''శశి మేడం ఎక్కడ ఉన్నారు ? ప్రిన్సిపాల్ రూం లో మీటింగ్
జరుగుతూ ఉంది '' ఫోన్ విని క్లాస్ నుండి అక్కడకి వెళ్లాను .
ఇది మామూలే . మీటింగ్ లో ముందు నేను ఎక్కడ ఉన్నానో
వెతుకుతారు . రూం అంతా సీరియస్ గా ఉంది . వేడి తెలుస్తూ ఉంది .
ప్రిన్సిపాల్ గారు ముభావంగా ఉన్నారు . అంటే పై నుండి ఏదో అర్జెంట్
పనికి సర్కులర్ వచ్చినట్లే . పని కి భయం లేదు ,కాని ఈ కంప్యుటర్
వచ్చినప్పటి నుండి అప్పుడే పెట్టాలి అంటున్నారు . కాలం తో
పరిగేత్తనీకుండా చేసే క్షేత్ర స్థాయి అడ్డంకులు చాలా ఉంటాయి .
ఎవరికి వాళ్ళే ఎక్కడ ఈ పని తమ మీద పని రుద్దబడుతుందో అని టెన్షన్ .
''చాలా అర్జెంట్ గా పెట్టాలంట '' చెప్పారు కొలీగ్స్ .
''ఎన్ని రోజులు అయింది సర్వీస్ లో చేరి , అర్జెంట్ కానిది ఏమైనా ఉంటె
కొత్తగా చెప్పండి '' పెద్దగా నవ్వాను .
చిన్నగా అందరి పెదాలు విచ్చుకున్నాయి .
''అయ్యాన్నీ నాకు తెలీదమ్మ . ఈ రోజు కధ ఈ రోజే ''చిన్నగా సంతోషం ప్రిన్సిపాల్ గారిలో .
నిజమే పై అధికారులు చెయ్యమన్నది మనం అడ్డం చెప్పకుండా చేయాలి .
కొంత చేసి అడ్డం వచ్చినప్పుడు చెపితే కొంత సానుకూల దృక్పధం ఉండొచ్చు .
కాని చేయడం అందరికీ తప్పనిసరి .
''చూడండి అందరం ఒకే పడవలో ఉన్నాము . మునిగేది మేడం అనుకోవద్దు .
పడవ తల కిందులు అయితే అందరికీ ఇబ్బంది ''చెప్పాను .
సాలోచనగా ఊపి పనిని ప్లాన్ చేయడం ప్రారంభించారు .
మెల్లిగా ప్రిన్సిపాల్ గారు కూడా వంగి ప్రేమగా సూచనలు చేయడం
ప్రారంభించారు . బయట పని పెద్ద ముక్క . తప్పదు సీనియర్స్ తలకు
ఎత్తుకోవాలి . ఎందుకంటె పిల్లలు చదువులకు హాస్టల్స్ కు వెళిపోతే
కాసింత పాక్షిక నన్స్ గా మారిపోయాము . జూనియర్స్ ఇంకా
పిల్లలు , ప్రెగ్నెంట్ లు వగైరా ...... అదీ కాక మా భర్త లకు
సినిమాకు వెళ్ళాలి అన్నా ''నీకు డ్యూటీ లేదు కదబ్బా '' అని
అప్పాయింట్ మెంట్ తీసుకొనే జ్ఞానోదయం అయింది .
పాపం జూనియర్స్ భర్తలు ఇంకా భార్య ల సమయం తమదే అనే భ్రమ లో
ఉన్నారు ,ఈ జాబ్ చేరినాక కూడా .
ఏముంది కొన్ని జీతాలుగా కాలం దొర్లితే చిట్టీ లకి , ఇంస్టాల్ మెంట్స్ కి
అలవాటు పడితే వాళ్లకి కూడా జ్ఞానోదయం అవుతుంది .
మొత్తానికి బయట పనికి ఎవరో ఒకరు తల అడ్డం పెట్టినాక ఇక స్వచ్చందంగా
అందరూ తలో పని ముక్క ప్రేమగా ఆ తలను పెట్టిన వాళ్ళను
పరామార్శిస్తూ తీసుకుంటారు వీలును బట్టి .
ఇక అప్పుడు ప్రిన్సిపాల్ గారి ముఖం లో నవ్వు చిందులు వేస్తూ ,
రూం అంతా వెలిగిపోతూ ఉంటుంది .
అంతకు ముందు ఉన్న వేడి ఏమైంది !బిగుసుకొని కూర్చున్న వాళ్ళు
ఎలా అందరు ప్రేమగా మారారు . చిన్న చిరు నవ్వు .
అవును టెన్షన్ సమయం లో దాని విలువ వందల వేల రెట్లుగా ఉంటుంది .
మరి అది ఉదయించడం ఎలా ?
''ఇక ఇప్పుడు యోగా '' సమయం దానికి కొంత
కేటాయిస్తే కందెన వేసిన చక్రం అంత హాయిగా జీవితం దొర్లిపోతుంది .
దానికి టైం లేదు అనడం, కార్ లో పెట్రోల్ లేకుండా నడపడమే .
తెలివిగల వాళ్ళు పని బాగా జరగడానికి అవసరం అయిన
ప్రశాంత జీవన శైలిని ముందుగా ప్లాన్ చేసుకుంటారు . అమలు
చేస్తారు .
మొన్న 29/1/2015 నుండి మంత్రులకు , పాలనా అధికారులకు
బాబు గారు జగ్గీ వాసుదేవ్ గారితో యోగా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు .
మంచిది . నలభై రోజులు ఇచ్చినా మేలే . ఎందుకంటె మనం
అసహనంతో తప్పు చేస్తే కూడిక లో ఒకట్లో , పదులొ స్థానం లో
తప్పు జరుగుతుంది . కాని వాళ్ళ స్థాయి లో నిర్ణయాలు అసహనం తో
తీసుకుంటే కోట్ల స్థానం లో తప్పు జరుగుతుంది . బాబు గారు
మంచి నిర్ణయం తీసుకున్నారు . పాలనకు ఏమి ఇబ్బంది లేదు .
ఇప్పుడు మాత్రం నత్త నడకే కదా నడుస్తుంది , బైఫర్గేషన్ పేరుతో .
పనిలో పని సామాన్యుడు కు కూడా ట్రైనింగ్ ఇప్పిస్తే ఇప్పటి
నవ్యాంధ్ర ప్రదేశ్ దెబ్బలకు తట్టుకోగలుగుతాడు .

No comments:
Post a Comment