ఉన్న 
ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తారు . రాధ ను కలవాలని తన ప్రేమను 
గెలుచుకోవాలి అని కృష్ణ లండన్ నుండి బయలుదేరి వస్తాడు . 

ఎనిమిదో తరగతి లో ప్రారంభం అయిన ప్రేమ ఇంటర్ లో 
ఒకసారి ,ఇంజినీరింగ్ లో ఒకసారి చెప్పాలి అనుకోని చెప్పలేకపోతాడు . 
మరి రాధ కు పెళ్లి అయి ఉంటుందా !ఉంటె వీళ్ళు కలుస్తారా !
చాలా డిగ్నిఫైడ్ గా తీసారు . హరి సంగీతం చాలా బాగుంది . 
మాటలు చక్కగా సన్నివేశం కి తగినట్లు ఉన్నాయి . ముఖ్యంగా 
ఇంటర్ కాలేజ్ ప్రిన్సపాల్ గా పోసాని మాటలు చాలా ఆలోచింప చేసేవి 
గా ఉన్నాయి . 
''ఒక్కో వయసులో ప్రేమకు ఒక్కో అర్ధం ఉంటుంది . దానితో పాటు 
అమ్మాయి మారిపోతూ ఉంటుంది '' అని . మేము కూడా 
టీనేజ్ పిల్లలకి ఇలాగే కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము . విన్న వాళ్ళు 
జీవితం లో మంచి జాబ్స్ లోనే ఉన్నారు . 
ఇంకా చివరి మీటింగ్ లో కృష్ణ మాటలు హార్ట్ టచింగ్ గా ఉన్నాయి . 
''చెదిరిన అక్షరం లాంటి నన్ను 
అర్ధవంతమైన వాక్యం చేసావు ..... ''కవిత చాలా బాగుంది . 

ఇంకా రాధ కృష్ణ ను ఇన్సపైర్ చేయడానికి ''టార్గెట్ 3 బిలియన్ '
అబ్దుల్ కలాం గారి బుక్ ఇవ్వడం నాకు నచ్చింది . 
కుటుంభం తో కలిసి ఏ సందేహం లేకుండా వెళ్ళగలిగిన సినిమా . 
                         @@@@@@@@@@@@

Tuesday, 14 April 2015

నాకెందుకు !... ఇవన్నీ మీ విషయాలు .....

నాకెందుకు !... ఇవన్నీ మీ విషయాలు ..... 
మనోళ్ళు ''మామ్ '' విజయవంతం చేసారంట .... నాకెందుకు 
నాకు ఆఫీస్ టైం  అవుతుంది . 
ఆయుధ కొనుగోళ్ళు స్కాం అంట ..... 
బొగ్గు కుంబకోణం అంట .... 
త్రీ జి స్కాం అంట ..... 
నాకెందుకు నాకు కొత్త సినిమా టైం అయింది . 
కశ్మీర్ లో వరదలంట .... 
పట్టి సీమ ,పోలవరం గొడవలంట ...... 
నాకెందుకు పోపు అవతల మాడిపోతుంది . 
పార్టీ లలో   గొడవలంట .... 
రాష్ట్రానికి హైటెక్ రాజధాని అంట .... 
నాకెందుకు సరుకులు తేవాలి పోయి .
పక్క వీధిలో పంచాయతి నీళ్ళు రాలేదంట ..... 
ఇక నుండి కరెంట్ కట్ అంట ... 
నాకెందుకు మా టాంక్ లో నీళ్ళు ఉన్నాయి . 

హ్మ్ .... ఇలాగే ఉండండి . మీ చాప కిందకి నీళ్ళు వచ్చేస్తాయి . 
పోయేది ఎవరి సొమ్ము . మనం ప్రభుత్వానికి కట్టిందే !!!!

కనీసం ఖండించండి . నిరసన ఉంది అని అన్నా భయపడుతారు . 
మన నిరసన వలన ఎన్నో జి . ఓ లు అగ్గిపోయిన చరిత్రలు ఉన్నాయి . 
లైక్ లు ,కామెంట్లు అన్నా ..... అప్పుడప్పుడు వీటికి ఉపయోగించండి . 

