ఇది మా పాప హేమ మాధురి వ్రాసింది.సరే పాపం తనకి
బ్లాగ్లో చూసుకోవాలని కోరిక.ఈ రోజు వాళ్ళ మాగజైన్
సైబర్ క్రెస్ట్ కి పంపుతుంటే సరేలే పోనీ అని బ్లాగ్లో పెట్టాను.
మరి మీ ఆశీస్సులు తెలియచేయండి.
ఇదే ఇదే మా లోకం
సౌర శక్తికి రెక్కలు తొడిగిన లోకంలో
ప్లాస్టిక్ కాలుష్య బూతాన్ని తరిమి కొట్టి
భావించే యువతే మా భవిత
హింస సమాధిపై శాంతి పావురాన్ని ఎగురవేసి
స్నేహపు దీపాల వెలుగున
ఐకమత్యం వికసించాలని
భావించే యువతే మా భవిత
పిల్లలందరూ చదువుల తల్లి వొడిలో
ఆకాశమే హద్దుగా అవకాశాలు సాదించి
అవకాశాలు సృష్టించి విరించిలా వెలగాలని
భావించే యువతే మా భవిత
మూఢవిశ్వాసాల మదమును అణిచి
జ్ఞానపు బావుటా ఎగురవేసి
శాంతి సూక్తుల సీమ లో సయోధ్యతో మెలగాలని
భావించే యువతే మా భవిత
ఆలోచన పెంచి ఆవేశం త్రుంచి
సద్విమర్శను సృజించి
కర్తవ్యపు బాటలో భారతమాతకు అండగా నిలవాలని
భావించే యువతే మా భవిత......
@@@@@@@@@@@@@@@@@@@@@
ఈ కవిత ఈదూరి సుబ్బయ్య సాహితీ పీటం వారు 12-2-2011
న జిల్లా స్థాయిలో యువతకు పెట్టిన కవితల పోటిలో
రెండవ బహుమతి పొందినది.
రెండవ బహుమతి పొందినది.
11 comments:
very nice.. God bless her.I wish All the Best Hema madhuri.marinni manchi kavithalu vraayaalani korika.
Wow! Loved it
So meaningful
చాలా బాగా రాసారండీ
హేమ మాధురి కి శుభాభినందనలు
ఫస్ట్ ప్రైజ్ ఇవ్వనందుకు నిరసన తెలియచేస్తున్నాం:)
vanaja gaaru mee aaseessulu maa
papaku ichchaaru...thank u.
hare krishna gaaru...mee wishes ku
mechchi mee blog ki follow petamu
see andi.
కలంలో యువత భావాలని నింపి మాకు దేశ భాద్యత కూడా ఉంది అంటూ చక్కగా వ్రాసిన హేమ మాధురి గారికి నా శుభాభినందనలు!
శసి గారు మీ అమ్మాయి రాసిన అవిత చాల బాగుంది...ఇప్పటి పిల్లలు అందరి ఇలా ఆలోచిస్తే బావిష్యత్హు గురించిన దిగులే ఉండదు.
ఇంత చిన్న వయసు లోనే బుద్దుడి అంతటి మహాత్ముడి మార్గం లో నడవమనటం మీ అమ్మాయి ఆలోచనల కవిత నిజం గ పెద్దవారు కోడ పాటిస్తే ఎంతో బాగుంటుంది...
thank u rasagana gaaru,sekhar gaaru
చాలా బాగా రాసిందండీ మీ పాప
అభినందనలు తెలియచేయండి
after a long time...thank u latha gaaru
వామ్మో...మా చెల్లి చాల talented
నా మోకాలు మొత్తం use చేసేసిన...
mallii చదవాలి మొత్తం అర్థం కావాలంటే...
బాగుంది హేమ :)
ఇలాంటి యువత కోసమే ఎదురు చూస్తుంది..బావి భారతం.
లొకనాధ్ గారు థాంక్యు
Post a Comment