Monday, 15 August 2011

ఇంత తెలుగా...వామ్మో....

ఆగస్ట్ 13,14,15,తేదీలలో విజయవాడలో ఆంధ్రప్రదేశ్ 
సాంస్కృతిక శాఖ ,హింది అకాడెమి భారతీయ బాషా 
 కేంద్రం,మైసూర్ సాహిత్య అకాడెమి వాళ్ళు కలసి 
కృష్ణ జిల్లా రచయితల సంఘం వారు 
  ప్రపంచ తెలుగు రచయతల రెండవ మహాసభలు 
నిర్వహించాయి.అక్కడ చాలా చర్చలు జరిగాయి.
మరి బాషలో మన మూలాలు ఉంటాయి కాబట్టి 
దానిని రక్షించుకోటానికి ఒక వేదిక కావాలి కదా.

మీకెందుకు ఇవి  చెప్పుతున్నాను అని కదా సందేహం.

మీ నేస్తం(ఆమె ఎవరు నా...నేనే బాబు.రెండురోజులకే 
 మర్చిపోయారా?)పాల్గొని తెలుగు గొప్పదనం మీద కవిత 
...పాటలాగా పాడింది అన్నమాట.పాడమంటారా......ఆ...ఆ

 (ఏమిటిమొహం అలా పెట్టారు.సుమనుడి సీరియల్ చూసినట్లు)

సరే వ్రాస్తాను చదువుకోండి....

పల్లవి: పలు మమతల కోవెల,మా తెలుగుకోయిల 
పద పుష్పపు తీవేలా,మధుర స్వర ఊయల 
మా తెలుగు కోయిలా చకోరికి వెన్నెల 
మాతెలుగు కోయిలా తేనెలూరు జలదిలా 
మా తెలుగు వైభవం ,పొగడ పూల సౌరభం
మా తెలుగు రాజసం ,సహస్ర సూర్య తేజసం....

1.షడ్రుచుల ఉగాది ,అవధానపు ఆటలు 
చమత్కార పాటలు ,చతురించే కవులు 
తేట గీతులు,ఆటవెలదులు,
సంధులు సమాసాల సరాగాల సుగంధం 
వ్యాకరణం తో వయ్యారముగా ,ఈ నాటి ది కాదయ్యా 
తెలుగు తల్లి వైభవం .........

2.మందార మకరంద మాదురోసగు పోతన 
భారతాన్ని తెనిగించిన ఆది కవి నన్నయ 
జుంటి తేనెలు ,పాల ధారలు
కలగలసిన కవిత్వం మా తిక్కనది 
అన్నమయ్యతో,క్షేత్రయ్యతో ఈ నాటిది 
 కాదయ్యా తెలుగుతల్లి వైభవం .........

ఎందుకో అవధానం లో అందరు నిషిద్ధాక్షరి 
గొప్పది అంటారు.దానివలన వారి పద కౌశల్యం,
వ్యాకరణం పై పట్టు తెలుస్తాయని.నాకు మాత్రం 
సమస్య పూరణం ఇష్టం.ఎందుకంటె అది వారిలోని 
 సృజనాత్మకత ను చూపుతుందని.ఎందుకంటె అది
నేర్చుకుంటే వచ్చేది కాదు.

నిజానికి ఈ చర్చలు,వేదికల పై కాదు తెలుగు ఉండేది
ఎక్కడ ఉందొ చెప్పమంటారా?

 చిన్నారి బాబు ని వడిలో వేసుకొని అమ్మ 
అని పెదాలు తాకించి చూపిస్తూ నేర్పించే 
ప్రేమలో ఉంది............

 చందమామ రావే ,జాబిల్లి రావే
 అని అమ్మపెట్టె గోరు ముద్దలో ఉంది........

 రావోయి బంగారి మామ ...అని పిలిచే
ఎంకి ప్రేమ లో ఉంది .............

సంకురాత్రికి దాన్యం రావాలని
కోరుతూ ప్రేమగా నాటే నారు మళ్ళలో ఉంది......

 చెల్లియో చెల్లకో..అని రాగాలాపనతో 
మేకల్ని మేపే గొంతులో ఉంది......

 భగ..భగ..మండే  సెగలా వస్తున్నాడు కదిలి 
 అని రగిలించే బుర్రకధలో ఉంది ......

తెలుగుని వదలలేక బ్లాగుల్లో వ్రాసుకుంటూ
 ప్రేమను చూపుతున్న మీ అందరిలో ఉంది ....

జనాల్లో ఉంది .....జానపదాల్లో ఉంది
 పల్లెల్లో ఉంది.....పసి పాప మనసులో ఉంది

మీరనుకుంటే మీ దగ్గరగా కల కళా రూపాల 
మీద మీరు తీయబోయే డాక్యుమెంటరీ లలో ఉంది....

 రండి.మనకు అసాధ్యమేమీ లేదు.మన చేతిలోని 
కెమెరాలతోనే దాచి పెట్టి చూసుకోవలనిపించే 
తెలుగు రూపాలు మొగిలిరేకులుగా ,నెమలి ఈక లు గా మార్చి 
అందరికి పంచుదాం.

6 comments:

Anonymous said...

మరి నీ blog title కొంచెం మార్చి తెలుగులో పెట్టవూ?

శశి కళ said...

కష్టం ఆండి.అదెలాగొ నాకు తెలీదు.అదీ కాక చాలా
మందికి నా బ్లొగ్ పెరు చెప్పి ఉన్నాను.మామూలుగా
మొదట నా దగ్గరికి వచ్చిందె నా కొసమని నమ్మకం
ఉంది.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

అదేం లేదండి
సెట్టింగ్స్ లోకి వెళ్ళి టైటిల్/శీర్షిక అని ఉన్న బాక్స్ లో తెలుగు పేరు పేస్ట్ చేసి సేవ్ చేస్తే సరి.

వనజ తాతినేని/VanajaTatineni said...

శశి ..చాలా బాగా చెప్పారు. బాగుంది.
అలాగే.. మనకోసం మనదైనది ఎప్పుడు వస్తూనే ఉంటుందేమో!
అజ్ఞాత గారి సూచనతో..నేను ఏకీభవిస్తున్నాను.మీ బ్లాగ్ పేరు వల్ల మీ బ్లాగ్ అందరకి చేరే వీలు ఉండదేమో!ఆలోచించండి

శశి కళ said...

vanaja,mandaakini gaaru meeru cheppina daani goorchi aalochistunna.
thank u.

ఇందు said...

వావ్! శశి చాలా బాగుంది. అయ్యో లేట్ గా చూశా! సారి! నాకు ఈ లైన్స్ బాగా నచ్చాయి :) మళ్ళీమళ్లీ చదువుకున్నా!

>>చిన్నారి బాబు ని వడిలో వేసుకొని అమ్మ
అని పెదాలు తాకించి చూపిస్తూ నేర్పించే
ప్రేమలో ఉంది............

పాడాను అన్నావ్ కదా! మరి ఆడియో ఏది అమ్మాయీఇ?