నిన్న ఈ ఊరిలో పత్రీజీ పిరమిడ్ ధ్యానం క్లాస్ .
ఊరిలో ఉండే పిల్లా పాప ,పెద్దలు .... ధ్యానం అంటే కొంచెం
అయినా ఇంటరెస్ట్ ఉండేవాళ్ళు అంతా అక్కడే ఉన్నారు .
పోయిన ఏడాది కర్తాల్ ధ్యాన మహాచక్రం గొడవల ప్రభావం
అంతగా లేనట్లు ఉంది . నిజమే కదా ఇక్కడ డబ్బు ప్రమేయం లేని
సంగతి , ఎవరికి వాళ్ళం ఇంట్లో హ్యాపీ గా ధ్యానం చేసుకుంటూ
యెంత మనః శాంతి పొందుతున్నామో మాకే తెలుసు . ఇక ఎవరో
చెప్పిన దానిని నమ్మడం ఎందుకు !!పత్రీజీ గారు మాట్లాడుతూ
మీరు పి . కె చూసారా ? అడిగారు . ఎవరూ చేతులు ఎత్తలేదు .
మరి మాకు ఇక్కడ హిందీ సినిమాలు రిలీజ్ అయ్యేది పెద్దగా
అలవాటు లేదు . సరే ''గోపాల గోపాల '' చూసారా ?
హయ్య ...... నేనున్నానోచ్ !! మరీ ఘోరం !!! సినిమాలు కూడా
చూడకుండా ఏమిటి వీళ్ళు !!
నేను మాత్రం ధ్యానం ధ్యానమే ,ఉద్యోగం ఉద్యోగమే ,ఇల్లాలు పోస్ట్
ఇల్లాలే ,రచనలకు రచనలే .... దేనికదే చేసుకుంటూ ఉంటాను .
అసలే ఇక్కడ కొన్ని ఏళ్ళు విజిట్ కి వచ్చాము . ఇక్కడ ఏమున్నాయో
నేర్చుకొని పోవాలి కదా !! ఇప్పుడు విదేశాలకి ఆఫీస్ పని మీద
పోతే అదే చూసుకొని రాము కదా , చూడవలసిన ప్రదేశాలు ,విశేషాలు
చూస్తాము కదా . మరి ఇంత పెద్ద మానవ జన్మకు వచ్చి యెంత
జ్ఞానం ఉందొ తెలుసుకోవద్దా !!
పత్రీజీ గారు అన్నారు .......
''గోపాల గోపాల '' చూడండి . మూర్ఖంగా మూఢ నమ్మకాలు పెట్టుకోకూడదు .
మనలో ఏమున్నదో ధ్యానం చేసి తెలుసుకోండి . మనిషి కి సహాయం
చేయండి ,దేవుడ్ని చేసి మూర్ఖులు కావొద్దు . అందరం దేవుళ్ళం .
కాకుంటేమనకు తెలీదు . ధ్యానం చేసి మీలోకి వెళ్లి తెలుసుకోండి .
ఎవ్వరూ ఏమి చెప్పక్కర్లేదు ,సమస్తం మీలోనే ఉంది . ధ్యానం చేయండి .
శ్వాస్ మీద ధ్యాస . చేతుల్లో చేతులుంచి ప్రశాంతంగా కూర్చోండి .
మీకే తెలుస్తుంది . పిల్లలు గోలీలు కోసం పోట్లాడినట్లు మీరు కోరికలు
కోసం ఆరాట పడి జబ్బులు తెచ్చుకుంటున్నారు . ఈయనలో ఇది
మాత్రం నాకు భలే నచ్చుతుంది . జనాలు కాళ్ళకు నమస్కారం చేయపోతే
తిట్టేస్తారు . మూర్ఖ శిఖా మణి ఏమి చేస్తున్నావు నువ్వు !!! నేను మీలాగే
ధ్యానిని అంతే ,అని భలే కోప్పడుతారు . చేసే వాళ్ళు తెగ సేవలు
చేస్తుంటారు . ధ్యానం తో ఎదగాలి . అంత వరకు వాళ్ళని మనం ఏమి
అనగలం .
గోపాల గోపాల చూసారా ?
''ఓ మై గాడ్ '' రీ మేక్ అంట . కధ బాగుంది . పెద్ద స్టార్స్
చేయడం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కృష్ణునిగా చేయడం ఈ సినిమా
కలక్షన్స్ కి ఎస్సెట్ . లేకుంటే మంచి సినిమా అని చెప్పినా అందరూ
చూడరు . ''అనూప్ రూబెన్స్ ''సంగీతం సూపర్ .
''దీంత నకర నకర '' పాట అయితే భలే హుషారుగా ఉంది .
సాహిత్యం కూడా బాగుంది .
వెంకటేష్ దేవుడి బొమ్మలు ,వస్తువులు అమ్మే వ్యాపారి .
కాని దేవుడిని మూర్ఖంగా పూజించడం ,మూఢ నమ్మకాలు
లేని వ్యాపారి . కాని పక్కన ఉన్న ముస్లిం అయినా ఎవరైనా
అవసరం లో ఉంటె సహాయం చేస్తాడు .అన్నం విలువ తెలిసిన వాడు .
యెంత అంటే పిండం వదలడానికి కూడా అంత అన్నం వృధా అవుతుందే
అనే బాధతో ఒక సాధువు జోలె లోకి విసిరేస్తాడు దాన్ని .
