Sunday, 23 October 2011

సముద్రమంత....హృదయం....

మొన్న ఒక కధ రివ్యు  చదివాను...నిజంగా జ్ఞాపకాల అలలను రేపి నువ్వు 
ఒకరికి కృతజ్ఞతలు తెలియ చేసుకోవాలని గుర్తు చేసింది.అది
అద్దేపల్లి.ప్రభు గారు వ్రాసిన అతడుమనిషి కధ.ఒక రోజు వర్షం లో 
నా జీవితం లో జరిగిన ఒక  సంఘటనలో ఆ కధే  గుర్తుకు తెచ్చుకున్నాను.
మరలా ఆ కధ చదివినపుడు.....అదే జ్ఞాపకాల మడతలలో ....
గుప్పుమన్న మానవత్వపు పరిమళం.......ఈ సందర్భంగా నా మల్లె పువ్వు 
కవిత లో ఒక వాక్యం...............................

"మనిషి మల్లె పువ్వైతే ........సమాజం సుగంధ భరితం  అవుతుంది"

సూక్ష్మం  గా చెప్పాలంటే "అతడు మనిషి"కధ .....ఒక టౌన్ లో నివసించే అతను
ఒక వానా కాలపు రాత్రి నది దాటలేక ఒక గుడిసె లో ఉండి  వారి ఆతిధ్యం 
తీసుకో వలసి వస్తుంది.అప్పుడు వారు చూపే ఆదరణ అతనికి నచ్చుతుంది.
ఇంకా వారి బాబు అతని చుట్టూ పక్కల తెలుసుకున్న జ్ఞానాన్ని చెపుతుంటే 
తన బాబుకు తెలిసిన జ్ఞానం గొప్పదా..ఇది గొప్పదా....అని....సరేలెండి ...
ఇది నా కధ....ఆయన కధ చెపితే ఎలా?

ఒక రోజు....మబ్బులు భయంకరంగా ముసురుకుంటున్నాయి....రాంగోపాల్ వర్మ 
దెయ్యాల లాగా ఆకారాలతో భయపెడుతూ......బాయ్.....మని సడి చేస్తూ గాలి
జుయ్యన వీస్తూ...ఊ...ఊ.....అన్నిటిని ఎగర కొడదామని  చూస్తూంది.....
అప్పుడో ఇపుడో వర్షం వచ్చేస్తుందని....చల్లగా నిమురుతూ చెపుతూంది కబురు.

అప్పుడు...నేను స్కూల్ లో ఉన్నాను.లంచ్ టైం కి ఒక గంట ముందే పర్మిషన్ 
తీసుకున్న వానలో తడిసిపోతామని భయపడి....
(కాదు లెండి...ఎంచక్కా తడుస్తాము 
కాని....మాకు వర్షం పడితే చిన్న పెద్ద వరల్డ్ మ్యాప్ లో ఉండే సముద్రాలు నాయుడుపేట
 కు వచ్చేస్తాయి.....మరి మనకు స్కూటర్ వచ్చు కాని .....నీళ్ళలో పడవ నడపటం రాదు)

బయటకు వస్తుంటే శైలజ మేడం పిలిచారు"శశి మా బాబుని కూడా నీతో తీసుకొని పో.
వీడికి ఈ మధ్యే కుక్క కరిచింది.....మళ్ళా నీళ్ళలో తడిస్తే ప్రమాదం"అని వాళ్ళ ఏడవ
 తరగతిచదివే బాబుని నాతొ పంపింది.

సరే అని వాడిని ఎక్కించుకొని జుయ్య్యయ్య్య్యయ్యి............అని వెళుతున్నాను

ఊరికి స్కూల్కి మధ్యలో కొంత దూరం ఇళ్ళు ఏమి ఉండవు.
అదిగోఓఓఓ......అక్కడకు వచ్చే సరికి పడింది..టప...టప....రెండో చుక్క...బాబోయ్...
బాబు సంగతి ఏమిటి?నా సంగతి సరే తడిచినా ....మహా అయితే తలలో మట్టికి చిన్న 
చెట్టు మొలుస్తుంది....అంత  కన్నా ఏమి కాదు......పాపం మేడం నా మీద నమ్మకం  తో 
బాబుని నాతొ పంపింది.....చుట్టూ చూసాను....
ఏమి ఇళ్ళు లేవు......దగ్గరలో చిన్న గుడిసె .....దాని ముందు
చిన్న పంచ.......దాని కింద నిలబడ్డాము.........

గోడకి అతుక్కొని నిలబడ్డ.....జుయ్య్య్యయ్య్య్యి ....అని హోరు గాలి....
దానితో వర్షపు జల్లుమాపై  పడుతుంది..
బాబు ని గోడకు ఆనించి నిలబెట్టి  నేను వాడికి
 కొంచం కొంగు అడ్డం పెట్టి నిలుచున్నాను.

