Monday 28 May 2012

జీవితం జీవించ గలగాలి తృప్తిగా .....ఎలా?

జీవితానికి తృప్తి 
తన కోసమే కాక 
పరుల కోసం 
కూడా జీవించి నపుడే....


ఈ రోజు ఎం.టి.ఆర్ జయంతి.
ముందు ఆయనను తలుచుకుంటాను.






''అసతోమా సద్గమయా''


సత్యము వైపే నడిపించు.
ఇది మన మనసుల్లో ఎప్పుడూ మెదిలే వాక్యం.


ఇప్పుడు అందరి మనస్సులో స్తానం వహించింది 


''సత్యమేవజయతే''


దీని గూర్చి నేను ప్లస్ లో చూసినపుడు ఇది హిందీ 
ప్రోగ్రామ్ కదా నా కెందుకులే అనుకున్నాను.


కాని తెలుగులో ఈ టీవీ లో ఆదివారం 
పదకుండు గంటలకు వస్తుందని తెలుసుకొని చూసాను.


అరె ఇంత వరకు ఎందుకు ఈ ప్రోగ్రాం చూడలేదా అని 
బాధ పడ్డాను.


దీనిని అమీర్ ఖాన్ నిర్వహిస్తున్నారు.


దీని ఉపోద్గాతం లోనే అమీర్ ఖాన్ ''మనం చాలా 
తప్పులు సమాజం లో చూస్తునాము.కాని వాటిని 
ఖండించలేక సర్దుకు పోతున్నాము.ఇవి అందరి 
దృష్టికి తీసుకు రావాలనే చిన్న ప్రయత్నమే ఇది''అన్నారు .


ఒక్కో వారం ఒక్కో సమస్య బుల్లి తేర పైకి తీసుకొని వస్తున్నారు.
వర కట్నం,బ్రూన హత్యలు ఇలాగా.ఈ ఆదివారం 
జీవితం విలుయినది అది పేద వారి దైనా ,గొప్ప వారి దైనా 
అనే అంశం లో వైద్యం గూర్చి చూపించారు.


డాక్టర్స్ అంటే మనం దేవుళ్ళు లాగా చూస్తాము.
కాని అది కూడా ఒక వ్యాపారంగా ఎలా మారి పోయిందో చూపించారు.


ఇంకా రెండో ఒపీనియన్ తీసుకోకుండా వైద్యం చెయ్యించ వద్దు.అని 
బాదితుల ను కూడా చూపించారు.కొన్ని కధలు మన ముందు 
ఉంచారు.


ముఖ్యంగా ఒక ఊరిలో ఆడవాళ్ళు అందరికి హిస్తోరేక్టమి 
ఆపెరేషన్స్ చేసారు అని చూసినపుడు భలే బాధ అనిపించింది.
అసలు ప్రక్రుతి ఆడవాళ్ళు తమ కార్యక్రామాలు చేసుకునేదానికి 
వీలుగా హార్మోన్స్ రావాటానికే వాళ్ళ  జీవితం లో ఒక క్రమం 
ఏర్పరిచింది.అది కోల్పోవటం అంటే వాళ్ళ జీవితం లో 
ఒక ముఖ్య భాగాన్ని కోల్పోవటమే.అది తప్పని సరి అయితే సరే.
కాని ఉత్తినే అలాగా...అంత  మందికి తీసేస్తారా?


''A MOTHER IS BORN .....WHEN THE BABY IS BORN''


అవును....అమ్మ పుడుతుంది....
తన తనువు లోనే ఒక చిన్నారి మొగ్గ ఊపిరి పోసుకున్నప్పుడు 


అవును అమ్మ పుడుతుంది 
చిన్నగా ఒక ప్రాణం తనలోపల లీలగా చక్కిలి గింతలు పెట్టినపుడు 


అవును అమ్మ పుడుతుంది 
చిన్నారి పాదం పొట్టలో మెత్తగా తన్నినపుడు 


అవును అమ్మ పుడుతుంది 
లోపల చిన్నారిని మనసులోనే హత్తుకొని మురిసినపుడు 


అవును అమ్మ పుడుతుంది 
ప్రాణాలు  పోయే కష్టాన్ని పంటి బిగువున దాచినపుడు 


అవును అమ్మ పుడుతుంది 
కష్తపు తీరం దాటి క్యార్ మనే కేక విన్నప్పుడు 


అవును అమ్మ పుడుతుంది 
చిన్నారి యెర్రని పెదాలు అమ్మ తనానికి వెతికినపుడు 


అవును అమ్మ పుడుతుంది 
రక్తాన్ని అమృతంగా మార్చి చిన్ని పొట్టకు శ్రీ రామ రక్షా అయినపుడు ...


యెంత చక్కనిది అమ్మతనం.....తొలగించే హక్కు యెంత రాక్షసతనం 


ఎలాగా ఊరులో అందరికి ఆపరేషన్స్ చేస్తారు....చాలా బాధ వేసింది.


ఇంకా మాత్రలు రేట్స్ విన్నప్పుడు ,పేదలకు వైద్యం యెంత 
భారం అయిందో తెలిసినపుడు,ముఖ్యంగా ఒక రూపాయ పావలా 
చేసే మందు నాలుగు వందలు అని చెప్పితే అది కొనలేక 
ఆ అమ్మ రాత్రంతా తన బిడ్డ నరకాన్ని అనుబవిస్తూ చనిపోయిన 
సంగతి చెప్పేటపుడు ......కళ్ళలో తిరిగే నీటి సుడులు ఆపుకోలేక 
పోయాను.


ముఖ్యంగా ఇదంతా చుట్టూ కాబోయే డాక్టర్స్ ముందు చెయ్యటం 
చాలా బాగుంది.కలాం గారు ఎప్పుడూ అందుకే యూత్ కి 
ప్రాధాన్యత ఇవ్వాలంటారు.


కొన్ని దగ్గర్ల అమీర్ ఖాన్ గారు కొంచం అవతల వారిని 
మాట్లాడ నీక పోయినా .....అంత సీరియస్ కార్యక్రమం 
చక్కగా నవ్విస్తూ ...విషయం హృదయం లోకి దూసుకొ 
పోయ్యేలా నిర్వహించారు.


తప్పకుండా అందరు చూసి కొంతైనా తమ హృదయాలను 
తడుము కోవాల్సిన కార్యక్రమం.