భార్య పరమ భక్తురాలు . ఆశ్రమాలు ,స్వామీజీలు , అభిషేకాలు ,
సామాన్య మానవులకున్న అన్ని నమ్మకాలు ,భయాలు ఉన్నాయి .
ప్రతీ పూజా చేస్తూ ఉంటుంది . ఒక స్వామీజీ దగ్గర భార్య నిప్పుల
గుండం తొక్క పోతుంటే ఆపడానికి ,
''కృష్ణుడు వెన్న తింటున్నాడు వెళ్లి పెట్టండి ''అని జనాలనందరిని
పంపేస్తాడు . అప్పుడు ఆ స్వామీజీ కి కోపం వచ్చేసి (పోసాని ,చాలా
బాగా చేసాడు ) నువ్వు నాశనం అయిపోతావు అని శాపం
పెట్టేస్తాడు . నిజంగానే వెంకటేష్ షాప్ కి మాత్రమె భూకంపం
వచ్చి షాప్ కూలి పోతుంది . ఎనబై లక్షలకి ఇన్స్యురెన్స్ క్లైమ్
చేస్తాడు . అప్పుడు ట్విస్ట్ . '' ఇది గాడ్ ఆఫ్ ఆక్ట్ '' కిందకి
వస్తుంది . మేము మనీ ఇవ్వమని కంపెనీ వాళ్ళు తిరస్కరిస్తారు .
(దొంగ మొహాలు ఈ కంపనీలు వాళ్ళు నిజంగానే రూల్స్ సరిగా
చెప్పరు ,ఇచ్చేటపుడు మాత్రం పాపం చావక బ్రతికి ఉన్న వాళ్లకి
చచ్చిన వాళ్ళతో వెళ్లి పోవాలి అనిపించేస్తుంది. అంతగా విసిగిస్తారు . )
పాపం వెంకటేష్ సగటు మనిషి . అంత నష్టం భరించడం ఎలా ?
లాభం లేదని ''దేవుడే చేసాడు కాబట్టి ,దేవుడే నాకు నష్ట
పరిహారం ఇవ్వాలి అని ''కోర్ట్ లో కేస్ వేసి అన్ని ఆశ్రమాల
స్వాములకు సమన్లు పంపి వాదించుకుంటాడు .
చివరికి వాళ్ళు చంపే ప్రయత్నం చేయపోతే ..... అప్పుడు
వచ్చేస్తాడు ..... ఇంకెవరు పవన్ కళ్యాణ్ ,మన కృష్ణుడు .
ఏమి నైస్ గా సూట్ ,షూ ,మొహం లో ప్రసన్నత ,ఆ బండి
ఉంది చూడండి ఎంత బాగుందో . మా ఊరి జనాలందరికీ
ఈ కృష్ణుడు కూడా నచ్చేసాడు . చప్పట్లే చప్పట్లు .
మరి వీళ్ళు ఇద్దరు కలిసి కేస్ ఎలా గెలిచారు ?జనాలు
మూఢ నమ్మకాలు వదిలేశారా ?అది స్క్రీన్ మీద చూడాలి .
చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి కాని నాకే డైరక్టర్ ఏమి
చెప్పాలి అనుకుంటున్నాడో చాలా సేపు అర్ధం కాలేదు .
మామూలు వాళ్లకు నచ్చదేమో అనుకున్నాను . కాని
అందరికీ బాగానే నచ్చింది . పవన్ కళ్యాణ్ శ్రియ తో
''మీ ఆయన దేవుడు లేడు అనటం లేదు తల్లి , ప్రశ్నిస్తున్నాడు ''
అని చెప్పినపుడు నాకు కొంచెం క్లారిటీ వచ్చింది . పర్లేదు
సినిమాని ఇంకెవరూ బాన్ చేయమని అనరు అనుకున్నాను .
చూడండి . మంచి ఆలోచన విధానం వస్తుంది .
చివరగా పెద్ద స్వామీజీ అంటాడు
''జనాలను మాకు దూరం చేయగలవా ? వాళ్ళు
గాడ్ లవర్స్ కాదు ,గాడ్ ఫియరర్స్ '' ఎంతటి నిజం .
ఎలా ఆలోచిస్తున్నాము మనం . అది,ఇది చేయకపోతే దేవుడు
ఏమి చేస్తాడో అని ఎంత భయపడుతున్నాము .
నిజంగా దేవుడు అమ్మ కంటే గొప్ప వాడు అయినపుడు ఆయన
దగ్గర ప్రేమ ,క్షమ తప్ప కోపం ఉంటుందా ?ఒకటి మాత్రం
నిజం పక్క మనిషికి తన సంపాదనలో కొంత అయినా
ఇవ్వని వాడు , ఒక్కరి ఆకలి అయినా తీర్చనివాడు ఎన్ని
పూజలు చేసినా దేవుడు మెచ్చడు . ఎందుకంటె ఆయనకు
అందరిని ప్రేమించడం మాత్రమె తెలుసు . ప్రేమ మాత్రమె
తెలుసు . అది ఎక్కడ ఉంటుందో ఆయన అక్కడ ఉంటాడు .
@@@@@@@

2 comments:
నైస్ పోస్ట్ శశిగారూ.. ;)
thank you raj
Post a Comment