అయినా మిష్టర్ వర్ష దేవ్ గారికి కనికరం లేదు........
జల్లులు మీద జల్లులు కురిపించేస్తూనే ఉన్నాడు..

ఊహూ....ఆడవాళ్లే పాపం బాబు ఉన్నాడే అనన్నా కరుణిస్తాడు   అనుకుంటే ..
ఊహూ....నీకు దిక్కున్న చోటుకు పో అని సవాల్ విసురుతున్నాడు వానదేవుడు.....

ఏమి చేసేది వాడిని కాపాడటం నా భాద్యత కదా...ఏదైతే అది అయిందని....మెల్లిగా ఆ
పాకతలుపు తోసాను.అది చిన్న దీర్ఘచతుర స్రాకారపు పాక అన్న మాట.....
మనం కొంచం వొంగివెళ్ళక పొతే గడప మొహమాటం లేకుండా బాపు గారి కార్టూన్స్ లో
లాగా ఎంచక్కాఒక బొప్పిని ప్రసాదిస్తుంది.

అక్కడ ఒకతను నులక మంచం పై వాళ్ళ పాప లను  ఇద్దరినీ కూర్చో పెట్టుకొని
ఉన్నాడు.ఒక పాపకు పది నెలలు ,ఇంకో పాపకు మూడేళ్ళు ఉంటాయి.
పక్కన ఆ మంచం పట్టేంత స్తలమేఉంది.
అక్కడ వాళ్ళ భార్య వంట చేస్తుంది.మేము ఎక్కడ నిలబడాలి?అందుకని వాళ్ళు
మంచం ఎత్తేసి నిలబడి మాకు చోటిచ్చారు.
ఇంతలో ఇంకా మాలాగా ఇద్దరు ఆడవాళ్ళు ఒకఅతను కూడా వాన వల్ల లోపలి
వచ్చారు.అసలు నిలబడటం కూడా కష్టం గా ఉంది.
బయటకు పోదామంటే తుపాను లాగా ఉంది వాతావరణం.

అప్పుడు మొదలైంది అసలు కద....బుజం మీద చల్లగా ....
ఏమిటా అని చూద్దును కదా.....
పై నుండి నీళ్ళు పడుతున్నాయి....కొంచం పక్కకి జరిగాము...
బాబు ని నాకు అటు పక్కగా నిలబెట్టు కొన్నాను.
మళ్ళా ఇంకో పక్క నుండి నీళ్ళు  పడుతున్నాయి.....వాళ్ళు రెండు 
దగ్గరలా యేవో రెండు గిన్నెలు పెట్టారు......నీళ్ళు  వాటిలో పడుతూ ఉంటె
టపా...టపా....టపా....టపా....టపా......
.కొత్త సంగీతం....చలి గాలి ఒక పక్క.......పొయ్యి సెగ......తాలింపు వాసనా.....
ఏదో కూర చేస్తుంది పాపం.......యెంత సేపు ఉంటాము భావుకతలో .......
వాస్తవం చేదుగా ఇంకా చాలా దగ్గరల నీళ్ళు పై నుండి కారుతూ ఉన్నాయి......


కొంచం పొయ్యి పై నీళ్ళు పడకుండా ఏదో యూరియా గోతం కట్టుకున్నారు.......
ఇప్పుడు ఇంకేమి చేయాలి ?గిన్నెలో పడిన నీళ్ళు కూడా ఆ వడికి చింది నేలపై పడి
నేలంతా బురద.....మళ్ళ ఆ బురద నా చీర కుచ్చిళ్ళ పడుతూ......దేవుడా పాపం 
వీళ్ళకి ఎవరైనా గుడిసె పైన కప్పుకోను ఏమైనా ఇవ్వ వచ్చును కదా అనిపించింది.....

నాకు బాబుదే దిగులుగా ఉంది.....వాళ్ళంతా అందరం కష్టాలు పడుతూ  ఉన్నా
 నేనొక్కటే పడుతున్నట్లు నా దుస్తితికి జాలిగా చూస్తున్నారు......
సరే ఏమైతే అది అయిందనివాళ్ళతో "నేను తడిచినా పర్వాలేదండి....
పాపం బాబుకి కుక్క కరిచింది వాడు తడవ కూడదు"అన్నాను.

వాళ్ళు పాపం వెంటనే ఇంకో వైపు కొంచం స్తలం తడవకుండా చేసి అక్కడ బాబుని నిలుచో పెట్టారు.
హమ్మయ్య అనుకొన్నాను.పాపం వాళ్ళైతే తడిసి పోతున్నారు.....అయినా సరే సహాయం చేసారు.
నిజంగా దేవుడు ఎక్కడ ఉంటాడు ?సహాయం చేసే వాళ్ళ మనసులలో తప్ప.

తరువాత వాన పూర్తిగా వెలిసిన తరువాత ,మామూలుగా నేను టీచర్ ని కాబట్టి
నా బాగ్ లో చాక్లెట్స్  ఉంటాయి.అవి పిల్లలకు ఇద్దామని చూస్తె లేవు.