(ఈ కార్యక్రమం లింక్ క్రింద ఉంది)


http://www.youtube.com/watch?v=6aoNqDICsak&feature=player_embedded#

Sunday 27 May 2012

ఇది పిల్లలకు బడి సమయం....పెద్దలకు?


బుజ్జి బుజ్జి పిల్లలు చక్కగా ''తలి నిన్ను తలంచి ''

అంటూ చక్కగా పలకా బలపం పట్టుకొని 
బడిలో చేరాల్సిన సమయం వచ్చింది.

మరి పిల్లల కంటే వాళ్ళు ఎలా వెళ్ళగలుగుతారు 
అనే ఆందోళన పెద్దలలో ఎక్కువగా ఉంటుంది.

కొంచం చిన్నా జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు 
బడిలో సమయాన్ని చక్కగా ఉపయోగించుకోగలరు.

ఈ రోజు ఆంద్ర భూమిలో నా ఆర్టికల్ చదవండి.

అ’ అంటే అనురాగం, ‘ఆ’ అంటే ఆటపాటలు

  • - తన్నీరు శశికళ
  •  
  • 28/05/2012
మూడేళ్లు నిండిన పిల్లలకు అక్షరాభ్యాసం చేయస్తూ వేసవి సెలవుల తరువాత 
స్కూల్‌కి పంపటానికి తల్లిదండ్రులు పడే హడావుడి అంతా ఇంతా కాదు. 
వాళ్ళను ఎలా స్కూల్‌లో.. అంత సేపు ఇల్లు వదిలి ఉండేటట్లు ప్రిపేర్ చెయ్యాలి? 
లంచ్ సమయంలో బాక్స్ తీసి తింటారో లేదో? మిగిలిన పిల్లలతో కలిసిపోతారో లేదో? 
ఇవన్నీ కాకుండా చదువులో ముందం జలో ఉంటారో లేదో?
ఇలా చాలా ఆలోచనలు పేరెంట్స్‌కు రావడం సహజం.

పిల్లలపై అనురాగం, ఆప్యాయతలు చూపిస్తూ, ఆటపాటలతో లాలిస్తూ బడికి వెళ్లేలా
 వారిని మానసికంగా సిద్ధం చేయాలి. 
ముందుగా పిల్లలకు బొమ్మల పుస్తకాలు కొనిచ్చి మీరే ఒక్కో బొమ్మ చూపించి 
దాని గూర్చి చెపుతూ, 
‘ఇది నీ పుస్తకం.. జాగ్రత్తగా ఉంచుకో..’-అని చెపుతూ పుస్తకాలు చదివించాలి.
దానిలో బొమ్మలు ఉంటాయనే ఆలోచన మెల్లగా వాళ్ళలో ప్రవేశపెట్టండి.
 ఇంకా పలక, బలంతో వాళ్లు గీతలు, సున్నాలు రాసేలా ప్రోత్సహించండి.
 ఆ పుస్తకాలు, పలక బ్యాగ్‌లో పెట్టడం నేర్పించండి. అలా స్కూల్‌కి వెళ్ళటానికి
 వారిని సిద్ధం చెయ్యండి.

మామూలుగా పిల్లలకు నాలుగు విషయాలు రావాలి.
స్కూల్‌కి వెళ్ళటం ద్వారా... చదవటం, రాయటం, వినటం, మాట్లాడటం. 
వీటిలో వినటం, మాట్లాడటం మనం వాళ్ళకు ఇంట్లోనే చక్కగా నేర్పించవచ్చు.
 తద్వారా వాళ్ళు స్కూల్‌లో మిగిలిన రెండూ నేర్చుకుంటారు. 
మామూలుగా ఇవి పక్కవాళ్ళతో, మనతో ఉంటూ నేర్చుకుంటారు. 
కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఇంకా బాగా నైపుణ్యాలు పెరుగుతాయి. 

ముఖ్యంగా తల్లిదండ్రులిద్దరూ దీనిపై శ్రద్ధ వహించాలి.
కచ్చితంగా రాత్రి నిద్రపోయేముందు పిల్లల పక్కన పడుకొని బొమ్మల పుస్తకాలు 
తీసుకొని, బొమ్మలు చూపిస్తూ కథలు చెప్పాలి. 
వాళ్ళు ఊ కొడుతూ వింటూ ఇంకా.. ఇంకా అన్నారంటే శ్రద్ధగా వింటున్నారని అర్థం. 

దీనివలన వారిలో ఊహాశక్తి కూడా పెరుగుతుంది. వీడియోలు చూపిస్తే లాభం లేదు. 
పుస్తక పఠనమే పిల్లలకు అలవాటు చెయ్యాలి.
ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
కథ మరీ పెద్దది కాకూడదు. చెప్పిన కథే కొన్ని రోజులు చెపుతూ ఉండాలి.
కథ ఎప్పుడూ సుఖాంతంగా ఉండాలి.
ఇంకా మధ్యలో జంతువుల అరుపులు అవీ కూడా చెప్పగలిగితే వారికి
అది కూడా ఒక ఆటలాగా ఉంటుంది. 

మాట్లాడటం అలవాటు చెయ్యటానికి వాళ్ళని- ‘అమ్మకు కథ చెప్పు’ అని అభినయంతో
చెప్పేటట్లు ప్రోత్సహించవచ్చు. వినేవాళ్ళుకూడా భలే భలే అని వారిని అభినందించాలి.
 ఇంకా కొందరు స్కూల్‌కి వెళ్ళేలోపు ఇంట్లోనే అక్షరాలు కూడా నేర్పిస్తూ ఉంటారు.
ఇందులో తప్పేమీ లేదు. కానీ కొంచెం వాళ్ళ వేళ్ళకు శ్రమ లేకుండా చూసుకోవాలి.
 రాయించటం కంటే ఆ అక్షరాలు ఎక్కడ ఉన్నా.. అంటే పేపర్లో, టీవీలో గుర్తుపట్టేటట్లు
 ప్రోత్సహించాలి.
 చిన్న చిన్న రైమ్స్ (తెలుగు అయితే మేలు. మాతృభాష మననుంచే వారికి రావాలి)
 పలికించి డాన్స్‌చేయిస్తే చదువంటే ఒకేసారి భయపడకుండా ఉంటారు.

