Monday, 30 April 2012

నెమలీక.....నవ్వు లీక్ 4 ....

ఈ రోజు సంతోషం  అయిన రోజు మరి నాకు ...నా బ్లాగ్ కి...
ఎందుకంటె ఈ రోజు నా బ్లాగ్ పుట్టిన రోజు మరి.....ఈ రోజున 
ఏమి గుర్తుకు తెచ్చుకోవాలి......నాకు ఇష్టమైనవి.....
అంటే ఆకాశం......లేదా సముద్రం.......

సముద్రం మా ఊరికి పది కి.మీ.దూరం లోనే ఉంటుంది ....
అదే బంగాళాఖాతం.......మరి దాని దగ్గర ఉండే ఊరు ''తూపిలి పాళెం''
ఆ ఊరికి వెళితే  వ్యాన్లో  సముద్రం దగ్గరిదాకా  వెళ్ళొచ్చు. .అందుకని కోట నుండి అక్కడికే వెళుతాము సముద్రం చూడాలంటే.


''శశి నీకు ఒక గుడ్ న్యూస్ ....మనం రేపు అందరం మీ ఊరి దగ్గర 
సముద్రానికి వెళుతున్నాము''ఉత్సాహంగా చెప్పారు ఈయన.
 అప్పటికే పెళ్లి అయ్యి అత్తగారింటికి వచ్చి కొన్ని రోజులైంది.
మనసు దిగులుగా ఊరు వైపు వెళ్ళమని చెపుతూ ఉంది.
నేను చెప్పక పోయినా ఈయనకు ఎలా తెలుస్తున్దబ్బా .....నా గుబులు .

వీళ్ళకి ఊరు చుట్టూ మామిడి తోటలు,మల్లె తోటలు ఉంటాయి 
కాని సముద్రం చూడాలంటే మా ఊరు వెళ్ళాల్సిందే.
మా అత్తగారు,బావగారు,తోడుకోడలు,పాప,ఆడ బిడ్డ ,మరుదులు....
ఇంకా కొందరం కలిసి వెళ్ళాము.ముందు మా ఇంటికి వెళ్లి 
పలహారాలు అవి చేసి సముద్రానికి బయలుదేరాము.
కబుర్లు,పాటలు,నవ్వులు వ్యాన్ అంతా గువ్వల కిల కిలలతో 
నిండిన గున్న మామిడి లా ఉంది.నేను ఎంజాయ్ చేస్తూ 
మధ్యలో జోక్స్ వేస్తూ బయట గాలికి సేద తీరుతూ కిటికీ 
పక్కనే కూర్చున్నాను.

ఇసుక నేలలు కనపడుతూ సముద్రం దగ్గర అవుతున్న సంగతి చెపుతున్నాయి.
చిన్నగా సవక చెట్ల  గుబుర్లు వింజామరలు వీస్తూ ఉప్పు గాలి 
మోసుకొస్తూ ఉన్నాయి.పుట్టింటి సంతోషం నా కళ్ళలో మెరిసిపోతుందని 
ఈయన హాస్యమాడుతున్నారు.మరే ఈ గాలి,ఈ నేలా,అందరికి ఉంటాయి....
మరి మాకు సముద్రం కూడా.....ఉంది....గొప్పే కదా.....

కొంచం సేపు సవక చెట్ల నీడలో కూర్చుని ......అంత్యాక్షరి ఆడుతూ 
పాప చేత డ్యాన్స్ చేయిస్తూ తెచ్చినవి  తింటూ అల్లరి చేసాము అందరం.

ఇంకా సముద్రం దగ్గరకు వెళ్తామని వెళ్ళాము.అలలు చాలా ఎక్కువగా ఉన్నట్లు 
అనిపించాయి నాకు.....సముద్రానికి మనుషులను చూస్తె సంబరం అంట.
అలలతో యెగిరి పడుతుంది.మగ వాళ్ళు ఒక వైపు ఆడవాళ్ళు ఒక వైపు అలల్లో 
కాళ్ళు పెట్టి సంబరంగా ఎగురుతున్నారు.అల మన కాళ్ళ ను తడిపి 
వెనక్కు వెళ్ళేటపుడు భలే ఉంటుంది.మన కాళ్ళ కింద ఏదో కదిలి నట్లు ....
చక్కిలి గింతలు పెట్టి నట్లు....

మా వారికి నేను పక్కన కొత్తగా జత అయ్యేసరికి ఇంకా ఉత్సాహం గా ఉంది.
అలల్లో ఎగురుతూ లోపలి వెళుతూ ....నేను బయపడుతుంటే ఏడిపిస్తూ 
ఉన్నారు.

