Tuesday 1 November 2011

వహ్వా....ఏమి భారతీయ ఎసెన్స్ .....

ఈ రోజు మీకు ఏమి చెప్ప బోతున్నాను అంటే ....
ఏమిటి మీకు తెలుసా?.....అరె మీకేలా తెలుసు 
నేను సెవెంత్ సెన్స్ గూర్చి చెప్పబోతున్నానని........

ఓహో....మీ సిక్స్త్ సెన్స్ చెప్పిందా?ఆహా పే..ద్ద....
చెప్పండి సిక్స్త్ సెన్స్ అంటే ఏమిటి?

నన్నే చెప్పమంటారా....ఓ.కే.....మనకు ఐదు జ్ఞానేంద్రియాలు 
ఉంటాయి కదా....వాటిద్వారా మనం అన్ని గ్రహిస్తాము కదా....
కాని కొన్ని సార్లు మనకు ఎలాగో వీటి ప్రమేయం లేకుండా 
ఏమి జరగబోతుందో తెలిసిపోతుంది.....అది ఎలాగో తెలీదు...
దానినే సిక్స్త్ సెన్స్ అంటాము....ఇంకా కొన్ని విచిత్రాలు కూడా 
జరగోచ్చు....అంటే మనకు ఎవరో తెలీని వారు..చూడని వారు...
వాళ్ళ విషయాలు కూడా మనకు తెలియ వచ్చు....అయితే 
అదేమీ పెద్ద గొప్ప కాదు.....మనం రేడియో ఆన్ చేసినపుడు
 ఏ చాన్నేల్ ఫ్రేక్వేన్సి తగిలితే అది వచ్చేస్తుంది కదా....అంతే.....

మరి ఈ సెవెంత్ సెన్స్ ఏమిటో నాకు తెలీదు...
కధ విషయానికి వస్తే మామూలే ...
అంటే....దశావతారం లాగా బయో వార్ గూర్చి....
ఆంటే ఒక దేశం ఇంకో దేశం పై వైరస్ ని వ్యాప్తి చేసి 
జబ్బులు సృష్టించి దానిని లొంగ దీసుకోవాలని 
ప్రయత్నించటం.....కాక పొతే ఇక్కడ చైనా భారత్ పై 
ప్రయోగిస్తుంది.....

హీరో గూర్చి చెప్పాలంటే సూర్య ఏ పాత్ర అయినా 
విరగ దీసేస్తాడు ..... మొదట భోది ధర్మగా ........
అన్ని విద్యలు తెలిసిన వ్యక్తిగా కంచి పురం నుండి 
ఒక వ్యాది ని అరికట్టటానికి చైనా వెళతాడు...ఆ వ్యాధికి 
ఎంతో మంది చనిపోతుంటే వైద్యం చేసి వాళ్ళను 
కాపాడటమే కాక...బందిపోట్లు నుండి వాళ్ళను రక్షిస్తాడు.

అయితే యుద్దవిధ్యలె కాక కళ్ళ తో హిప్నటైజ్ చేసి 
(ఉల్ఫా మేస్సింగ్)తో వాళ్ళ లో వాళ్ళే చంపుకొని చచ్చేలా 
చేస్తాడు.అది చూసి అక్కడి వాళ్ళు అవి తమకు నేర్పమని
 కోరుతారు.అలా అక్కడే వారికి నేర్పుతూ ఉంటె, అతను
అక్కడ నుండి వెళ్ళ కూడదని వారు విషం కలిపిన అన్నం 
పెడతారు.ధర్మా కు అది తెలిసినా వాళ్ళ కోరికను మన్నించి 
తిని చనిపోతాడు.ఆయనను సమాధి చేసి షూ లైన్ అనే 
గుడి కట్టి అక్కడ అందరికి యుద్ద  విద్యలు నేర్పుతుంటారు. 

అసలు సూర్య కాదండి...డైరెక్టర్ ...
మ్యూజిక్ డైరెక్టర్ మనలను 
ఉల్ఫా మేస్సింగ్ చేసేస్తారు...
హాల్లో అందరు ఆ మ్యూజిక్ కి 
అలా సూర్యాని చూస్తుండి పోయారు.... 


