ఒక నొక రోజు నేను మా అత్తగారింట్లో మా పాప (8 నెలలు)
తో ఆడుకుంటూ ఉన్నాను.ఉన్నట్లుండి ఎదురుగా మా అమ్మ ,
నాన్న ప్రత్యక్షం
(అంటే ఆకాశం నుండి రాలేదు మీరలా మాట్లాడితే చెప్పనంతే)
మా నాన్న అయితే చాల చాల సంతోషంగా ఉన్నారు.
(అంటే ఆకాశం నుండి రాలేదు మీరలా మాట్లాడితే చెప్పనంతే)
మా నాన్న అయితే చాల చాల సంతోషంగా ఉన్నారు.
ఇక ఇంట్లో అందరు వచ్చేసారు విషయం తెలుసుకోవాలని.
(ఎవరు ఎవరు వచ్చారో చెప్పమంటారా?వద్దా తెలుసా?)
(ఎవరు ఎవరు వచ్చారో చెప్పమంటారా?వద్దా తెలుసా?)
విషయం ఏమిటంటే నేను పాపను తొమ్మిదో నెల ప్రెగ్నెంట్
గా ఉన్నపుడు హైదరాబాద్ వెళ్లి జాబ్ కోసం ఒక state level
పరీక్ష వీర లెవల్లో రాసి వచ్చామనమాట.మనము ఏమి పోడిచామో
తెలీదు కాని వాడు దెబ్బకు బయపడి జాబ్ ఇచ్చేసాడు
(అసలు అప్పుడు మనకు జాబ్ అవసరం.ఎందుకంటె మేమిద్దరం
బుద్దిగా BEd రిజల్ట్స్ కూడా రాక ముందే పెద్ద వాళ్ళ మాట విని పెళ్లి చేసుకోన్నాము.
మా మామగారికి ఆయనకు అన్ని షాప్ లు ఉన్నాయి కాని
బట్టల షాప్ లేదని అది మా చేత పెట్టిచ్చాలనుకొన్నారు.
మేమేమో కొంచం నీతి ,నిజాయతి రకాలమి షాప్ తప్పించుకోవాలంటే
జాబ్ రావాల్సిందే.)
అవును పే....ద్ద లెవెల్ లో ఉద్యోగం
తెచ్చుకొన్నా కదా కధకి ఊ..కొట్టక పోతే పోనీ శేబాష్ శశి అన వచ్చు కదా.
జాబ్ వచ్చింది కదా సమస్య లేదనుకోన్నారా?
అసలు సమస్య ఇప్పుడే ......ఈ నిముషమే స్టార్ట్ అయింది.....
(అబ్బ ఏమి లేదండి.ఈ కధలో అన్ని రసాలు ఉంటాయి.
మీరన్ని తాగొచ్చు,కాని బయానక రసం లేదు దాని కోసం అలా రాసాను)
మేమేమో మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ కి క్రింద సముద్రం దగ్గర
నెల్లూరు లో ఉన్నామా?జాబ్ ఏమో పైన వరంగల్ లోని
హనుమకొండ లో వచ్చింది.ఎలా పంపాలి మమ్మల్ని అది ప్రాబ్లం.
(ఏమిటి అందరు ముక్కు మీద వేళ్ళు వేసుకొన్నారు తీయండి
పెద్ద అప్పట్లో అది చాల దూరం లెక్క)
సరే మన ప్రయత్నం మనం చేయాలి కదా అని మా నాన్న ,మా వారు
నేను హైదరాబాద్ వెళ్లి మంత్రుల ఇళ్ళు అన్ని ఒక రౌండ్
వేసాము.మనకు నూకలు హనుమకొండ లో రాసుంటే
వాళ్ళెందుకు దొరుకుతారు?అందరు వినాయక చవితి
నిమజ్జనమని దొరకనే లేదు.ఇంకేమి చేస్తాము దిగులు పడుతూ
తిరుగు రైలు ఎక్కేసాము
"ఆ పల్లె లో ఎలా ఉండాలో ఏమిటో అని మాట్లాడుకుంటూ "ఉన్నాము.
అప్పుడు పక్కన ఒక ఆయన మాకు జ్ఞానోదయం చేసారు.
(వెనుక వేలుతురుందా చూడలేదు)
"అరె ఏమి అంటున్నారు మీరు హనుమకొండ అంటే వరంగల్
అదేమీ పల్లె గాదు"అన్నారు.
దెబ్బకి మా కళ్ళుదబ్బున విచ్చుకొని వెంటనే ఇంటికి వచ్చేసి
మూట ముల్లె సర్దుకొని హనుమకొండ లో జాబు లో చేరిపోయాను.