నేను కొంచం దూరంగా కూర్చొని కళ్ళకు అల తాకుతుంటే మురుస్తూ....
అలల సవ్వడి రాగాలు ఆలపిస్తుంటే దూరంగా ఆకాశం,పడవలు 
చూస్తూ కూర్చున్నాను.అందరు నీళ్ళ లోపలి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.

ఒక సారి మా పిన్నమ్మలతో వెళ్లి నపుడు మధ్యలో కూర్చొని అలలో మునుగు 
దామని తల వంచాను.అంతే అల ముంచేసి ఉక్కిరి బిక్కిరి అయిపోయి 
అలతో పాటే లోపలి వెళ్లి పోబోయాను .సమయానికి వాళ్ళు ఇద్దరు చూసి 
పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది.అప్పటి నుండి లోపలి వెళ్ళను.
కాళ్ళు తడిపెదగ్గర కూర్చుంటాను.సముద్రానికి నేను అంటే ఇష్టం 
అయితే నా కాళ్ళు తాకి పోతూ చక్కిలి గిలి పెడుతూ ఉంటుంది.

నేను ఒడ్డున కూర్చుని ఉన్నాను అని మా మరిది,ఈయన వచ్చి 
వాళ్ళ ఉంగరాలు నాకు ఇచ్చి షర్ట్స్ విప్పి అక్కడ పెట్టి దూరంగా వెళ్లి పోయారు.
నేను ఆ ఉంగరాలు (రెండూ పచ్చ రాళ్ళవే) వేళ్ళకు పెట్టుకున్నాను.
కొంచం వదులుగా ఉన్నాయి.సరేలే వాళ్ళు వస్తే ఇస్తాము కదా 
అని కూర్చొని మోకాళ్ళపై తల ఉంచుకొని సముద్రాన్ని చూస్తూ 
మధ్యలో ఈయన నవ్వితే బదులు ఇస్తూ గడుపుతున్నాను.

ఈ లోపల మా తోడు కోడలు నీళ్ళలో ఫోటోలు తీసుకుందాము రా 
అని పిలిచింది.వెళ్లి పక్కన నిల బడ్డాను.ఇంతలో తటాలున పెద్ద 
అల వచ్చి మా తోడుకోడలు చెప్పు వెళిపోయింది దానిలో.
చటుక్కున ఆలోచన లేకుండా వంగి పటుకున్నాను.
అంతే చేతి వెలి ఉంగరం అలతో వెళ్లి పోయింది.గుండె గుబిల్లుమంది.
ఒక్క క్షణం ఏమి అర్ధం కాలేదు.హమ్మయ్య అది మా వారిది.
మా మరిది ఉంగరం ఉంది.అయినా నేనే పోగొట్టేసాను అని భయపడి 
పోయాను.
ఇంటికి వెళ్ళే దాకా గమ్మున తల వంచుకొనే ఉన్నాను....
కళ్ళు అయితే శ్రావణ మేఘాల్లా నీళ్ళతో నిండిపోయి ఉన్నాయి.
ఇంకా అసలు కోట వదిలి వెళ్ళను అని అనుకునేసాను.
వాళ్ళు జాలిగా మాట్లాడే మాటలు కూడా నా చెవిన దూరటం లేదు.
అమ్మను వదిలి ఈయన దగ్గరకు రాను కూడా రాలేదు.
ఏమంటారో....ఎక్కడకు తీసుకెళ్ళి పోతారో అని......

ఈయనకు అర్ధం అయిపొయింది.ఇంకేమి చెపిన వినను అని.
చిన్నగా నాన్న తో మాట్లాడుతున్నాడు.నేను పొంగే కన్నీటి ముత్యాలు 
జాలువారకుండా తుడుచుకుంటునాను.

''నాకు ఆ ఉంగరం ఇష్టం లేదు మావయ్యా''అన్నాడు.
ఓహో అనుకున్నా....అయినా తప్పు చేశా కదా .....అనుకోని 
తల ఎత్తకుండా వింటూ ఉన్నాను.

''పొతే పోయిందిలే మావయ్య....అదేమీ నాకు కలిసి రాదు''అన్నాడు.

మరి ఎందుకు ఉంచుకున్నట్లు.....అక్కడ కధల  మీద కధలు చెపుతున్నాడు.
నాకు ఇంటరెస్ట్ పెరిగి కొంచం తల ఎత్తాను.
ఈయనకు హుషారు పెరిగి ''అసలు అది నాకెందుకో కలిసి 
రానే రాదు.....పోయిందే మంచిది యింది......అసలు పరీక్షలు 
వ్రాసేటపుడు దానిని పక్కన తీసి పెట్టి పరీక్షలు వ్రాస్తాను....''

