Sunday, 17 July 2011

తిరుపతి.....ఏమిటి మా గతి.......

...అలొ.....అలొ......అలొ......ఏమి చేస్తున్నాలు?పొస్ట్ చదవాలని
వచ్చాలా?

ఏమి లేదండీ....మా బాబు
చిన్నప్పటి అల్లరి బాల్యపు తీపి గుర్తులు 
రాద్దామని.....మొదలెట్టాను అన మాట.ఊ.......ఊ........యెక్కడ నుండి
మొదలు పెట్టాలి?ముందు మా బాబు పోటో చూపిస్తాను.

 
అరెరె......బుజ్జి కన్నయ్యా......దా...దా......దామ్మా........నీ గూర్చె చెపుతున్నాను.
(మీరెమి చిచ్చి......బుజ్జి.....అనక్కర్లేదు.....పదండీ....పదండీ......)

మా అమ్మ మూడొ ఏడు వరకు పెంచి స్కూల్ లొ వేయమని నా దగ్గరకు పంపింది.
అప్పుడు మేము ఉండె ఊరిలొ దసరాకు పిల్లల కు చాల పొటీలు పెట్టెవారు.పిల్లలను
ఆ పోటీలకు పంపేది నాకు సరదా.ఆ రొజు fancy dress పోటీ .వాడికి వామనుడి లాగ
వేద్దామని గడ్డి తొ చిన్న గొడుగు చెసాను.అన్ని బాగా కుదిరాయి.కాని మూడు అడుగులు
నేల ఇమ్మని వాడు డైలాగ్ చెప్పాలి.

వాలికెమొ...ఇన్కా సలీగా లాదు
(ఒహ్.....నాకు బాగానెవచ్చు కద....నెను ఏందుకు అలా మాట్లడటం)

ఇక మన హీరొ స్టేజి మీదకి యెక్కాడు.అందరికి బలే ముద్దుగా ఉంది ఏమి చెపుతాడా అని.
అసలు మాట్లాడీతె గదా.నోట్లొ  centre fresh పెట్టు కున్నట్లు గమ్మున నిలుచున్నాడు.

(ఏమిటి?నెను పొయి చెప్పమంటారా?మీ కిచ్చెస్తా centrefresh)

నెను క్రింద నుండి చెప్పగా.....చెప్పగా....నొరు విప్పి అడిగాడు.....ఏమని అంటె 
రెండు అడుగుల నేల కావాలని......ఇక అందరు నవ్వటమె.......వాడి పొట్టి కి తగ్గట్టు 
అడిగాడని.

వాడికి పదేళ్ళ వయసులొ మెము మా వారి అన్నగారి కుటుంబము కలిసి తిరుపతి వెళ్ళాలని
అనుకొని బయలుదెరాము.వాళ్ళకు ముగ్గురు ఆడ పిల్లలు,మా పాప,బాబు కలిసి ఐదుగురు 
పిల్లలు.అందరు తిరుమల కు నడిచి వెళ్ళాలని అడిగారు.అక్క,నెను పిల్లలకు సపోర్ట్.
ఇంక మొగవాళ్ళు కూడా ఒప్పుకొని నడవసాగారు.

అప్పుడు చూడాలి మగవాళ్ళ తిప్పలు..................
(పెళ్ళి కాని వాళ్ళు చదవక పొతె మంచిది.లేక పొతె 
పెళ్ళంటె బయపడె ప్రమాదం ఉంది.యెమి బయంలేదా సరె .....సాహసమ్ చెయరా డింబకా...
నీకు తగ్గ విజయ లక్ష్మి వరించేనులే......)

అసలె వీళ్ళు తూనీగలు.పరుగొ.....పరుగొ......ఒకరు మామిడి కాయ కావాలంటే......
ఇంకొకరు కూల్ డ్రింక్ అంటె........ఇంకొకరు మెట్లపై పరుగు.......నెను ఫస్ట్ అంటె,నేను ఫస్ట్ అని...
మగవాళ్ళకు పిల్లలను వదిలేసి నెను అక్క హాపిగా కబుర్లు చెప్పుకుంటూ నిదానంగా ఏక్కుతున్నాము.
వాళ్ళకు మండిపోతుంది.
"ఇంకో సారి మీతొ వస్తె చూడండి" అని బెదిరించారు.

వెంటనె పై కోర్ట్  ఆర్డ్ ర్ వేసినట్లు పిల్లలకు వార్నింగ్ ఇచ్చెసాము .
మీ నాన్న వాళ్ళకు కోపంవచ్చింది .
వెంటనె అల్లరి మానేసి బుద్దిగా ఉండండి.లేకపొతె ఇక్కడే వదిలేసి పొతాము "అన్నాము.

యెంచక్కా బుద్దిమంతులై పోయారు.

అసలు తిరుమలకు నడిచి వెళుతుంటె ఆహా........చూడాల్సిందె......వర్ణించలేము.

