Friday 7 October 2011

అనగా...అనగా...ఒకబ్లాగ్...

  అనగా...అనగా...ఒక బ్లాగ్...అందులో ఓ అయ్యోరమ్మ....
 మరీ అంత సీన్ లేదు కాని.....పర్లేదు....ఓ....లుక్కెయ్యండి....

ఇదంతా శైల బాల అభిమానమే ...తను వ్రాసిన నాకు నచ్చిన బ్లాగ్లు పోస్టింగ్
నుండి నా నేస్తాల కోసం తెచ్చిపెట్టాను....చదవండి......

ఎవరైనా మనలను మెచ్చుకుంటే ఎవరికైనా సంతోషమే....అది శైల బాల లాంటి 
వాళ్ళు చేస్తే అది ఎంతో స్పూర్తిని ఇస్తుంది.....థాంక్యు శైల............

(శైల బాల బ్లాగ్ లింక్----kallurisailabala.blogspot.com     )have a nice reading........



ఓక టీచర్ గారి బ్లాగ్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

మీరు గాని ఒక నవ్వు గాని నవ్వాలంటే...
మీరు గాని అరుంధతి సినిమా చూడాలంటె...
మీరు గాని స్కూటీ నేర్చుకోవాలంటే...
మీరు గాని మన చుట్టూ ఉన్న వారు చేసే పనులు స్పూర్తిగా తీసుకోవాలంటే...
మన టీచర్ గారి బ్లాగ్ చదవాల్సిందే.

కొంచం అమాయకత్వం , కొంచం పెద్దరికం
అంతలోనే చిన్న పిల్లల కబుర్లు
మళ్లి అంతలోనే టీచర్ గారి కబుర్లు అన్ని ఉన్నాయి ఇక్కడ
నాకు ఎక్కడ పరిచయం అంటే బజ్జ్లో
ఒకరోజు "శైలు !అలగకు ఇంకా నీ పోస్ట్ చదవలేదు " అంటే అరె నేను అవిడకి తెలుసా ?అనుకున్న ...తర్వాత అర్ధం అయింది ఆవిడ అప్పటికే నా బ్లాగ్ చదువుతున్నారు అని
సరే అలా మాట కలిసింది.

ఒకరోజు ఫోన్ చేసారు.
"నేను ఎవరో చెప్పు చూద్దాం " అంటూ ఒక పొలికేక
"శశి గారు !" ఇటు ఒక గావుకేక
ఈ పొలికేకలు, గావుకేకలు తో ఇటు మా కాలనీ అటు వాళ్ళ కాలనీ వాళ్ళు దడుసుకున్నారేమో మరి నాకు తెలీదు కాని ఈ సందర్భం గా ఒక్క మాట చెప్పాలి మీరు ఎప్పుడయినా నెల్లూరు భాష వినాలంటే శశి గారు మాట్లాడితే వినాల్సిందే.
ఈ మాట ఎందుకు చెప్పానంటే నేను పది మాటలు మాట్లాడితే అందులో నాలుగు ఆంగ్లం, రెండు తెలుగు, రెండు హిందీ ఇక ఈ మధ్య చెన్నయి లో ఉండటం మొదలు పెట్టాక మనకు వచ్చిన రెండు మూడు తమిళ మాటలు కూడా కలిసిపోతున్నాయి అని అంటున్నారు. ( ఈ మధ్య మావారు ఈ విషయం మీద క్లాసు తీసుకున్నారు ఆయనతో మాట్లాడేటప్పుడు ఒక్క అంగ్ల పదం కూడా రాకూడదు అని ...ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తున్నాను.)
శశి గారితో మాట్లాడాక నేను కూడా తెలుగులో మాట్లాడాలి అని ఒక కంకణం కట్టుకున్నాను.
ఇక బ్లాగ్ విషయానికి వస్తే
స్ఫూర్తి పేరుతొ రాసిన పోస్ట్ లు దగ్గరినుంచి సినిమా సిత్రాలు వరకు అన్ని బావుంటాయి.స్ఫూర్తి పేరుతొ రాసిన పోస్ట్ లు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.అన్ని బావుంటాయి కాబట్టి ఎ ఒక్కదాని గురించి ప్రత్యేకంగా చెప్పడం లేదు.
ఒక్కసారి కాదు ఎన్నిసార్లు అయిన చదవచ్చు.

నేను..కెవ్వ్....నా దయ్యం
బూత ప్రేత పిశాచ ...
నారి బంబం.......అవును సొంత పాటే ......నా దెయ్యం వేరే వాళ్ళ పాటలు పాడితే రాదు)
ఇది మాత్రం సూపర్ అసలు.( శశి గారు మరి నా దయ్యం సంగతి ఏంటి ? 
నాకు పాటలు రాయడం రాదు కాబట్టి మీరు నా దయ్యనికి ఒక పాట రాయాల్సిందే ...)