''పొతే పోనీలే శశి ....ఇంకోటి చేయించు కుందాము....అది ఏమి మంచిది 
కాదు''నేను కొంచం నవ్వాను......చిన్నగా....
హమ్మయ్య అనుకోని....తొందరగా బయలుదేరు....
మళ్ళా చీకటి పడిపోతుంది.
చివరికి అందరు కలిసి నా తప్పు ఏమి లేదని .......
పౌర్ణమి ముందు పుట్టింటికి 
రాకూడదని....వచ్చాను కాబట్టి ఇలా జరిగిందని తేల్చేసారు.

ఎలాగో భయం తగ్గి అత్తగారింటికి వచ్చేసాను.అయితే అక్కడ ఎవరు
 సంయమనం పాటించకున్నా.........జీవితాంతం అది ఒక చేదు జ్ఞాపకం గా 
మిగిలి ఉండేది.ఇప్పుడు అది ఒక మంచి జ్ఞాపకం నాకు........
సంతోషం లో అందరు మంచివాళ్ళే....
కాని భాదలో కూడా ఆ మంచితనం నిలుపుకుంటేనే .....నిజమైన మంచివారు.

సరే కాని అండి......మీకందరికీ ఒక విన్నపం ......

ఇక్కడ ఆ సేతు హిమాచలం ....కాదు కాదు....ఆ సేతు ప్రపంచం మొత్తం 
బ్లాగ్ మిత్రులు ఉన్నారు......

మీకు ఎక్కడ పచ్చ రాయి ఉంగరం దొరికినా ........మీరు మంచి వారు 
కాబట్టి నాకు తెచ్చి ఈయగలరు......

(చూద్దాం....ఒక పది ఉంగరాలు అన్నా దొరుకుతాయేమో )


నా బ్లాగ్ లోకి వచ్చిన నా మిత్రులందరికీ థాంక్స్ 
తెలుపుకుంటూ ఈ స్వీట్స్ మీకు అందరికి ....

29 comments:

kallurisailabala said...

నేను చెప్పక పోయినా ఈయనకు ఎలా తెలుస్తున్దబ్బా .....నా గుబులు .
అలా తెలుసుకోవడమే చక్కని దాంపత్యానికి సూచన అక్క!
నాకు తెలిసి పెళ్లి అయిన కొత్తలో మాటలతో మాట్లాడుకోవాలి కాని తర్వాత మనసు మనసు మాట్లడుకుంటుంది.మనసులు మాట్లడుకునేచోట గొడవలకి చోటు ఉండదు కదా...

.జీవితాంతం అది ఒక చేదు జ్ఞాపకం గా
మిగిలి ఉండేది.ఇప్పుడు అది ఒక మంచి జ్ఞాపకం నాకు........
సంతోషం లో అందరు మంచివాళ్ళే....
కాని భాదలో కూడా ఆ మంచితనం నిలుపుకుంటేనే .....నిజమైన మంచివారు.

నిజ్జం చెప్పారు అక్క!
ఇది పూర్తిగా నిజ్జం.
పచ్చ రాయి ఉంగరం నాకు దొరికితే తప్పకుండ ఇచ్చేస్తాను.లేదా ఎవరిదీ అయిన లాక్కుని లేదా కొట్టేసి అయిన ఇచ్చేస్తాను సరేనా...
మీ బ్లాగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు.

జ్యోతిర్మయి said...

మీ బ్లాగ్ కు జన్మదిన శుభాకాంక్షలు శశిగారూ..ఇలాగే మీ బ్లాగు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
"బాధలో ఆ మంచితనం నిలుపుకుంటే"..ఎంత బాగా చెప్పారండీ...

రాజి said...

"సంతోషం లో అందరు మంచివాళ్ళే....
కాని భాదలో కూడా ఆ మంచితనం నిలుపుకుంటేనే .....నిజమైన మంచివారు"
మంచి జ్ఞాపకాన్ని పంచుకుంటూ.. మంచి మాటలు చెప్పారండీ..

మనవాళ్ళకి మనమే బంగారమండీ అందుకే మనల్ని ఏమీ అనరు..
నేను కూడా లా చదివేటప్పుడు ఒక ఉంగరం పోగొట్టేశాను ఐనా అమ్మ,నాన్న నన్ను ఏమీ అనలేదు :)

మీ ఉంగరం తప్పకుండా దొరకాలని కోరుకుంటున్నాను.
మీ బ్లాగ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

తృష్ణ said...

