Friday, 3 June 2011

వీణా వాదన...అరణ్య రోదన..

  "నేను లేక వీణ పలుకలేనన్నది 
   నేను లేక బ్లాగు నిలవలేనన్నది"
అందుకని అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్లి త్వరగా వచ్చేసానన్న మాట.
మీకోసం వీణ కధ తెచ్చేసా.ఏమిటి అలా చూస్తున్నారు ?
violin పోయే.......వీణ వచ్చే డాం ....డాం....డాం.....
అలా  అడిగి చెప్పించుకుంటారు కాబట్టే మీలో ఎందరో 
మహానుభావులు కనిపిస్తున్నారు......

                  ఆ రోజు                 

 ఒక రోజు పాత violin పోస్ట్ తప్పులు ఎడిట్ చేస్తూ
పిల్లలికి అన్నం పెట్టి వద్దామని signout చేయకుండా 
వెళ్లాను.అప్పుడు...ఆ క్షణాన...ఏం జరిగిందంటే....
ఏమి జరిగిందంటే..............................


ఏమి జరగలేదులే.మా వారు వచ్చి 
ఆ పోస్టింగ్ చదువుతూ కనిపించారు
(ఏమంటారో అని నాకు suspence మీరెందుకు ఆలా 
monitor దగ్గరగా రావటం .ముక్కు తగులుతుంది జాగ్రత్త)

ఆయన చదవటం అయిపోయినాక ..................................

(ఏంటి పెద్ద...తిట్టారా?తిట్టారా?అని అడుగుతారు.
ఏమి పొగిడారా?అని అడగవచ్చుగా కుళ్ళు)

ఏమి తిట్టలేదు ,ఏమి పొగడలేదు ఓఒహ్.....చిన్నగా నవ్వుతూ
నవ్వుతూ ..............ఏమి శశి వీణ గూర్చి వ్రాయలేదే అన్నారు?
(ఈ పోస్టింగ్ వ్రాయటానికి కారణం ఆయననితెలుసుకొని  
అయన మీద ఎవరో పళ్ళు నూరుతున్నారు.
ఎవరో నాకు తెలియాలి అప్పుడు ............
ఏమి చేస్తానా?ఇంకా నిర్ణయం తీసుకోలేదు.) 

ఇప్పుడు ఇంకో కారణంచెపుతా.
ఎంత బాగా చదివే blogviewers దొరికారు.
నా జన్మ ధన్యం అయింది.

28 తేది రాత్రి అమ్మ నాన్నల మధ్య కూర్చొని దూరదర్శన్ 
hyd చూస్తున్నాను.(అదే మా ఇంట్లో అయితే  pogo మారిస్తే
పిల్లలు ఒప్పుకోరు)
ఆహ వీణ పాటల మీద programme ఎంత హాయిగా ........
కాసేపు నాన్న పై వాలుతూ,అమ్మ వడిలో తూలుతూ 
వీణ పాటలు వింటూంటే....(నా మాట విని మీరుకూడా 
కాసేపు పెద్దయిన సంగతి ,ఉద్యోగం సంగతి మరిచిపోయి
మీ అమ్మ,నాన్నల మధ్యన  గడిపి రండి...బతుకు పై తీపి
భవిష్యత్తు పై ఆశ రాకపోతేచూడండి .......రాకపోతే ఏంటి అంటారా?
నాకు వీణ లేదు లేకుంటే ఇచ్చేద్దును.....)

"పాడెద నీ నామమే గోపాల హృదయములోనే 
పదిలముగానే నిలిపితి నీ రూపమేగా......"
పాటల విశేషాలు ,పాటలు మధ్యలో అమ్మ ,నాన్న వాటి గూర్చి 
చెప్పే కధలు (మీకు కూడా వినాలనుందా?)

"సుందరాంగ మరువగలేనోయ్ రావేలా ...
నా అంధ చందములు దాచితి నీకై రావేల..."
వైజయింతి మాల ఈ పాటతో శ్రీలంకకి వెళ్లిందట అమ్మ 
చెప్పింది.

"సఖియా వివరింపవే...వగలెరిగిన చెలునికి 
నా కధ..........."
సావిత్రి అందమే అందం చూడు అన్నారు నాన్న.
 పతివ్రతలను ఏడిపిస్తే ఏమవుతుంది చూడు అంది అమ్మ.
(వాళ్ళిద్దరిని అటు ఇటు తల తిప్పుతూ చూస్తూ వింటూ ఉన్నాను.) 

పెద్ద అన్ని anr పాటలే వేశారు. ntr పాటలే వేయలేదు 
పోనిలే సావిత్రి ఉంది కాబట్టి క్షమించేశా .

