Wednesday, 9 November 2011

హూ.....ఏమి చేస్తాము ప్రేమంటే అంతే

ఇల్లంతా చిన్నపోయింది .......
నవ్వుల పువ్వుల రవ్వలు ,పాటల గువ్వలు,
అల్లరి పాటలు... మాటలు... ఆటలు....ఇవన్ని ఏవి?

ఓహో...అదీ సంగతి చక్కని వెన్నెలమ్మ అలక మబ్బులో 
కూర్చొని ఉంది.

ఏమైందబ్బా?...ఊహూ...మౌనమే సమాధానం....
చ...ఇల్లే బోసి పోయింది ....అల్లరి అయితే అయింది 
అదే బాగుంది.......

చెప్పబ్బా?నువ్వు చెప్పక పొతే నాకెలా తెలుస్తుంది?
చెప్పవా ....ప్లీజ్..........

"మరైతె నాకు ఒక ప్రెమ లెఖ వ్రాయండి."

"ఇప్పుడా?""అవును ఇప్పుడే మీరు నాకెప్పుడూ వ్రాయలేదు"

"మనమెప్పుడూ దూరంగా లేక పోతిమి ...అందుకే వ్రాయలేదు"

"మరే నేను పుట్టింటికి వెళ్ళినా ఏదో ఒక సాకు చెప్పి,
బస్సు మిస్ అయిందని చెప్పి అక్కడకు వచ్చేస్తుంటిరి...
ఇక దూరంగా ఎలా ఉంటాము ?అయ్యన్నీ నాకు తెలీదు...
ఇప్పుడు వ్రాయాల్సిందే"ముచ్చటైన బుంగ మూతి మురిపెంగా...

(ఇప్పుడేమిటి దారి?ఏదో బుక్ లో చూసుంటుంది....
అసలు ఆ బుక్ వ్రాసిన వాడిని అనాలి....గొణుక్కున్నాడు)

"పిచ్చిదానా ...ప్రేమ లేఖ వ్రాయక పొతే ప్రేమ లేనట్లా?
అయినా అది ఒక ఆర్ట్ కదా అందరు వ్రాయలేరు....."

బుంగ మూతి మారలేదు.....ముద్దు అలక తీరలేదు....

నిష్టూరాల వర్షం ......"అంతే లెండి....బయట అందరికి 
ప్రేమను పంచుతారు...గౌరవాన్ని ఇస్తారు....నేను ఎక్కడకు 
పోలేనని అలుసు....నా ప్రేమ ను విసుగులుగాను,
నా ప్రేమను తిట్లు గాను,నా ప్రేమను కోపంగాను,
నా ప్రేమను మౌనంగాను,నా ప్రేమను అలసట గాను 
ఫీల్ అవ్వమని మమ్మల్ని అడుగుతారు...అంతేగాని 
ప్రేమను ప్రేమ రూపంలో ఇవ్వరు...ఏమి మేము డబ్బులు,
కెరీర్ మేమివ్వకపోయినా జీవితాంతం మీతోనే ఉంటాముగా 
మాకు కొంత టైం కేటాయిన్చావచ్చుగా....ఇక్కడ సంతోషం 
లేకపోయినా తరువాత మీరు యెంత సంపాదించింది 
ఎవరి కోసం?"

మనసుని తాకిన వెలితి...ఒక్కసారి హృదయాన్ని తెరుస్తూ......

నిజమే తనని సంతోషం గా ఉంచలేక పొతే తను భర్తగా 
ఏమి చేస్తున్నట్లు?అంతరంగంలో మమతల సునామి.....

"సరే ప్రేమ లేఖ సంగతి వదిలేయ్...నా పుట్టిన రోజుకి 
నువ్వు కూడా చీర కొనుక్కో"....ఊహూ...."సరే యేవో 
నగలు కావాలన్నావు కదా కొనుక్కో"ఊహూ.......

"సరే సినిమాకి పోదామా?"

(హన్నా సినిమాని చివర చెపుతావా?నయం ముందు 
చెపితే అలక వదిలేసి ఉండేది....మనసులో అనుకుంది)
లాభం లేదు ఏమి చేద్దాం?

"బంగారు"తన చేతిని చేతిలోకి తీసుకొన్నాడు....

(అయ్యా బాబోయ్ ...ఇదేమిటి టెలిగ్రాఫ్ లో అక్షరాలూ 
విధ్యుత్ తరంగాలుగా ప్రవహిస్తాయంట....అలా అక్షరాలను 
తరంగాలుగా మార్చి నాలో పంపెస్తున్నాడా ఏమిటి?
మరి మైండ్లో డీ కోడింగ్ మిషన్ పని చేయటం లేదా?

ఏమీ అర్ధం కావటం లేదు......

ఆ కళ్ళు బాబోయ్ దాని ద్వారా ఏమి పంపిస్తున్నాడు....
ఓయ్...మనసు అలక మాని వెళ్లవాకు.....వినటం లేదే...
వెళ్ళిపోతుంది......తరిమే స్వరమా....తడిమే వరమా.....
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా....వింటున్నావా.....
ఏమో...ఏమో...ఏమవుతుందో........

