మీకొకటి చూపించేదా...మరి అబ్బ..బలే ఉంది అనాలి సరేనా....
బా.....గుంది కదా.మాయా బజార్ కలర్ లో చూస్తె ఆ మజా బలే
తమాషాగా ఉంది
ఇంకోటి చూపించేదా......అబ్బా ఇంకా బలే అనాలి.
(బలే అన్న వాళ్ళు మీకు మీరే సేబాష్ అనుకోండి.)
జగదేక వీరుడు కలర్ లో.చూడగానే బలే సంతోషంగా
అనిపించింది.అసలు బ్లాక్ అండ్ వైట్ లోనే పిల్లలకు
కాసేట్ తెచ్చి మరీ చూపించాను.
ఎందుకంటె చిన్నప్పుడు నేను పొందిన ద్రిల్ల్ వాళ్ళు కూడా
పొందాలి కదా.
అసలు నీకు ఇంత సినిమా పిచ్చి ఏమిటి అంటారా?
(హమ్మయ్యా ...వినేవాళ్ళు దొరికారోచ్...)
అనగా ...అనగా......అప్పుడు నేను చిన్న పాపని అన్న మాట.
అప్పుడే మూడో సంవత్చరం వచ్చింది.
ఒక రోజు నేను ఎక్కడా కనపడలేదు.
పాపం మా అమ్మ నాన్న ఊరంతా వెతికారు.
(హమ్మయ్య పొతే పోనీ అనుకోని ఉంటారు
అనుకుంటున్నారా?)
ఎక్కడా దొరకలేదు.మా ఇంటికి కొంచం దూరంలో
ఒక సినిమా హాల్ ఉంది .ఎవరో చెప్పారు అక్కడ
ఒక చిన్నపాప ను చూసాము అని.
మా నాన్న పరిగెత్తుకొని వెళ్లి సినిమా హాల్ లో
వెతికారు.
బాల్కనీ,కుర్చీ లో,బెంచి లో ఎక్కడ లేను.
మా నాన్న గారికి బోల్డంత దిగులు వేసింది.
(ఇంత రాక్షసి ని అని అప్పుడు తెలీదు కదా.
తెలుసుంటే వెతికేవారు కాదు)
(ఇంత రాక్షసి ని అని అప్పుడు తెలీదు కదా.
తెలుసుంటే వెతికేవారు కాదు)
చివరికి స్క్రీన్ ముందు నేలలో చూస్తె అక్కడ ఉన్నాను.
అంటే ఎవరికి చెప్పకుండా అక్కడనచ్చి కూర్చునేసాను అన్న మాట.
మా నాన్నకి కోపం వచ్చి అరవబోయి నేనన్న
మాటలకి నవ్వేసారు.
"దా నాన్నఇక్కడైతే పే....ద్ద బొమ్మ కనిపిస్తుంది"
(అంటే అప్పుడే పెద్ద einsteen లెవెల్ లో అన్ని కోణాలలో
స్క్రీన్ పరిసీలించానన్న మాట)
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.
సినిమా పిచ్చోళ్ళు చిన్నప్పుడే స్క్రీన్ పరిశీలిస్తారు.
అదండీ....మన సినిమా సంగతులు.
మరి కొత్త జగదేక వీరుడు అంటే కలర్ లో చూడటానికి
రెడీ అయిపోండి.
11 comments:
super cinimaa.. aa cinimaa kannaa ee cinimaa.. chaalaa baagundhi. yenthainaa cinimaa picchollam kadhaa..
హ్హహ్హహ్హా! బాగుంది రాక్షసీ నీ సినిమా పిచ్చి [నువ్వు అనేస్తున్నా ఏం అనుకోవుగా ;)]
ఇంకా ఆ సావిత్రి పిక్ చాలా సేపు చూస్తుండిపోయా! ఎంత బాగుందో!
హాయ్ ఇందు...నెనెపుడొ నువ్వు లొ ఫిక్స్ అయ్యాను.
నువ్వె కొంచం లెటు గా గుర్తించావు.జాబ్ గూర్చి యెప్పుడు
వ్రాస్తావు.....
వనజ గారు మీరు ఈ ఊరిలొ ఉంటె యెంత బాగుండెది.
యెన్ని సినిమాలు చూసుండె వాళ్ళం.యెన్ని పొస్ట్ లు
ఇచ్చి ఉండె వాళ్ళం.
కలర్ లో మాయాబజార్ చూడలేదండీ,ఈ సావిత్రి పిక్ చూశాక వెంటనే చూడాలనిపిస్తోంది
ఎంత బావుందో
హహహః....soooparu
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.
సినిమా పిచ్చోళ్ళు చిన్నప్పుడే స్క్రీన్ పరిశీలిస్తారు.
నేను సేబాష్ అనుకున్నా :))
కిరణ్..ఇప్పుడె పుట్టావు...మెదడు అంతా వాడెసి కామెంట్స్ అన్ని ఒకె సారి వ్రాస్తె యెలా...
thank u.
లత గారు..తప్పకుండా చూడండి..బాగుంటుంది.
అబ్బ బలే బలే బలే బలే...కానీ మాయాబజార్ లో అన్నీ కట్ చేసి పారేసినట్టూ ఇందులోనూ కట్ చేసేస్తారేమోనండీ!
sowmya most welcome my dear friend...
thank u
అయ్యయ్యో.. నేను చాలా పోస్ట్ లు మిస్సయి పోయాను..
నేనూ వెయిటింగ్ అండీ ఈ సినిమా కోసం.. ;) ఫస్ట్ ఫోటో సూపరు..
రాజ్ కుమార్
"దా నాన్నఇక్కడైతే పే....ద్ద బొమ్మ కనిపిస్తుంది"
(అంటే అప్పుడే పెద్ద einsteen లెవెల్ లో అన్ని కోణాలలో
స్క్రీన్ పరిసీలించానన్న మాట)
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.
సినిమా పిచ్చోళ్ళు చిన్నప్పుడే స్క్రీన్ పరిశీలిస్తారు.
ఎంత నవ్వోచ్చిందో ఇక్కడ
మీరు ఎలా అని ఉంటారో ఊహిస్తే నవ్వు ఆగడం లేదు.
సూపర్ ఈల వేయాల్సిందే
కాని రాదే...
అందుకే కొనుక్కున్న ఈలతో వేస్తున్న ...
వినిపించిందో లేదో చెప్పండి.
Post a Comment