Tuesday, 18 October 2011

అకటా...ఏమంటిరి......ఏమంటిరి......

ఎమంటిరి?ఎమంటిరి?
రేణుకా చౌదరి గారు ఎమంటిరి?

"ఇదేమన్నా ప్రెషర్ కుక్కర్లో  వంటనా?అనియా?"

హెంత మాటా.....యెంత మాటా.......

ఇది ప్రాదేశిక వివాదము  కాని మా శక్తి వివాదము  కాదె ....
కాదు అదే నందురా....మా ప్రెషర్ లేకుండా ఈ రాష్ట్రం లో ఏ 
పనైనా జరుగునా....వాని గురువు ఢిల్లీ మాటేమిటి.....అక్కడ 
కూడా వెనక నుండి ప్రెషర్ పెడుతుంటేనే మాటలు బయటకు 
వస్తున్నవి కదా...............

అన్నియునూ కనపడని ప్రెషర్ తోనే జరుగుతుండ..........
నేడీ కుక్కర్ .....కుక్కర్ అని తేలిక మాటలేల.............

మరి మదీయ గొప్పదనము మీ కెరుక  అయిన అటుల వచింపబోదురు కదా?

సఖి....నా ప్రాణ నెచ్చలి .....శశి కళ.......మదీయ గొప్పదనము శతదా....సహస్రదా
....సహస్రదా......లక్షదా........లక్షదా....కోట్లదా...... వీరికి వివరింపుము........

అటులనే సఖా........వినుడి ..వినుడి ....కుక్కర్ గాధా......వినుడీ మనసారా.........

                           ఎవరిని ఎలా ఉడికించాలో 
                            బాగా తెలుసు ...........
                            కుక్కర్ తో 
                             సావాసం.............

మరి కుక్కర్ లేక పొతే యెంత మంది లేత వంటగాళ్ళు(ఆడ వాళ్ళ ను ఏమనాలో)
కు చేనక్కాయలు ఎలా ఉడక పెట్టాలో నేర్పేది ఎవరు?
మొక్కజొన్నలు ఎలా ఉడక పెట్టాలో నేర్పేది ఎవరు?
పప్పు ఎలా వండాలో......అన్నం ఎలా చిమడ పెట్టాలో 
నేర్పేది ఎవరు?ఎవరు?ఎవరు?................................

                          గ్యాస్  బడ్జెట్ 
                           కిందకు దిగింది 
                           ప్రెషర్ ఉంటె 
                           అంతే.............


గ్యాస్ సబ్సిడీ లో కోత పెడుతూ......ఆరు సిలిండర్లె అని 
అరిచి గీ పెడుతూ.......ఉడకని అన్నం .......నానని పప్పు 
జాలిగా చూస్తూ.....కట్టెలు కొట్టుకొని బతకాల్సిన పరిస్తితిలో .......
ఆడవాళ్ళను ఆదుకున్నది ఎవరు?ఎవరు?ఎవరు?

                       వంట 
                       తగలడింది.......
                       కుక్కర్ 
                       లేక...........
 ఒక పక్క వంట.....ఒక పక్క పిల్లల తంటా.....
శ్రీవారి ఆకలి మంట.....తకదిమి తొమ్.....తకదిమి తొమ్....
కదాకళి  ,   కూచి పూడి చేస్తుంటే......వంట మాడకుండా ఆడవాళ్ళను 
కాపాడింది ఎవరు?ఎవరు?ఎవరు?

                        అన్ని తనలో 
                       ఇముడ్చుకుంటుంది....
                       ఇల్లాలి 
                       ప్రేమ కోసం............

శ్రీవారికి అన్నం సరే....బాబుకి పప్పు సరే.....తాతకి తాలింపు సరే......
పాపకి కంకి సరే.......ఎన్నున్నా.....ఏమి తెచ్చినా......నీ సుఖమే 
నే కోరుకున్నా .......నీ కోసమే నే ఉడుకుతున్నా.....అంటూ 
అనుక్షణం తన నెచ్చెలి సుఖం కోరుకునేది ఎవరు?ఎవరు?

                     మొగుడి ముందే 
                     విజిల్ వేస్తుందే......
                     ఆడవాళ్ళ సప్పోర్ట్ 
                     ఉందిగా.............

అమ్మ రేణుక ఎంతంటే.....యేమని చెప్పను....కుక్కర్ గొప్పదనాన్ని....
శ్రీమద్రమా రమణ గోవిందో.....గోవింద.........

ఇంకా మాకేంత  ఇష్టమంటే.........

"లామి లామినా.....జాన్ కారేగా......జింగా.....జింగా.......
లామి లామినా......హే...హే.....వక్క......వక్కా ......హే...హే....
it is the time for aaaaafricaaaaaaaaaa................."

(ఏమి అర్ధం కాలేదా?అది మా బాబుకు ఇష్టమైన పాట అన్న మాట.
వాడికి నిద్ర వచ్చేదాకా మేము కూడా చచ్చినట్లు వినాల్సిందే........
పాపం బాబుకి ఎన్నేళ్ళు అంటారా?చిన్న పిల్లాడే ......సీనియర్ ఇంటర్....)

మా బాబుకి ఆ పాట యెంత ఇష్టమో.....నాకు కుక్కర్ అంత ఇష్టమన్న మాట.

కాబట్టి కుక్కర్ ని గాలితో పని చేస్తుందని గాలి తీసిపారెయ్య కండి.

కుక్కర్ లేనిదే సగటు ఇల్లాలికి నిమిషం గడవదని గుర్తించండి........

ఇక మేమిద్దరం కలిసాము అనుకోండి............

రావే చేద్దాం ........భాండియా.......జరా 
లొట్టలు వెయ్యదా ఇండియా ............