తరువాత భోది ధర్మా వంశం లో ఇప్పటి కాలం లో 
పుట్టిన వాడు సూర్య.....హీరోయిన్ తన
జెనిటిక్ పరిశోధనలో భాగంగా ధర్మ లాంటి
D.N.A. ని సూర్య లో ప్రేరేపిస్తే మళ్ళా అతను
ధర్మా లాగా ఉపయోగ పడుతాడని
అతని వెనుక తిరుగుతూ ఉంటుంది.

అసలు శ్రుతి హాసన్ ఉందీ....
అసలు ఆ కళ్ళు.....
సోనాలి బింద్రే,శ్రుతి హాసన్ వాళ్ళు  అంతే.....


జిస్ దేశ్ మే గంగా బహతీ హై......
ఉస్ ఆంఖో మే భారతీయత బహతీ హై.....

(అసలు బాపు గారికి సీత గా వీళ్ళు ఇద్దరు ఎందుకు
 కనపడలేదో ఏమో...ప్చ్....)

ఈ లోపల చైనా వాళ్ళు domgle  అనే వాడి ద్వారా 
ధర్మా ఏ వైరస్ నుండి చైనా వాళ్ళని కాపాడాడో అదే 
వైరస్ ని వీది కుక్కల ద్వారా అందరికి వ్యాపింప చేయాలని 
ఇండియా కి పంపుతారు.ధర్మాకి వచ్చిన విద్యలన్నీ 
కళ్ళతో హిప్నటైజ్ చేయటం తో సహా వాడికి తెలుసు.
వాడు ఒక కుక్కకి ఆ వైరస్ ఎక్కించి మనుషులలో కూడా 
ఆ వైరస్ వ్యాప్తి చేస్తాడు.దానికి మందు ఇండియా లో లేదు 
కాబట్టి దాని కోసం ఇండియా లోంగుతుందని చైనా ప్లాన్.

కాని సూర్యాని హీరోయిన్ ధర్మా గా మార్చాలని పరిశోధన 
చేస్తున్న సంగతి తన ప్రొఫెసర్ ద్వారా చైనా కి తెలుస్తుంది.
ప్రోఫెసర్ ని  డబ్బుతో కొనేసి డోంగ్లి ద్వారా శ్రుతిని
 చంపించాలని చూస్తారు.
శృతి దేశం లో  వైరస్ వ్యాప్తి చెందటం చూసి ధర్మా 
వస్తే తప్ప వైరస్ కి మందు కనుగోనలేరని సూర్యాని 
ధర్మా గా మారుస్తుంది.

తరువాత సూర్యా డోంగ్లి ని చంపటం ,వైరస్ కి మందు 
కనిపెట్టి అందరిని రక్షించటం మామూలే.
కాక పొతే మన భారత దేశం గొప్పదనం తెలుసుకోమని ,మూడ విశ్వాసాలు అనుకునేవి సైన్సు అని అందరుతెలుసుకోవాలని 
చెపుతాడు ముగింపు లో సూర్యా.

సంగీతం చాలా బాగుంది.....స్క్రీన్ ప్లే బాగుంది.....
కెమెరా బాగుంది.....అన్నిటికి మించి ప్రేమ కంటే 
ముఖ్యం అందరికి మేలు చేయటం అనే సందేశం 
చాలా బాగుంది....కేవలం ప్రేమలో విపలమైనామని 
చనిపోయే వారు తమ జీవితం యెంత ముఖ్యమైనదో 
తెలుసు కోవాలి.

నేను రెండు విషయాలు చెపుతాను.