పచ్చని కొండలు,చల్లని పవనాలు,మబ్బుల్లొకి నడిచి వెళుతున్నట్లు ఖచ్చితంగా పాట పాడాల్సిందే.
"గాల్లొతేలినట్లుందె.......గుండే జారినట్లుందే..........తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్లుందె......."

అక్క ని కలిసి చాలా రోజులయ్యెసరికి ఇద్దరం మాటలె......మాటలు............గల.....గలగల......
గల గల గల............

మా బావ గారు ఉన్నట్లుండి "శశి నీకు ఒక విషయం తెలుసా?" అని అడిగారు.
మెము మాటలు ఆపి కుతూహలంగా "యెమిటి బావా?"అని అడిగాను.

"కపిల తీర్దం జలపాతం శబ్దం వినిపించటం లేదంట.."చెప్పారు.అది తిరుపతి లొ చిన్న జలపాతం.

"ఎందుకు బావా?"అడిగాను."ఏమి లేదు మీ మాటల శబ్దం వలన ....."

అంతె నెను, అక్క బావ ని కంటి చూపు తొ .............చూసాము.
"అసలు మెము తక్కువకొందరు మాట్లాడితె నయాగర జలపాతం 
కూడా వినపడదు తెలుసా?"

(సామెత తెలుసా?అడివి అంతా సింహానికి బయపడీతె ,సింహం సింగానికి బయపడుతుందంట...)

వెంటనె నవ్వెసి మాట మార్చెసారు.

ఈ లొపల మా వాడికి బుద్దిగా ఉండటం బొర్ కొట్టింది.
"అమ్మ నెను 500 మెట్టు దగ్గర ఉంటా"అని అడిగాడు.
సరె పొ అన్నాను .వాడు అలాగె తూనీగ లాగా వెళ్ళి అక్కడ కూర్చుని ఉన్నాడు 

మెము వచ్చెవరకు.అలాగె 1000,1500 మెట్ల దగ్గర మా కొసం కూర్చుని యెదురు చూసాడు.

మెల్లిగా మధ్యలొ ఆంజనెయ స్వామి విగ్రహం ,జింకల పార్క్ దగ్గరకు వచ్చాము .హమ్మయ్యా......
ఇక్కడ వరకు నడిచాము కదా కూర్చుంటాము. 
హలొ.........మీరు వెళ్ళి స్వామి కి దణ్ణం పెట్టుకొని ,జింకలు చూసి ఎంజాయ్ చెయండి.





మళ్ళా ప్రయాణం ....పదండీ.......పదండి.............ఆడ పిల్లలు ముందు నడుస్థున్నారు.వెనుక మగవాళ్ళు 
వెనుక నెను అక్కా.మళ్ళా మా వాడు "అమ్మా....నెను అక్కా వాళ్ళతొ వెళతాను"అని అడిగాడు.సరే నని 
పంపాను.

సరె యెవరి గోలవాళ్ళ దే.......బి జీ గా ఉన్నాము.కాసెపు తరువాత ఆడ పిల్లలను అడిగాను 
"తమ్ముడు ఏడి?" అని.

వాళ్ళు బయపడి పోయారు.మీ దగ్గర కద ఉండేది అన్నారు.జరిగింది యెమిటంటె వాళ్లు 
పేలాలు మిక్సర్ కొనుక్కొవాలని వెళితె వీడు చూసుకొకుండా వెళిపోయాడు.

నాకు నోట్లొ  నుండి మాట రావటం లేదు."దేవుడా యెలా వీడు దొరికెది......."నాకు కళ్ళు 
తిరిగి పొతున్నట్లుంది.బావ గారు దైర్యం చెప్పారు వాడు 2000 మెట్టు మీద ఉంటాడులె.....అని.

గబ....గబ....అక్కడికి వెళ్ళాం......అక్కడ.....లెడు.నాకైతె మనసు మనసులొ లెదు.

దైర్యం యెటు పోయిందొ........ఏడుపు ఆపుకుంటూ ...అందరిని అడుగుతూ వెళుతున్నాము.
అప్పటికె వీడు కనపడక చాలా సెపు అయింది."తిరుపతి వెంకన్నా యెమిటి మా గతి?
సాయి బాబా యెన్ని మొక్కులు మొక్కానొ ....."

అప్పుడు యెదురుగా ఒక అతను కాషాయ వస్త్రాలు వెసుకొని ఒక పుస్తకమ్ గుండెలపై
పెట్టుకొని వస్తూ ఉన్నాడు.ఆ పుస్తకం అట్ట పై బాబా నవ్వుతూ ఆశీర్వదిస్తూ కనిపించాడు.
యెందుకొ బాబు క్షెమంగా ఉన్నాడు అని పించింది.

"బాబా వాడికి వాళ్ళ నాన్న ఫొన్ నెంబరు ఒకటె తెలుసు అది వాడికి గుర్తు రావాలి "
అని ప్రార్దించ సాగాను.

