Wednesday, 2 May 2012

చదువు ''కొనుట''....బాబోయ్...

ఏమిటండి మీ వాడి ఇంజనీరింగ్ సీట్ కోసం మీరు చెన్నై
వెళ్లటం లేదా?మీ వాడికి బాగానే మార్కులు వస్తాయి కదా?

లేదండి....అన్నిట్లో పాస్ అయ్యడు...90% మార్కులు కూడా 
వచ్చాయి ...అయినా ఫిజిక్స్ లో ఫెయిల్ అయ్యాడు...


           *************************

మీ పాపకు ఎన్ని వచ్చాయి వదినా ఇంటర్ లో మార్కులు ?

ఏమి రాలేదు వదినా .......850

అయ్యో....ఏమి చేస్తాము ఫిజిక్స్ లో 21 

      ********************
హూ.....కలలన్ని కల్లలు అయిపోయే...ఇంకేమి 
పెద్ద కాలేజ్ లకు అప్లయ్ చేస్తాడు ......
ఫిజిక్స్ దెబ్బ కొట్టింది...టోటల్ తగ్గిపోయ్యే....

   *********************
ఒకరు,ఇద్దరు,లేదా పది మంది అయితే సరే.....

1,80,000 మంది ఆవేదన....అందరు బాగా చదవని మొద్దులేనా?

ఇదండి మొన్న ఇంటర్ వ్రాసి మంచి మార్కులు తెచ్చుకొనే పిల్లలు కూడా 
పెర్సెంటేజ్ పడి  పోయి పడే వ్యధ..................

మామూలుగా ఫిజిక్స్ కష్టమే .....కాదనలేము.....కాని ఇంత మందా?

నేను విద్యా శాఖ మంత్రి వివరణ టి.వి లో చూసాను.....
ఆయన చాలా కర్రేక్ట్ చెప్పినట్లు ఉంది కాని ........దానిలో 
తప్పించుకోవటమే కనిపించింది......

అసలు బ్లూ ప్రింట్ మేము ఇచ్చామా అంటారు.
అసలు బ్లూ ప్రింట్ వెయ్యకుండా ప్రశ్నా పత్రం ఎలా చేస్తారు 
.....నా బి.ఈ.డి.బుర్రకి అర్ధం కావటం లేదు....


నేను మా బాబుకి కూడా తక్కువ వచ్చాయి అని ఇలాగ చెప్పటం లేదు.

ఈ రోజు ఒక చెన్నై కాలేజ్ కి వెళ్ళాము......
యెంత పర్సెంటేజ్ ......అడిగారు.....
90.3%.........చెప్పాము.....

ఫిజిక్స్ తగ్గాయి లేకుంటే ఇంకా వచ్చి ఉండేది చెప్పాము...ఓహో...అన్నారు...

సరే ఏ గ్రూప్ కావాలి? చెప్పాము.....
సింపుల్ గా ఐదు వేళ్ళు చూపాడు.....అంటే లకారాలు .......
బాబోయ్ అన్నాము.....అది అడ్మిషన్ కే.....మళ్ళా ఒకటిన్నర .....అన్నారు....
90% వస్తేనే ఇలా ఉంటె మిగిలిన వాళ్ళ పరిస్తితి ఏమిటి?
బీద వాళ్ళు ఇంకెలా చదువుతారు....మంచి మార్కులు వచ్చినా కాని...

బాబోయ్.......చదువు''కొనుట''.......అనుకొని వచ్చేసాము.


పి.మధుసూదన్ రెడ్డి గారి రివ్యు .....ఫిజిక్స్ పరీక్ష పై ఇక్కడ చూడండి....
మీరు ఎక్కడైనా ఉండొచ్చు ఇక్కడ పరిస్తితి కూడా తెలుసుకోండి...

12 comments:

జలతారు వెన్నెల said...

శశి గారు,నేను ఈ వార్త పేపర్ లో చదివి తెలుసుకున్నాను ఈ సంవత్సరం physics lO అంధ్రా లో విధ్యార్ధులు తక్కువ మార్కులతో ఉత్తీర్ణులయ్యరని.
అసలు బ్లూ ప్రింట్ /గ్రీన్ ప్రింట్ అని కాకుండా.. syllabus లో ఉన్న టోపిక్స్ అన్ని చదవాలి కదండి. విధ్యార్దులన్నాక పరీక్షలలో పాస్ అవ్వడమే ధ్యేయం అవ్వకూడదు కదా? ఇక్కడి system లో ప్రతి లెస్సన్ లోను quizes and tests untaayi. 90% పైన మార్కులు సంపాదిస్తే "A" వచ్చినట్టు. లేకపోతే గ్రేడ్ పడిపోతుంది. అలా అన్ని లెస్సన్స్ లో quizes and tests lO vachina marks అన్ని కలిపి, mid term + Final కలిపి final grade decide అవుతుంది. అంటే "A" సంపాదించాలంటే ప్రతి లెస్సన్ లోను 90% పైన మార్కులు సంపాదించాల్సిందే! ఇక పరీక్షలలో (physics) theory questions ఉండవు. అన్ని problems . Conceptual gaa గా subject అర్ధం అయితే తప్ప ఆ problems ని crack చెయ్యleru students. ఇవి కాక, వారికి weekly ఒక 15 problem sets ఇస్తారు homework కింద. ఆ homework కి కూదా గ్రgrades ఉంటాయి. Final grade లో HW + quizes + final test + midterm test అన్ని కలిపి 90% పైన ఉంటే "A" vachinattu..లేకపోతే ఇంతే సంగతులు... ఒక వేళ ఆరోగ్యం బాగొలేక కొన్ని tests / quizes మిస్స్ అయినా, సరిగా చెయ్యకపోయినా..final దెబ్బ తింటుంది. ప్రతి రోజు చదువుకోవాలి, ప్రతి test బాగా score చెయ్యలి..అది challenge!