ఇంకా కొంతసేపు మీ నుండి దూరంగా ఇరుగుపొరుగు పిల్లలతో ఆడుకునేటట్లు చెయ్యాలి. 

ఇక వాటర్ బాటిల్ తీసి తాగటం, బాక్స్ ఓపెన్ చేసి తినటం, తినేముందు చేతులు కడుక్కోవటం ఇలా...
 అప్పుడప్పుడూ చేయిస్తుంటే కొత్తగా ఫీల్ అవ్వరు. 
ఎలాగూ బడిలో టీచర్లు ఇవన్నీ చూసుకొంటారు. కొంచెం మనం అలవాటు చేస్తే బాగుంటుంది. 
ఒకటి మాత్రం నిజం. అమ్మానాన్నల పర్యవేక్షణలోనే పిల్లలు అన్ని విధాలా చక్కగా ఎదుగుతారు.
‘మనం వాళ్ళకు ఇవ్వాల్సింది డబ్బు కాదు.. సమయం, ప్రేమ మాత్రమే’’.

Friday 25 May 2012

మనమైతే...ఏమి చేస్తాము?

మనమైతే...ఏమి చేస్తాము?

చూడండి రోడ్ మీద స్పృహ తప్పిన వ్యక్తిని చూసి 
ఆ కార్ లోని వ్యక్తీ ఎలా స్పందిన్చాడో?
గ్రేట్ కదా...

మనకు అలా చెయ్యా లని అనిపిస్తూ ఉంటుంది....
కాని మన హడావడిలో మనం ఉంటాము.
కాని ఎండకి పేద గొప్ప తేడా లేదు.
మనం అయినా వడ దెబ్బకి పడిపోవచ్చు.

వడ దెబ్బ ఎవరికి ఎప్పుడు తగలదని మనం ఏమి 
చెప్పలేము.అందులో చెన్నై నుండి ఇప్పుడే వచ్చాను...

బాబోయ్ ఏమి ఎండలు....పక్షులైతే గిల గిల ..పాపం.

కనీసం అలా పడిపోయిన వాళ్ళు కనపడితే అన్నా మీలో  
మానవత్వానికి చోటివ్వండి.ఎందుకంటె వడదెబ్బ వల్ల
ప్రాణాలు పోతాయి.కనీసం మీ చేతిలోని నీళ్ళ బాటిల్ అయినా 
ఇచ్చి తాగించండి....మనుషులుగా తృప్తి పడండి.




Monday 14 May 2012

కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్....కేక.....నవ్వులే నవ్వులింక.

ఆ రోజు ఒక దివ్యమైన రోజు.ఎందుకో మీకే ముందు ముందు తెలుస్తుంది.
తొందర పడితే ఎలాగందీ?


మొన్న శుక్రవారం ఈయన ఒక మంచి కళ లో .....శశి ఏమి కావాలి 
నీ పుట్టినరోజుకి?అని అడిగారు.
నాకైతే చెప్పు సఖీ....చుక్కలు తెమ్మన్నా తెంపుకు రానా...అనే ఫొజ్ 
కనిపించింది.
(హమ్మయ్య దొరికారు అనుకొన్నా మనసులో)

గమ్ముగా చూసాను.పాపం తుఫాన్ ముందటి ప్రశాంతత అని 
ఊహించక....మేక పిల్ల లాగ అమాయకంగా ,నేనేదో మొహమాట పడుతున్నాను 
అనుకొని .....పర్లేదు చెప్పు అని భరోసా ఇచ్చారు.
(అసలు భార్య కోరిక తీరిస్తే భర్తకు చాల గర్వంగా ఉంటుంది అనుకుంటాను)

నేను మెల్లిగా నవ్వుతూ....చల్లగా చెప్పేసాను.మరు నిముషం .....
కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ ...కేక.....ఎలా వీలవుతుంది?రెండో రోజు టికట్స్ ఎలా 
దొరుకుతాయి అందులో నెల్లూరులో .......అనేసారు.
కావాలంటే ఇంకేదైనా కోరుకో....అదియున్ దక్క ....అనేసారు.

అలాగా మనసు మార్చుకుంటే శశి ఎలా అవుతుంది.నాకు 
కావాల్సింది ఇదే అని మొండికి  పడిపోయ్యాను.

"అయినా నీకో తిక్క ఉంది ....కాని దానికి ఒక లెక్కుంది 
మరి ఈ పవన్ పిచ్చి ఎప్పటి నుండి "అని దీనంగా అడిగారు.

ప్లస్ లో పోస్ట్లు వేసి...వేసి...ఈ పిచ్చి రప్పించిన మహా మహులు 
గూర్చి చెప్పెద్డాము అని నోటి దాక వచ్చింది....
కాని తరువాత ప్లస్ మూసివేస్తారు అనే ....లైట్ వెలిగి చెప్పలేదు.


''ఊహు ఈ పిచ్చి నా సొంతమే కాని ఎవరు ఇవ్వలేదు ''
అని ఖచ్చితంగా చెప్పేసాను...

సరే ఇంకేమి చేస్తారు.నెల్లూరు లో వాళ్ళ ఒక్కగాని ఒక్క చెల్లికి విషయం 
చాలా సీరిఎస్ అని చెప్పేసారు.పుట్టింటి వాళ్ళ పని చెయ్యటమే ప్రధమ 
కర్తవ్యమ్ కల ఆడపిల్ల కాబట్టి....వాళ్ళ భర్తకు ఆర్డర్ వేసేసింది.
వాళ్లకు అక్కడ రైస్ మిల్.ఆయన పలుకు బడి అంతా ఉపయోగించి 
నాలుగు టి కట్స్ ఫస్ట్ షో కి,నాలుగు సెకండ్ షో కి సంపాదించారు.

సరే ఏమి చేద్దాము.పిల్లలు నలుగురిని ఫస్ట్ షో కి పంపించి ,మేము 
సెకండ్ షో కి వెళ్ళేటట్లు నిర్ణయం చేసుకున్నాము .

ఇక్కడ ఆడబిడ్డ గూర్చి చెప్పాలి.యెంత అత్తగారింట్లో ఉన్న వాళ్లకి  
పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది.నా పుట్టిన రోజని ,నేను ఎక్కువగా రాను 
అని చిన్న హడావడి చెయ్యలేదు.సేమ్య పులిహోర,గ్రాస్స్ హల్వా,వడలు,
కేక్స్,ఐస్ క్రీం ఇలాగా హడావడే హడావడి.