నాకు మాత్రం ఎందుకు !! ఇంట్లో పని ఉంది . ఇవి చూసెయ్యండి :)





Monday, 2 March 2015

ఇప్పుడు కాసిన్ని కార్టూన్స్ .... కొంచెం ఆయుష్షు

ఇప్పుడు కాసిన్ని కార్టూన్స్ .... కొంచెం ఆయుష్షు 
ఎప్పటి నుండి వేద్దాము అనుకున్న పోస్ట్ ఇది !!
ఏదో ఇప్పుడు ''మాలిక వారి మహిళా ప్రత్యెక సంచిక ''
లో వచ్చిన నా కార్టూన్స్ ''భక్తి -ముక్తి '' పుణ్యమా అని 
వేస్తున్నాను . 
అప్పట్లో ''తండ్రి -తనయ '' అని తండ్రి ప్రేమ మీద కధల 
సంచిక మాలిక వెబ్ మాగజైన్ లో వచ్చింది . దానిలో 
''గొడుగు '' అని నా కధ  ప్రచురితం అయింది . 
తరువాత ప్రమదాక్షరి క్రింద 
''తండ్రి - తనయ '' కధా సంకలనం 
ప్రచురించారు . హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ లో 
(మహిళలేనిర్వహించారు ) 
లకారం పైనే బుక్స్ అమ్మారు అంటే 
ఇక ఆలోచించండి . 
నేను నా కవితల కు ముందు మాటలు ,
సమీక్షలు చదివాను కాని
 ''గొడుగు '' కధకు మందా భానుమతి గారు వ్రాసిన సమీక్ష 
చాలా చాలా నచ్చింది . 
నాకు ఎప్పుడూ ప్రోత్సాహం ఇచ్చే వలబోజు జ్యోతక్క కి 
కృతజ్ఞతలు . ఇప్పుడు మార్చ్ మాలిక సంచిక లో నా 
కార్టూన్స్ (మొదట గా ప్రచురణ ) చూసి ఆల్ ది బెస్ట్ చెప్పెయ్యండి :)

(bhakthi mukhti cartoons link )

Friday, 20 February 2015

యూ టూ ''రాగతి పండరి '' గారు

యూ టూ ''రాగతి పండరి '' గారు ... 
మీరు కూడా వెళ్ళిపోయారా !!! :(
ఏదో గీతల బాషలో కూడా మహిళా శక్తి కి చోటు 
ఉంది అని మిమ్మల్ని చూసి మురిసిపోతుంటిమి. 
ఇలా కార్టూన్ ప్రియులను బాధపెట్టి ఎక్కడకు వెళ్ళిపోయారు ?




ఎంత మంచి కాలం అప్పట్లో , మాగజైన్స్ లో మీవి , బాపు వి , మల్లిక్ వి 
లక్ష్మణ్ గారివి ఇంకా ... ఇంకా .... చదువుకొని నిష్కల్మషంగా 
నవ్వేసుకొని ఆయుష్షు పెంచుకున్న కాలం . 
భార్య ల ఆరళ్ళు , పిల్లల అల్లరులు , ముగ్గుల ముచ్చట్లు , 
ఇంకా ఉగాది పచ్చడులు తెలుగుతనం పొంగి పొరలే కార్టూన్ లు 
చదివి భర్త కు కనపడకుండా కొంగు చాటున నవ్వుకొనే కాలం . 

కళా కారుల పర్సనల్ విషయాలు నేను పెద్దగా పట్టించుకోను ,నేను 
గౌరవం ఇచ్చేది వారి జ్ఞానానికి . కాని మీకు పోలియో అని తెలిసిన 
రోజున చాలా బాధ పడ్డాను . ఏది అడ్డం కాకుండా మీరు ఎదగడం 
చూసి స్పూర్తిని పొందాను . ఎప్పుడో ఒకప్పుడు మీ సలహాలు 
పొందుదాము అనుకున్న మాట వాస్తవమే . మీరేమో నేను 
కొంచెం ఏకలవ్య గురువు అన్నందుకే వెళ్ళిపోతే ఎలా ?

మీరు స్కెచ్ తో గీసే సంగతి ఈ రోజు సాక్షి లో చూస్తే తెలిసింది . 
''హమ్మయ్య . దేనితో గీసాము అనేది కాదు అన్నయ్య ..... 
జోకు పేలిందా లేదా '' అనే డైలాగ్ ఇక వాడేసుకోవచ్చు . 
నేను రెండు చేతులతో బోలెడు గీతాలు గీసుకోవచ్చు . 
మనలో మాట ఎప్పుడైనా కార్టూన్ బుక్ వేయిస్తే మిమ్మల్ని 
ముందుగా ప్రస్తావిస్తాను . 

