Saturday, 8 October 2011

చందమామ సిగ్గుపడింది....

చందమామ 
సిగ్గుపడింది 
పసిపాప 
బోసి నవ్వు నెగ్గలేక......

పిల్లలు దేవుడు చల్లనివారే......కల్ల కపటమెరుగని కరుణామయులే 
పుట్టినపుడు మనిషి మనసు తెరిచియుండును 
ఆ తెరిచిఉన్న మనసులో .....దేవుడుండును........
వయసు పెరిగి ,ఈసు కలిగి ,మదము హెచ్చితే
అంత మనసులోని దేవుడే మాయమగునులే........

పిల్లలు మన కోసం మాత్రమె కాదు...వారు జాతి మొత్తానికి సంపద
"సత్సంతానము పొంది జాతికి సౌభాగ్యము చేకూర్చవలె"

పిల్లలు శుక్లపక్ష చంద్రునిలా నవ్వుతూ ఎదుగుతుంటే 
ఆ ఇంటి లో ఎన్ని పండగలు......ముఖ్యంగా ఆ బిడ్డకి 
సంవత్చారం వచ్చేవరకు మన వాళ్ళు ఎన్ని పండుగలు
 జరుపుతారో చూడండి...........

(రసజ్ఞ గారు దోగాడటం అంటే ఏమిటి అని అడిగారు.....సరే మన వాళ్ళు చేసేవి అందరికి 
తెలుస్తాయని వ్రాస్తున్నాను)


ముందుగా పాపాయి పుట్టిన తరువాత పదకుండో రోజు 
కాని మంచి రోజు చూసి నామకరణం జరిపించి 
మంచి పేరు చూసి వాళ్ళ నాన్నగారు బియ్యం లో 
ఆ పేరు వ్రాసి పాపాయి చెవులో మూడుసార్లు ఆ పేరు 
చెపుతారు.ఆ రోజు నుండి ఆ పాపాయిని ఆ పేరుతొ పిలుస్తారన్న మాట.

తరువాత అదే రోజు పాపాయిని డోలారోహణం అంటే ఎంచక్కా 
లాలి...లాలి...అని ఉయ్యాలలో వేసి ఊపుతారు.
మరి అప్పటి దాక పాపాయి అమ్మ పక్కనే పడుకుంటూ
ఉంటుంది.అప్పటి నుండి ఉయ్యాలలో పడుకోబెట్టుతారు.

తరువాత మూడవ నెలలో మంచి రోజు చూసుకొని అత్తగారు
వాళ్ళు పాపని ,అమ్మని వాళ్ళ ఇంటికి తీసుకు పోతారు.
(ఇది ఏ నెలైనాకావొచ్చు)

అయితే ఇప్పటికి పాప నిద్రలోనే కాకుండా మెలుకువలో కూడా 
మనల్ని చూసి నవ్వుతుంది....పిడికిళ్ళు విడిచి ఆడుతుంది...
మనము ఏమైనా కబుర్లు చెపితే ఊ.... కొడుతుంది .......

అందుకని అందర్నీ పిలిచి ఊకోడుతున్నందుకు ఉగ్గిన్నెలు....
పిడికిళ్ళు విదిచినందుకు లడ్లు....నవ్వుతున్నందుకు పువ్వులు 
పంచి అందరి చేత పాపకి ఆశీస్సులు అందచేస్తారు.

(ఇది కూడా పాప ఎదుగుదలను బట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు)

తరువాత ఐదవ నెల వచ్చేసరికి చక్కగా బోర్ల పడతారు.
అప్పుడు అందరిని పిలిచి ఒక దుప్పటి ఫై బొబ్బట్లు పరిచి 
పాపను దానిపై  పడుకోబెట్టి అందరి చేత అక్షింతలు వేయించి 
బొబ్బట్లు అందరికి పంచాలి.
తరువాత పాపాయి ఆరోనేల వచ్చేసరికి చక్కగా పొట్టపై పారాడుతుంది.ఇక అప్పుడు మంచి రోజు చూసి 
అన్నప్రాసన చేసి పారాడుతున్నందుకు పాపకి, వచ్చిన అందరికి 
పాయసం ఇవ్వాలి.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే పాప ముందు పుస్తకాలు,
డబ్బులు ,మిటాయిలు,నగలు,బొమ్మలు ఇంకా చాలా ఉంచుతారు.
పాపకి ఏది ఇస్టమై ముందు తాకుతుందో చూద్దామని .......