ఇక సెకండ్ షో దాక ఖాళీయే కాబట్టి  వాళ్ళ ఆయన ,ఆ అమ్మాయి దగ్గర ఉండి 
కార్ లో ఇస్కాన్ టెంపుల్ కి తీసుకు వెళ్లారు.పొయ్యే సరికి హారతి.
ఇక్కడ కృష్ణుడు పూరి జగన్నాదుడు లాగా ఉంటాడు.ఇక నన్ను కృష్ణుని 
దగ్గర నుండి లాక్కొని రావటం చాల కష్టం.
ఎలాగో కష్టపడి అక్కడ నుండి 15 కి.మీ దూరం లో గల ''వెంకయ్య స్వామీ''
గుడికి వెళ్ళాము.ఈయన సాయి బాబా లాగా అవదూత.శనివారం చాలా 
రష్ గా ఉంది.అయిన దర్శనం చేసుకొని హోటల్ కి వెళ్లి సినిమాకు వెళ్ళాము.

ఇప్పుడు కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్...కేక 

   అదిగో పేర్లు పడుతుంటేనే కేకలు,ఈలలు...చాలా రోజులు తరువాత భలే 
హుషారు వచ్చేసింది.అలాగా కేకలు ఉంటె నేను ఎలా ఉన్నా మా వారు 
ఏమి అనరు.గుంపులో గోవిందా.(అయినా సినిమాకి వెళ్ళేది ఎందుకు 
ఎంజాయ్ చెయ్యటానికి)....సిడ్ని లో అలాగే అంట,ఢిల్లీ లో అలాగే  అంట.

ముందు గా దేవిశ్రీ కి....ఒక కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్......హు హా...తరువాత 
ఒక ఊపు అందించాడు.
ఇక కధ ఏమి పెద్దగ లేక పోయినా ,స్క్రీన్ ప్లే  తో నవ్వులు పండించి 
దర్శకులు ప్రేక్షకులను కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ అనిపించారు.

జనాలు బండ్ల గణేశా .....బండ్ల నిండా డబ్బులు తీసుకొని పో 
అని ఉద్దారంగా తమ ప్రేమనంత ఇచ్చేసారు.


పాపం పవన్ చిక్కిపోయ్యి ఉన్నాడు.శ్రుతి చిక్కి పోయి ఉంది.
పవన్ తనదైన స్టైల్ లో నవ్వులే నవ్వులు.


తన పోలిస్ స్టేషన్ పేరు మార్చటం,ఆలి ని అరె ఓ సాంబ అని పిలవటం...
అసలు జనాలు సీట్లలో కూర్చోలేక ఎగురుతున్నారు నవ్వులతో.

అందరు పనులు,భాద్యతలు,కెరీర్ ,టెన్షన్ లు అనే షెల్ల్స్ బద్దలు 
కొట్టేసుకొని సీతా కొక చిలుకల్లాగా నవ్వుతుంటే నాకు భలే 
సంతోషం ఎసింది.ఇంకా బ్రహ్మా నందం అయితే తన పని తను 
చక్కగా చేసాడు.మరీ పవన్ కట్ అవుట్ తెచ్చే సీన్ అయితే కేకో...

మరీ ముఖ్యంగా అంత్యాక్షరి సీన్,కబడ్డీ సీన్ భలే ఎంజాయ్ చేసాము.
అయితే అర్ధం కాని విషయం ఏమిటంటే హీరో బుల్లెట్స్ ని టపా ,టపా 
కాల్చేస్తుంటాడు.నాకు తెలిసి ఒక్క బుల్లెట్ కాల్చిన వాళ్ళు లెక్క చూపాల్సి 
ఉంటుంది.

అయినా ఇలా తప్పులు చూస్తె నన్ను తెలుగు ప్రేక్షకురాలు కాదు 
అనుకునే అవకాశం  ఉంది.తెలుగు సినిమాలో ఏదైనా పాజిబుల్...
కేకో...కేక అంతే.

ముఖ్యంగా తెలుగు సినిమాని అలా తెల్ల పంచలు కటుకొని కొడవళ్ళు 
తీసుకొని,సుమో లు వేసుకొని.....టపా...టపా...పొడిచేసే సీన్ లు నుండి 
బయటకు లాక్కొచ్చి పడేసి....కొంచం ఊపిరి తీసుకోనిచ్చారు.

ఇదేదో దబాంగ్ సిఇమా రీమేక్ అంట.నాకేమి పోల్చుకొనే ప్రాబ్లెం 
లేదు.ఎందుకంటె నేను హిందీ సినిమాలు చూడను.

అన్నీ బాగున్నాయి శశి కధ ఏది అంటే.....

భలే వాళ్ళే రాక రాక తెలుగు సినిమాల్లో సకుటుంబంగా 
నవ్వులే నవ్వులతో చూసే సినిమా వచ్చింది.
పొయ్యి దియేటర్ లో చూడండి.ఎంజాయ్ చెయ్యండి.

సరే కొస మెరుపు ఏమిటంటే ....పక్క రోజు ఆదివారం నెల్లూర్ లో 
ఈనాడు వాళ్ళు ''అమేజింగ్ అమ్మ ''పోటీలు నిర్వహిస్తే 
దానిలో పాల్గొని ఆరు రౌండ్లు కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వు కేక 
అనిపించి ఫస్ట్ ప్రైజ్ తెచ్చేసుకున్నాను.

ఈ కింద పిక్స్ చూడండి 






నాకు పిక్స్ పంపించి సహాయం చేసిన శేఖర్ గారికి థాంక్స్ .

(శేఖర్ గారి బ్లాగ్ లింక్ ..... http://sekhargunturu.blogspot.in/)

ఇంకా నా పుట్టిన రోజుని తమ ఆత్మీయురాలిగా నన్ను భావించి 
నేను బాగుండాలని ప్లస్ లో పోస్ట్లు వేసిన వాళ్ళు,విషస్ పెట్టిన వాళ్ళు 
ఫోన్స్ చేసిన వాళ్ళు,మెయిల్స్ పెట్టిన వాళ్ళు.....అందరికి బోల్డన్ని 
థాంక్స్.ఇంతకూ ముందు ఎవరికి ఎవరమో....ఇప్పుడు తెలీకుండానే 
ఆత్మీయులం అయిపోయ్యము.అందరికి....ఒక కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్...కేక.