డబ్బులు ఇస్తే వాళ్ళు చాలా ఫీల్ అయ్యేటట్లుగా అనిపించారు.
సరే ఆ పాపా బుగ్గ పుణికి ముద్దు పెట్టు కొన్నాను.వాళ్ళు చాలా సంతోషించారు.
తరువాత చాక్లెట్స్ కొనుక్కో పాపా అని ఆ పాపకి కొంచం డబ్బులు ఇచ్చి
(చాలా కొంచం లెండి...బండి ఉంది కాబట్టి మన దగ్గర చాల డబ్బులు ఉండవు)
టాటా చెప్పి వచ్చేసాము .

బాబుని వాళ్ళ ఇంట్లో క్షేమంగా వదిలి హమ్మయ్య అని ఊపిరి తీసుకున్నాను.
మరి ఎవరైనా మనకు భాద్యత అప్పచెపితే దానిని కచ్చితంగా  పూర్తీ చేయాలి కదా......

ఇంట్లో కి వచ్చిన తరువాత మా వారు జరిగిన దంత తెలుసుకొని నేను క్షేమంగా 
వచ్చినందుకు సంతోషించారు."శశి అన్ని నగలు వేసుకొని ఆడదానివి అలా
ఎవరింటి కైనా వెళ్ళ కూడదబ్బా....జాగ్రత్తగా ఉండాలి"అన్నారు.

నేనన్నాను కదా "నన్ను ఎవరు ఏమి చేయలేరు నేను ఝాన్సి లక్ష్మి బాయి ని కదా"
అన్నాను.

మా వారంటారు....ఆ విషయం నీకు తెలుసబ్బ ....వాళ్లకు తెలీదు కదా.....
.అని......రచ్చ గెలిచాము......ఇంట్లో గెలవ లేక పోతిమి.......

మా కధ ఎప్పుడూ ఉండేదే.....మీరు అతడు మనిషి రివ్యు చూడాలంటే ఈ లింకు చూడండి.

11 comments:

మందాకిని said...

ఈ కథ విపుల లో వచ్చింది కదండీ పేరు గుర్తు లేదు కానీ మనసు కదిలించే కథ. ఆ పుస్తకం నేను జాగ్రత్తగా దాచుకున్నాను.
నేనే గొప్ప అనుకునే ప్రతి మనిషీ (అంటే అందరు కదా) చదివి తీరాల్సిన కథ.
అన్నట్టు మీ రాతల్లో అచ్చుతప్పులు బాగా తగ్గిపోయాయి:-) అభినందనలు.

శేఖర్ (Sekhar) said...

Idhe nenu ninna andhi......

Prema..nammakam ee prapancham lo inka brathike unnai ani anipisthundhi ilanti sanghatanalu chaduthunte.

:)

వేణూరాం said...

చాలా బాగుందండీ. సీరియస్ విషయాన్ని మీ స్టైల్ లొ చెప్పారు. నైస్ పోస్ట్

వనజ వనమాలి said...

chaalaa baagundi.meeru icchina linklo..jnaaana samupaarjna koodaa kallu theripinchedigaa undi.anthasthulu manushula madya addugodalu leputhaayi.manishi thatwam okariki saayam chesetappudu teluputhundi.manchi alochana rekettinche post..Shashi garu. Good.

శశి కళ said...

మందాకిని గారు థాంక్యు.మీ లాంటి స్నెహితుల వలన
తెలుగు టైపింగ్ బాగా నెర్చుకుంటున్నాను.


వనజ గారు థాంక్యు.

శశి కళ said...

రాజ్,శెఖర్ గారు థాంక్యు.

జ్యోతిర్మయి said...

శశి గారూ నిన్నటినుంచి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాను వ్యాఖ్య పెట్టడానికి కుదిరింది కాదు. మానవత్వం గురించి వ్రాసిన మీ టపా బావుందండీ... ఇలాంటి విషయాలు పంచుకోవడం వల్ల మనలో కూడా పాజిటివ్ థింకింగ్ పెరుగుతుందనిపిస్తుంది. ధన్యవాదములు.

శశి కళ said...

thanks jyoti gaaru....happy deepaavali....

ramki said...

Hello Sasikala Garu,
mee ee blog ki Indu garu daari chupincharu....Thanks to Indu.
nice posting.. :)

శశి కళ said...

welcome ramki gaaru...thanks indu

kiran said...

మహా అయితే తలలో మట్టికి చిన్న చెట్టు మొలుస్తుంది.- హహ మన టైపు ఏ
నిజంగా దేవుడు ఎక్కడ ఉంటాడు ?సహాయం చేసే వాళ్ళ మనసులలో తప్ప. -- కదా..చప్పట్లు...!!
రచ్చ గెలిచాము......ఇంట్లో గెలవ లేక పోతిమి....... - హిహిహిహిహిహి :D