మీ బ్లాగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

నిరంతరమూ వసంతములే.... said...

మీ జ్ఞాపకాల దొంతరులు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు శశి గారు. మీ బ్లాగుకు పుట్టినరోజు శుభాకాంక్షలు!

Best Wishes,
Suresh Peddaraju

తృష్ణ said...

మీ బ్లాగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

వేణూ శ్రీకాంత్ said...

మీ బ్లాగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియూ మీకు అభినందనలు :-)

శశి కళ said...

శైలూ...యెంత మంచి దానివి కొట్టేసి తెచ్చినా పర్లేదు...థాంక్యుజ్యోతి గారు మీరు కూడా హృదయాన్ని తాకేతట్లు వ్రాస్తారు ...థాంక్యు

శశి కళ said...

రాజి గారు నిజంగా మీ మాటలు నాకు సంతోషం కలిగించాయి.ఇరవై ఏళ్ళు అయిపొయింది దొరుకుతున్దంటారా....దొరికితే నేను చాలా అదృష్టవంతురాలిని కదా....థాంక్యు

శశి కళ said...

తృష్ణ గారు,నిరంతరం వసంతములే గారు,వేణు గారు ...థాంక్యు

లోక్ నాథ్ కోవూరు said...

శశి గారు ..మీరు చెప్పిన ..తుపిలి పాలెం..మీ వారి ఊరు కి వెళ్ళే దారిలో మల్లేతోటలు నాకు బాగా తెలిసినవే...అక్కడే ఉప్పుకయ్యలలో ప్రయాణం...సవక చెట్ల గుబురులు..ఆ మట్టి రోడ్లు...ఇంకా ఆ సముద్రం...మొదట సముద్రం చూసింది అక్కడే...మీ పోస్ట్ అన్నిటి గుర్తు చేస్తూ ఎటో తీసుకెళ్తుంది...నాకు టైం ఉంటె ..అక్కడి మిత్రులతో ఎప్పుడు వెళ్దామా అనే..ఉంది..ఇప్పుడు నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తు మనసంత...ఏవేవో సంగతులు...నిజంగా మీకు థాంక్స్ చెప్పాలి...అన్నట్టు కనుపూరు జాతర కి ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్లుంటే ఒక పోస్ట్ రాయరూ.... ప్లీజ్.

మాలా కుమార్ said...

మీ బ్లాగుకు పుట్టినరోజు శుభాకాంక్షలండి .

లోక్ నాథ్ కోవూరు said...

అబ్బా... మీ పోస్ట్ చదివి ఎటో వెళ్ళిపోయాను...అసలు మీ బ్లాగ్ పుట్టిన రోజునే మరిచితిని.... "మీ బ్లాగ్ కు జన్మదిన శుభాకాంక్షలు .. మీ బ్లాగు ఇలాగే మన నేల,గాలి , మన మల్లెల పరిమళాలను ఎదజల్లుతూ...పది కాలాపాటు మన బ్లాగ్ మిత్రులందరికీ ...చక్కటి..ఆనందాన్ని ..ఆహ్లాదాన్ని ఇవ్వలాని (...నువ్వు ఇస్తావ్ నాకు తెలుసు..ఎందుకటే నీది అంత బోల్డ్ మనసు కదా.. ) మనసారా కోరుకుంటున్నాను.

వనజవనమాలి said...

శశి ప్రపంచం ..మా ప్రపంచం లోకి వచ్చి సంవత్సరమేనా అయింది!? నాకైతే..ఓ..పదేళ్ళు అయినట్లు ఉంది.
పడి కాలాలు గుర్తుంచుకునేలా ..ఉన్నటువంటి మంచి విషయాలు. నేను ఈ మధ్య నేను పవర్ కట్ వల్ల నేను అన్ని బ్లాగ్ లు చూడటం వీలవక ఖచ్చితంగా కొన్ని పోస్ట్ లు మిస్ అయ్యాను. ఈ రోజు కూడా ఇప్పుడే చూసాను శశి.
ఎన్ని లోతయిన అనుభవాలు..మంచి మనసుల గురించి పంచుకున్నారు. నిజంగా మంచి రోజు..
శశి ప్రపంచం పుట్టిన రోజు.
ఇలాటి పుట్టిన రోజులు ఆనందంగా జరుపుకుంటూ.. అందరికి స్పూర్తిని పంచాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ..
శశి..నాకు పచ్చ రాయి ఉంగరం ఇక్కడ హంసల దీవిలో దొరికింది. అది నీదని నాకు తెలియలేదు. మళ్ళీ సముద్రుడికి ఇచ్చేసానే!. మళ్ళీ దొరికితే.. ఇస్తానులే!

