Friday, 19 August 2011

వింటారా మల్ల ..మస్తుగుంటై కదలు...2

హలో...అలో...అలో ...ఎవరికి కదలు కావాలో వచ్చేయన్డొచ్...
 యెంత మంచి వాళ్ళో ...హనుమకొండకి వచ్చేయండి .

మరి జాబ్ లో చేరాక నేను మావారు స్కూల్ కి దూరంగా 
(2 కి.మీ )ఇల్లు తీసుకున్నాము మాకు తెలీక.అది అదాలత్ (కోర్ట్)
సుబేదారి(కలక్టర్ ఆఫీసు )అన్ని దాటినాక బస్ డిపో 
దగ్గర ఉంటుంది.

నేను ఒక్క దాన్నేసాయంత్రం స్కూల్ నుండి 
వస్తానని దైర్యంగా చెప్పాను మా వారికి.స్కూల్ అయిపోయిన 
తరువాత బస్ స్టాప్ కు వచ్చి బస్ వస్తే బస్ డిపో కి
 వెళుతుందా?అని అడిగాను.

ఆతను బస్ స్టాండ్ అనుకోని వెళుతుంది అని చెప్పారు.
నేను ఎక్కిన తరువాత ఊరంతా తిరిగి బస్ స్టాండ్ లోదింపారు.
అది మా స్కూల్ కి కొంచం దగ్గరగా ఉంటుంది .

(బూమి గుండ్రంగా ఉంటుందని అప్పుడు బాగా తెలిసింది)

నీరసంగా నడుచుకుంటూ స్కూల్ వైపువస్తున్నాను.
ఎదురుగా మా వారు కనపడ్డారు.
నిజమేనా అని కళ్ళు నులుముకొని చూసాను.
ఇంకా చూడు నిజమే.

హమ్మయ్యా అనుకున్నాను.
ఇక ఆయనకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి

(దొరికానని బాదతో అంటున్నారా? మీ సంగతి మళ్ళ చెపుతా)

అపుడు అనుకున్నాను...

ఒరే...ఏడిపించే వాళ్ళు తప్పి పోయారని కూడా ఏడుస్తారా?

 వెంటనే నిర్ణయం తీసుకున్నారు ఇల్లు మార్చేయాలని.
 స్కూల్ పక్కనే ,కాని రెంట్ చాలా ఎక్కువ ఏడు వందలు.
 అప్పుడు నాకొకటే ఉద్యోగం ,ఈయన వెతుక్కోవాలి.అసలు 
నా జీతమే 2000  రూపాయలు.అయినా సరే నాకోసం 
 ఆ ఇంట్లోకి వెళ్ళాలి అనుకొన్నాము.
పాత  ఇల్లు ఖాళి చేసి రిక్షా ఎక్కి కొత్త ఇంటికి బయలుదేరాము.
ఏమి పెద్ద సామాను లేదు.ఇంకా వంట మొదలు పెట్ట లేదు.
చాప,పరుపు,బకెట్ ,చీపురు,ఇంకా ఒక సూట్ కేస్ .
అన్నికాళ్ళ దగ్గర పెట్టుకొని సూట్ కేస్ రిక్షా వెనుక పెట్టుకొన్నాము.
ఇంట్లో అన్నికొత్త దింపుకొని లోపలి వెళ్ళాము.
    
తీరా చూస్తె సూట్ కేస్ లేదు. దేముడా ....ఇప్పుడేమి 
చేయాలి...బట్టలు ,డబ్బులు ,నగలు ,అన్నిదాన్లోనే ఉన్నాయి.
తెలీని ఊరు...ఎవరిని అడగాలి?ఇప్పట్లా సెల్ ఫోన్ లు లేవు.
  
ఇద్దరికీ ఏడుపు వచ్చేస్తుంది.మా వారు వెంటనే పరిగెత్తి 
మేము వచ్చిన వైపు వెళ్లారు రిక్షా కోసం. 
  
నేను బయటకు వచ్చి ఏడుపు మొహం తో చూస్తూ 
ఉన్నాను.ఉన్నట్లుండి రోడ్ రెండో వైపు నుండి వస్తూ 
 కనిపించాడు రిక్షా ఆతను.
"అరె మీరు పెట్టె మరిచిపోయిన్రామ్మా..అంటూ" 
తీసి నాకిచ్చాడు.
నాకైతే వెంకటేశ్వర స్వామే  వచ్చి ఇచ్చినట్లు అనిపించింది.
దణ్ణం పెట్టేసాను.
ఈలోపు మా వారు కూడా అక్కడకు పరిగెత్తి వచ్చారు.
ఇద్దరమూ థాంక్స్ చెప్పాము.

"అరె ఏం చేసిన నమ్మా మీది మీకిచ్చినా గంతే గదా"అన్నాడు.
మా వారు కొంచం డబ్బులు ఇచ్చి అవి తీసుకునే దాక ఒప్పుకోలేదు.
  
నిజం గా యెంత మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ...
 అని సంతోషంగా నిద్రపోయాము

(ఇంకేమిటి ...ఇంకో కదలో చెపుతాలే ..
మీరుకూడా నిద్రపోండి )

8 comments:

kiran said...

ఏమిటి కథ అని వస్తే..వేల్లిపోమంటారా....:P
దొరికానని బాదతో అంటున్నారా? -- నిజాలు మీకు తెల్సు కదా :)

శరత్ 'కాలమ్' said...

:)
అవును. మంచివాళ్ళు అక్కడక్కడా కనపడుతుంటారు.

ఇందు said...

అవునా! నిజంగా అప్పుడప్పుడు ఇలాంటివాళ్ళని చూసినప్పుడే మంచి ఇంకా బ్రతికే ఉంది అనిపిస్తుంది :) బాగుంది శశి. నువ్వు కనపడకపోతే మీవారు ఏడ్చారా?? :) క్యూట్ కపుల్! :)

it is sasi world let us share said...

కిరనూఊఊఊఊఊ.....సత్యాలు అయినా అలా
చెప్పకూడదమ్మా....వాఆఆఆఆఆ....

it is sasi world let us share said...

శరత్ గారు థాంక్స్

ఇందూఊఊఊ ఏందుకు దాచి పెదతావు...చందు
కూడా అంతె.....

వేణూరాం said...

హహహహ.. మీకు తిరపతి వెళ్ళకుండానే వెంకటేశ్వరస్వామి దర్శనం అయిపోయిందన్నమాట. ;) ;)

తర్వాత కధ ఎప్పుడు చెప్తారు మరీ?

kallurisailabala said...

Sasi గారు నిజంగా కళ్ళు చెమర్చాయి.ఆ రిక్షా అతని మానవత్వంకి హాట్స్ ఆఫ్

శశి కళ said...

శైల గారు థాంక్యు