ఒకటి సూర్య ఒక పాటలో రక్త దానం చేస్తాడు.
అది వీలైన అందరు చేయండి....ఎందుకంటె రక్తం 
కృత్రిమంగా చేయటం ఇంకా కనుగొన లేదు....దేవుడు 
ఇచ్చిన మంచి రక్తాన్ని చెడు అలవాట్లతో కలుషితం 
 చేసుకోవాకండి.ముఖ్యంగా "ఓ" పాజిటివ్ వాళ్ళు 
దేవుడు ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడే అవకాశం మీకు 
మాత్రమె ఇచ్చాడు.ఆ కర్తవ్యాన్ని గర్వంగా పాటించండి.

రెండోది ఎన్ని వేల ఏళ్ళు అయినా మన జీన్స్ లో 
భారతీయత అనువంశికంగా ప్రవహిస్తూ ఉంటుంది.
ప్రయత్నం తో అది వెలికి దీయండి.ముఖ్యంగా 

స్త్రీలను గౌరవించటం మన సాంప్రదాయం ....

అది మీరు కూడా పాటించండి.....ఒక చక్కటి పువ్వు....
చిన్న పిల్లల చిరునవ్వు......చల్లని తెమ్మెర .......
వర్షపు జల్లు......యెంత అందంగా అస్వాదిస్తామో 
స్త్రీలు కూడా అంతే.......అంతే పవిత్రంగా వారిని 
గౌరవించాలి .....మన జాతిని కాపాడుకోవాలి......
వాటిని వాటి స్తానం లోనే గౌరవించాలి ....ఆప్పుడే
మనకు మన దేశానికి క్షేమం..           

14 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

Good msg.. yem cheppaaru.. movie lo kaadu.. meeru maatrame! Excellent Shashi gaaru.

రాజ్ కుమార్ said...

సినిమాకి మీరు బాగా కనెక్ట్ అయినట్టున్నారు. అసలు విషయాన్ని బాగా ఎలివేట్ చేశారు.
నాకు ఫస్ట్ అరగంట సినిమా బాగా నచ్చిందీ.. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, సూర్య ఇరగదీశారు. మిగిలిన సినిమా ఎక్కలేదు నాకు. బట్ డైరెక్టర్ చెప్పాలన్కున్న పాయింట్ బావుంది. మీరు చెప్పినట్టు గా.. ;)

శేఖర్ (Sekhar) said...

Chivarlo meeru cheppina points bagunnaie.....

:))

శశి కళ said...

వనజ గారు థాంక్యు.

రాజ్ నువ్వు మనసు పెట్టి చూసుండవు...
అందుకె యెక్కి ఉండదు....

శెఖర్ గారు...థాంక్యు.

వేణూశ్రీకాంత్ said...

సినిమాలో చెప్పిన విషయాలేమో కానీ మీరు చివర్లో చెప్పిన రెండు విషయాలు బాగున్నాయండీ :-)

శశి కళ said...

venu thank u...welcome after a long period .....

జ్యోతిర్మయి said...

బావు౦దండీ 'భారతీయ ఎసెన్స్'. సినిమా గురించి మీరు చెప్పిన విధానం బావుంది శశిగారూ..

Lakshmi Naresh said...

శశి గారు నాకు తెలుగు చదవడం అంటే చాల ఇష్టం. అందులో మనకి తెల్సిన మాటల్లో వినడం 2 చాల ల ఇష్టం. చూడండి మీ పోస్ట్ లు చదవడం మొదలు పెట్టి మీ "క్షమ......తెలుసా దాని మహిమ?" వారకి చదివేసాను. ఈ లోగ కామెంట్ పెట్టకపోతే ఫీల్(అంటే భావం ఏమో ) పోతుందని తొందరపడి తొందరగా రాసేస్తున్నా. చాల బాగుంది. ఎలా అంటే ఇంట్లో అక్క నో అమ్మ నో వదిన నో వాళ్ళ జీవితం లోంచి తీపి ముత్యాలు(బాగుందని వాడేసా ) "నీకు చెప్పడం నాకు చాల ఇష్టం " అని దగ్గర కూర్చోబెట్టుకొని చెప్తున్నట్టు. ఇంకా నచ్చింది ఏంటంటే వరసలు..మామయ్య,అత్త, బావ,మరిది ఇలా... మన తెలుగు ఇల్లు. ఎంత బాగుందో. ఇంకా చెప్పనా మీరు చెప్పిన "వెన్నెల్లో గోదారి" ఇంకో టాబ్ లో తయారుగా ఉంది. అంత ఒకేసారి చదవాలని కక్కుర్తి.