జ్యోతి said...

మీ బ్లాగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

రాజ్ కుమార్ said...

మీ బ్లాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు శశి గారూ..
నా దగ్గర నాలుగు రాళ్ళ ఉంగరాలు ఉన్నాయ్. అందులో ఒకటి ఆ మధ్య మా ఊరి సముద్రం లో దొరికీంది. మీదేనా?? :)

హరే కృష్ణ said...

సంతోషం లో అందరు మంచివాళ్ళే.... కాని భాదలో కూడా ఆ మంచితనం నిలుపుకుంటేనే .....నిజమైన మంచివారు.

చాలా బావుంది శశి గారు..
మీరు సౌత్ ఆఫ్రికా టైమ్స్ పేపర్ చదివారా ఏప్రిల్ 13 వ తేదీన..
సౌత్ అట్లాంటిక్ ocean లో ఉంగరం మింగేసి తిమింగలం మృతి అని

శశి ప్రపంచానికి జన్మదిన శుభాకాంక్షలు :))

ఆ.సౌమ్య said...

సూపర్ శశి మిస్....congratulations and happy b'day

ఫోటాన్ said...

Happy B'day Sasi Prapancham :))

జలతారువెన్నెల said...

ముందుగా మీ బ్లాగ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.మీరు ఈ టపా కి పెట్టిన చిత్రం simply superb! భలే బాగుంది. చాలా బాగా రాసారండి. ఉంగరం దొరికితే తెచ్చి ఇస్తాను, మీ address చెపుతారా కొంచెం?

Geeta said...

పుట్టిన రోజు శుభాకాంక్షలు శశి గారు .మీ బ్లాగ్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచి సురేష్ గారికి మీరే మరిన్ని ఉంగరాలను చేయిస్తారని కోరుకుంటున్నాం :)

శశి కళ said...

గీతు...థాంక్యు రా...
జలతారువెన్నెల గారు....దేవుడి దయ వలన మీలాంటి
మంచి వారికి నా ఉంగరం దొరకాల్నే గాని అదింక నాకు
కచ్చితంగా చేరుతుంది.కాక పొతే అది పదో ఉంగరం కావాలని కోరుకుంటున్నాను...))థాంక్యు

శశి కళ said...

హరే...ఆ ఉంగరం నువ్వు చూసావా?పచ్చ రాయి ఉందా?ఉంటె తెచ్చి ఇచ్చెయ్యి...


హర్షా,సౌమ్య,అండి...అందరికి థాంక్యు ...))

శశి కళ said...

వనజక్కా,జ్యోతి అక్క ...మీ ఆశీస్సులకు థాంక్యు...
రాజ్ నీకు నా బ్లాగ్ తరుపున మరియు నా తరుపునా థాంక్యు ...టీచర్ గారు...))

kalyan said...

@శశి గారు మొదట మీ బ్లాగ్ కు ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు ..... అప్పుడప్పుడు మంచితనాన్ని చూపించడానికి ఇలాంటివి జెరుగుతుంటాయండి .... బాగుంది మీ కథ :) హ పైగా పచ్చరాయి ఉంగరం దొరికితే నేను బద్రంగా దాచుకొని మా పిల్లలకు చూపించు మీ కథను చెప్పాలి కాబట్టి మీకు ఇవ్వలేను క్షమించాలి ...

శశి కళ said...

కళ్యాణ్..హ...హ..ఇవ్వవా?ఇంకా అల్లరి తగ్గలేదా?
సరే మీ పిల్లలకు చూపించి కధ చెప్పటానికి ఒక కధ
తయారు చేస్తాను...ఇది ఒక అమ్మాయి గుబులు కధ
వాళ్లకు నచ్చదు ....రాకుమారి కధ వ్రాస్టాలే...అయినా తిరుపతిలో సముద్రం ఇల్లే తంబి...))

శశి కళ said...

రాజ్ ఇంకా ఉంగరం అందలేదు...పంపలేదా?


వనజ గారు మళ్ళా పారేశారు అంట...అది నీకు దొరికినట్లు ఉంది

శశి కళ said...

లోకనాద గారు...మీకు మన ఊరి సంగాతలు గుర్తు చేసుకుంటూ మాట్లాడుదాము అని ఇక్కడ వ్రాయలేదు...సారి...మీ అభినందనలకు థాంక్యు

శశి కళ said...

మాలా కుమార్ గారు మీరు చాలా బాగా గుర్తు ఉంచుకొని అభిననదనలు చెపుతారు...థాంక్యు