Monday 7 May 2012

షష్టి పూర్తీ.....యెంత తృప్తి?

ఆటో కళ్యాణ మండపం ముందు దిగగానే ఎదురుగా 
జన సమూహం కనిపించింది.
ఈయన ఆటో కి డబ్బులు ఇచ్చి వస్తుంటే 
లోపలి వెళ్లి సమూహం లోకి తొంగి చూసాను.
పక్కన అప్పుడే ఆయుష్ హోమం పూర్తీ చేసినట్లున్నారు.
సమూహం మధ్యలో భార్య భర్త ఇద్దరు కూర్చొని ఉన్నారు.
మంగళ స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అప్పటికి రెండు రోజుల ముందు నుండి 108 కలిశాలతో పూజలు,హోమాలు చేసి ఉన్నారు.


వాళ్ళ కొడుకులు,కోడళ్ళు,బావమరుదులు,మనుమలు 
మనవరాళ్ళు ఒక్కొక్కరుగా పైన ఉంచిన జల్లెడలో ఉన్న పూలు నెమలీకలు మీదుగా కలిశాలలో ని నీరు పోసి వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేస్తూ ఉన్నారు.


చుట్టూ హడావడి....పిల్లల సందడి చెప్పలేము,తాత అవ్వ పెళ్లి జరుగుతుందని...
నవ్వులు,కేకలు,సందడి..పెద్ద వాళ్ళపై భక్తీ,ప్రేమ ......చాలా చక్కగా ఉంది వాతావరణం 

హమ్మయ్య సమయానికి వచ్చాము.అందరు జంటలుగా వాళ్ళ పై 
నీళ్ళు  పోసి కాళ్ళకు నమస్కారం చేసుకుంటున్నారు.
నేను ,మా వారు కూడా నీళ్ళు పోసి అభిషేకించి నమస్కరించుకున్నాము
(కాని ఒకటి అనిపించింది.ఎండాకాలం కాబట్టి సరిపోయింది.
లేకుంటే అన్ని చల్లటి నీళ్ళు ఆ వయసులో పోయించు 
కోవాలంటే కష్టమే)


తరువాత వెళ్లి కళ్యాణ మండపం లో కూర్చున్నాము.ఇంతకీ విశేషం ఏమిటంటే 
మా వారి పెదనాన్న కూతురి (అంటే నాకు వదిన )గారి షష్టి పూర్తి.
ఇలాంటి భాగ్యం కోసమైనా మనం అక్కడకు వెళ్లి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి.
ఎందుకంటె అందరికి డబ్బులు ఉంటాయి....కాని చేసే వాళ్ళు ఉండరు.
ఇంకా కొందరికి  షుగర్ బీపి లు ఉంటె  కూర్చునే ఓపిక ఉండదు.
ఇంకా విశేషం ఏమిటంటే షష్టి పూర్తి పెళ్లి కొడుకుకి జిలకర బెల్లం పెట్టటానికి 
జుట్టు ఉండటం.


పూజారి చాలా చక్కగా నవ్విస్తూ అన్నీ ఎందుకు చేస్తున్నారో వివరిస్తూ ఉన్నాడు.
(మేము నలుగురు తోడూ కోడల్లం మా షష్టి పూర్తికి ఆ స్వామినే పిలవాలి అని 
ఫిక్స్ అయిపోయ్యాము...అంత బాగా చేసారు)


మామూలుగా తల్లి తండ్రులుగా మారిన దంపతులకు మధురమైన 
ఒక తీపి గుర్తు ఉంటుంది......అదేమిటంటే పిల్లలు  వాళ్లకు కొంచం 
ఉహ తెలిసిన తరువాత అమ్మా నాన్న పెళ్లి ఫోటోలు చూసి 
నేను ఎందుకు లేను ఇక్కడ అని ఏడుస్తారు.


వీళ్ళు ఇంకా ముసి ముసి నవ్వులు నవ్వుకొని ...ఒక్కోరు ఒక్కో కారణం 
చెపుతారు.నువ్వు మమ్మి పొట్టలో ఉన్నావు,లేదా నువ్వు నిద్ర పోతున్నావు ఇలాగా 


కానీ వాళ్ళకి మన పెళ్లి చూడాలి అని ఉంటుంది.ఆ పూజారి చెప్పారు 
వయసులో చేసుకొనే పెళ్లి అమ్మా నాన్నల సంతోషం కోసం......
ఇప్పుడు చేసుకొనే పెళ్లి పిల్లల ఆనందం కోసం (మా నాన్న గారి షష్టి 
పూర్తి  కైతే మేము నలుగురు పిల్లలం,మాకు తొమ్మిది మంది వాళ్ళ 
సంతోషం అమ్మమ్మ,తాతయ్య అని చేసే సందడి చూసి మాకు చిన్న 
ఆనందం కాదు..)


ఇప్పుడు వీళ్ళకు ఒక అమ్మాయి,ఇద్దరు మొగ పిల్లలు....చిన్న పిల్లలు 
రెండు ఏళ్ళ వాళ్ళు ఒక పాపా ,బాబు ట్విన్స్.వాళ్ళు కూడా తాతయ్య,నానమ్మ పక్కనే 
కూర్చున్నారు ఎగురుతూ నవ్వుతూ...


పూజారి ఏమి చెప్పారంటే .......చిన్న వయసులో పెళ్ళిలో పెళ్లి కూతురు 
సిగ్గు పడుతుందంట.ఇప్పటి పెళ్ళిలో పెళ్లి కొడుకు సిగు పడుతాడు అని చెప్పారు .
నిజమే ......


