Thursday, 25 August 2011

నువ్వంటే నాకిష్టం....కాని

నువ్వంటే నా కిష్టం...
సుధా చంద్రికల నర్తించే నీ మలయానిలం  నాకిష్టం ...
శీతల జల పుష్ప తుంపరల స్నానించి 
వయ్యారపు హరివిల్లుల నడుము ఒంపు పై ఉయ్యాలా 
ఊగటం నాకిష్టం .........

(ముక్క అర్ధం కాలేదా?మరి మనకు అర్ధమయ్యే 
తెలుగింగ్లిష్ లో వ్రాయమంటారా?)

మరి మనలో మనకే తెలీకుండా లోపల ప్రకృతి
ప్రేమికులు ఒకరు ఉంటారు(ఎస్ ...అపరిచితుడి లాగా)
వాడికి (ఆమెకి)వానలో తడవటం ఇష్టం కావొచ్చు...

హరివిల్లుని కనులలో నింపుకోవటం ఇష్టం కావొచ్చు....
చల్లని చెట్టు నీడలో పడుకొని నీలాకాశం వైపు చూడటం ఇష్టం
కావొచ్చు.............

మట్టి వాసనా,పూల స్పర్శ,నీటి అలజడి,.....
ఓహ్.....పాట గుర్తుకు వచ్చేస్తుంది.....కెవ్వ్...పారిపోండి.

"ఆకులో ఆకునై ..పువ్వులో పూవునై ..కొమ్మలో కొమ్మనై..
నును లేత రెమ్మనై ఈ అడవి దాగిపోనా...."

ఈ లాగా ప్రకృతిని ప్రేమిస్తున్నాము అంటారు...కాని
ప్లాస్టిక్ వాడొద్దు అంటే...కష్టం అండి అంటారు...

నీళ్ళు కలుషితం చెయ్యొద్దు అంటే....నా చేతిలో లేదు అంటారు

సరే అందరికి అవగాహన కలిపిద్దము రండి అంటే....టైం లేదు
ఇవన్ని నిజమే కావొచ్చు.

కాని మీకు వీలయ్యే పని చెపుతానుచేయండి.

 మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాము.

"ఏమి లేదండి..ఈ సారి వినాయక చవితికి రంగులు లేని 
 మట్టి వినాయకుడిని పూజించండి.మీ ప్రేమని నిరూపించుకోండి."

 (మనం చేసే పని యెంత చిన్నదైనా మంచి మనసుతో 
చేస్తే ఎందరికో స్పూర్తిని ఇస్తుంది)

ఈ విషయం మీద "ఎకో దంతుడు"అనే ఆర్టికల్ 24-8-11
సాక్షి ఫ్యామిలీ లో ప్రచురించారు.

మరి అందులో మీ నేస్తం వాళ్ళ స్కూల్ పిల్లల చేత మట్టి
వినాయకుని చేయించి ఆ స్టెప్స్ అన్ని పోటోస్ తీసి పంపింది.
గణపతి రూప కల్పన క్రింద స్కాన్ చేసి పెట్టాను చూడండి.

గణేశ ....నీ రంగులు లేని మట్టి బొమ్మని పూజ చేసిన 
వాళ్ళ మంచి మనసుని అనుగ్రహించి వారికి కావలసినవి ఇచ్చెయ్యి...
                       గణపతి బొప్ప...మోరియా.....


9 comments:

మందాకిని said...

మీకూ, పిల్లలకీ కూడా అభినందన శతం.
పేరు తెలుగులో మార్చేశారుగా............:-)

వేణూరాం said...

హ్మ్...
నా వంతు గా వినాయక చవితి నాడు ఇంట్లో వినాయకుడి పూజ చెయ్యకుండా ఎంచక్కా గుడి కెళ్ళి పోతాను. (మాకు వేరే ఆప్షన్ లేదు లెండీ)

ముందస్తు వినాయ్క చవితి శుభాకాంక్షలు..

వనజ వనమాలి said...

chaalaa baagundhi... nuvvante..naaku..istam.

it is sasi world let us share said...

మందాకిని,వనజ....మీ సలహా నచ్చింది.అందుకె
పెరు మార్చాను.మంచి స్నెహితులు మంచి సలహాలు
ఇస్తారు.థాంక్యు.

it is sasi world let us share said...

అదెమి కుదరదు బక్తా....వినాయకుడిని తెచ్చి అగరు
వత్తులు వెలిగించు.లెకుంటె నిత్య పరారె....

kiran said...

.కెవ్వ్...పారిపోండి. -- చాల థాంక్స్ ససి గారు ముందే చెప్పినందుకు..:)
ఆహ..కానీ ఏమైనా వర్ణించార ప్రకృతి గురించి...సూపరు..:)
ఇంకో రకంగా కూడా ప్రకృతిని కాపాడచ్చు..న లాగా హాస్టల్ లో ఉంటూ వినయకున్నే పెట్టకుండా మనసులో దండం పెట్టుకోడం..:)
వినాయక చవితి శుభాకాంక్షలు..:)

శశి కళ said...

యెవరబ్బా ఇంత లెటు గా లిఖింది అనుకున్నా.
చిన్నూ....ఊ....మరి హాస్టల్ లొ కుడుములు
పెడతారా?

రాజి said...

వినాయకచవితి శుభాకాంక్షలు

శశి కళ said...

thank u raji.same to u.