అరె ఏమిటి అలక మానేయమని చెపుతోంది....ఓటమా?

అరె ఏంటబ్బా ఈ మాంగల్య బంధానికి ఇంత శక్తి ....
ఇద్దరినీ ఒకరి కోసం ఒకరిని ఓడి పొమ్మని చేపుతుందే....
అంత శక్తి దానిలో ఉందా?అందుకే కాబోలు దానిని ఎవరికి 
కనపడకుండా హృదయానికి దగ్గరగా ఉంచుకోవాలంటారు....
ఈ శక్తి కి నైతిక విలువల సోబగులద్దితే ఓటమి కూడా 
అందంగా ఉందే.........

అరె ఇద్దరం ఓడిపొతే గెలిచేదేవారు?సమాజం లో సంసార 
గౌరవం కాబోలు.....హృదయం మెత్త బడుతూంది.......

"సరే నా గూర్చి ఒక కవిత చెప్పండి"ఇరవయ్ ఏళ్ళ కాపురం 
ఇరవై వాక్యాలు అయినా చెప్పరా.....అనే ధీమా....కళ్ళలో...

మళ్ళా నావాడు కళ్ళతోనే....తప్పదా కళ్ళలో ప్రశ్న.....
చెప్పాల్సిందే.....పట్టుదలతో కళ్ళలోకి చూడలేక 
మీసాల కింద కదిలే పెదాల వైపు చూస్తుంది.......
ముత్యాలు పడితే ఎరుకుందామా.....అన్నట్లు.....
మెల్లగా కదిలాయి పెదాలు....చిన్నగా పదాలు పేరుస్తూ.....

                    నీ కు భర్త గా 
                    కంటేనీ వడిలో 
                    బిడ్డగావాలని
                    ఉంది చిన్నారి.......

 తన కను కోలుకుల్లో నీళ్ళు ముత్యాలుగా 
మారి .....స్వర్ణాభిషేకం చేసినా ఇంత సంతోషంగా 
ఉంటుందా?తన భార్య కన్నుల్లో ఏ భర్త కి దొరకని 
అపురూప ప్రశంస.......................

(సరే ఏమి చేద్దాము ....కవి గారు ఎపుడో చెప్పారు....
ఓ చెలి....తెలుసా....తెలుసా....తెలుగు మాటలు పదివేలు....
అందులో ఒకటో రెండో.....నువ్వు చెపితే అది చాలు.....
రివర్స్ లో పాడుకుంటే సరి.....అంతరంగం నుండి వచ్చినవి 
ఆరు మాటలైనా అమృతమే.....)

కధ అయిపోయిన్దోచ్చ్..........  

మామూలే మీకు కబుర్లు చెప్పాలి కదా.......
అసలు విషయం ఏమిటంటే .....మీ లైఫ్ పార్ట్ నర్
ఎలాగా ఉండాలో మీరే ఎన్నుకున్న తరువాత మీరు 
పుట్టారు.....తన లో లోపాలు కనిపిస్తుంటే లోపాలు 
కనపడనంత తనని మీరు ప్రేమించటం లేదన్న మాట....
అసలు తను మీలో భాగం అనుకుంటే అసలు లోపాలే 
కనపడవు......

అన్నట్లు అలక రుచి,ఆవకాయి రుచి ఆలు మగలకి 
తెలిసినట్లు గూగుల్ వాడికి తెలీనట్లు ఉంది....ఇమేజెస్ 
దొరక లేదు.........అలక నీటిలో గీసిన నాగేటి చాలు.....
గీస్తూ ఉంటె వెంటనే హృదయాలు కలిసిపోతూ ఉంటాయి.....
 
 అమ్మాయిలూ....ఊరికినే అలగొద్దు....అవతలి వాళ్ళ మూడ్ 
చూసి అలగాలి......అప్పుడే అలక సరదా మీకు ...అదే వేడుక 
మాకు ....అని తీరుస్తారు.....అది కూడా వాళ్ళు పాపం 
తీర్చ దగినవే అడిగితె అవిచ్చేసి .....ఎవరెస్ట్ శిఖరం 
ఎక్కినట్లు ఫీల్ అవుతారు......లేక పొతే తోలు తీసే 
ప్రమాదం ఉంది....తరువాత నన్ను అనొద్దు.........

మరి పెళ్లి కాని వాళ్ళు ఏమి చేస్తారు పా....పం....

"ఉందిలే మంచి కాలం ముందు ముందునా ....
అందరు సుఖపడాలి నందనందనా...."అని పాడుకోండి.

ఎందుకంటె చుట్టూ మల్లె తోట ఉంటె ఆ పరిమళం 
మనలో కూడా వ్యాపించి నట్లు.....చుట్టూ అందరు 
సంతోషంగా ఉంటె ఆ సంతోషం మీలో కూడా వ్యాపిస్తుంది....