ఏంది నా వీణ కధ కావాలా?
 అబ్బ ఎంత మంచి వాళ్ళో అడిగి మరి చెప్పించుకుంటున్నారు.
అప్పుడు మేము వరంగల్ లో ఉండే వాళ్ళం.మా స్కూల్ కి 
కొత్తగా వీణ టీచర్ వచ్చింది.ముగ్గురు టీచర్లము  వీణ
నేర్చుకోవాలని ఆమెను అడిగాము.ఆమె సరే ఒక్క వీణ ఉంది.
ఒక్కో వారం ఒక్కొక్కరి ఇంట్లో ఉంచుకొని సాధన చేయండి.
నేను అప్పుడు అప్పుడు నేర్పిస్తాను అన్నారు.

నేను వెంటనే వీణ పట్టుకొని ఫోటో తీయించుకొని 
మా అత్తగారింటికి పోస్ట్ చేసాను.నేను వీర లెవల్లో 
నేర్చేసుకున్నానని అనుకొని సరస్వతి దేవిలా
ఉన్నానని మా మరుదులు మెచ్చుకుంటూ ఉత్తరం వ్రాసారు.
(అప్పటికి జస్ట్ సరిగమ వచ్చు అంతే.
ఆ ఫోటో ఇక్కడ పెట్టొచ్చు కాని నా సాదనా 
భాదితులు నన్ను గుర్తిస్తే తన్నే ప్రమాదం ఉంది)

ఎంత అన్యాయం నన్ను చూస్తేనే అందరికి కుళ్ళు.
నేను వేరే వాళ్ళింట్లో సాధన చేస్తుంటే వాళ్ళ పక్కింటివాళ్ళు 
వచ్చి ఆ మేడం ని అడిగారట.(నేర్పమని కాదు.)

"ఏందండీ ఎప్పుడు వాయిస్తూవుంటే మేము 
ప్రశాంతంగా ఉండొద్దా?"అని.నేనే అప్పుడు వాయించానని
ఇప్పటికి నేనెవరికి చెప్పలేదు.

 ఇక పోతే టీచర్ సంగతి.మాకు పాటలు చెప్పలేక వీణ తీసుకొని 
వెళ్లి పోయింది.మా వారి సంగతి అంటారా........

"ఏమండీ వీణ కావాలి intrest గా ఉంది"అడిగా.
"వద్దులేమ్మ నీకు intrest అయిన వాటితో ఇల్లు 
నిండిపోయింది"అన్నారు.
instruments అంటే భర్తకి intrest లేక పోతే ఎలాగండి?

ఆ రోజే ఒక నిర్ణయానికి వచ్చాను ఎప్పటికైనా నేర్చుకొని 

THAT IS SASIKALA   అనిపించుకోవాలని ....

ఏమిటి మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చారా?
ఏమని?ఆలా చూస్తారేమిటి?వెనక చేతుల్లో ఏముంది?
అయ్య బాబోయ్............

9 comments:

కొత్త పాళీ said...

శుభం. నేర్చుకునే లిస్టులో నెక్స్ట్ ఐటెం ఏంటి? :)

it is sasi world let us share said...

yenduko mee deevena choodagaane vimaanam nerchukovaalannantha ushaaru vachchindi.
thanks for ur encouragement koththa paali gaaru
...sasi

జ్యోతి said...

వేరే ఏదో ఎందుకు వీణనే నేర్చుకోండి. ఎవరేమన్నా, ఎవరేమైనా జాన్తానై అంటూ ...
నేను కూడా పెళ్లి కాకముందు నేర్చుకుంటూ వదిలేసిన వీణ ఇప్పుడు నేర్చుకుంటానంటే అందరూ ఇలాగే అంటున్నారు. ఇప్పడది అవసరమా? అని.. సో మీకు నా సపోర్ట్ ఫుల్లుగా ఉంటుంది.... ఎప్పుడైనా సరే..

it is sasi world let us share said...

jyothi gaaru deepam laanti maata chepparu.
meerilaage support chesthe manam rockettttttt......la ayipothaamu.

రాజ్ కుమార్ said...

హహహ.. సూపరండీ మీ వీణావాదనా.. ;)
పాపం మీ టీచరు..;)

జయ said...

బాగుంది:) కానీయండి. కృషితో నాస్తి దుర్భిక్షం.

it is sasi world let us share said...

jaya and raju gaaru thanks for ur encouragement

ఇందు said...

ఆ కాస్త వీణ నేర్చుకుని నాకూ నేర్పించండీ! ఇక్కడ నేను కచ్చ తీర్చుకోవాల్సిన శాల్తీలు చాలా ఉన్నాయ్! కూసింత వీణ నాకూ నేర్పండీ :))

it is sasi world let us share said...

మొదట నాపై చూపనన్టే నెర్పిస్థాను....ok....ha..ha....ha...