Saturday 3 September 2011

గల గల పారె సెలయేరు ...గొదారిలా మారితే..

మారితె ఏమవుతుంది?చక్కగా జీవనదిలా మారి 
ఎందరికో జీవన నాదం గా నిలిచిపోతుంది.
 అలాంటి సెలయేరు లా ప్రవహించే నన్ను జీవన 
 శ్రుతికి తెచ్చి నా జన్మకు సార్ధకత తెచ్చి ఎందరో విద్యార్దుల 
తలపుల్లో నన్ను నిలబెట్టిన మా గురువులను తలుచుకుందామని
చిన్న ప్రయత్నం.

(ఏమిటి ఇంత గంబీరమైన బాష అనుకుంటున్నారా?
కొంచం గ్రాందికం బీబత్శంగా ప్రాక్టిసు చేస్తున్నాను. )

ముందు నాకు చిన్నతరగతుల్లో చెప్పిన కుమారి మేడం ని 
తలుచుకోవాలి.అదేమీ పెద్ద కాన్వెంట్ కాదు.నాకు,మా
పెదనాన్న పిల్లలు ఇద్దరికీ ఇంకో ఇద్దరు వేరే పిల్లలకి 
పెట్టిన స్కూల్ అది.

మనం చదివేది లేదు.రాసేది లేదు.
చెప్పేటపుడు విని గుర్తు పెట్టుకోవటమే.
మేడం దగ్గరుండి ఇది రాయి అంటే రాయటమే.
లేకుంటే నా ఇష్టం ఉంటె  వ్త్రాస్తా...లేకుంటే లేదు.
ఒక వేళ రాశాననుకోండి.తప్పు లేక పొతే మార్క్స్ తీసేస్తే 
ఒప్పుకోను.ఏమి చేస్తానా?మా నాన్నని లాక్కొచ్చి అడిగిస్తా?
ఎక్కడ తప్పుందో చెప్పమని.

నాతో వేగలేక మూడో క్లాసు లోపే ఐదు తరగతుల బుక్స్ 
చదివించేసి హై స్కూల్ కి పంపేసింది.

 ఇక హైస్కూల్ లో సుమిత్రమ్మమేడం. నాకు అప్పుడు పరీక్షలు 
 ఎలా వ్రాయాలో తెలీదు.అందరికంటే ఫస్ట్ ఇచ్చేసేదాన్ని.అదే ఫస్ట్
రావటమంటే అనుకునే దాన్ని(35  మార్క్స్ కంటే ఎక్కువ రాయను)

ఎప్పుడు బూమి మీదే ఉండము.ఎక్కడ ఉంటానా?గోడల మీద,చెట్ల మీదే...పాపం నన్నుభూమి మీదకి తేవటానికే 
చాలా కష్టపడింది.ఇంకా పరీక్ష పూర్తిగా రాయించటం...
భగీరదుడు  గంగను తెచ్చినట్లే...ఆమె అన్ని ప్రశ్నలు 
రాయాలమ్మా అంటుంది...వెంటనే మనం ఏమంటాము...

మా నాన్న కొండ మీద కోతి కావాలన్న తెచ్చిస్తాడు 
నేను ఎందుకు రాయాలి అని .

(మన మీద బోల్డెంత అభిమానం,బయం కూడా మా నాన్నని లాక్కోస్తానని...అయన వాళ్ళని ఏమి అనకపోయినా)

 అలా....అలా....ఓర్పుగా కధలు  నా కోసం కల్పించి చెప్పి 
మనం స్కూల్ ఫస్ట్లు,సెకండ్ లు వచ్చేటట్లు చేసింది.
మేడం కి పోలియో ఒక కాలుకి.పెళ్లి కూడా చేసుకో లేదు.
ఇప్పటికి వాళ్ళ ఇంట్లో అందరు,మేడం నన్నుకన్నబిడ్డలా
చూస్తారు.నా అల్లరి "విన్నావా యశోదమ్మా?"లాగా 
కదలు చెప్పుకుంటారు.