ఎన్ని ఏళ్ళు గడిచాయి నీ సాహచర్యం లో 
తల వంచుకొని సిగ్గుపడుతూ మూడు ముళ్ళు వేయించుకున్న కాలం 
వేవిళ్ళతో మదన పడుతూ వేదన పడిన కాలం 
చిరు నవ్వుల సందళ్ళు,తప్పటడుగుల  ఇల్లు నింపిన కాలం 
అనారోగ్యపు వేళల్లో ధైరంగా ఎదుర్కున్న కాలం 
ఆర్దిక వత్తిడి లో   బుజం తట్టిన కాలం 
మనసు తో వెళ్లి తప్పులు చేస్తే మన్నించిన కాలం 
పిల్లల చదువలతో మదన పడిన కాలం 
అలసిపోయిన తనువును వడిలో అలరించిన కాలం 
పిల్లల పెళ్ళిళ్ళకు పెద్దగా నిలచి గౌరవం నిలబెట్టిన కాలం  
ఎదిగిన భర్తను అనారోగ్యపు వేళలో చిన్న పిల్లాడిగా చాకిన కాలం 


ఎన్ని వత్తిళ్ళు,ఎన్ని సవాళ్లు ......మనసుకు మొండి ధైర్యాన్ని 
ఇస్తూ......
దాంపత్యపు మధురిమ యెంత చెపితే తరుగుతుంది....
అది అనుభవించాలే కాని....


వేసిన అడుగులు తెలీకుండా ఆడవాళ్ళకు భాద్యతను,పెద్ద రికాన్ని 
ఇస్తే భర్తకు భార్యపై ఆధార పడే బలహీనతను కూడా ఇస్తాయేమో.....


ఆవిడ అక్కడ కూడా స్వామికి ఆయన అయ్యి చెయ్యలేరులే స్వామీ 
అని వెనుక వేసుకొస్తుంది.
ఆయన భార్యను గర్వంగా చూసుకుంటూ తాళి కట్టాడు.
చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ  వరకు చప్పట్లే మంగళ వాద్యాలుగా 
తృప్తి గా మోగించారు.


వాళ్ళ పెళ్ళికి వచ్చిన వాళ్ళు,వాళ్ళతో చదివిన వాళ్ళు ,చిన్న వాళ్ళు  
ఇంకా మా వారు అయితే మా అక్క ఇంకా అలాగే ఉంది ...పెళ్లి అప్పటి 
లాగే అని పొంగిపోయారు.యెంత మందికి దక్కుతుంది ఇంతటి 
ఆప్యాయత....భారతీయ గృహస్తు జీవితం లోని ఈ గొప్పదనం 


అందరికి వాళ్ళు ఆశీస్సులు ఇచ్చారు.పూజారి అయితే 
వాళ్ళ కోడళ్లను చాలా పొగిడారు.నిజమే ఈ వయసులో 
మీ కోసం నాలుగు లక్షలు ఖర్చు పెట్టాలా? అని అని వాళ్ళు అనుకోలేదు .


ఇంకా సొంత తల్లి తండ్రులకు చేసినట్లు అన్నీ దగ్గరుండి ప్రేమగా 
చేసి....పక్కనుండి తలంబ్రాలు పోయించారు.


ఇంత చక్కని పిల్లలను కలిగిన ఆ తల్లి తండ్రుల కళ్ళలో ఉబికిన 
ఆనంద తలంబ్రాలు వాళ్ళపై ఆశీస్సులుగా కురిసాయి అనటం లో 
సందేహమే లేదు  .



Saturday 5 May 2012

ఏమి కావాలి....ఇంకా....ఇంకా...

బ్రతకటానికి సంతోషం గా ఏమి కావాలి.....

డబ్బు.....సరే......

కీర్తి...సరే........

మంచి కుటుంబం ......సరే....

ఫ్రెండ్స్......సరే......

ఆరోగ్యం......సరే.....

ఏమిటి ఇంకా సంతోషం గా లేరా?
మరి ఏమి కావాలి మీకు మనసుకు శాంతి.

ఇదే బుద్దుడు కనుగొన్నది ......
కాని ఆయన  ఏమంటారో తెలుసా........
వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని నమ్మొద్దు...
నువ్వు చేసి చూడు .....అప్పుడు నమ్ము....
ఇవి చూడండి .




యెంత ప్రశాంతత.....చూస్తుంటేనే యెంత హాయిగా ఉంది.

జ్ఞానం నువ్వు పొందటమే కాదు...ఇతరులకు కూడా దారి చూపు .....


మరి ఎలాగా దీనిని పొందటం?
చేసి చూడండి.ఇలాగ కూర్చోండి.కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో,మంచం పై 
కూర్చోవచ్చు.

ఎలాగా చెయ్యాలి?
కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచి గమనిస్తూ ఉండండి.
ఆలోచనలు వస్తే కట్ చేసి .....శ్వాస నే గమనించండి .
కొంతసేపటికి ఆలోచనలు ఆగిపోయి ప్రశాంతంగా విశ్వ శక్తి ని పొందుతారు.

యెంత సేపు చెయ్యాలి?
మీ వయస్సు ఎంతో కనీసం అన్ని నిముషాలు చెయ్యాలి.

ఎప్పుడు చెయ్యాలి?
మీకు ఎప్పుడు వీలు ఉంటుందో అప్పుడు ......
బస్  లో వెళ్ళే టప్పుడు  అయినా చెయ్యొచ్చు సాదన మీద...
కాని ప్రతి రోజు ఒకే సమయానికి చెయ్యగలిగితే మంచిది.

ఎన్ని రోజులు చెయ్యాలి?
మామూలుగా నలబై రోజులు చేసి చూడండి అంటారు.
అలాగే అలవాటు అవుతుందని.....కాని దాని విలువ తెలిస్తే వదులుకోలేము.

ఏమి గుర్తు ఉంచుకోవాలి?
దీనికి మంత్రాలు,గురువులు లేరు...ఎవరికి వారే....
కాకుంటే సాధన,సత్సంగం,సద్గ్రంధ పతనం చెయ్యాలి.అప్పుడే మనసు 
మన మాట వింటుంది.

ఎవరు తోడుంటారు ?
మీ పూర్నాత్మే  మీకు తోడూ...ఎలా నడిపిస్తుందో మీరే చూడండి.

నేను చెప్పింది ఒక మార్గమే.బోలెడు మార్గాలు ఉన్నాయి.
కాని నాకు ఎందుకో డబ్బు ప్రస్తావన లేక పోవటం,గురువులు లేక పోవటం,
సులభంగా చేసుకోగాలగటం ,నియమాలు లేకపోవటం .....
అదీ కాక ఇది నాకు మంచి పలితాలు ఇవ్వటం వలన నాకు నచ్చింది.