దేవుడా క్లారిటీ గా చెపుతున్నాను విను . నాకు గీతల గురువులు లేరు . 
నా వంకర గీతాలకి దానికి తగిలించిన తుంటరి మాటలకి నేనే బాధ్యురాలిని . 
హమ్మయ్య ఇక ''గీత కారులు '' అందరు ప్రశాంతంగా గుండెల మీద కుంచెలు 
ఉంచుకొని నిద్ర పోవచ్చు . 
రాగతి పండరి గారు సాక్షి లో ''జయ దేవ్ ''గారు వ్రాసిన ఆర్టికల్ చూడండి . 
మీకు ఆత్మా శాంతి కలగాలి అని కోరుకుంటూ .... సెలవు . 



Friday, 30 January 2015

ఇంక ఇప్పుడు యోగా

''శశి మేడం ఎక్కడ ఉన్నారు ? ప్రిన్సిపాల్ రూం లో మీటింగ్ 
జరుగుతూ ఉంది '' ఫోన్ విని క్లాస్ నుండి అక్కడకి వెళ్లాను . 
ఇది  మామూలే .  మీటింగ్ లో ముందు  నేను ఎక్కడ ఉన్నానో 
వెతుకుతారు . రూం అంతా సీరియస్ గా ఉంది . వేడి తెలుస్తూ ఉంది . 
ప్రిన్సిపాల్ గారు ముభావంగా ఉన్నారు . అంటే పై నుండి ఏదో అర్జెంట్ 
పనికి సర్కులర్ వచ్చినట్లే . పని కి భయం లేదు ,కాని ఈ కంప్యుటర్ 
వచ్చినప్పటి నుండి అప్పుడే పెట్టాలి అంటున్నారు . కాలం తో 
పరిగేత్తనీకుండా చేసే  క్షేత్ర స్థాయి అడ్డంకులు  చాలా ఉంటాయి . 
ఎవరికి వాళ్ళే ఎక్కడ ఈ పని తమ మీద పని రుద్దబడుతుందో అని టెన్షన్ . 

''చాలా అర్జెంట్ గా పెట్టాలంట '' చెప్పారు కొలీగ్స్ . 
''ఎన్ని రోజులు అయింది సర్వీస్ లో చేరి , అర్జెంట్ కానిది ఏమైనా ఉంటె 
కొత్తగా చెప్పండి '' పెద్దగా నవ్వాను . 
చిన్నగా అందరి పెదాలు విచ్చుకున్నాయి . 
''అయ్యాన్నీ  నాకు తెలీదమ్మ . ఈ రోజు కధ ఈ రోజే ''చిన్నగా సంతోషం ప్రిన్సిపాల్ గారిలో . 
నిజమే పై అధికారులు చెయ్యమన్నది మనం అడ్డం చెప్పకుండా చేయాలి . 
కొంత చేసి అడ్డం వచ్చినప్పుడు చెపితే కొంత సానుకూల దృక్పధం ఉండొచ్చు . 
కాని చేయడం అందరికీ తప్పనిసరి . 

''చూడండి అందరం ఒకే పడవలో ఉన్నాము . మునిగేది మేడం అనుకోవద్దు . 
పడవ తల కిందులు అయితే అందరికీ ఇబ్బంది ''చెప్పాను . 
సాలోచనగా ఊపి  పనిని ప్లాన్ చేయడం ప్రారంభించారు . 
మెల్లిగా ప్రిన్సిపాల్ గారు కూడా వంగి ప్రేమగా సూచనలు చేయడం 
ప్రారంభించారు . బయట పని పెద్ద ముక్క . తప్పదు సీనియర్స్ తలకు 
ఎత్తుకోవాలి . ఎందుకంటె పిల్లలు చదువులకు హాస్టల్స్ కు వెళిపోతే 
కాసింత పాక్షిక నన్స్  గా మారిపోయాము . జూనియర్స్ ఇంకా 
పిల్లలు , ప్రెగ్నెంట్ లు వగైరా ...... అదీ కాక మా భర్త లకు 
సినిమాకు వెళ్ళాలి అన్నా ''నీకు డ్యూటీ లేదు కదబ్బా '' అని 
అప్పాయింట్ మెంట్ తీసుకొనే జ్ఞానోదయం అయింది . 
పాపం జూనియర్స్ భర్తలు ఇంకా భార్య ల సమయం తమదే అనే భ్రమ లో 
ఉన్నారు ,ఈ జాబ్ చేరినాక కూడా . 
ఏముంది కొన్ని జీతాలుగా కాలం దొర్లితే చిట్టీ లకి , ఇంస్టాల్ మెంట్స్ కి 
అలవాటు పడితే వాళ్లకి కూడా జ్ఞానోదయం అవుతుంది . 

