Sunday, 5 June 2011

నేను ఎంత ఇవ్వాలనుకొన్నాను మీ కోసం.......

నేను ఎంత ఇవ్వాలనుకొన్నాను మీ కోసం.......

స్వచ్చమైన గాలి తో వళ్ళంతా నిమిరి 
మీ హృదయకుహరం లో ఆరోగ్యపు ప్రతిష్ట చేద్దామనుకున్నాను 

మంచి నీళ్ళ అలలలో ఉరకలేయించి 
సంతోషపు పడవలో తిప్పుదామనుకున్నాను 

 పసిపాపలా దుమ్ములో పొర్లించి 
మనసులోని కల్మషాలు కడిగివేయాలనుకొన్నాను

వెచ్చని అగ్ని ని రగిలించి చైతన్యాన్ని 
కలిగించి మరో లోకపు వింతలు ఆవిష్కరింప 
చేయాలనుకొన్నాను 

అంబరాన్ని మీకు పూబాటగా చేసి 
అపరిమిత జ్ఞానాన్ని  ఇవ్వాలనుకొన్నాను 

 నా అంతట మీరే అయి పూలతో ,చేలతో 
నేలతో, గాలితో మమేకమై జీవిస్తుంటే 
సృష్టి సార్దకమైంది అని సంతసిల్లాలి అనుకొన్నాను 

మీరేమి చేసారు?.....................................................

ఈ క్షణపు సుఖం  కోసం 
మీ రేపటిని బలి చేసారు............

స్వార్ధపు ఆశల కోసం 
సకలాన్ని చంపుకొన్నారు..........

ఆరోగ్యాన్ని బలి పశువును చేసి
అమ్మ లాంటి ప్రకృతిని అమ్ముకొన్నారు.........

కరిగిన కల ,ఎండిన నేల
కాలుష్యమే నలువైపులా 
ఇదే మీరు గీచిన నా ఈనాటి చిత్తరువు.....

ఈ రోజు పర్యావరణ దినోత్శావం సందర్భంగా .........
మరి మీరేమి చేస్తారు?ప్రకృతి ఇచ్చినవన్ని అనుభవిస్తున్నారు 
కదా.దానిని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది.

అది అందరి పని నా ఒక్కడిది కాదు అంటారా?

 నిజం గా ఏమి చేయలేరా?మీ తెలివితో ,హృదయం తో 
ఆలోచించండి. 
కనీసం plasticcovers కి బదులు clothbags వాడటం,
నీళ్ళను పొదుపు చేయటం,
అన్నాన్ని వృధా చేయకుండటం,
నీ వ్యాపార అవసరాలలో కొంత వరకైనా ప్రకృతి కి 
హాని కలిగించకుండటం
మీ ప్రక్కన మీ సహచరిగా చిన్న మొక్క 
ఉండేటట్లు చూసుకోవటం.......
ఏదో ఒకటి మీరు చేయగలిగినది...........

ఎప్పుడైనా మీరు నిజంగా మంచి పని చేసాము అనుకొంటే 
మీ కుడి చేయి ఖాళీగా ఉందా?
ఎందుకు అంటారా ?

ఉంటె దాంతో మీ ఎడమ బుజం మీద తట్టుకోండి 
శేబాష్........శేబాష్......శేబాష్.........అని.........

 

8 comments:

kiran said...

sasi గారు - :))..
ఏదో ఒకటి చేయడానికి తప్పకుండ ప్రయత్నిస్తాం..:)..
బాగా రాసారు
కుడి చెయ్యి ఎందుక అనుకున్నా..చదివాకా హహ్హహాహాహ్హహహః ఇలా నవ్వుకున్న..:))

శశి కళ said...

adi ala undaali spoorthi ante meeku shebaash...
shebaash...shebaash....

రాజ్ కుమార్ said...

సింప్లీ సూపర్ అండీ..
ఆలోచింపచేసేలా ఉందీ మీ పోస్ట్.. తప్పని సరిగా ఆచరణ లో పెట్టాలి.

శశి కళ said...

మరి మీరు అనుకొండీ.....శేబాష్.......అని వెణురాం గారు.

Anonymous said...

chala bagudi kani na kudi chetilo mouse undi yadama chatho champa pi kottokuna prakruthini praminchananduku..........

శశి కళ said...

యెవరొ తెలీదు కాని మీ ప్రొత్శాహానికి దన్యవాదాలు.

ఇందు said...

chala baga raasaru Nature gurinchi! Nice message! Naku ilanti thoughts inka implementation ante chala ishtam :)

Thnks for such wonderful message oriented pist :)

శశి కళ said...

మరి మీరు కూడా వాన లొ తడుస్థూ....ఓఓఓ...ఎంజాయ్ చెస్థున్నారు కద.