అందరికి బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు 

ఎన్నోలక్షల ఏళ్ళ నుండి భారతీయుల మనసులోని మాట....కోరిక....

''అసతోమా సద్గమయా''
సత్యము వైపు నడిపించు.

''బుద్ధం శరణం గచ్చామి 
ధర్మం శరణం గచ్చామి 
సంఘం శరణం గచ్చామి ''


Friday 4 May 2012

తోక లేని పిట్ట..... ఇన్ని ఏళ్ళు తరువాత...

   తోక లేని పిట్ట ......తొంబై ఆమడలు పోతుంది....
ఎవరో తెలుసు కదండీ.......

మరి ఈ తోక లేని పిట్ట ఎన్నో ఏళ్ళు ఊర్లన్ని  తిరిగి ఫేస్ బుక్ లో 
వచ్చి పడి అది చేరవలసిన ఊరికి చేరింది......        



సరే ఇది చేరింది....ఓ.కే.

మరి పాపం మా జిల్లా ఇంటర్ ఫిజిక్స్ పేపర్స్ పోస్ట్ లో 
మిస్ అయ్యాయంట....మరి ఆ తోక లేని పిట్టలు ఎప్పటికి 
కనపడుతాయంటారు .............

పాపం వాళ్ళు నిన్న మళ్ళా ఫిజిక్స్ పరీక్ష వ్రాశారు.
చూడండి....రాత్రికల్లా దిద్ది రిజల్ట్స్ ఇస్తారంట.

మరి ఎవురికైనా ఎప్పటికైనా ఆ జవాబు పత్రాలు దొరికితే .......
ఎన్నేళ్ళు అవుతుందో మరి......చక్కగా అప్పుడు ఉండే ఏదో ఒక 
బుక్ లో పెట్టెయ్యండి.....వాళ్ళ మనుమలు చూసి సంతోషిస్తారు.

మా తాత రిజల్ట్స్ ఇప్పటికైనా వచ్చాయి అని ....

పనిలో పని వీళ్ళు వ్రాసిన స్కూల్ గూర్చి కొంచం చెపుతాను చూడండి...
మీకు కొద్దిగా పైన ఫోటోలో కనిపిస్తూ ఉంది కదా.....

అది ,ఇక్కడి కలక్టర్ ఆఫీస్ .......ఇవి బ్రిటిష్ వాళ్ళు కట్టినవి.
ఒక్కో గోడ ఇం......త లావుగా ఉంటుంది.మెట్లు కూడా చేక్కవి .
అయినా భలే గట్టిగా ఉంటాయి.ఇప్పటి భవనాలు చూసారా?
చెప్పుకోవటం ఎందుకు.....

సరే ఫిజిక్స్ పరీక్ష గూర్చి ఇంకొంచం.....ఎందుకంటె తృష్ణ గారు కామెంట్ 
చాలా చక్కగా చేసారు.దానిపై కొంచం వివరణ ఇస్తే అందరికి 
ఇక్కడి పిల్లలపై సానుకూల దృక్పధం ఏర్పడుతుంది.

ముందు జలతారు వెన్నెల  గారి కామెంట్ చూడండి 


Blogger జలతారువెన్నెల said...
శశి గారు,నేను ఈ వార్త పేపర్ లో చదివి తెలుసుకున్నాను ఈ సంవత్సరం physics lO అంధ్రా లో విధ్యార్ధులు తక్కువ మార్కులతో ఉత్తీర్ణులయ్యరని.
అసలు బ్లూ ప్రింట్ /గ్రీన్ ప్రింట్ అని కాకుండా.. syllabus లో ఉన్న టోపిక్స్ అన్ని చదవాలి కదండి. విధ్యార్దులన్నాక పరీక్షలలో పాస్ అవ్వడమే ధ్యేయం అవ్వకూడదు కదా? ఇక్కడి system లో ప్రతి లెస్సన్ లోను quizes and tests untaayi. 90% పైన మార్కులు సంపాదిస్తే "A" వచ్చినట్టు. లేకపోతే గ్రేడ్ పడిపోతుంది. అలా అన్ని లెస్సన్స్ లో quizes and tests lO vachina marks అన్ని కలిపి, mid term + Final కలిపి final grade decide అవుతుంది. అంటే "A" సంపాదించాలంటే ప్రతి లెస్సన్ లోను 90% పైన మార్కులు సంపాదించాల్సిందే! ఇక పరీక్షలలో (physics) theory questions ఉండవు. అన్ని problems . Conceptual gaa గా subject అర్ధం అయితే తప్ప ఆ problems ని crack చెయ్యleru students. ఇవి కాక, వారికి weekly ఒక 15 problem sets ఇస్తారు homework కింద. ఆ homework కి కూదా గ్రgrades ఉంటాయి. Final grade లో HW + quizes + final test + midterm test అన్ని కలిపి 90% పైన ఉంటే "A" vachinattu..లేకపోతే ఇంతే సంగతులు... ఒక వేళ ఆరోగ్యం బాగొలేక కొన్ని tests / quizes మిస్స్ అయినా, సరిగా చెయ్యకపోయినా..final దెబ్బ తింటుంది. ప్రతి రోజు చదువుకోవాలి, ప్రతి test బాగా score చెయ్యలి..అది challenge!

జలతారు వెన్నెల  గారు ఇప్పుడు మీరు చెప్పింది చాలా చక్కగా ఉంది .