ఇప్పుడు తరవాత దోగాడుతూ 
అంటే పొట్ట నేలకుతాకకుండా...
గడపలు దాటుతుంది.....
అప్పుడు దోగాడిన దానికి దోసెలు ..
గడప దాటితే గారెలు పంచాలి...

మళ్ళా గడపకు పసుపు,కుంకుం పెట్టి పూజ చేసి 
"మా పిలకాయలను చల్లగా కాపాడమ్మా"అని దణ్ణం పెట్టుకోవాలి.
(మరి తల్లి దీవెన తప్పక ఫలిస్తుంది)

తరువాత తొమ్మిదో నెలలో కాని పదకుండో నెలలో కాని 
పిల్లలకు పుట్టు వెంట్రుకులు తీయించాలి.ఇవన్ని సామాన్యంగా 
మేన మామే చేయాలి.
తరువాత మొదటి పుట్టిన రోజుకి వాళ్ళు చిన్నగా తప్పటడుగులు  వేస్తూ ఉంటారు.అందుకని దుప్పటి వేసి దానిపై అరిసెలు పరిచి నడిపించి అందరికి పంచాలి.

ఇంకా బోగి పండుగ రోజు రేగుపళ్ళు తెచ్చి అందరిని పిలిచి 
అందరి చేత పాపపై బోగి పళ్ళు పోయించాలి .

ఇంకా మొదటి పుట్టిన రోజుకి కేక్ అవి మామూలే.మరి పిల్లలు లేని వాళ్ళు ఏమి బాధ పడక్కర్లేదండి.
ఇంతకూ ముందు మనిషి తానూ యెంత 
తక్కువ సంపాదించినా దానిలో ఒక్క పైసా వాటా దేవునికి అని తీసి పెట్టి దానితో
మంచి పనులు చేసేవారు.
 
అనాదాశ్రమాలకు వెళ్లి మీరు 
పెంచుకోక పోయినా ఒకరి ఖర్చు పెద్ద అయ్యేదాకా మీరే భరిస్తానని  చెప్పి వారి 
పెరుగుదలను చూడండి....
వాళ్ళు ఖచ్చితంగా ...

"కంటేనే అమ్మ అని అంటే ఎలా?
పెంచిన ప్రతి తల్లి దేవత కదా"....అనక పొతే చూడండి.


ఇంకా మీ బిడ్డయెంతగొప్పవాడు....
పుట్టకుండానే తన స్పూర్తితో 
మీచే ఎన్ని మంచి పనులు చేయిస్తున్నాడో ................


అలాటి ఒక మంచి ఆలయం జీవని.....చూడండి ఆ పిల్లల 
అమాయక నవ్వులలో జీవనిని.......(రాజ్ కుమార్ గారికి 
కృతఙ్ఞతలు ....ఇంత మంచి జీవని ని పరిచయం చేసినందుకు)


జీవని లింక్......jeevani2009.blogspot.com  
మరి రండి మన ముద్దలో నుండి పక్క వాళ్లకు కొంత పెడదాము.

16 comments:

kallurisailabala said...

Wonderful post sasi akka..chala bavundi

వేణూరాం said...

సూపర్ పోస్టండీ.. మంచి విషయాలు రాశారు ఫోటోస్ కూడా బాగున్నాయ్.

ఫినిషింగ్ టచ్ అదుర్స్.. థాంక్యూ వెరీమచ్

రాజ్ కుమార్

శశి కళ said...

raj..shailu...thank u.

బులుసు సుబ్రహ్మణ్యం said...

చాలా బాగుంది టపా. ఒక ఏడాది లోపు పిల్లలుంటే ఇంట్లో సందడే సందడి.

