Friday, 1 July 2011

కాపాడే దైవమె కాసులకు ఆశ పడితే....

తల్లి తండ్రులు జన్మ నిస్తే 
దైవం ప్రాణం పోస్తే 
ఆ ప్రాణాన్ని కలకలం కాపాడే 
దైవం ఒకరున్నారు.......
వారే వైద్యులు.............
కాని వారిలో కొందరు డబ్బుకు ఆశపడి
సిజేరియన్ అవసరం లేకున్నా చేస్తున్నారనే 
విషయం పేపర్ లో చదివినపుడు చాల భాద 
వేసింది.ఈ కవిత నవ శంఖారావం పత్రిక లో 
పోయిన సంవత్షరం వచ్చింది.
మంచి వాళ్ళు ఉన్నారు.......
చెడ్డ వాళ్ళు ఉన్నారు..........
మంచి వారికి నమస్సులు.......
చెడ్డ వారి హృదయం తెరుచుకోవాలని 
నూతనంగా ఈ భూమి పై కి వచ్చే పసి బిడ్డని 
పైకపు ఆశలతో కాక పరిమళించే చిరునవ్వుతో 
ఆహ్వానించాలని ఆశిస్తూ.............................


                         ప్రకృతికి కత్తెర

 పరితప్త జంట హృదయాల ప్రార్ధన తో 
ప్రకృతి పరిష్వంగం నుండి 
పరమాణువు గా వీడి 
పసిపాప గా మారి 
ప్రపంచం పరికించాలని
చిన్నగా విప్పిన కళ్ళు 
చూస్తున్నాయి పైకపు ఆశల కుళ్ళు 

ప్రాణాలు పోయాల్సిన చేతులు 
పాపపు మూటలు మోస్తూ 
అమ్మతనాన్ని కత్తిరిస్తూ 
జననాన్నేకృత్రిమము  చేస్తూ 
పసిడి కత్తెర వేస్తుంటే 

రక్తపు మరకల పుణ్య ధారలు
లో మునగాల్సిన కరములు 
కాసులకు ఆశ పడి 
ఆశల సౌధాలు కూలుస్తూ 
నిర్వీర్యపు జీవితాలకు 
నైరాశ్యపు స్వాగతాలు చెపుతున్నాయి 
స్వార్ధపు సంగతులనే 
కొత్త ప్రాణికి పరిచయం చేస్తున్నాయి......


పశ్చాతాపంతో పరమాత్మునిగా 
మారి మానవులు పసిపాపలకు 
పరిమళాల స్వాగతం ఇచ్చేదేన్నడో ?




2 comments:

durgeswara said...

వైద్యో నారాయణో హరిః అన్న నానుడి మారిపోయింది
ఇప్పుడంతా ఆరంగం జలగలమయం .అవినయం జీవికి హానికలగకుండా నన్నా రక్తం పీలుస్తాయి. ఇవి రాబందులజాతి.

శశి కళ said...

నిజాన్ని రాసారండి.మీ లాంటి వాళ్ళ ఆశీస్సులు మానవ జాతికి కావాలి.థాంక్స్.