నిజానికి విద్యా వ్యవస్థ అలాగే ఉండాలి.
కాని మీరు అలాంటి చదువు కోసం యెంత ఖర్చు పెడుతున్నారో చెప్పగలరా?
ఇక్కడ పేద విద్యార్ధులు అంత ఖర్చు పెట్టగలరు అనే అనుకుంటున్నారా?
అప్పటికి నేను మా వారు మా వంతుగా మంచి పిల్లలకు పెన్స్,బుక్స్ అవీ ఇస్తూ ఉంటాము .
(చాలా తక్కువ లెండి)అసలు బర్రెలు దగ్గరకు పోకుండా బడికి రప్పించటానికి ,
పెళ్లి చేసుకోకుండా పాటశాల కు రప్పించటానికి ఇక్కడ టీచర్స్ కి యెంత కష్టమో తెలుసా?
కనీసం వాళ్ళు ఇచ్చే మధ్యాహ్నం భోజనం కోసం వచ్చే వాళ్ళు ఎందరు తెలుసా?
ఇక్కడ పదునాలుగు ఏళ్ళు నిర్బంధ విద్య ఉంది కాబట్టి ప్రభుత్వం బరిస్తుంది.
లేకుంటే ఎన్ని స్కూల్స్ ఎత్తి వేసిందో తెలుసా?కొందరు టీచర్స్ ది తప్పు అంటారు 
కాని లోపాలు ఎక్కడా ఉంటాయి...ముందు మనం పిల్లవాడిని చదువుకు రప్పించటమే 
మన ధ్యేయం.అల్లాగే అందరు 90% తెచ్చుకొనే క్లేవేర్స్ ఉండరు...ఒక్కోరికి ఒక్కో 
విద్యలో ప్రావీణ్యత ఉంటుంది.అందుకే 35% వస్తే చాలు పై క్లాస్స్ కు పంపేది.
అందరు ఆఫీసర్స్ కాలేరు కదా........

అదీ కాక ఇంటర్ బోర్డ్ వాళ్ళు పేపర్ మార్చినప్పటి నుండి పేపర్ ఇలాగే ఇచ్చి ఉంటె 
వాళ్ళు చెప్పింది నిజమే  అనవచ్చు.ఎలాగో వస్తుందని ఊహించరు.
పాపం మొద్దులు  ఉంటారు కదండీ...వాళ్ళు వాళ్లకు  తగ్గ చదువులు ఏదో 
ప్యాస్స్ మార్కులు తెచ్చుకొని చదువుతారు.
మీరు చెపినట్లు అన్నీ  రాక  పొతే అదే తరగతిలో ఉండమంటే ప్రబుత్వం వాళ్ళ 
ఖర్చు బరించదు.మా మీద భారం  పెడుతుంది ఎలాగైనా పై క్లాస్స్ కు పంపమని...
ఇప్పటికి మనం పేదరికం కారణంగా  సంపూర్ణ అక్షరాస్యతే సాదించలేదు.
మీరు చెపిన చదువు రావటానికి ఇంకా కొంచం కాలం పడుతుంది.
అయితే దానికి తల్లి తండ్రులు సహాయం చాలా అవసరం.ఇక్కడ తల్లి తండ్రులు 
బడికి పంపమంటేనే కష్టపడుతున్నారు.
మంచి కామెంట్ పెట్టారు థాంక్యు.
అలాటి చదువులు ఇక్కడ కూడా రావాలని నేను కూడా కోరుతున్నాను.

Wednesday 2 May 2012

చదువు ''కొనుట''....బాబోయ్...

ఏమిటండి మీ వాడి ఇంజనీరింగ్ సీట్ కోసం మీరు చెన్నై
వెళ్లటం లేదా?మీ వాడికి బాగానే మార్కులు వస్తాయి కదా?

లేదండి....అన్నిట్లో పాస్ అయ్యడు...90% మార్కులు కూడా 
వచ్చాయి ...అయినా ఫిజిక్స్ లో ఫెయిల్ అయ్యాడు...


           *************************

మీ పాపకు ఎన్ని వచ్చాయి వదినా ఇంటర్ లో మార్కులు ?

ఏమి రాలేదు వదినా .......850

అయ్యో....ఏమి చేస్తాము ఫిజిక్స్ లో 21 

      ********************
హూ.....కలలన్ని కల్లలు అయిపోయే...ఇంకేమి 
పెద్ద కాలేజ్ లకు అప్లయ్ చేస్తాడు ......
ఫిజిక్స్ దెబ్బ కొట్టింది...టోటల్ తగ్గిపోయ్యే....

   *********************
ఒకరు,ఇద్దరు,లేదా పది మంది అయితే సరే.....

1,80,000 మంది ఆవేదన....అందరు బాగా చదవని మొద్దులేనా?

ఇదండి మొన్న ఇంటర్ వ్రాసి మంచి మార్కులు తెచ్చుకొనే పిల్లలు కూడా 
పెర్సెంటేజ్ పడి  పోయి పడే వ్యధ..................

మామూలుగా ఫిజిక్స్ కష్టమే .....కాదనలేము.....కాని ఇంత మందా?

నేను విద్యా శాఖ మంత్రి వివరణ టి.వి లో చూసాను.....
ఆయన చాలా కర్రేక్ట్ చెప్పినట్లు ఉంది కాని ........దానిలో 
తప్పించుకోవటమే కనిపించింది......

అసలు బ్లూ ప్రింట్ మేము ఇచ్చామా అంటారు.
అసలు బ్లూ ప్రింట్ వెయ్యకుండా ప్రశ్నా పత్రం ఎలా చేస్తారు 
.....నా బి.ఈ.డి.బుర్రకి అర్ధం కావటం లేదు....


నేను మా బాబుకి కూడా తక్కువ వచ్చాయి అని ఇలాగ చెప్పటం లేదు.

ఈ రోజు ఒక చెన్నై కాలేజ్ కి వెళ్ళాము......
యెంత పర్సెంటేజ్ ......అడిగారు.....
90.3%.........చెప్పాము.....

ఫిజిక్స్ తగ్గాయి లేకుంటే ఇంకా వచ్చి ఉండేది చెప్పాము...ఓహో...అన్నారు...

సరే ఏ గ్రూప్ కావాలి? చెప్పాము.....
సింపుల్ గా ఐదు వేళ్ళు చూపాడు.....అంటే లకారాలు .......
బాబోయ్ అన్నాము.....అది అడ్మిషన్ కే.....మళ్ళా ఒకటిన్నర .....అన్నారు....
90% వస్తేనే ఇలా ఉంటె మిగిలిన వాళ్ళ పరిస్తితి ఏమిటి?
బీద వాళ్ళు ఇంకెలా చదువుతారు....మంచి మార్కులు వచ్చినా కాని...

బాబోయ్.......చదువు''కొనుట''.......అనుకొని వచ్చేసాము.


పి.మధుసూదన్ రెడ్డి గారి రివ్యు .....ఫిజిక్స్ పరీక్ష పై ఇక్కడ చూడండి....
మీరు ఎక్కడైనా ఉండొచ్చు ఇక్కడ పరిస్తితి కూడా తెలుసుకోండి...