జీవని గురించి చెప్పింది కూడా బాగుంది.

శేఖర్ said...

Inspiring post andi.... very good :)

రసజ్ఞ said...

శశి గారు బాగుందండీ మీ ఈ టపా. మేము పాకడం అంటాం దోగాడటం అనే పదం మా గోదావరి జిల్లాలో వినలేదు. మీ వల్ల ఒక క్రొత్త పదం తెలిసింది. పిడికిళ్ళు విడిచినప్పుడు ముద్దగుడుమలు అని చేస్తారు కదా!

Sujata said...

Very nice. Who is that baby in this post ?

శశి కళ said...

బులుసు గారు..హ...హ...మీ కామెన్ట్ కాకి
యెత్తుకుపొయింది...))))))))))

@thanks sekhar gaaru....

రసజ్ఞ్...గారు అవి కూడా ఇవ్వ వచ్చు...
థాంక్యు....

శశి కళ said...

సుజాత గారు మా పిల్లలలవె ఆ పొటొస్ అన్నీ...
థాంక్యు.

ఆ.సౌమ్య said...

"మరి పిల్లలు లేని వాళ్ళు ఏమి బాధ పడక్కర్లేదండి.ఇంతకూ ముందు మనిషి తానూ యెంత తక్కువ సంపాదించినా దానిలో ఒక్క పైసా వాటా దేవునికి అని తీసి పెట్టి దానితో మంచి పనులు చేసేవారు.

అనాదాశ్రమాలకు వెళ్లి మీరు పెంచుకోక పోయినా ఒకరి ఖర్చు పెద్ద అయ్యేదాకా మీరే భరిస్తానని చెప్పి వారి పెరుగుదలను చూడండి....
వాళ్ళు ఖచ్చితంగా ...
"కంటేనే అమ్మ అని అంటే ఎలా?
పెంచిన ప్రతి తల్లి దేవత కదా"....అనక పొతే చూడండి.
ఇంకా మీ బిడ్డయెంతగొప్పవాడు....పుట్టకుండానే తన స్పూర్తితో మీచే ఎన్ని మంచి పనులు చేయిస్తున్నాడో ................
అలాటి ఒక మంచి ఆలయం జీవని.....చూడండి ఆ పిల్లల అమాయక నవ్వులలో జీవనిని....

మరి రండి మన ముద్దలో నుండి పక్క వాళ్లకు కొంత పెడదాము."

అద్భుతం శశి గారూ అద్భుతం, పరమాద్భుతం, అత్యద్భుతం...ఇంకో మాట లేదంతే!

శశి కళ said...

సొమ్య...నువ్వు కూడ యెవరికైన సాయం చెయ్యి..
థాంక్యు

శశి కళ said...

సొమ్య...నువ్వు కూడ యెవరికైన సాయం చెయ్యి..
థాంక్యు

kiran said...

--------------------
ఇంకా మీ బిడ్డయెంతగొప్పవాడు....
పుట్టకుండానే తన స్పూర్తితో
మీచే ఎన్ని మంచి పనులు చేయిస్తున్నాడో ................
------------------------------------------------
శశి గారు :))))))))))))))))))))))))))))
నేను మీకు పెద్ద ఫ్యాన్ ని ఐపోయాను....
సరదాగా తెలియని విషయాలు చదువుకుంటూ వస్తున్న..
ఒక్క నిమిషం చివరికి వచ్చేసరికి నాకూ తెలీకుండానే..మనసు ఒక రకంగా అయిపొయింది !!
నిజం జీవని వాళ్ళు ఎంత అదృష్టవంతులో...!!

Ennela said...

pOst, photolu, pillalu...comments..annee adurs...

Ennela said...

raatri 1 varaku koorchuni mee blaag mottam syllabus yee roju poorthi chesesaa...exams pedite tappakundaa 1st class lo pass avutaa.sure...nammandi..
blog baagundi...inka regular gaa chaduvutaa...meeru wraayadame late.

శశి కళ said...

pomma...kiranoooooooo...pedda...
pariksha fee time ayipoyindi...
inka pettediledu po...