మొత్తానికి బయట పనికి ఎవరో ఒకరు తల అడ్డం పెట్టినాక ఇక స్వచ్చందంగా 
అందరూ తలో పని ముక్క ప్రేమగా ఆ తలను  పెట్టిన వాళ్ళను 
పరామార్శిస్తూ తీసుకుంటారు వీలును బట్టి . 
ఇక అప్పుడు ప్రిన్సిపాల్ గారి ముఖం లో నవ్వు చిందులు వేస్తూ , 
రూం అంతా  వెలిగిపోతూ ఉంటుంది .  

అంతకు ముందు ఉన్న వేడి ఏమైంది !బిగుసుకొని కూర్చున్న వాళ్ళు 
ఎలా అందరు ప్రేమగా మారారు . చిన్న చిరు నవ్వు . 
అవును టెన్షన్ సమయం లో దాని విలువ వందల వేల రెట్లుగా ఉంటుంది . 

మరి అది ఉదయించడం ఎలా ?
''ఇక ఇప్పుడు యోగా '' సమయం దానికి కొంత 
కేటాయిస్తే కందెన వేసిన చక్రం అంత హాయిగా జీవితం దొర్లిపోతుంది . 
దానికి టైం  లేదు అనడం, కార్  లో పెట్రోల్ లేకుండా  నడపడమే . 
తెలివిగల వాళ్ళు పని బాగా జరగడానికి అవసరం అయిన 
ప్రశాంత జీవన శైలిని ముందుగా ప్లాన్ చేసుకుంటారు . అమలు 
చేస్తారు . 
మొన్న 29/1/2015 నుండి మంత్రులకు , పాలనా అధికారులకు 
బాబు గారు జగ్గీ వాసుదేవ్ గారితో యోగా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు . 
మంచిది . నలభై రోజులు ఇచ్చినా మేలే . ఎందుకంటె మనం 
అసహనంతో తప్పు చేస్తే కూడిక లో ఒకట్లో , పదులొ స్థానం లో 
తప్పు జరుగుతుంది . కాని వాళ్ళ స్థాయి లో నిర్ణయాలు అసహనం తో 
తీసుకుంటే కోట్ల స్థానం లో తప్పు జరుగుతుంది . బాబు గారు 
మంచి నిర్ణయం తీసుకున్నారు . పాలనకు ఏమి ఇబ్బంది లేదు . 
ఇప్పుడు మాత్రం నత్త నడకే కదా నడుస్తుంది , బైఫర్గేషన్ పేరుతో . 
పనిలో పని సామాన్యుడు కు కూడా ట్రైనింగ్ ఇప్పిస్తే ఇప్పటి 
నవ్యాంధ్ర ప్రదేశ్  దెబ్బలకు తట్టుకోగలుగుతాడు . 




Tuesday, 27 January 2015

ఇలా ఎలా వెళ్ళిపోయారు ఆర్ . కె . లక్ష్మణ్ గారు !!

ఇలా ఎలా వెళ్ళిపోయారు ఆర్ . కె . లక్ష్మణ్ గారు !!
ఆహా అసలు ఎలా వెళతారు ?మేమేదో మీ కామన్ మాన్ 
మాట్లాడుతాడు ఏమో ,ఈ పాలిటిక్స్ తాట వలిచేసి శుభ్రం 
చేస్తారు అనే ఆశతో ఉంటె ..... 
ఒక వేళ నేను ఎప్పటి నుండో దాచుకున్న నా కార్టూన్స్ 
బ్లాగ్ లో ఉంచానే అనుకోండి ...... 
ఏదో గురు భక్తితో మీకు కూడా ఏకలవ్య శిష్యురాలిని అని 
చెప్పుకున్నానే అనుకోండి ...... 
నా కార్టూన్స్ నచ్చకపోతే ,ఇక్కడ నేర్చుకోమ్మా ,అనాలి కాని 
ఇలా దిగులుతో వెళ్ళిపోతారా :(

అక్కడ చూడండి ...... పైలట్ విమానానికి ఇందనం అయిపోతే 
ప్లైట్ నే పారాచూట్ తో పసిఫిక్ పై దించేసి లైఫ్ బోట్ లో 
ఈదుకుంటూ వచ్చేసాడంట...... ఒక సాహసి . బహుశా 
వెనక్కి లాగే కామెంట్స్ చేసే వాళ్ళు అక్కడ ఉండి ఉండరు . 
నాకు కూడా కొంత మంది మంచి కామెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు . 
ఎలాగోలా ఈ సముద్రాన్ని ఈది ,మీకు నా కార్టూన్స్ ప్రచురించి 
చూపించేదాన్ని . ఇంకొన్ని రోజులు ఉండకూడదా !