ఏమో అండి, మనసుని బాగు పరిచేవి డబ్బు,పదవి, ఉద్యోగం ఇలా కాకుండా ఇంకా ఏదో ఉంది..అవే చిన్న చిన్న సంతోషాలు. అవే మనల్ని బతికిస్తాయని నమ్ముతాను నేను. మీ పోస్ట్ లు అన్ని వాటిని తాకేవే. మన బాల్యం, మన బడి, మన పల్లెటూరు, మన పొలాలు, మన ఇంట్లో పెద్ద రోలు, మన బడిలో పంతులు(చదువు చెప్పే పంతులు ) గారు..ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉంటాయే..తప్పకుండా చెప్పగలను ఇవి అందుకుని ఆనందించే మనసు కూడా ఉండాలి...

థాంక్స్ లక్ష్మి నరేషు...

శశి కళ said...

jyothi thank u.

lakshmi naresh gaaru ...welcome to
my blog.మీరు చాలా ఫీలింగ్ ఉన్న వారు లాగా
ఉన్నారు...అంటే నా లాగా...వీలైతె మీ మైల్ ఐ.డి
ఇవ్వండి.ఇంకొ చెల్లి వచ్చిందని ఆనంద పడతాను.

Unknown said...

మనసుని బాగు పరిచేవి డబ్బు,పదవి, ఉద్యోగం ఇలా కాకుండా ఇంకా ఏదో ఉంది..అవే చిన్న చిన్న సంతోషాలు. అవే మనల్ని బతికిస్తాయని నమ్ముతాను
లక్ష్మి గారు మీకు తెలుసా అని శశి అక్క అడిగారు.
లక్ష్మి గారు మీకు కావాల్సిందే వెన్నెల్లో గోదావరిలో ఉంది.
welcome to my blog

Unknown said...

ముఖ్యంగా "ఓ" పాజిటివ్ వాళ్ళు
దేవుడు ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడే అవకాశం మీకు
మాత్రమె ఇచ్చాడు.ఆ కర్తవ్యాన్ని గర్వంగా పాటించండి.
ఇది సూపర్ అక్క
మీరు మూవీస్ గురించి రాసే పోస్ట్లు నాకు బలే నచ్చుతాయి.
నాది అదే గ్రూప్

Unknown said...

అది మీరు కూడా పాటించండి.....ఒక చక్కటి పువ్వు....
చిన్న పిల్లల చిరునవ్వు......చల్లని తెమ్మెర .......
వర్షపు జల్లు......యెంత అందంగా అస్వాదిస్తామో
స్త్రీలు కూడా అంతే.......అంతే పవిత్రంగా వారిని
గౌరవించాలి .....మన జాతిని కాపాడుకోవాలి......
వాటిని వాటి స్తానం లోనే గౌరవించాలి ....ఆప్పుడే
మనకు మన దేశానికి క్షేమం..

ఇది కేక అసలు
మీరు చెప్పిన విధానంకి వేసుకోండి వీరతాళ్ళు.
ఎన్ని అని అడగకండి
మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోండి.

David said...

ఒక చక్కటి పువ్వు....
చిన్న పిల్లల చిరునవ్వు......చల్లని తెమ్మెర .......
వర్షపు జల్లు......యెంత అందంగా అస్వాదిస్తామో
స్త్రీలు కూడా అంతే.......అంతే పవిత్రంగా వారిని
గౌరవించాలి .....మన జాతిని కాపాడుకోవాలి......
వాటిని వాటి స్తానం లోనే గౌరవించాలి ....ఆప్పుడే
మనకు మన దేశానికి క్షేమం..బాగుంది.

శశి కళ said...

మీ చక్కని అభిరుచికి థాంక్యు