(మా పిల్లలకి చెప్పేస్తారు...చెప్పోద్దో అంటే కూడా వినరు)
   

"రైలు బడి" పుస్తకం లో కొబయాషి , టొటో చాన్ ను 
దారిలో పెట్టినట్లు నన్ను ఈ రోజు ఎందరో విద్యార్దుల కు 
 స్పూర్తి గా నిలిపింది ఆమె.

పిల్లలు తమకు నచ్చిన విదంగా ప్రకృతిలో మమేకమై
విద్య నార్జించే పరిస్తితులు కల్పించేవాడు కొబయాషి.
అతని ఓర్పు,పిల్లల పట్ల ప్రేమ ఎందరో టొటొ చాన్ లను సృష్టించి 
దేశం కోసం పంపింది.

వారి గూర్చి మిత్రుని రివ్యూ చూడండి.


"పిల్లలంతా తరగతి గదిలో  క్రమశిక్షణ తో నిశ్సబ్దంగా ఉంటె
నేర్చుకునేదెవ్వరు?"అంటూ ఉంటారు గిజు బాయి.


 "వాళ్ళని వాళ్ళ లాగే పెరగనిస్తే ప్రకృతే వాళ్లకి గురువు అవుతుంది"
 అంటారు రవీంద్ర నాథ్ టాగూర్ గారు.

"మీరు ఏమైనా వారికి నేర్పించాలంటే ముందు వాళ్ళ ప్రపంచం తో
మమేకమవ్వండి.అప్పుడు అక్కడ ఇద్దరు లేరుఉన్నది ఒక్కటే.
అది జ్ఞానం మాత్రమే"

ఇదెవరు చెప్పరంటారా?
బలే వాళ్ళే నేనే చెప్పానండి.
ఏమి చెప్పకూడదా?
ట్వెంటీ ఇయర్స్ టీచింగ్ ఇండస్ట్రీ ఇక్కడ.


"A bad teacher teaches 
 A  good teacher explains
 A  better teacher demonstrates
 A  best teacher inspires"


"The future of the nation depends upon the 
class room".........Sarvepalli.Radhakrishnan.

6 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

క్లాసులో ఫస్ట్ రావటమంటే ఇదా??
భలే ఉందే!!! :-)

శశి కళ said...

మరి మీరు యెపుడు రాలేదా?థాంక్యు

voleti said...

ఉపాధ్యాయుల దినోత్సవమున "మంచి" ఉపాధ్యాయురాలైన మీకు శుభాకాంక్షలు.... ఇప్పటి స్కూల్స్ లో అప్పటి మీ టిచర్స్ లాంటి మంచి టీచర్స్ వున్నారంటారా?

శశి కళ said...

థాంక్యు.మీ లాంటి వాళ్ళ అభినందనలె మాకు
స్పూర్తి నిస్తాయి ముందుకు నడవటానికి.

Unknown said...

"మీరు ఏమైనా వారికి నేర్పించాలంటే ముందు వాళ్ళ ప్రపంచం తో మమేకమవ్వండి.అప్పుడు అక్కడ ఇద్దరు లేరుఉన్నది ఒక్కటే.
అది జ్ఞానం మాత్రమే"

ఇదెవరు చెప్పరంటారా?
బలే వాళ్ళే నేనే చెప్పానండి.
ఏమి చెప్పకూడదా?
ట్వెంటీ ఇయర్స్ టీచింగ్ ఇండస్ట్రీ ఇక్కడ.


అమ్మో చెప్పకూడదు అని అంటామా చెప్పండి.
చేతిలో బెత్తం కనిపిస్తోంది.
లేదా గోడ కుర్చీ వెయ్యి అంటారు.
ఇప్పుడు నేను ఒక గోడ , ఆ గోడ మీద వేసుకునే కుర్చీ ఎక్కడ చూసేది చెప్పండి.
అందుకే బుద్ధిగా ఒప్పేసుకుంటున్న బావుంది అని
నిజంగా.

శశి కళ said...

శైలు..మంచి స్టూడెంట్...