ఇక లాస్ట్ 100 మెట్లు ఉన్నాయి.ఒక ఆమె అక్కడ అమ్ముకుంటూ ఉంది.ఆమె చెప్పింది.
ఇందాక ఒక బాబు రెండు సార్లు మెట్లు దిగి యెక్కాడు అని.పై మెట్టు మీద ఉంటాడు అని 

మా వారు స్పీడ్ గా వెళ్లారు.మేము ఉన్నాడా?అని కెక వెశాము.లేడని చెప్పారు.అంతె నా 
కయితె కళ్ళు తిరిగాయి.ఇంతలొ అక్క అరిచింది.ఉన్నాడంటా.....ఫొన్ చెసాడంటా...అని.
            
  మా వారు చివరి మెట్టు యెక్కెసరికి అక్కడికి కొంచం దూరం నుండి వీడీ ఫొన్.
అక్కడ ఏడుస్తూ ఉంటె యెవరొ అడిగితె "మా అమ్మ,నాన్న తప్పిపోయారు"అని ఏడ్చాడంట
(తప్పి పోయింది వీడా? మేమా?)

వాళ్ళు ఫొన్ చెస్తుంటే వాడికి మా వారు కనిపించారు."అదిగొ మా నాన్న.....అని పరిగెత్తుకొని
వచ్చాడు.(నయం ఆప్పుడు చిరుత పులులు లెవు.లేక పొతె అమ్మో..........)

ఇంక నేను అయితె వాడినింక వదల లెదు.
కధ సుఖాంతం ఇంకా యేమి చూస్తారు నవ్వండీ.....హ......హ....హ...........

ఇదంతా ఇప్పుడు ఏందుకు రాసాను అంటారా?
ఏమి లేదండి......వేణూ శ్రీకాంత్ వాళ్ళ అమ్మ మీద వ్రాసిన అర్టికల్ చూసిన తరువాత
మా బాబు కి యెప్పుడైనా నా ప్రేమతొ స్పూర్తి పొందాలంటే వాడికి చదువుకోను ఇది 
ఇది ఉండాలని వ్రాశాను.

మీరెందుకు బాద పడుతున్నారు?నెను ఏక్కడికి పోతాను?
సరె మీకు ఒక మంచి జోక్............

డాక్టర్ ; x-ray  తీస్తె మీ యెముక ఒకటి విరిగి కనిపించింది.

పెషంట్; అయ్య బాబొయ్.........యెలా ఇప్పుడు?

డాక్టర్; పరవాలేదు......photo shop లొ అతికించేశాము.

పెషంట్; ఆ.....ఆ.......ఆ...........



5 comments:

రాజ్ కుమార్ said...

హహహ.. బావున్నాయండీ మీ అబ్బాయి విశేషాలూ.. ;)(అచ్చం మీలాగే ఉన్నాడు)

>>
నోట్లొ centre fresh పెట్టు కున్నట్లు గమ్మున నిలుచున్నాడు. (వామ్మో..మీరు సామాన్యులు కారు)
సింహం సామెత అరుపులు
బుద్దిగా ఉండటం బొర్ కొట్టింది
>>>

సూపరు ఇవి మాత్రం..

చిన్నపుడు ఒకసారి మాతమ్ముడు కూడా ఇలాగే తప్పిపోయాడండీ.. తిరుపతి లో కాదు లెండీ.. రోజంతా పాదయాత్రలు చేశాం అందరం. ;

అయితే మీరు డాక్టర్ దగ్గరకి వెళ్ళరన్న మాట..

--రాజ్ కుమార్.

వేణూశ్రీకాంత్ said...

కామెంట్ ఏం రాయాలో తెలియడంలేదండీ... బాబా ఆశీస్సులు మీకు సదా ఉండాలి అని కోరుకుంటున్నాను.

శశి కళ said...

రాజ్,వెణు శ్రీకాంత్...థాంక్యు.....

kiran said...

>>మీరెమి చిచ్చి......బుజ్జి.....అనక్కర్లేదు.....పదండీ....పదండీ....
ఎలా అనకుండా ఉంటాం..అంత ముద్దు గ ఉంటె..కన్నయ్య లాగా..??
హహహ..అయిన ఏంటి ససి గారు...పిల్లల వెనకాలే పెద్దలు నడవాలి అని తెలిదు..అలా మీరు తప్పిపోతే ఎలా? :ప
బాగా బయపడిపోయరనుకుంట పాపం :)
lucky son ..:)
హహ్హహహహహహః...జోకు కేక..:D

Kalyan said...

@శశికళ గారు మా వెంకన్న కరునామయుడండి :) ( అంటే మిఘతవారు కారా అని అడగకండి ) తిరుపతి మా వారు.. నేను పుట్టి పెరిగి ఇప్పటికి ఉంటున్న ఊరు.. తిరుపతి అని టపా చూసిన వెంటనే చదివేసాను మొత్తం ... నాకు కనుక చెప్పుంటే వచ్చేసుంటా.. బౌసా అప్పుడు అస్సలు తెలియదు కదా నేను... సంతోషం మీ బాబు దొరికినందుకు... :)