18 comments:

::బ్లాగిల్లు:: said...

ఫ్రెండ్

"బ్లాగిల్లు"లో రేపటి కోసం "నేటిబ్లాగు"కు మీ బ్లాగును ఎంచుకున్నాం. మీయొక్క మంచి పోస్టులతో మమ్మల్ని మరింత అలరించాలని...

మా వెబ్ సైట్ ను దర్శించండి :మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను ,సూచనలను తెలుపగలరు.

http://blogillu.com/

మీ

శ్రీనివాస్

వనజ వనమాలి said...

Excellent post. vraayadaaniki maatale levu.

రాజ్ కుమార్ said...

సూపర్ గా రాశారు శశిగారూ..!

ఉందిలే మంచి కాలం ముందు ముందునా ....
అందరు సుఖపడాలి నందనందనా ఆ ఆ ఆఅ ;) ;)

మందాకిని said...

భలే సరదాగా ఉంది చదివేందుకు, ఊహించుకునేందుకు.
బాగా రాశారు.
చివర్లొ అమ్మాయిలకు సందేశాలెందుగ్గానీ, మిగతాదంతా చాలా బాగుంది.

జ్యోతిర్మయి said...

'అలుక మానవే చిలుకల కొలికి' అని చూడగానే మానేసిన మీ అలుక మహా స్వీట్ గా ఉంది. బావుంది శశి గారూ మీ అన్యోన్య దాంపత్యం.

శశి కళ said...

nice job ur doing....
thanku for ur encouragement...blogillugaaru....

శశి కళ said...

vanajagaaru,raaj,mandaakini gaaru
andariki thankyulu

హరే కృష్ణ said...

బాగా రాసారు శశి గారు!
రాధా కృష్ణ బొమ్మ చాలా చాలా బావుంది :)


మీరు పోస్ట్ లు చాలా తక్కువ రాస్తున్నారు :(

శేఖర్ (Sekhar) said...

చాల బాగా రాసారు శశి గారు...నిజం గ చాల బాగుంది...

రసజ్ఞ said...

చాలా బాగా వ్రాశారు! దాంపత్య జీవితంలోని మాధుర్యతను చూపించారు! ఇదిగో మీరు చెప్పినట్టు పాట పాడేసుకుంటున్నాను!
ఉందిలే మంచి కాలం ముందు ముందునా ....
అందరు సుఖపడాలి నందనందనా....

kallurisailabala said...

(ఇప్పుడేమిటి దారి?ఏదో బుక్ లో చూసుంటుంది....
అసలు ఆ బుక్ వ్రాసిన వాడిని అనాలి....గొణుక్కున్నాడు)
అక్క ఇది చాలా అన్యాయం.బావగారికి చెప్పలేదా ఆ పుస్తకం రాసింది నేను అని.
పోస్ట్ చాలా బావుంది.

శశి కళ said...

sailoo...)))))))))

Avineni Bhaskar / అవినేని భాస్కర్ said...

శశి గారూ,
మీరుగాని మా అవిడకి క్లోజ్ ఫ్రెండ్ కాదుకదా? మా ముచ్చట్లు మీతో చెప్పుకుంటే వాటిని బ్లాగ్ గా రాయలేదు కదా? మరి మా యింటి సంగతులేమన్నా దొంగచాటుగా చూశారా?

బాగుందండి మీ యలుక ముచ్చట్లు...

----
అయ్యా బాబోయ్ ...ఇదేమిటి టెలిగ్రాఫ్ లో అక్షరాలూ విధ్యుత్ తరంగాలుగా ప్రవహిస్తాయంట....అలా అక్షరాలను
తరంగాలుగా మార్చి నాలో పంపెస్తున్నాడా ఏమిటి?
మరి మైండ్లో డీ కోడింగ్ మిషన్ పని చేయటం లేదా?
----
లైక్డ్ :)

kallurisailabala said...

sailoo...)))))))))
ila smily lu petti ma kopam pogattaleru bavagaru meku premalekha rayalsinde..leda meru rayali...

శశి కళ said...

అవినెని గారు ఇవి అందరి ముచ్చట్లె....నెను కొంచం
బయట పెట్టాను అంతె.....మీ ఆవిడ ను ఫ్రెండ్
చెసుకుంటాను చూడండి...థాంక్యు.

శశి కళ said...

శైలూఊఊఊఊ....)))))))))))
మీ భావకి ఇలా అంటె చాలు ...వంద ప్రెమ లెఖలు
వ్రాసినట్లె....బతికాను రా బాబు ఈ రొజుకి అనుకుంటారు.
అయినా నీ లాగా మెము వ్రాయలెమబ్బా...)))))))))

శశి కళ said...

hare krishna,rasagna,sekhar thank u all

kiran said...

చాలా..చాల్లాఆ...బాగుంది :)...గూగుల్ వాడికి ఏమి తెలుసండి..??మీరే అలిగేసి ఓ సారి ఫోటో తీయించుకుని పెట్టేయల్సింది :)