హరే కృష్ణ said...

హత విధి...ఏమి ఫిజిక్స్

రాజ్ కుమార్ said...

ఐదు లకారాలేగా.. చదువు కొనెయ్యండీ.. మీకేటీ? ;)))))))))))

Unknown said...

సివిల్ ఇంజినీరింగ్ చెయ్యమనండి. కన్సల్టెన్సీ పెట్టుకొని బోల్డన్ని డబ్బులు సంపాదించొచ్చు. అయినా ఇంజినీరింగ్ స్టార్టయ్యేది ఆగష్టు/సెప్టెంబర్‌లో కదండీ. ఇప్పుడే వెళితే ఏ కాలేజ్ వాడైనా లకారాలు డిమాండ్ చేస్తాడు. అప్పుడైతే బోల్డన్ని సీట్లు మిగిలిపోయి ఉంటాయి కాబట్టి విద్యార్థి చేరడమే గొప్ప అనుకుంటాడు. నాకు తెలిసి ఇంజినీరింగ్ విద్య తమిళనాడు కన్నా మన రాష్ట్రంలోనే కాస్తో కూస్తో నయం. :-)

జీవన పయనం - అనికేత్ said...

ఫిజిక్స్ కాదు జిమిక్స్:)

వనజ తాతినేని/VanajaTatineni said...

కార్పోరేట్ కాలేజెస్ ఇప్పటి వరకు చెల్లించారు. ఇక ఇంజినీరింగ్ కాలేజెస్ ని బతికిద్దామని .. అన్నట్టు ఉన్నాయి.
ఎమ్ విద్యా విధానం!?
నిస్సందేహంగా చదువు" కొనుట"
:(

శశి కళ said...

జలతారు వెన్నెల గారు మంచి విషయాలు చెప్పారు...
దీని మీద రాత్రికి ఇంకో పోస్ట్ వేస్తాను ...మీ కామెంట్ పై చూడండి.....



హరే...హ్మ్మ్...ఏమి చేద్దాం...

శశి కళ said...

రాజ్ మా కెపాసిటి నీకు తెలుసులే కాని ...కొనుక్కున్న చదువుతో మా వాడు దేశాన్ని ఉద్దరించాగాలడా?
ఇప్పటి దాకా వాళ్ళ తెలివితోనే బండి లాక్కొచ్చారు...
మరీగా కొనలేదు మేము ...


అవును అనికేత్ గారు.....థాంక్యు

శశి కళ said...

అవును వనజక్క....చదువు కొనటమే...దీని కోసమే ఇంట్లో ఉండే ఇద్దరు తెల్లారి గట్లే బయటకు వెళ్లి రాత్రి వరకు కష్టపడి వచ్చేది...బిడ్డలకు చదువు కోనీటానికే...


రామ లింగా గారు మీ పేరు భలే ఉంది.మీ సూచన బాగుంది ...ఆలోచిస్తాము...థాంక్యు

Anonymous said...

and....
naalanty vallani prothsahisthe kanuka.... nenu meeku nenu manchi btapaa raaya galanu...

శశి కళ said...

అంతర్ముఖం గారు ఇప్పుడు మీ కామెంట్ వచ్చింది ..చూసారా...మీ కామెంట్స్ అనీ నేను అప్ప్రూవ్ చేస్తే(అంటే పబ్లిష్ నేను చేస్తే)మీకు కనిపిస్తాయి...
దీనిని కామెంట్ మోడరేషన్ అంటారు.మీరు సెట్టింగ్స్ లోకి వెళ్లి పెట్టుకోండి.అప్పుడు మీకు ఎవరైనా సలహాలు ఇవ్వాలంటే ఇస్తారు...లేకుంటే ఇక్కడకు వచ్చి మీ మెయిల ఐ.డి.ఇవ్వండి...చెపుతాను

Anonymous said...

sasi gaaru meeru... b.ed cheasaara...???
naadi physical science methodology...
anattu naa tapaa meechaduvutaara???