(ఈయన లేక పోతే పోలేమా పెద్ద......ఇష్....నిజంగానే పోలేము.
అందులో దెయ్యం సినిమా. ఎవరండి ఇండియా డెవలప్ అయింది అంది)
 
హమ్మయ్య......సాయబు వచ్చి మేం సాబ్......అని అరిచి ఆ మంత్ర దండం విసిరేశాడు.
చచ్చాడు పో........అనుకోని ఊపిరి పీల్చుకున్నా.....కాని చావడు......ఇంకేమి చేసేది
దేవుడా........అనుకుంటున్నా......అరుందతి దానితో పొడుచుకుంది............
 
(బాబోయ్.....ఇప్పుడు దెయ్యాన్ని ఎవరు చంపాలి ....నేనా?...కేవ్వ్వ్......)
 
ఈ పోస్ట్ చదివి ఎవ్వరు నవ్వకుండా ఉండలేరు.కాకపోతే శశి గారు
( భర్త రాకుండా మనం దయ్యం సినిమాలు చూడలేము అని ఇలా చెప్పేస్తే ఎలా అండీ ?)

ఇంకా ఆలస్యం ఎందుకు నెల్లూరు వెల్లిపోదాం పదండి.
శశి గారు స్కూటీ నేర్చుకోవడం చదవాల్సిందే అంటే స్కూటీ మీద కూర్చుని చదవకండి నవ్వలేక పడిపోతారు.కావాలంటే మీకు మీరు పందెం వేసుకుని చదవండి నేను అస్సలు నవ్వను అని 
తప్పకుండ ఓడిపోతారు.
 
ఎప్పుడైనా skooty నేర్చుకోవాలంటే
break మీద break అని పెద్ద అక్షరాలతో వ్రాసుకోవాలి )
 
మా స్కూల్లో సర్ ఒకరు "ఏమి madam ఇంకా బండి మీద రావటం
లేదు"అని అడిగారు."దైర్యం చాలటం లేదు సార్"అన్నాను.
వెంటనే ఆయన "ఊరుకోండి మీరు పోయే 20 కి మీ
స్పీడు కి ఒక పిల్లవాడు మీ పక్కన పరిగెత్త గలడు.దానికే భయం ఎందుకు"అన్నారు
 
అది అసలు సంగతి ఏడాది స్కూటీ నేర్చుకున్నాక ఎవరయినా ఇంతకన్నా స్పీడ్ గా వెళ్ళగలరా ?

కవిత కదంబం 

లో తెలుగు భాష తీయదనం గురించి

చిన్నారి బాబు ని వడిలో వేసుకొని అమ్మ
అని పెదాలు తాకించి చూపిస్తూ నేర్పించే
ప్రేమలో ఉంది............

చందమామ రావే ,జాబిల్లి రావే
అని అమ్మపెట్టె గోరు ముద్దలో ఉంది........

రావోయి బంగారి మామ ...అని పిలిచే
ఎంకి ప్రేమ లో ఉంది .............

సంకురాత్రికి దాన్యం రావాలని
కోరుతూ ప్రేమగా నాటే నారు మళ్ళలో ఉంది......

చెల్లియో చెల్లకో..అని రాగాలాపనతో
మేకల్ని మేపే గొంతులో ఉంది......

భగ..భగ..మండే సెగలా వస్తున్నాడు కదిలి
అని రగిలించే బుర్రకధలో ఉంది ......

తెలుగుని వదలలేక బ్లాగుల్లో వ్రాసుకుంటూ
ప్రేమను చూపుతున్న మీ అందరిలో ఉంది ....

జనాల్లో ఉంది .....జానపదాల్లో ఉంది
పల్లెల్లో ఉంది.....పసి పాప మనసులో ఉంది
ఇది ఎంతో బావుంది.

మీ ప్రక్కన మీ సహచరిగా చిన్న మొక్క
ఉండేటట్లు చూసుకోవటం.......

పర్యావరణం గురించి చెప్పింది ఈ మాట.
అన్ని నేను చెప్పేస్తే మీరు బ్లాగ్ లో ఏం చదువుతారు కంగారు పడకండి
నాకు బాగా నచ్చినా ఒక చిన్న మాటతో ఇది ముగించేస్తాను.

మీరో ఒక పని చేయండి.ఒక మొక్కని నాటండి.
ఇరవయ్యి ఏళ్ళు బాగా పెంచండి.తరువాత పీకి
ఇంకో దగ్గర వేయండి.అది ఎలాగా ఉంటుందో
ఆడపిల్లలు అంతే.
మేము ఎంత బాగా చూసుకున్న పుట్టింటి వాళ్ళని చూస్తే నీకు సంతోషం
లేదా పుట్టింటికి వెళ్ళాలంటే చాలు ఎక్కడ లేని అనందం వచ్చేస్తుంది అనే భర్తలు ఇది చదివితే తెలుస్తుంది ఆడపిల్ల అంటే ఏంటో??
మరి బ్లాగ్ కి వెళ్లి చదివేసి చెప్పండి.itissasiworld.blogspot.com

2 comments:

Unknown said...

శశి గారు మీ బ్లాగ్ గురించి లేనిది ఏమి రాయలేదు.
ఉన్నదే రాసాను.
పోస్ట్ పెట్టుకున్నందుకు ధన్యవాదాలు.

శశి కళ said...

thank u sailu