మీ మాటలు వెనక్కు తీసుకొని కోట్ల మంది ఇల్లాళ్ల 
అభిమాన దనాన్ని కాపాడుతారని ఆశిస్తున్నాము.........


20 comments:

శ్రీ said...

కుక్కర్ కి ఇంత చరిత్ర ఉందని కుక్కర్ కి కూడా తెలియదేమో? అమెరికా వెళ్ళే ప్రతి తెలుగువాడు కుక్కర్ లేకుండా బండి ఎక్కడు. సాఫ్ట్ వేరులో కీ బోర్డు లేకున్నా బతకచ్చేమో కానీ కుక్కర్ లేకుండా బతకలేము.

వేణూరాం said...

kEka kEkaa...

cooker fans ki jai ;)

సిరిసిరిమువ్వ said...

ఏం చెప్పారండి!

అసలు రేణుకా చౌదరికి ఏం తెలుసని ప్రెషర్ కుక్కర్ లో వంట గురించి మాట్లాడటానికి. కుక్కరులో వంట ఆవిడ చెప్పినంత సులువేం కాదు. దాని కన్నా రాష్ట్రాన్ని విడదీయటమే సులువైన పని!

ఏమీ తెలీకుండా రాజకీయాల్లో రాణించవచ్చు..దేశాన్ని పాలించవచ్చు..కానీ కుక్కరులో వంట అలా కాదే!

కుక్కరులో అసలేమేమి వండుకోవచ్చు..ఏ ఆహారపదార్థం ఎంత సేపు ఉడికించాలి..ఏవి హైలో పెట్టి ఉడికించాలి..ఏవి సిమ్ లో పెట్టి ఉడికించాలి..దేనికి ఎన్ని విజిల్సు రావాలి..ఏని నానబెట్టి వండాలి..వేటికి ముందు తాలింపు వేసి వండాలి..మూత పెట్టే ముందు ఏ పదార్థాలు వేయాలు..మూత తీసాక ఏ పదార్థాలు వేయాలి..మంట ఆపేసాక ఎంతసేపటికి మూత తీయాలి..ఇవన్నీ తెలిస్తేనే కుక్కరులో వంట రుచి!

Ennela said...

మొగుడి ముందే
విజిల్ వేస్తుందే..hahahhaha

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీకు మా సంపూర్ణ మద్దత్తు తెలియ చేసుకుంటున్నాం. కుక్కర్ల సమ్మెకు సన్నద్ధం కావాలని పిలుపు నిస్తున్నాం. ఇళ్ళలో వంటా వార్పు కార్య క్రమాలు ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నాము.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ said...

హాహ... హాస్యం ఉడికించింది ఈ ప్రషర్ కుక్కర్ :)

Anonymous said...

LOL. YOU HAVE BUILD UP GR8 PRESSURE.

PHANI

ఆ.సౌమ్య said...

బలే చెప్పారండీ...కుక్కర్ లేకపోతే కాలు చెయ్యి ఆడదు నాకు...మామూలుగా వంటా...అదెలా సాధ్యం? హమ్మో హమ్మో.....కుక్కర్ మా ఇంటి దేవత...మాకింత తిండి పెడుతున్న మా ఇంటి ఇలవేలుపు...అది లేకపోతే ఇంకేమైనా ఉందా!

హెంతమాట హెంతమాట!

శేఖర్ (Sekhar) said...

cooker gurinchi intha chepochhani ippude thelisindhi......
cooker is great ur post also great....:)

గిరీష్ said...

Hilarious..

రాజేష్ మారం... said...

:)

Every line of the post is excellent.. :)

శశి కళ said...

సిరి సిరి మువ్వ గారు,వెన్నెల గారు,సొమ్య గారు
అందరికి థాంక్యు

శశి కళ said...

శ్రీ గారు,రాజ్,బులుసు గారు,అవినెని గారు,శెకర్ గారు ,
గిరిశ్ గారు,రాజెశ్ గారు,పని గారు...థాంక్యు

Sravya Vattikuti said...

ha ha nice one Sasi gaaru :))

వనజ వనమాలి said...

andaru mecchukunnaaru.aakharina vacchaanu. kukkaraa..!? majakaa? DAANI PANITEERU POLCHADAMAA? ASALU OPPUKOVADDU. RENUKAMMAA MEKE UP VESUKUNI RAAJAKEEYAALU MAATLAADATAM KAADAMMAA... PRESSUR COOKER LEKUNDAA VANDI CHOODU ANI CHEPPIVACCHINATTU UNDI.. ee post. Great Sasi.

శశి కళ said...

sravs....welcome to my blog...thank u.

వనజ గారు...లెటు గా వచ్చినా లటెస్టె....
కెక అంతె....సూపెర్ జలక్...లెక పొతె కుక్కర్ ని
అని మహిళల దగ్గర బతుకుదామనా.....

జ్యోతిర్మయి said...

అసలా కుక్కరేంటి! మీ రాతలేంటి! ఇప్పటి వరకు కేక భాష నేర్చుకోలేదు. మొదటి కేక పెట్టేస్తున్నా. కెవ్వ్ వ్వ్ వ్వ్ ..

శశి కళ said...

keka baasha nerchukunnanduku jyothi garu inko keka....

kiran said...

>>> మొగుడి ముందే
విజిల్ వేస్తుందే......
ఆడవాళ్ళ సప్పోర్ట్
ఉందిగా............. -- హహహ్హహహహహహహహః
>>>>రావే చేద్దాం ........భాండియా.......జరా
లొట్టలు వెయ్యదా ఇండియా ............
coming coming ....వంట రెడీ నా :)

Anonymous said...

kevvu ...........kaka