మీరు మళ్ళీ వస్తారు నాకు తెలుసు ,ఎలాగంటే అంతే .... 
మీకు నచ్చిన కార్టూన్ ఇంకా వెయ్యలేదు అని చెప్పారు కదా ,
అందుకని మళ్ళీ వస్తారు నాకు తెలుసు . 
పెద్ద వాళ్లకు ఇచ్చే నివాళి వాళ్లకు వేసే పూల దండ కాదు ,
వాళ్ళలో నేర్చుకొనే మంచి , అందుకనే మీకోసమే ఈ కార్టూన్ .... 






ఈ రోజు సాక్షి ఫామిలీ నివాళి చాలా బాగుంది . ఆ పెద్దాయనకి కళకి , కుంచకి 
దక్కాల్సిన గౌరవం . ఒక శంకర్ గారు గీసిన కారికేచర్ తో ఆయన గురించిన 
జ్ఞాపకం . ఇంకోటి లక్ష్మణ్ గారి ఇటీవలి ఇంటర్వ్యు . 
చూడండి . 

ఈ  కార్టూన్ తెగ శ్రధ్ధగా గీస్తుంటే ఈయన అంటారు ..... 
పిచ్చిది ఏది పడితే అదే ,వచ్చేదాకా వదలవా ..... అని . 
నేనేమి చేసేది , పిల్లలు ఇద్దరు ఒకరు పెళ్లి అయి , ఇంకొకకరు 
చదువు కోసం వెళ్లి పోతే ఒక తల్లి కి ఇంకేమి ప్రపంచం 
ఉంటుంది . ఏదో ఏమైనా నేర్చుకుందాము అని తపన . 

అంటూనే ఉంటారు , మళ్ళీ నాకు కావాల్సిన సహాయాలు అన్నీ 
చేస్తూనే ఉంటారు . 
కామన్ కాపురాల్లో ఇలాంటి అన్ కామన్ కామెంట్లు మామూలే . 
అవే దీవెనలు . 
                              @@@@@@@@ 

Sunday, 11 January 2015

నేను సైతం ఒక్క గీత

నేను  సైతం ఒక్క గీత .... 
హై స్కూల్ చదివే రోజుల నుండి ఎన్ని గీతలు దాటి వచ్చాము . 
గీత ,ప్రపంచానికి అర్ధం అయ్యే భాష . దానికి ఇంకో లిపి అవసరమే 
లేదు . పెషావర్ లో కాని ,ప్రాన్స్ లో కాని ,తుళ్ళూరు లో కాని ..... 
'కానిపని' జరిగితే అది తిరగబడుతుంది ,ప్రశ్నిస్తుంది ,నిలేస్తుంది . 
మనుషుల తరుపున నిలబడి మనందరి మానవత్వపు కులాన్ని 
గుర్తుచేస్తుంది . ఒక్క గీత ను చేరిపితే వేయి గీత ల వికృత రూపం 
దాలుస్తుంది . 
మల్లిక్ ,బాపు ,రాగతి పండరి ,సరసి ,లక్ష్మణ్ ..... ఎన్ని గీతలు 
మనకు నవ్వడం నేర్పాయి ,ఆలోచించడం నేర్పాయి ,వాస్తవాలు 
చూపాయి . మాట వ్రాయగల కలం ,గీత గీసే చేయి మనసు 
స్పందించినపుడు ఊరుకొనవు . తోచిన గీతలు వ్రాయడం లోపల 
దాచుకోవడం . అప్పటి నుండి అంతే . ఇప్పుడు నా బ్లాగ్ మిత్రులతో 
పంచుకుందాము అని ఇలా తీసుకొచ్చాను :)





న్యూస్ ఇక్కడ చూడండి . కార్టూన్స్ ఇంకా నేర్చుకుందాము అని ఉంది కాని ,ఎవరి దగ్గర 
నేర్చుకోవాలో తెలీడం లేదు .