నా ఫీలింగ్.ఎందుకంటె మన లాంటి మంచి టీచర్ దొరికింది కదా
(వాళ్ళు వేరేగా ఆలోచించారా?మీకెవరు చెప్పారు?)
(వాళ్ళు వేరేగా ఆలోచించారా?మీకెవరు చెప్పారు?)
పాపం వారం రోజులు వదలకుండా వాళ్ళ బుర్రలు నింపేశాను.
వాళ్ళు ఇంటికి ఉత్తరాలు వ్రాస్తే మేము చదివి పోస్ట్ చేస్తాము.
అది వాళ్లకు తెలీదు.వాళ్ళైతే ఇక్కడ మాకు కొత్త టీచర్ వచ్చింది
గాని ఏమి అర్ధం అవుత లేదు మల్ల అని వ్రాసున్నారు.
విషయం ఏందంటే మన బాష వాళ్లకు అర్ధం కాదు.మనకు కూడా వాళ్ళ
బాష అర్ధం కాదు.వాళ్లకి లెక్కలలో తీసివేతలో అప్పు తెచ్చుకుంటే
అంటే అర్ధం కాదు.ఎమనాలా?దస్కం తెచ్చుకోండి అనాలి.
వెంటనే ఆ ఉత్తరాలు చదివి నాకు బోల్డు రోషం వచ్చింది.
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి ,బాష ని భాష తోనే సేబాష్
అనిపించుకోవాలి అని గాట్టిగా ......మనసులు అనుకోని
ఆ రోజు నుండి వాళ్ళ బాష జాగ్రత్తగా వినేదాన్ని.అంతా విని
అర్ధం కాకా పోతే మళ్ళ ఆ......అనేదాన్ని. మళ్ళా మొదటినుండి
అంతా చెప్పేవారు.
ఒక సారి maingate లోని చిన్న గేటు తీసుకొని స్కూల్ లోపలి కి
వస్తూ ఉన్నాను.ప్రిన్సిపాల్ ఏదో అరిచి చెప్పింది.పాట అనేది వినపడింది.
మనల్ని పాట పాడమంటుంది అనుకోని బోల్డు ఆనంద పడిపోయాను.
(మరి అడిగి పాటలు ఎవరు వింటారు )పాడపోయి ఎందుకో ఆగి
మరలా ఆమె వైపు చూసాను. ఈ సారి పెద్దగా చెప్పింది ,
పాటక్ పెట్టు అని.నా కర్ధం కాలేదని ఆమెకి అర్ధం అయింది .
దగ్గరకు వచ్చి తలుపు గడియ వేసింది.
పాటక్ అంటే అదన్న మాట.
పాటక్ పెట్టు అని.నా కర్ధం కాలేదని ఆమెకి అర్ధం అయింది .
దగ్గరకు వచ్చి తలుపు గడియ వేసింది.
పాటక్ అంటే అదన్న మాట.
ఇంత కష్టపడి నేను వాళ్ళ బాష నేర్చుకొంటుంటే వాళ్ళు నా గూర్చి
ఏమనుకొన్నారో తెలుసా?నాకు చెముడని,వినపడదని.
(అంతే జరగాలి బాగా జరిగింది అనుకుంటున్నారా?)
ఆశ,దోశ ,అప్పడం ....రమ్మని, అందరు నేను బాగా చెపుతున్నానని
మెచ్చుకున్నారు తెలుసా.ఇంకొన్ని రసాలు ఈ సారి ఎందుకంటె
juice తయారుచేస్తున్నాను
6 comments:
హహాహ్.. బావుందండీ.. అదేంటీ మధ్యలో ఆపేసినట్టున్నారూ? తొందరగా తరువాయి భాగమ్ రాసెయ్యండీ..;)
హహహ భాషతో భలే ఇరకాటం లేండి బాగా రాస్తున్నారు
ఇట్లా బాష తో బాధలు పడ్తూ ఇంకో భాగం రాసేయండి..
మీరు narrate చేసే విధానం నాకు చాల నచ్చుతుంది..:)
వేణు రామ్ ,కిరణ్ గారు థాంక్యు.
kaneesam meerayina oppukunnaru Telangana Bhasha Aandhra Bhasha kaasta veruga untai ani...telugu Telugeeeey kani Yasa,Padala vaaduka Veruga Untai....neneu Telangana lendi...maa aandhra friends maa bhasha vini navvutaru...ento ala undi paristiti.
అజ్ఞాత గారు అక్కడ కొన్ని రోజులు ఉంటె ఎవరు అయినా ఒప్పుకుంటారు.వాళ్ళ మమతలు,అమాయకత్వం,ఆత్మీయత నాకు చాలా నచ్చాయి
Post a Comment